కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునికి మనపట్ల శ్రద్ధ ఉందా?

దేవునికి మనపట్ల శ్రద్ధ ఉందా?

దేవునికి మనపట్ల శ్రద్ధ ఉందా?

కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఇతర బరువైన బాధ్యతల కారణంగా మీరు భావోద్వేగ ఒత్తిడికి గురైనట్లు భావిస్తున్నారా? చాలామంది అలాంటి స్థితిలోనే ఉన్నారు. నేడు అన్యాయం, నేరం, దౌర్జన్యం ఎవరిపై ప్రభావం చూపడం లేదు? నిజానికి పరిస్థితి సరిగ్గా బైబిలు వర్ణించినట్లే ఉంది: “సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నది.” (రోమీయులు 8:​22) ‘దేవునికి మనపట్ల శ్రద్ధ ఉందా? ఆయన మనకు సహాయం చేస్తాడా?’ అని చాలామంది ప్రశ్నించడంలో ఆశ్చర్యం లేదు.

జ్ఞానియైన సొలొమోను రాజు దేవునికి ప్రార్థిస్తూ ఇలా అన్నాడు: “నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగినవాడవు గదా.” దేవునికి మన గురించి తెలియడమే కాదు ఆయనకు మనపట్ల వ్యక్తిగతమైన శ్రద్ధ ఉందని సొలొమోను విశ్వసించాడు. అందుకే ‘ఆకాశమునుండి ఆలకించుమని,’ ‘తన నొప్పిగాని కష్టముగాని’ చెప్పుకున్న దైవభయంగల ప్రతీ వ్యక్తి ప్రార్థనలకు సమాధానమివ్వమని ఆయన దేవుణ్ణి అడగగలిగాడు.​—⁠2 దినవృత్తాంతములు 6:29-31.

నేటికీ యెహోవా దేవునికి మనపై శ్రద్ధ ఉంది, తనకు ప్రార్థన చేయమని ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు. (కీర్తన 50:​15) తన చిత్తానికి అనుగుణంగా చేయబడిన హృదయపూర్వక ప్రార్థనలకు తాను ప్రతిస్పందిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. (కీర్తన 55:16, 22; లూకా 11:5-13; 2 కొరింథీయులు 4:⁠7) అవును “ఎవడైనను . . . [ఆయన] జనులందరు కలిసియైనను, నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు . . . చేయు విన్నపములన్నియు ప్రార్థనలన్నియు” యెహోవా వింటాడు. కాబట్టి మనం దేవునిపై నమ్మకముంచి, ఆయన సహాయం కోసం ప్రార్థించి, ఆయనకు సన్నిహితమైతే, మనం ఆయన ప్రేమపూర్వకమైన శ్రద్ధను ఆయన నడిపింపును పొందుతాము. (సామెతలు 3:​5, 6) బైబిలు రచయిత యాకోబు మనకిలా హామీ ఇస్తున్నాడు: “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.​—⁠యాకోబు 4:⁠8.