కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజాయితీగల మనస్సాక్షి

నిజాయితీగల మనస్సాక్షి

నిజాయితీగల మనస్సాక్షి

కెన్యాలోని ఒక విశ్వవిద్యాయంలో ఉద్యోగం చేస్తున్న ఛార్లెస్‌ ఒకరోజు పనినుండి ఇంటికి తిరిగివెళుతూ, తన సెల్‌ ఫోన్‌ పోగొట్టుకున్నాడు. కెన్యాలో ఇప్పటికీ సెల్‌ ఫోన్‌లు చాలా ఖరీదైన విలాస వస్తువులుగా పరిగణించబడుతున్నాయి.

“ఎవరైనా దానిని తిరిగి నాకిస్తారని నేను ఆశించలేదు” అని ఛార్లెస్‌ చెబుతున్నాడు. అయితే కొన్నిరోజుల తర్వాత కెన్యాలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం నుండి తనకు ఫోన్‌ రావడంతో అతను ఆశ్చర్యపోయాడు. వచ్చి తన సెల్‌ ఫోన్‌ తీసుకెళ్లమని అతనికి చెప్పబడినప్పుడు, అతను తన చెవులను తానే నమ్మలేకపోయాడు! ఛార్లెస్‌ ప్రయాణించిన వాహనంలోనే ప్రయాణిస్తున్న యెహోవాసాక్షుల పూర్తికాల పరిచారకునికి ఆ ఫోన్‌ దొరికింది. దాని యజమానిని కనుగొనే ప్రయత్నంలో ఆ పరిచారకుడు ఆ ఫోన్‌ను బ్రాంచి కార్యాలయానికి తీసుకొచ్చాడు. అప్పుడు అక్కడున్న స్వచ్ఛంద సేవకులు ఆ ఫోన్‌లో కనబడ్డ నంబరు జాడతీసి చివరకు ఛార్లెస్‌ను కనుగొన్నారు.

“కష్టపడి నన్ను కనుక్కోవడానికి చేసిన ప్రయత్నాలను నేను చాలా ప్రశంసిస్తున్నాను. తమకు దొరికిన నా సెల్‌ ఫోన్‌ తిరిగి నాకు అందజేసిన మీ సంస్థ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాంటి నిజాయితీపరుడైన వ్యక్తిని నేడు కనుక్కోవడం అంత సులభం కాదు, అయితే యెహోవా దేవుని నిజమైన సాక్షులుగా కొందరు ఉండడం ప్రోత్సాహకరంగా ఉంది” అని ఛార్లెస్‌ బ్రాంచి కార్యాలయానికి వ్రాసిన ఉత్తరంలో పేర్కొన్నాడు.

ప్రతీచోట తమ నిజాయితీకి యెహోవాసాక్షులు పేరొందారు. “మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాము” అని చెప్పిన అపొస్తలుడైన పౌలును వారు అనుకరిస్తారు. (హెబ్రీయులు 13:18; 1 కొరింథీయులు 11:⁠1) “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి” అని యేసుక్రీస్తు చెప్పినట్లు అలాంటి ప్రవర్తన యెహోవా దేవునికి మహిమ తెస్తుందని వారికి తెలుసు.​—⁠మత్తయి 5:16.