కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆశ్చర్యపడే గుణాన్ని మీరు పెంపొందింపజేసుకుంటున్నారా?

ఆశ్చర్యపడే గుణాన్ని మీరు పెంపొందింపజేసుకుంటున్నారా?

ఆశ్చర్యపడే గుణాన్ని మీరు పెంపొందింపజేసుకుంటున్నారా?

బైబిలు రచయితలు దేవుని కార్యాలను, లక్షణాలను ప్రశంసించేటప్పుడు పదే పదే ఆశ్చర్యపోవడాన్ని మీరు గమనించారా? ‘నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యము పుట్టుచున్నది’ అని కీర్తనకర్త ప్రకటించాడు. (కీర్తన 139:​14) “యెహోవా, నీవే నా దేవుడవు. నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసితివి” అని యెషయా ప్రవక్త వ్రాశాడు. (యెషయా 25:⁠1) అపొస్తలుడైన పౌలు వ్రాసిన ఈ మాటల్లో వ్యక్తమైన ఆశ్చర్యం గురించి ఆలోచించండి: “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము!”​—⁠రోమీయులు 11:​33.

“ఆశ్చర్యం” అనే పదం “అనుకొన్నదాన్నిగాని అనుభవాన్నిగాని మించిన లేదా ఇటువంటిదని చెప్పడానికి సాధ్యం కాని సంఘటన వల్ల కలిగే భావోద్రేకం” అని నిర్వచించబడుతోంది.

చిన్నపిల్లలు ఏదైనా కొత్త విషయాన్ని చూసినప్పుడు, అనుభవించినప్పుడు లేదా విన్నప్పుడు కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యపడడాన్ని చూడడం మనకు ఆనందం కలిగించదా? విచారకరమైన విషయమేమిటంటే, కుతూహలం మూలంగానో ఏదైనా కొత్త విషయాన్ని బట్టో అలా ఆశ్చర్యపడడమనేది సంవత్సరాలు గడుస్తుండగా తగ్గిపోతుంది.

అయితే పైన ప్రస్తావించబడిన బైబిలు రచయితల్లో అలా ఆశ్చర్యపడే గుణం అంతర్గతంగా ఉండేది. అది సంవత్సరాల తరబడి అలానే ఉండేది. ఎందుకలా? దేవుని కార్యాలను కృతజ్ఞతాపూర్వకంగా ధ్యానించడం ద్వారా వారు అలా ఆశ్చర్యపడే గుణాన్ని పెంపొందింపజేసుకున్నారు. కీర్తనకర్త ఇలా పాడాడు: “గడచిన సంవత్సరాల్లో జరిగిన విషయాలన్నిటిని, నీ క్రియలన్నిటిని నేను జ్ఞాపకం చేసుకొంటున్నాను. నీ సృష్టిలోని ఆశ్చర్యకార్యాలను నేను ధ్యానిస్తున్నాను.”​—⁠కీర్తన 143:⁠5, ద న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌.

దేవుని ఆధునిక దిన సేవకుల్లో ఇప్పటికీ అలా ఆశ్చర్యపడే గుణం ఉందంటే అది ఎంత ప్రశంసనీయం! మీరు కూడా అలా ఆశ్చర్యపోతారా? అలా ఆశ్చర్యపడే గుణాన్ని మీరు పెంపొందింపజేసుకుంటున్నారా?