కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కష్టాల్లోవున్న వారికి ఆదరణ

కష్టాల్లోవున్న వారికి ఆదరణ

కష్టాల్లోవున్న వారికి ఆదరణ

గతంలో విశ్వాసులైన స్త్రీపురుషులు కష్టాలు వచ్చినప్పుడు నడిపింపు కోసం వారు దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థన చేశారు. అయితే వారు ఆ కష్టాలను తగ్గించుకోవడానికి చొరవ కూడా తీసుకున్నారు, కష్టపెట్టేవారి నుండి తప్పించుకునేందుకు చాతుర్యం వంటివి ఉపయోగించారు. ఉదాహరణకు, తన ప్రతికూల పరిస్థితిని తట్టుకోవడానికి యెహోవాపై ఆధారపడడం, వ్యక్తిగత ప్రయత్నం దావీదుకు సహాయం చేశాయి. మరి నేడు మన విషయమేమిటి?

కష్టాలు అనుభవిస్తున్నప్పుడు, మీ సమస్యను పరిష్కరించుకోవడానికి బహుశా మీరు చొరవ తీసుకుంటారు. ఉదాహరణకు, మీరు నిరుద్యోగులైతే, మిమ్మల్ని మీ కుటుంబాన్ని పోషించుకునేందుకు తగిన ఉద్యోగం సంపాదించుకోవడానికి మీరు ప్రయత్నించరా? (1 తిమోతి 5:⁠8) లేదా మీకు ఒంట్లో బాగోలేకపోతే తగిన వైద్య సహాయం కోసం మీరు ప్రయత్నించరా? ఆసక్తికరమైన విషయమేమిటంటే, అన్నిరకాల జబ్బులు బాగుచేసేందుకు దేవుని నుండి శక్తి పొందిన యేసు కూడా ‘రోగులకు వైద్యుని అవసరం’ ఉందని గుర్తించాడు. (మత్తయి 9:​12) అయితే అన్ని సందర్భాల్లోను మీ కష్టాలు తొలగించబడకపోవచ్చు; కొంతమేరకు మీరు వాటిని సహించవలసి రావచ్చు.

ఆ విషయమై యెహోవా దేవునికి ఎందుకు ప్రార్థించకూడదు? ఉదాహరణకు, ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నప్పుడు, బైబిలు సూత్రాలకు భిన్నంగావుండే ఉద్యోగాన్ని అంగీకరించే శోధనను ఎదిరించేందుకు ప్రార్థనాపూర్వకంగా దేవునిపై ఆధారపడడం మనకు సహాయం చేస్తుంది. అలాగే మనం దురాశ లేదా ధనాపేక్షతో ‘విశ్వాసము నుండి తొలగిపోకుండా’ కూడా ఉంటాము. (1 తిమోతి 6:​10) ఉద్యోగం లేదా కుటుంబం లేదా అనారోగ్య చింతలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, నిజానికి మనం “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు” అని చెప్పిన దావీదు వినతిని అనుసరించవచ్చు.​—⁠కీర్తన 55:22.

మనకొచ్చిన కష్టం మనలను ముంచెత్తకుండా మన మానసిక సమతుల్యాన్ని కాపాడుకోవడానికి కూడా మన మనఃపూర్వక ప్రార్థన సహాయం చేస్తుంది. నిజ క్రైస్తవుడైన అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.” యథార్థమైన ప్రార్థన ఏ విధంగా మనకు ఆదరణనిస్తుంది? “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలిప్పీయులు 4:​6, 7) దేవుని సమాధానము ‘సమస్త జ్ఞానమునకు మించినదిగా’ ఉంటుంది. అందువల్ల, మానసిక భారాలతో మనం కృంగినప్పుడు అది మనలను స్థిరంగా ఉంచగలదు. మన కష్టాలు అధికమయ్యేలా మనం తొందరపడి, అవివేకంగా ప్రవర్తించకుండా మనకు సహాయం చేస్తూ అది ‘మన హృదయాలకు, తలంపులకు కావలిగా ఉంటుంది.’

ప్రార్థన పరిస్థితిలో గణనీయమైన మార్పును కూడా తీసుకురాగలదు. అపొస్తలుడైన పౌలు రోమాలో ఖైదీగా ఉన్నప్పుడు, తనకోసం ప్రార్థించమని ఆయన తోటి క్రైస్తవులను వినయంగా వేడుకున్నాడు. పౌలు ఈ విన్నపం ఎందుకు చేశాడు? “నేను మరి త్వరగా మీయొద్దకు మరల వచ్చునట్లు ఈలాగు చేయవలెనని మరి యెక్కువగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను” అని ఆయన వారికి వ్రాశాడు. (హెబ్రీయులు 13:​19) మరోరకంగా చెప్పాలంటే, తోటి విశ్వాసులు పట్టుదలగాచేసే ప్రార్థనలను యెహోవా ఆలకించడం తను విడుదలకాగల సమయంలో మార్పు తీసుకురావచ్చని పౌలుకు తెలుసు.​—⁠ఫిలేమోను 22.

మన కష్టాల ఫలితాన్ని ప్రార్థన మారుస్తుందా? బహుశా మార్చవచ్చు. అయినా సరే, మనం కోరినట్టే యెహోవా దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోవచ్చని మనం గ్రహించాలి. తన శరీర అనారోగ్యం అంటే బహుశా తన “శరీరములో ఒక ముల్లు” గురించి పౌలు చాలామార్లు ప్రార్థించాడు. అయితే ఆ కష్టాన్ని తొలగించడానికి బదులు దేవుడు పౌలుకు ఇలా చెప్పాడు: “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది.”​—⁠2 కొరింథీయులు 12:7-9.

కాబట్టి మన కష్టం వెంటనే తొలగకపోవచ్చు. అయితే, మన పరలోకపు తండ్రిపై ఆధారపడ్డామని నిరూపించుకునే అవకాశం మాత్రం మనకుంటుంది. (యాకోబు 1:​2-4) ఆ కష్టాన్ని యెహోవా తొలగించకపోయినా, ‘సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ [మనకు] తప్పించుకొను మార్గమును కలుగజేయగలడనే’ నమ్మకంతో ఉండండి. (1 కొరింథీయులు 10:​13) ‘సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించే’ దేవుడని యెహోవా పిలువబడ్డాడనే విషయం గమనార్హం. (2 కొరింథీయులు 1:​3, 4) సహించడానికి మనకు అవసరమైనది దేవుడు మనకు ఇవ్వగలడు, పైగా మనకు నిత్యజీవ నిరీక్షణ ఉంది.

యెహోవా “వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు” అని దేవుని వాక్యమైన బైబిలు మనకు వాగ్దానం చేస్తోంది. (ప్రకటన 21:​3, 4) కష్టాల్లేని లోకం అనేమాట నమ్మశక్యం కానట్టుగా ఉందా? మీరు తీరని కష్టాలతో జీవించడానికి అలవాటుపడిపోతే అలానే అనిపించవచ్చు. అయితే భయం, విపత్తుల నుండి విడుదలను దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది.​—⁠యెషయా 55:10, 11.

[9వ పేజీలోని చిత్రాలు]

నిరాశ నుండి ఉపశమనానికి