మీ హృదయాన్ని కాపాడుకోవడం ద్వారా మీ పవిత్రతను నిలబెట్టుకోండి
మీ హృదయాన్ని కాపాడుకోవడం ద్వారా మీ పవిత్రతను నిలబెట్టుకోండి
“నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.”—సామెతలు 4:23.
బహుశా ఆ వర్ణచిత్రం పాతదిగా అనిపించవచ్చు. అది ఆ ఇంటి అలంకారానికి తగ్గట్టుగా ఉండకపోవచ్చు. ఏదేమైనా, ఆ ఇంటి యజమాని తనకది అక్కర్లేదని భావించాడు. ఆ వర్ణచిత్రం పాతసామాన్లు అమ్మే షాపులో 29 డాలర్లకు అమ్మకానికి పెట్టబడింది. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత దాని అసలు విలువ దాదాపు పదిలక్షల డాలర్లని తేలింది! నిజానికి, అది అరుదైన కళాఖండం. ఈ అమూల్య కళాఖండాన్ని తక్కువ అంచనా వేసిన ఆ మునుపటి యజమాని భావాలెలా ఉంటాయో ఒక్కసారి ఊహించండి!
2 ఒక వ్యక్తి పవిత్రత విషయంలో అంటే అతని నైతిక పరిశుభ్రత లేదా స్వచ్ఛత విషయంలో తరచూ అలాగే జరుగుతోంది. నేడు చాలామంది తమ సొంత పవిత్రతను విలువలేనిదిగా పరిగణిస్తున్నారు. కొందరు దానిని పాతకాలపు ఆలోచనగా, ఆధునిక జీవనశైలికి పనికిరాదన్నట్లు పరిగణిస్తున్నారు. అందువల్ల, వారు తమ పవిత్రతను గాలికి వదిలేస్తున్నారు. కొందరు కేవలం కొన్ని క్షణాల లైంగిక సుఖానుభూతి కోసం తమ పవిత్రతను పణంగా పెడుతున్నారు. మరికొందరైతే తమ స్నేహితుల దృష్టిలో లేదా భిన్నలింగ వ్యక్తి దృష్టిలో గొప్పగా కనబడాలనే ఉద్దేశంతో దానిని బలిచేస్తున్నారు.—సామెతలు 13:20.
3 తమ పవిత్రత ఎంత అమూల్యమైనదో చాలామంది ఆలశ్యంగా తెలుసుకుంటారు. వారికి జరిగిన నష్టం తరచూ విషాదకరంగా ఉంటుంది. బైబిలు చెబుతున్నట్లుగా లైంగిక దుర్నీతి పర్యవసానాలు ‘ముసిణిపండంత చేదైన’ విషంలా ఉండగలవు. (సామెతలు 5:3, 4) నేటి భ్రష్టుపట్టిన నైతిక పర్యావరణం దృష్ట్యా, మీరు మీ పవిత్రతను విలువైనదిగా ఎలా ఎంచగలరు, మీరు దానిని భద్రంగా ఎలా కాపాడుకోగలరు? దీనికి సంబంధించి మనం చేపట్టగల మూడు చర్యలపై దృష్టిసారిద్దాం.
మీ హృదయాన్ని భద్రంగా ఉంచుకోండి
4 పవిత్రతను కాపాడుకోవడానికి హృదయాన్ని భద్రంగా ఉంచుకోవడం కీలకం. బైబిలు ఇలా చెబుతోంది: “నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.” (సామెతలు 4:23) ఇక్కడ సూచించబడిన “నీ హృదయము” ఏమిటి? అది అక్షరార్థమైన హృదయం కాదు. అది అలంకారార్థ హృదయం. అది మీ తలంపులు, భావాలు, ఉద్దేశాలతోసహా మీ అంతరంగ వ్యక్తిని సూచిస్తుంది. బైబిలు ఇలా చెబుతోంది: ‘నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.’ (ద్వితీయోపదేశకాండము 6:5) యేసు దీనిని అత్యంత ప్రధానమైన ఆజ్ఞ అని సూచించాడు. (మార్కు 12:29, 30) కాబట్టి, మన ఈ హృదయానికి అంతులేని విలువ ఉందనేది స్పష్టమవుతోంది. దీనిని భద్రంగా ఉంచుకోవడం ఎంతైనా ప్రాముఖ్యం.
5 అయితే, “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది” అని కూడా బైబిలు చెబుతోంది. (యిర్మీయా 17:9) హృదయం మోసకరమైనదిగా ఉండి, మనకు ప్రమాదకరంగా ఎలా పరిణమించగలదు? ఉదాహరణకు, ఓ వాహనం విలువైన సాధనంగా ఉండి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కూడా కాపాడుతుంది. కానీ డ్రైవరు కారును అదుపుచేయకపోతే, దానిని నడిపించడానికి స్టీరింగ్ తిప్పకపోతే అదే కారు సుళువుగా ప్రాణాంతక సాధనంగా మారిపోవచ్చు. అదే ప్రకారం, మీరు మీ హృదయాన్ని భద్రంగా ఉంచుకోకపోతే, మీరు మీ అంతరంగంలోని ప్రతీ కోరికకు, ప్రేరణకు లొంగిపోతారు, చివరికి మీ జీవన విధానం కష్టాలపాలవుతుంది. దేవుని వాక్యమిలా చెబుతోంది: “తన మనస్సును [“హృదయాన్ని,” NW] నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును.” (సామెతలు 28:26) అవును, మీరు ప్రయాణానికి ముందు రోడ్డు మ్యాప్‌ను సంప్రదించినట్లుగానే, మీ మార్గనిర్దేశానికి దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తే మీరు జ్ఞానయుక్తంగా నడుచుకుంటూ ముప్పు తప్పించుకోవచ్చు.—కీర్తన 119:105.
6 మన హృదయం స్వభావసిద్ధంగా పవిత్రతవైపు మొగ్గుచూపదు. మనం దానిని ఆ వైపుగా నడిపించాలి. అలా చేయడానికి ఒక విధానమేమంటే పవిత్రత యొక్క నిజవిలువను తలపోయడం. ఈ లక్షణానికీ పరిశుభ్రత, స్వచ్ఛత, పాపంనుండి వేరుగా ఉండడాన్ని సూచించే పరిశుద్ధతకూ దగ్గరి సంబంధముంది. పరిశుద్ధత యెహోవా దేవుని సహజ స్వభావంలో భాగమైయున్న ఓ అమూల్య లక్షణం. వందలాది బైబిలు వచనాలు ఆ లక్షణాన్ని యెహోవాకు ముడిపెడుతున్నాయి. నిజానికి, “యెహోవా పరిశుద్ధుడు” అని బైబిలు చెబుతోంది. (నిర్గమకాండము 28:36) అయితే అసంపూర్ణ మానవులమైన మనకూ ఆ ఉన్నత లక్షణానికీ సంబంధమేమిటి?
7 తన వాక్యంలో యెహోవా మనకిలా చెబుతున్నాడు: ‘నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండవలెను.’ (1 పేతురు 1:14) అవును, మనం యెహోవా పరిశుద్ధతను అనుకరించవచ్చు; మనం మన పవిత్రతను కాపాడుకుంటూ ఆయన ఎదుట పరిశుభ్రంగా ఉండవచ్చు. ఆ విధంగా, మనం అపరిశుభ్రమైన, కళంకం తీసుకొచ్చే పనులు చేయకుండా ఉన్నప్పుడు, మనం ఉన్నతమైన, మనోహరమైన ఆధిక్యతను అంటే సర్వోన్నత దేవుని చక్కని లక్షణాన్ని ప్రతిబింబించే ఆధిక్యతను చేపట్టడానికి ప్రయత్నిస్తున్నాము! (ఎఫెసీయులు 5:1) యెహోవా మనం చేయగల దానికంటే ఎక్కువ ఎప్పుడూ అడగని జ్ఞానవంతుడైన, న్యాయమైన యజమాని కాబట్టి, ఆ పని మనవల్ల కాదని మనం తలంచకూడదు. (కీర్తన 103:13, 14; యాకోబు 3:17) నిజమే ఆధ్యాత్మికంగా, నైతికంగా పవిత్రంగా ఉండడానికి కృషి అవసరం. అయితే అపొస్తలుడైన పౌలు, ‘క్రీస్తు ఎడలనున్న సరళత . . . పవిత్రతను’ సూచించాడు. (2 కొరింథీయులు 11:3) కాబట్టి క్రీస్తు ఎడల ఆయన తండ్రి ఎడల మనకున్న బాధ్యత దృష్ట్యా నైతిక విషయాల్లో పవిత్రంగా ఉండేలా మనం ప్రతివిధమైన ప్రయత్నం చేయవద్దా? నిజానికి, వారు మనపట్ల మనమెప్పటికీ తిరిగి చెల్లించలేని దానికంటే ఎక్కువ ప్రేమ చూపించారు. (యోహాను 3:16; 15:13) పరిశుభ్రమైన నైతిక జీవితం జీవించడం ద్వారా మనం కృతజ్ఞత చూపడం సమంజసమైనది. పవిత్రత గురించి మనం ఈ విధంగా ఆలోచించడం ద్వారా, మనం దానిని విలువైనదిగా పరిగణిస్తూ మన హృదయాన్ని భద్రంగా ఉంచుకుంటాము.
8 మనల్ని మనం పోషించుకునే పద్ధతినిబట్టి కూడా మనం మన హృదయాన్ని భద్రపరచుకుంటాం. దేవుని రాజ్య సువార్తపై మన దృష్టి నిలుపుతూ మన మనస్సులకు, హృదయాలకు క్రమంగా మంచి ఆధ్యాత్మిక ఆహారం ద్వారా పోషణ ఇవ్వాలి. (కొలొస్సయులు 3:2) మన సంభాషణ సహితం అలాంటి దృష్టినే ప్రతిబింబించాలి. ఎక్కువగా శారీరక, అనైతిక విషయాలు మాట్లాడేవారనే పేరు మనకుంటే, మనం మన హృదయ స్థితి ఎలావుందో వెల్లడిచేస్తున్నట్లే లెక్క. (లూకా 6:45) దానికి బదులుగా మనం ఆధ్యాత్మిక, క్షేమాభివృద్ధికర విషయాలే మాట్లాడే వ్యక్తిగా పేరు సంపాదించుకుందాం. (ఎఫెసీయులు 5:3) మన హృదయాన్ని భద్రంగా ఉంచుకోవడానికి మనం తప్పించుకోవలసిన గంభీరమైన ప్రమాదాలు ఉన్నాయి. వీటిలో రెండింటిని మనం పరిశీలిద్దాం.
జారత్వానికి దూరంగా పారిపోండి
9 అనేకమంది తమ హృదయాలను భద్రంగా ఉంచుకొని పవిత్రతను కాపాడుకోవడానికి సహాయపడ్డ ఉపదేశం వ్రాసేలా యెహోవా అపొస్తలుడైన పౌలును ప్రేరేపించాడు. పౌలు ఇలా ఉపదేశించాడు: “జారత్వమునకు దూరముగా పారిపోవుడి.” (1 కొరింథీయులు 6:18) ఆయన కేవలం “జారత్వానికి దూరంగా ఉండండి” అనడంకంటే ఇంకా ఎక్కువే చెప్పాడని గమనించండి. కాబట్టి క్రైస్తవులు ఎక్కువే చేయాలి. ప్రాణాపాయ పరిస్థితి నుండి దూరంగా పారిపోవునట్లు వారు అలాంటి అనైతిక క్రియల నుండి దూరంగా పారిపోవాలి. మనం ఆ ఉపదేశాన్ని అలక్ష్యంచేస్తే, అపాయకరమైన అనైతిక చర్యల్లో పాల్గొనే అవకాశం పెంచుకొని, దేవుని అనుగ్రహం పోగొట్టుకునే వారమవుతాము.
10 ఉదాహరణకు: ఒక ముఖ్యమైన సందర్భంకోసం ఓ తల్లి తన పిల్లవాడికి స్నానం చేయించి, మంచి దుస్తులు వేసింది. ఆ తర్వాత ఆ పిల్లవాడు అందరూ బయలుదేరే వరకూ తాను బయట ఆడుకుంటానంటే, ఆ తల్లి ఓ షరతుపై సరే అంది. ఆమె “నువ్వు మాత్రం బయటవున్న ఆ నీటిగుంట దగ్గరకు కూడా వెళ్లొద్దు. బట్టలు మురికి చేసుకున్నావో నీకు దెబ్బలు పడతాయి” అని వాడికి చెప్పింది. కొద్దిసేపటికే వాడు, ఆ నీటిగుంట దగ్గర మునికాళ్లపై ముందుకు వంగి ఏదో అందుకోవడానికి ప్రయత్నించడం ఆమె కంటపడింది. వాడి బట్టలు ఇంకా మురికి కాలేదు. అయినప్పటికీ, వాడు ఆ నీటిగుంట దగ్గరకు వెళ్లొద్దని ఆమె చేసిన హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తున్నాడు, ప్రమాదం ముంచుకురాబోతోంది. (సామెతలు 22:15) మరింత జాగ్రత్తగా ఉండవలసిన యౌవనులు, వయోజనులు అనేకులు కూడా అలాంటి పొరపాటే చేస్తారు. ఎలా?
11 చాలామంది ప్రజలు “జుగుప్సాకరమైన లైంగిక తృష్ణకు” లొంగిపోయిన ఈ కాలాల్లో, ఎక్కడబడితే అక్కడ అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకోవడాన్ని పురికొల్పే ఓ కొత్త వ్యాపారమే వృద్ధయింది. (రోమీయులు 1:26, 27) పత్రికల్లో, పుస్తకాల్లో, వీడియోల్లో, ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాల తెగులు విశృంఖలమైంది. అలాంటి చిత్రాలను తమ మనస్సులోకి తీసుకునేవారు జారత్వానికి దూరంగా పారిపోవడం లేదు. బైబిలు హెచ్చరికను పెడచెవినబెడుతూ వారు దానితో ఆటలాడుతూ, నీటి అంచున మునికాళ్లపై ముందుకు వంగినవారిగా ఉంటారు. తమ హృదయాన్ని భద్రంగా ఉంచుకోవడానికి బదులు, మరచిపోవడానికి అనేక సంవత్సరాలు పట్టే తీక్షణమైన ప్రతిరూపాలతో వారు దానిని విషపూరితం చేసుకుంటున్నారు. (సామెతలు 6:27) తన కన్నులతో నిబంధన చేసుకున్న యథార్థపరుడైన యోబు నుండి మనం నేర్చుకుందాం. తప్పుచేయడానికి తనను శోధించేవాటిని చూసేందుకు ఆయన తన కన్నులను అనుమతించలేదు. (యోబు 31:1) అది ఖచ్చితంగా అనుసరణీయమైన ఆదర్శం!
12 ప్రత్యేకంగా కోర్ట్‌షిప్ సమయంలో ‘జారత్వానికి దూరంగా పారిపోవడం’ అవశ్యం. ఆ సమయం నిరీక్షణతోను, భవిష్యత్తు కోసమైన ఎదురుచూపులతోను నిండిన ఆనందదాయకమైన సమయమై ఉండాలి, అయితే ఆ సమయంలో కొందరు యువ జంటలు లైంగిక దుర్నీతికి పాల్పడడం ద్వారా దానిని పాడుచేస్తున్నారు. ఆ ప్రక్రియలో వారు మంచి వివాహ బంధానికి శ్రేష్ఠమైన పునాదిని అంటే నిస్వార్థ ప్రేమ, ఆశానిగ్రహం, యెహోవా దేవునిపట్ల విధేయతపై ఆధారపడిన శ్రేష్ఠమైన పునాదిని పరస్పరం పాడుచేసుకుంటారు. ఓ క్రైస్తవ జంట తమ కోర్ట్‌షిప్ సమయంలో లైంగిక దుర్నీతికి పాల్పడ్డారు. వారు వివాహం చేసుకున్న తర్వాత, పెళ్లిరోజు ఆనందాన్ని సైతం పాడుచేసేంతగా తన మనస్సాక్షి తనను బాధించిందని ఆ భార్య చెబుతూ ఇలా ఒప్పుకుంది: “నన్ను క్షమించమని నేను చాలాసార్లు యెహోవాను వేడుకున్నాను, అయినాసరే, అప్పటినుండి ఏడు సంవత్సరాలు గడిచిపోయినా, నా మనస్సాక్షి నన్నింకా బాధిస్తూనే ఉంది.” అలాంటి పాపాలు చేసేవారు క్రైస్తవ పెద్దలనుండి సహాయం పొందడం అత్యంత ప్రాముఖ్యం. (యాకోబు 5:14, 15) అయితే అనేక క్రైస్తవ జంటలు జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తూ కోర్ట్‌షిప్ సమయంలో ఇలాంటి ప్రమాదాలకు దూరంగా ఉంటారు. (సామెతలు 22:3) ప్రేమను వ్యక్తపరిచే చేష్టలను వారు అదుపులో ఉంచుకుంటారు. వారు తమవెంట ఎవరో ఒకరిని ఉంచుకొని ఏకాంత ప్రదేశాల్లో వాళ్లిద్దరే ఒంటరిగా ఉండకుండా చూసుకుంటారు.
13 యెహోవాను సేవించని వారితో కోర్ట్‌షిప్‌చేసే క్రైస్తవులు ఘోరమైన సవాళ్లు ఎదుర్కొనే అవకాశముంది. ఉదాహరణకు, యెహోవా దేవుణ్ణి ప్రేమించని వేరొకరితో మీరెలా జతకట్టగలుగుతారు? యెహోవాను ప్రేమిస్తూ, ఆయన పవిత్ర కట్టడలను గౌరవించే వారితో మాత్రమే క్రైస్తవులు జతకట్టడం అవశ్యం. దేవుని వాక్యం మనకిలా చెబుతోంది: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?”—2 కొరింథీయులు 6:14.
14 పరిజ్ఞానం కూడా అవశ్యం. నిజానికి జారత్వమంటే ఏమిటో మనకు తెలియకపోతే మనం సరైన రీతిలో దానినుండి దూరంగా పారిపోలేము. నేటి లోకంలో కొందరు “జారత్వం” అనే మాటకున్న భావాన్ని తప్పుగా అర్థంచేసుకున్నారు. తాము రతికి పాల్పడనంతవరకు వివాహేతర మార్గాల్లో తమ లైంగిక తృష్ణ తీర్చుకోవచ్చని వారు భావిస్తున్నారు. టీనేజ్ అమ్మాయిల అవాంఛిత గర్భధారణల సంఖ్యను తగ్గించడానికి కృషిచేస్తున్న కొన్ని ఆదర్శనీయ వైద్య సంస్థలు సైతం గర్భధారణకు దారితీయని అనాచారవంతమైన లైంగిక ప్రవర్తనలో పాల్గొనడానికి యువతను ప్రోత్సహించాయి. అలాంటి సలహా విషాదకరంగా తప్పుదోవపట్టించింది. అవివాహ గర్భధారణ తప్పించుకోవడం పవిత్రతను కాపాడుకోవడం వంటిది కాదు, ‘జారత్వానికి’ ఉన్న నిర్వచనం అంత సంకుచితమైనది కాదు.
15 “జారత్వము” అని అనువదించబడ్డ గ్రీకు పదమైన పోర్నియాకు చాలా విస్తృతమైన భావముంది. వివాహిత దంపతులు కానివారి మధ్యవుండే లైంగిక సంబంధాలను, అలాగే లైంగిక అవయవాల దురుపయోగాన్ని కూడా అది సూచిస్తుంది. పోర్నియాలో ముఖరతి, ఆసన సంభోగము, వేరొకరికి హస్తప్రయోగం చేయడం వంటి కృత్యాలు 2 తిమోతి 2:26) అంతేకాకుండా, పవిత్రత కాపాడుకోవడం అంటే కేవలం జారత్వపు క్రియలు అవి ఎలాంటివైనా వాటికి విముఖంగా ఉండడం అని మాత్రమే కాదు. ‘జారత్వానికి దూరంగా పారిపోవడానికి’ మనం పోర్నియా సంబంధమైన గంభీర పాపానికి దారితీయగల అన్నిరకాల లైంగిక అపవిత్రతను, కాముకత్వాన్ని విసర్జించాలి. (ఎఫెసీయులు 4:19) అలా చేసినప్పుడే మనం పవిత్రతను కాపాడుకుంటాము.
చేరివున్నాయి, ఇలాంటివి సాధారణంగా వేశ్యా గృహాల్లో జరిగే జారత్వానికి సంబంధించిన కృత్యాలు. అలాంటివి జారత్వ క్రియలు కాదని తలంచేవారు తమ్మునుతామే మోసగించుకుంటూ సాతాను ఉరులకు బలవుతున్నారు. (సరసంలో ఉండే ప్రమాదాలకు దూరంగా ఉండండి
16 మనం పవిత్రతను కాపాడుకోవాలంటే, జాగ్రత్తగా ఉండవలసిన మరో ప్రమాదం సరసాలాడడం. భిన్నలింగ వ్యక్తులు సరసాలాడడంలో తప్పులేదని, అది హాని కలిగించని తమాషా అని కొందరు వాదించవచ్చు. కానీ, సరససల్లాపానికి తగిన సమయం, తగిన స్థానం ఉంది. ఇస్సాకు రిబ్కాతో ‘సరసమాడడం’ ఇతరులకు కనబడింది, అది గమనించిన వారికి వారు అన్నాచెల్లెళ్లు కాదని స్పష్టంగా తెలిసింది. (ఆదికాండము 26:7-9) అయితే వారిద్దరు భార్యాభర్తలు. వారు పరస్పరం ప్రేమించుకోవడంలో తప్పులేదు. అయితే పరాయి వ్యక్తితో సరసాలాడ్డం మాత్రం భార్యభర్తల సంబంధం వంటిది కాదు.
17 సరసాలాడడాన్ని ఈ విధంగా నిర్వచించవచ్చు: వివాహం చేసుకోవాలనే ఉద్దేశం లేకుండానే పరాయి వ్యక్తిపట్ల రొమాంటిక్ ఆసక్తి ప్రదర్శించడం. మానవులు సంశ్లిష్ట ప్రాణులు, అందువల్ల వారి సరసాలాడే మార్గాలు కోకొల్లలు, వాటిలో కొన్ని వెంటనే అంతుబట్టవు. (సామెతలు 30:18, 19) అందువల్ల, కఠినమైన ప్రవర్తనా నియమాలతో వాటిని పరిష్కరించడం కుదరదు. బదులుగా, నియమావళికి అతీతంగా ఉన్నదేదో అవసరం అంటే యథార్థమైన స్వీయ పరీక్ష మరియు బైబిలు సూత్రాలను చిత్తశుద్ధితో అన్వయించుకోవడం అవసరం.
18 మనం చిత్తశుద్ధితో మన భావాలను పరిశీలించి చూసుకుంటే, ఓ భిన్నలింగ వ్యక్తికి మనపై రొమాంటిక్ ఆసక్తి ఉందని తెలిసినప్పుడు, మనలో చాలామంది ఉప్పొంగిపోతామని ఒప్పుకోవలసిందే. అది సహజం. అయితే అలాంటి ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో అంటే మన స్వాభిమానం మరికాస్త పెంచుకోవడానికో లేదా వేరొకరిలో అలాంటి స్పందననే రేకెత్తించాలనే ఉద్దేశంతోనో మనం సరసాలాడతామా? అలాచేస్తే, మనం బహుశా ఇతరులకు కలిగిస్తున్న బాధ గురించి ఆలోచించామా? ఉదాహరణకు, సామెతలు 13:12 ఇలా చెబుతోంది: “కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును.” మనం ఉద్దేశపూర్వకంగా పరాయి వ్యక్తితో సరసాలాడితే, ఆ వ్యక్తిపై అదెలాంటి ప్రభావం చూపుతుందో బహుశా మనకు తెలియకపోవచ్చు. అతను లేదా ఆమె కోర్ట్‌షిప్‌పై ఆ తర్వాత పెళ్లిపై ఆశలు పెంచుకోవచ్చు. ఆ తర్వాత ఆ వ్యక్తికి కలిగే ఆశాభంగం వినాశకరంగా ఉంటుంది. (సామెతలు 18:14) ఉద్దేశపూర్వకంగా ఇతరుల భావాలతో ఆడుకోవడం అమానుషత్వం.
19 ప్రత్యేకంగా వివాహితుల విషయానికొస్తే పరాయి వ్యక్తులతో సరసాలకు దూరంగా ఉండడం ప్రాముఖ్యం. వివాహిత వ్యక్తిపట్ల రొమాంటిక్ ఆసక్తి చూపడం లేదా వివాహిత వ్యక్తి వివాహ బంధం వెలుపటి వ్యక్తిపట్ల అలాంటి ఆసక్తి చూపడం తప్పు. కొందరు క్రైస్తవులు తమ వివాహ జతకాని పరాయివ్యక్తిపట్ల రొమాంటిక్ భావాలను పెంచుకోవడం ఆమోదకరమనే తప్పుడు నమ్మకంతో ఉండడం శోచనీయం. కొందరు తమ మనస్సుల్లోని లోతైన తలంపులను, తమ జతతో సైతం పంచుకోని తమ అంతరంగ భావాలను అలాంటి “స్నేహితుడితో/స్నేహితురాలితో” పంచుకుంటారు. తత్ఫలితంగా, రొమాంటిక్ భావాలు వృద్ధిచెంది అవి భావావేశ సన్నిహితత్వాన్ని పెంచుతాయి, అది వివాహాన్ని బలహీనపరచగలదు లేదా విచ్ఛిన్నం చేయగలదు. వివాహిత క్రైస్తవులు వ్యభిచారం విషయంలో యేసు ఇచ్చిన హెచ్చరికను గుర్తుంచుకోవడం శ్రేయస్కరం, వ్యభిచారం హృదయంలో మత్తయి 5:28) కాబట్టి, మనం మన హృదయాన్ని భద్రంగా ఉంచుకొని, అలాంటి వినాశనకర ఫలితాలకు దారితీయగల పరిస్థితులకు దూరంగా ఉందాం.
మొలకెత్తుతుందని ఆయన చెప్పాడు. (20 నిజమే, నేటి దుర్నీతికర లోకంలో పవిత్రంగా నిలిచి ఉండడం సులభం కాదు. కానీ, పవిత్రతను ఒకసారి పోగొట్టుకున్న తర్వాత తిరిగి దానిని సంపాదించుకోవడం కంటే దానిని కాపాడుకోవడం చాలా సులభమని గుర్తుంచుకోండి. అయితే, యెహోవా “బహుగా క్షమించి” తమ పాపాల విషయంలో నిజంగా పశ్చాత్తాపం చూపించేవారిని పరిశుభ్రం చేయగలడు. (యెషయా 55:7) కానీ లైంగిక దుర్నీతికి పాల్పడ్డ వారికి కలిగే పర్యవసానాల నుండి మాత్రం యెహోవా వారిని కాపాడడు. పర్యవసాన ప్రభావాలు చాలా సంవత్సరాలవరకు, ఓ జీవితకాలంపాటు నిలిచి ఉండవచ్చు. (2 సమూయేలు 12:9-12) కాబట్టి, అన్ని పరిస్థితుల్లోను మీ హృదయాన్ని భద్రంగా ఉంచుకోవడం ద్వారా మీ పవిత్రతను కాపాడుకోండి. యెహోవా దేవుని ఎదుట మీ పరిశుభ్రమైన, పవిత్రమైన స్థానాన్ని ఓ అమూల్య సంపదగా దృష్టించండి, దానిని ఎప్పటికీ పోగొట్టుకోకండి!
మీరెలా సమాధానమిస్తారు?
• పవిత్రత అంటే ఏమిటి, అది ఎందుకంత ప్రాముఖ్యం?
• మన హృదయాలను ఎలా భద్రంగా ఉంచుకోవచ్చు?
• జారత్వానికి దూరంగా పారిపోవడంలో ఏమి ఇమిడివుంది?
• సరసాలను మనమెందుకు విసర్జించాలి?
[అధ్యయన ప్రశ్నలు]
1-3. (ఎ) తమ పవిత్రతను విలువైనదిగా ఎంచడం లేదని ప్రజలు తరచూ ఎలా చూపిస్తారు? ఉదహరించండి. (బి) పవిత్రతా విలువను పరిశీలించుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
4. అలంకారార్థ హృదయమంటే ఏమిటి, మనం దానిని ఎందుకు భద్రంగా ఉంచుకోవాలి?
5. హృదయం ఒకే సమయంలో విలువైనదిగాను, ప్రమాదకరమైనదిగాను ఎలా ఉండగలదు?
6, 7. (ఎ) పరిశుద్ధత అంటే ఏమిటి, యెహోవా సేవకులకు అదెందుకు ప్రాముఖ్యం? (బి) అసంపూర్ణ మానవులు యెహోవా పరిశుద్ధతను అనుకరించగలరని మనకెలా తెలుసు?
8. (ఎ) మన అలంకారార్థ హృదయాన్ని ఎలా పోషించుకోగలం? (బి) మన సంభాషణలు మన గురించి ఏమి వెల్లడిచేయవచ్చు?
9-11. (ఎ) 1 కొరింథీయులు 6:18లోని ఉపదేశాన్ని పెడచెవినబెట్టేవారు ప్రమాదకర అనైతిక ప్రవర్తనలో పడిపోయే అవకాశం ఎక్కువగా ఎందుకు ఉంది? ఉదహరించండి. (బి) మనం జారత్వానికి దూరంగా పారిపోతున్నట్లయితే మనం దేనిని విసర్జించాలి? (సి) యథార్థవంతుడైన యోబు మనకెలాంటి అసాధారణమైన మాదిరినుంచాడు?
12. కోర్ట్‌షిప్ సమయంలో క్రైస్తవ జంటలు ఎలా ‘జారత్వానికి దూరంగా పారిపోవచ్చు’?
13. యెహోవాను సేవించని వారితో క్రైస్తవులు కోర్ట్‌షిప్ ఎందుకు చేయకూడదు?
14, 15. (ఎ) ‘జారత్వానికి’ ఉన్న అర్థం విషయంలో కొందరు ఎలాంటి తప్పుడు భావంతో ఉన్నారు? (బి) ‘జారత్వంలో’ ఎలాంటి క్రియలు ఇమిడివున్నాయి, క్రైస్తవులు ఎలా ‘జారత్వానికి దూరంగా పారిపోవచ్చు’?
16. లేఖనంలో ఉదహరించబడిన ప్రకారం సరససల్లాపానికి ఎలాంటి స్థానం సరైనది?
17. సరసాలాడ్డం అంటే ఏమిటి, ఆ సమస్యనెలా అదుపులో ఉంచవచ్చు?
18. సరసాలాడ్డానికి కొందరిని ఏది ప్రేరేపిస్తుంది, సరసాలాడ్డం ఎందుకు హానికరం?
19. పరాయి వ్యక్తితో సరసాలాడడం క్రైస్తవ వివాహాలను ఎలా ప్రమాదంలో పడవేయవచ్చు?
20. మన పవిత్రతను ఎలా దృష్టించడానికి మనం తీర్మానించుకోవాలి?
[11వ పేజీలోని చిత్రం]
కారును సరిగా నడిపించకపోతే అది ప్రమాదకరం కాగలదు
[12వ పేజీలోని చిత్రాలు]
మనం హెచ్చరికలను నిర్లక్ష్యంచేస్తే ఏమి సంభవించగలదు?
[13వ పేజీలోని చిత్రం]
పవిత్రమైన కోర్ట్‌షిప్ ఆనందపరిచేదిగా, దేవుని ఘనపరిచేదిగా ఉంటుంది