కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు కుటుంబ సభ్యులు వాళ్ళెవరు?

యేసు కుటుంబ సభ్యులు వాళ్ళెవరు?

యేసు కుటుంబ సభ్యులు వాళ్ళెవరు?

డిసెంబరు నెలలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, బాల యేసు తన తల్లి మరియ, తనను పెంచిన తండ్రి యోసేపుల వాత్సల్యపూరిత సంరక్షణలో ఉన్నట్లు చూపించే చిత్రాలను మీరు తరచూ చూస్తుంటారు. ఇలాంటి చిత్రాలు క్రైస్తవులు కాని ప్రజలను కూడా ఆకర్షిస్తాయి. ఆ చిత్రాల్లో ప్రధానంగా చూపించబడేది యేసే కాబట్టి ఆయన భూసంబంధ కుటుంబ సభ్యుల గురించి లేఖనాలు మనకేమి చెబుతున్నాయి?

యేసుకు చాలా ఆసక్తికరమైన కుటుంబ నేపథ్యం ఉంది. ఆయన మరియ అనే కన్యకు జన్మించడం ద్వారా మానవ కుటుంబంలో సభ్యుడయ్యాడు. బైబిలు ప్రకారం, పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన ప్రాణం పరలోకం నుండి మరియ గర్భంలోకి మార్చబడింది. (లూకా 1:​30-35) యేసు అద్భుత రీతిలో మరియ గర్భంలోకి మార్చబడతాడని ప్రకటించబడకముందే మరియ యోసేపుకు ప్రధానం చేయబడింది, కాబట్టి యోసేపు యేసును పెంచే బాధ్యతను తీసుకొని ఆయనకు తండ్రి అయ్యాడు.

యేసు జన్మించిన తర్వాత యోసేపు మరియలకు వేరే పిల్లలు కూడా జన్మించారు, వాళ్ళు యేసుకు సోదరులు సోదరీమణులు. ఆ తర్వాత యేసు గురించి నజరేతు నివాసులు అడిగిన ఈ ప్రశ్నను బట్టి ఆ విషయం స్పష్టమవుతోంది: “ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా?” (మత్తయి 1:25; 13:55, 56; మార్కు 6:⁠3) దీన్నిబట్టి యేసు కుటుంబంలో ఆయన తల్లిదండ్రులు, నలుగురు సోదరులు, కనీసం ఇద్దరు సోదరీమణులు ఉండేవారనే నిర్ధారణకు మనం రావచ్చు.

అయితే నేడు కొంతమంది, యేసు సోదరులూ సోదరీమణులూ యోసేపు మరియలకు జన్మించిన పిల్లలేనని విశ్వసించరు. ఎందుకు? “చర్చి మొదటి నుండి, మరియ ఎల్లప్పుడూ కన్యగానే ఉండిపోయిందని బోధిస్తోంది. దాన్ని బట్టి చూస్తే, మరియకు వేరే పిల్లలు లేరనడంలో సందేహమే లేదు” అని న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది. “సోదరుడు” మరియు “సోదరీమణి” అనే పదాలు “మతపరంగా లేదా మరో విధంగా ఐక్యమైవున్న వారిని” లేదా బంధువులను, బహుశా దాయాదులను సూచించవచ్చని కూడా ఆ గ్రంథం చెబుతోంది.

అది నిజమా? కొంతమంది క్యాథలిక్‌ తత్వవేత్తలు కూడా సాంప్రదాయ సిద్ధాంతంతో ఏకీభవించకుండా, యేసుకు స్వంత సోదరులు, సోదరీమణులు ఉండేవారనే తలంపును సమర్థిస్తున్నారు. క్యాథలిక్‌ బైబిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అమెరికాకు మాజీ అధ్యక్షుడైన జాన్‌ పి. మైయర్‌ ఇలా వ్రాశాడు: “కొ[త్త] ని[బంధన]లో అడెల్ఫోస్‌ [సహోదరుడు] అనే పదం కేవలం సూచనార్థకంగా లేదా అలంకారికంగా కాకుండా ఒక వ్యక్తి భౌతిక సంబంధాలను లేదా చట్టపరమైన సంబంధాలను పేర్కొనడానికి ఉపయోగించినప్పుడు అది స్వంత అన్నదమ్ములను మాత్రమే సూచిస్తుంది.” * అవును యేసుకు సోదరులు, సోదరీమణులు ఉండేవారని, వాళ్ళు యోసేపు మరియలకు జన్మించినవారని లేఖనాలు సూచిస్తున్నాయి.

సువార్తలు యేసు ఇతర బంధువుల గురించి కూడా చెబుతున్నాయి కానీ ఇప్పుడు మనం కేవలం యేసు స్వంత కుటుంబ సభ్యులపై అవధానముంచి వాళ్ళనుండి మనమేమి నేర్చుకోవచ్చో చూద్దాము.

[అధస్సూచి]

^ పేరా 6 జె. పి. మైయర్‌ రచించిన “ద బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ ఆఫ్‌ జీసెస్‌ ఇన్‌ ఎక్యూమెనికల్‌ పెర్స్‌పెక్టివ్‌,” ద క్యాథలిక్‌ బిబ్లికల్‌ క్వార్టర్లీ, జనవరి 1992, 21వ పేజీ.