“గొప్పకార్యముల” గురించి మాట్లాడడానికి గిలియడ్ గ్రాడ్యుయేట్‌లు ప్రోత్సహించబడ్డారు
“గొప్పకార్యముల” గురించి మాట్లాడడానికి గిలియడ్ గ్రాడ్యుయేట్‌లు ప్రోత్సహించబడ్డారు
సె ప్టెంబరు 13, 2003న వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ 115వ తరగతి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి 52 ప్రాంతాలనుండి మొత్తం 6,635 మంది హాజరయ్యారు.
‘దేవుని గొప్పకార్యాలను’ 17 దేశాల్లోని ప్రజలకు వివరించేలా ఆ తరగతిలోని 48 మంది విద్యార్థులకు ఇవ్వబడిన బైబిలు ఆధారిత ప్రోత్సాహాన్ని వాళ్ళు విన్నారు. (అపొస్తలుల కార్యములు 2:11) ఆ గ్రాడ్యుయేట్‌లు తమ మిషనరీ సేవను ఆ 17 దేశాల్లోనే చేస్తారు.
యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన, గ్రాడ్యుయేషన్ ఛైర్మన్‌గా వ్యవహరించిన స్టీఫెన్ లెట్ తన ప్రారంభ మాటల్లో విద్యార్థులకు ఇలా గుర్తుచేశాడు: “మీరు మీ నియామకాలను నెరవేర్చడానికి వెళ్ళినప్పుడు, ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ, మీకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ మీకు వ్యతిరేకంగా ఉన్నవారికంటే మీ పక్షాన ఉన్నవారే ఎక్కువున్నారు.” రెండవ రాజులు 6వ అధ్యాయాన్ని ఉపయోగిస్తూ సహోదరుడు లెట్, విద్యార్థులు “దేవుని గొప్పకార్యములను” తెలియజేస్తుండగా యెహోవా దేవునిపై అలాగే వేవేల దేవదూతల మద్దతుపై ఆధారపడవచ్చని వారికి గుర్తుచేశాడు. (2 రాజులు 6:15, 16) మొదటి శతాబ్ద క్రైస్తవులు తమ ప్రకటనా పనిలో, బోధనా పనిలో వ్యతిరేకతను, ఉదాసీనతను ఎదుర్కొన్నారు, నేటి క్రైస్తవ మిషనరీలకు కూడా అలాంటి పరిస్థితులే ఎదురౌతాయి. అయితే, వారు పరలోకం నుండి, అలాగే యెహోవా భూసంస్థ నుండి వచ్చే మద్దతుపై ఆధారపడవచ్చు.—కీర్తన 34:7; మత్తయి 24:45.
“దేవుని గొప్పకార్యముల” గురించి మాట్లాడండి
ఛైర్మన్ ప్రారంభ మాటల తర్వాత, అమెరికా బ్రాంచి కమిటీకి చెందిన హెరాల్డ్ కార్కెర్న్ “వాస్తవిక అపేక్షలు—ఆనందకరమైన, విజయవంతమైన సేవకు కీలకం” అనే అంశంపై మాట్లాడారు. సామెతలు 13:12 చూపుతున్నట్లుగా, నెరవేరని అపేక్షలు నిరుత్సాహానికి నడిపించగలవని సహోదరుడు కార్కెర్న్ సూచించారు. అయితే, నిరుత్సాహం తరచూ నెరవేరని అవాస్తవిక అపేక్షల మూలంగానే కలుగుతుంది. గ్రాడ్యుయేట్‌లకు తమ గురించి, ఇతరుల గురించి సమతూకమైన, వాస్తవికమైన దృక్కోణం ఉండాలి. తమవల్ల కొన్ని పొరపాట్లు జరుగుతాయి అని వాళ్ళు ఎదురుచూడవచ్చు, అంతమాత్రాన “దేవుని గొప్పకార్యములను” అర్థంచేసుకోవడానికి ఇతరులకు సహాయం చేసేందుకు తాము కృషిచేస్తుండగా అవి వారిని అధికంగా కలతకు గురిచేయకూడదు. “తన్ను వెదకువారికి ఫలము దయచేయు” యెహోవాపై ఆధారపడాలని సహోదరుడు కార్కెర్న్ ఆ కొత్త మిషనరీలను ప్రోత్సహించాడు.—హెబ్రీయులు 11:6.
కార్యక్రమంలో ఆ తర్వాత, పరిపాలక సభ సభ్యుడైన డానియేల్ సిడ్లిక్, “క్రైస్తవ నిరీక్షణ—అదేమిటి?” అనే అంశంపై మాట్లాడారు. ఆయనిలా చెప్పాడు: “నిరీక్షణ అనేది క్రైస్తవ సద్గుణం. అది ఒక వ్యక్తిని దేవునితో సరైన సంబంధంలోకి తెచ్చే ఓ శ్రేష్ఠమైన ప్రమాణం. క్రైస్తవేతరునికి మనలాగే నిరీక్షించడం అసాధ్యం.” జీవితంలో కష్టాలెదురైనా ఒక వ్యక్తి ఆశాభావంతో నిలిచి ఉండడానికి సహాయంచేసే క్రైస్తవ నిరీక్షణకు సంబంధించిన వివిధ అంశాలను సహోదరుడు సిడ్లిక్ వివరించారు. “నిరీక్షణవుంటే మనం పునర్నూతనం చేయబడిన పట్టుదలతో, జయప్రదమైన స్ఫూర్తితో జీవితాన్ని ఎదుర్కోవచ్చు” అని ఆయన చెప్పారు. ఒక క్రైస్తవుని నిరీక్షణ, యెహోవా సంకల్పంగల దేవుడని రోమీయులు 12:12.
చూసేందుకూ, ఆయనకు సేవ చేయడంలో ఆనందించేందుకూ అతనికి సహాయం చేస్తుంది.—గిలియడ్ స్కూల్ రిజిస్ట్రార్ అయిన వాలెస్ లివెరెన్స్, “ఆత్మానుసారంగా నడుచుకోండి” అని విద్యార్థులను ప్రోత్సహించారు. (గలతీయులు 5:16) యిర్మీయా దగ్గర లేఖికుడిగా పనిచేసిన బారూకు ఆత్మానుసారంగా నడవడం నుండి దాదాపు కొట్టుకుపోయాడని ఆయన చూపించాడు. ఒకానొక సందర్భంలో బారూకు విసుగెత్తి తనకోసం గొప్పవాటిని వెదకడం ఆరంభించాడు. (యిర్మీయా 45:3, 5) ఆ తర్వాత, సహోదరుడు లివెరెన్స్ కొందరు యేసును అనుసరించడం మానేశారనీ, రక్షణకు అవసరమైన ఆధ్యాత్మిక సత్యాన్ని తిరస్కరించారనీ సూచించాడు. యేసు బోధించింది వారు గ్రహించకపోవడంవల్ల, ఆ కాలంలో తమ శారీరక అపేక్షలు నెరవేరకపోవడంతో నిరుత్సాహపడడంవల్ల వారలా చేశారు. (యోహాను 6:26, 27, 51, 66) సృష్టికర్తవైపు, ఆయన సంకల్పంవైపు అవధానం మళ్లించవలసిన మిషనరీలు ఆ వృత్తాంతాల నుండి ఏమి నేర్చుకోవచ్చు? హోదాలో ఉండడం, మనుషుల గుర్తింపు పొందడం లేదా దైవపరిపాలనా నియామకాన్ని వ్యక్తిగత లాభంకోసం ఉపయోగించడం గురించి చింతించకుండా ఉండాలని విద్యార్థులు ప్రోత్సహించబడ్డారు.
గిలియడ్ ఉపదేశకుడైన మార్క్ నూమార్ “మీరు ఇచ్చేవారిగా ఉంటారా లేదా పుచ్చుకునే వారిగా ఉంటారా?” అని అడిగాడు. ఆయన న్యాయాధిపతులు 5:2 అధారంగా మాట్లాడారు, అక్కడ బారాకు సైన్యంలో పనిచేయడానికి నిస్వార్థంగా ముందుకొచ్చిన ఆయా ఇశ్రాయేలీయులు కొనియాడబడ్డారు. ఆధ్యాత్మిక యుద్ధంలో మరింత ఎక్కువగా పాల్గొనేందుకు గొప్ప బారాకైన యేసుక్రీస్తు ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందించడంలో గిలియడ్ విద్యార్థులు చూపిన స్ఫూర్తికి వారు మెచ్చుకోబడ్డారు. క్రీస్తు సైనికులు తమను చేర్చుకున్న వ్యక్తి ఆమోదం పొందడంలో శ్రద్ధ కలిగివుండాలి. సహోదరుడు నూమార్ విద్యార్థులకు ఇలా గుర్తుచేశారు: “మనల్ని మనం సంతోషపరచుకోవడంపై దృష్టినిలపడం ఆరంభించినప్పుడు, మనం శత్రువుపై పోరాటం సాగించలేము. . . . మిషనరీ సేవ మీ కోసం కాదు. అది యెహోవా కోసం, ఆయన సర్వాధిపత్యం కోసం, ఆయన చిత్తం నేరవేర్చడం కోసమే. యెహోవా మనల్ని సంతోషపరచాలని కోరుకున్నందువల్ల కాదుగానీ ఆయనపట్ల మనకున్న ప్రేమ కారణంగా ఆయనకు సేవ చేస్తున్నాం కాబట్టి మనం మిషనరీలుగా సేవచేస్తున్నాం.”—2 తిమోతి 2:4.
ఆ తర్వాత, గిలియడ్ ఉపదేశకుడైన లారెన్స్ బోవెన్ “సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము” అనే భాగపు చర్చకు అధ్యక్షత వహించారు. (యోహాను 17:17) 115వ తరగతికి చెందిన విద్యార్థులు దేవుని ప్రతిష్ఠిత పరిచారకులని ఆయన అన్నారు. స్కూల్‌లో ఉన్నప్పుడు వారు యథార్థ హృదయంగల సత్యప్రేమికులను వెదకుతూ క్షేత్ర పరిచర్యలో కూడా పాల్గొన్నారు. యేసు, ఆయన తొలి శిష్యుల మాదిరిగా ఆ విద్యార్థులు ‘వారంతట’ వారే మాట్లాడలేదు. (యోహాను 12:49, 50) వారు ఆసక్తిగా, ప్రేరేపితమైన జీవప్రదానమైన సత్యవాక్యాన్ని ప్రకటించారు. విద్యార్థుల పునర్నటనలు, అనుభవాలు వారు కలుసుకున్న ప్రజలపై బైబిలు చూపిన శక్తిమంతమైన ప్రభావాన్ని వెల్లడి చేశాయి.
సలహా మరియు అనుభవం ప్రోత్సాహమిస్తాయి
అమెరికా బ్రాంచి సర్వీస్ విభాగపు సభ్యులైన ఆంథొని పారెస్, ఆంథొని గ్రిఫిన్, ప్రపంచ నలుమూలల్నుండి వచ్చిన బ్రాంచి కమిటీ సభ్యులతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. వారు కొత్త మిషనరీలు ఎదుర్కొనే సవాళ్లను చర్చించి వ్యక్తిగత అనుభవంపై ఆధారపడ్డ ఆచరణాత్మక సలహా ఇచ్చారు. అలాంటి సవాళ్లలో సాంస్కృతిక వైవిధ్యాలు, సంవత్సరం పొడవునావుండే ఉష్ణప్రాంత వాతావరణం లేదా విద్యార్థులకు అంతకుముందు అలవాటులేని మత, రాజకీయ వాతావరణం వంటివి ఉంటాయి. కొత్త పరిసరాలను తాళుకోవడానికి కొత్త మిషనరీలకు ఏది సహాయం చేయగలదు? యెహోవాపట్ల ప్రేమ, ప్రజలపట్ల ప్రేమ, వెనుకకు తిరిగిచూడకుండా ఉండడం మరియు తొందరపాటుతో ప్రవర్తించకుండా ఉండడం. ఒక బ్రాంచి కమిటీ సభ్యుడు ఇలా చెప్పాడు: “మేము నియమించబడిన ప్రాంతంలోని ప్రజలు మాకంటే అనేక శతాబ్దాల ముందునుంచే అక్కడ జీవిస్తున్నారు. కాబట్టి నిశ్చయంగా మనమూ అక్కడ జీవిస్తూ పరిస్థితులకు తగ్గట్టు మారగలం. మేము కష్టాలు ఎదుర్కొన్న ప్రతీసారీ మేము వాటిని మా వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి లభించే అవకాశాలుగా పరిగణించాం. ప్రార్థనపై, యెహోవా ఆత్మపై మీరు ఆధారపడండి, అప్పుడు ‘మీతో ఉన్నాను’ అని పలికిన యేసు మాటల సత్యత్వాన్ని మీరు చవిచూస్తారు.”—మత్తయి 28:20.
పరిపాలక సభ సభ్యుడైన సామ్యుల్ హెర్డ్ “దేవుని గొప్పకార్యాల గురించి నిర్విరామంగా మాట్లాడుతూ ఉండండి” అనే తన ప్రసంగంతో కార్యక్రమం ముగించారు. సా.శ. 33 పెంతెకొస్తునాడు కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ యేసు శిష్యులు ‘దేవుని గొప్పకార్యాల’ గురించి మాట్లాడేందుకు వారిని శక్తిమంతులను చేసింది. దేవుని రాజ్యం గురించి అంతే ఆసక్తితో మాట్లాడేందుకు నేడు కొత్త మిషనరీలకు ఏది సహాయం చేయగలదు? అదే పరిశుద్ధాత్మ. “ఆత్మయందు తీవ్రతగలవారై” ఉండాలనీ, తమ నియామకాల విషయమై ఉత్సాహవంతులుగా ఉండాలనీ, వారికివ్వబడ్డ శిక్షణను ఎన్నటికీ మరచిపోకుండా ఉండాలనీ సహోదరుడు హెర్డ్ పట్టభద్రులవుతున్న విద్యార్థులను ప్రోత్సహించారు. (రోమీయులు 12:11) “బైబిలు దేవుని గొప్పకార్యం. దాని విలువను ఎన్నటికీ తక్కువ అంచనా వేయవద్దు. దాని సందేశం సజీవం. అది సమస్యలను ఆమూలాగ్రం పరిష్కరిస్తుంది. మీ జీవితాలను సరిదిద్దడానికి దానిని ఉపయోగించండి. అది మీ ఆలోచనా సరళినే మార్చనివ్వండి. లేఖనాలను చదవడం, అధ్యయనం చేయడం, ధ్యానించడం ద్వారా మీ ఆలోచనా సామర్థ్యాన్ని పదిలపరచుకోండి. . . . ‘దేవుని గొప్పకార్యాల’ గురించి నిరంతరం మాట్లాడడానికి మీ గిలియడ్ శిక్షణను ఉపయోగించడమే మీ లక్ష్యంగా, మీ తీర్మానంగా చేసుకోండి” అని సహోదరుడు హెర్డ్ చెప్పారు.
ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన శుభాకాంక్షలు చదివి, డిప్లొమాలు అందించిన తర్వాత, గిలియడ్ విద్యార్థి ఒకరు తాము పొందిన శిక్షణపట్ల తమ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తంచేసే ఉత్తరం చదివారు. ఆ పిమ్మట సహోదరుడు లెట్ 2 దినవృత్తాంతములు 32:7, ద్వితీయోపదేశకాండము 20:1, 4 వచనాలను ప్రస్తావిస్తూ ఆ ఆనందకర సందర్భాన్ని ముగించారు. తన ప్రారంభ మాటలతో తన చివరివ్యాఖ్యానాలు జోడిస్తూ ఆయనిలా ముగించారు: “కాబట్టి ప్రియమైన పట్టభద్రులారా, మీరు మీ కొత్త నియామకాల ఆధ్యాత్మిక కదనరంగంలో ముందుకు సాగుతుండగా, కవాతు చేస్తుండగా యెహోవా మీతోకూడా ఆ కవాతులో ఉన్నాడని గుర్తుంచుకోండి. మీకు వ్యతిరేకంగా ఉన్నవారికంటే మీ పక్షాన ఉన్నవారే ఎక్కువున్నారని ఎప్పటికీ మరచిపోకండి.”
[25వ పేజీలోని బాక్సు]
తరగతి గణాంకాలు
ప్రాతినిధ్యం వహించిన దేశాల సంఖ్య: 7
పంపించబడిన దేశాల సంఖ్య: 17
విద్యార్థుల సంఖ్య: 48
సగటు వయస్సు: 33.7
సత్యంలో సగటు సంవత్సరాలు: 17.8
పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు: 13.5
[26వ పేజీలోని చిత్రం]
వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క 115వ తరగతి పట్టభద్రులు
ఈ క్రింద ఉన్న లిస్టులో వరుసల సంఖ్య ముందు నుండి వెనక్కి లెక్కించబడ్డాయి, ప్రతి వరుసలోని పేర్లు ఎడమ నుండి కుడికి ఇవ్వబడ్డాయి.
(1) బ్రౌన్, టి.; గోలర్, సి.; హాఫ్‌మాన్, ఎ.; బ్రూజీసీ, జె.; ట్రేహన్ ఎస్. (2) స్మార్ట్, ఎన్.; కాష్‌మాన్ ఎఫ్.; గార్సియా, కె.; లోహన్, ఎమ్.; సీఫెర్ట్, ఎస్.; గ్రే, కె. (3) బెకెట్, ఎమ్.; నికల్జ్, ఎస్.; స్మిత్, కె.; గూల్యారా, ఎ.; రెప్పెనెకర్, ఎ. (4) గ్రే, ఎస్.; వాసెక్, కె.; ఫ్లెమింగ్, ఎమ్.; బెతెల్, ఎల్.; హర్‌మాన్సన్, టి.; హర్‌మాన్సన్, పి. (5) రెప్పెనెకర్, జి.; లోహన్, డి.; డికీ, ఎస్.; కిమ్, సి.; ట్రేహన్, ఎ.; వాషింగ్‌టన్, ఎ.; స్మార్ట్, ఎస్. (6) గోలర్, ఎల్.; బర్గోఫర్, టి.; గూల్యారా, డి.; నికల్జ్, ఆర్.; వాషింగ్‌టన్, ఎస్.; కిమ్, జె. (7) బెకెట్, ఎమ్.; డికీ, జె.; స్మిత్, ఆర్.; గార్సియా, ఆర్.; హాఫ్‌మాన్, ఎ.; సీఫెర్ట్, ఆర్.; బ్రౌన్, హెచ్. (8) ఫ్లెమింగ్, ఎస్.; బ్రూజీసీ, పి.; బర్గోఫర్, డబ్ల్యూ.; బెతెల్, టి.; కాష్‌మాన్, జె.; వాసెక్, కె.