కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నీళ్ళు నిలువని తొట్లు

నీళ్ళు నిలువని తొట్లు

నీళ్ళు నిలువని తొట్లు

బైబిలు కాలాల్లో, ముఖ్యంగా నీళ్ళు నిలువచేయడానికి ఉపయోగించేందుకు భూమిలోపల కృత్రిమంగా తొట్లు ఏర్పాటు చేయబడేవి. కొన్నిసార్లు వాగ్దాన దేశంలో అత్యావశ్యకమైన నీటిని సరఫరా చేసేందుకు అవే ఏకైక మాధ్యమంగా ఉపయోగపడేవి.

ఒక దేవోక్తిని నమోదు చేస్తూ యిర్మీయా ప్రవక్త తొట్లను సూచనార్థక భావంలో ప్రస్తావించి ఇలా అన్నాడు: “నా జనులు రెండు నేరములు చేసియున్నారు; జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని యున్నారు.”​—⁠యిర్మీయా 2:13.

ఇశ్రాయేలీయులు “జీవజలముల ఊట” అయిన తమ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి, అన్యదేశాలతో స్థిరత్వంలేని సైనిక ఒప్పందాలు కుదుర్చుకొని, దుర్భలమయిన అబద్ధ దేవుళ్ళను ఆరాధించడం ప్రారంభించారు. వాటివలన తమకు ఆశ్రయం లభిస్తుందని ఇశ్రాయేలీయులు తలంచారు, కాని అవి యిర్మీయా మాటల్లో చెప్పాలంటే, కాపాడే లేదా రక్షించే శక్తిలేని బద్దలైపోయిన తొట్లు అని నిరూపించబడ్డాయి.​—⁠ద్వితీయోపదేశకాండము 28:20.

ఈ చారిత్రక ఉదాహరణ నేడు మనకేమైనా పాఠం నేర్పిస్తోందా? యిర్మీయా కాలంలోవలే నేడు కూడా నిత్య దేవుడైన యెహోవా ఏకైక జీవజలముల ఊటగా ఉన్నాడు. (కీర్తన 36:9; ప్రకటన 4:​11) ఆయన నుండే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే మానవులు నిత్యజీవం పొందగలరు. (యోహాను 4:14; 17:⁠3) అయితే యిర్మీయా సమకాలీనులవలే నేడు ఎంతోమంది ప్రజలు బైబిల్లో వ్రాయబడిన దేవుని మాటలను తిరస్కరిస్తున్నారు లేదా సవాలు చేస్తున్నారు. దేవుని వాక్యంపై కాక వారు కార్యసాధక రాజకీయ పరిష్కారాలపై, అర్థరహితమైన మానవ తర్కనలపై, దేవుణ్ణి అవమానపరిచే వ్యర్థమైన సిద్ధాంతాలపై తత్వాలపై ఆధారపడుతున్నారు. (1 కొరింథీయులు 3:18-20; కొలొస్సయులు 2:⁠8) మీరు చేసుకోవలసిన ఎంపిక స్పష్టంగా ఉంది. మీరు ఎవరిని విశ్వసిస్తారు? “జీవజలముల ఉట” అయిన యెహోవానా లేదా ‘నీళ్ళు నిలువని తొట్లనా?’

[32వ పేజీలోని చిత్రం]

ఇశ్రాయేలీయుల సమాధిలో కనుగొనబడిన మాతృ దేవత మట్టి బొమ్మ

[చిత్రసౌజన్యం]

Photograph taken by courtesy of the British Museum