కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏ యే విధాలుగా దేవుని సేవకులు చెట్లను పోలియున్నారు?

ఏ యే విధాలుగా దేవుని సేవకులు చెట్లను పోలియున్నారు?

ఏ యే విధాలుగా దేవుని సేవకులు చెట్లను పోలియున్నారు?

బైబిలు సూత్రాలనుబట్టి సంతోషిస్తూ వాటిని తన జీవితంలో అన్వయించుకునే వ్యక్తి గురించి మాట్లాడుతూ, కీర్తనకర్త ఇలా అంటున్నాడు: “అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును, అతడు చేయునదంతయు సఫలమగును.” (కీర్తన 1:​1-3) ఈ పోలిక ఎందుకు యుక్తమైనది?

చెట్లు చాలాకాలం జీవిస్తాయి. ఉదాహరణకు, మధ్యధరా ప్రాంతంలో ఒలీవచెట్లు కొన్ని ఒకటి నుండి రెండు వేల సంవత్సరాల క్రితానివని చెబుతారు. అదేవిధంగా, మధ్య ఆఫ్రికాలోని బావ్‌బాబ్‌ వృక్షాలు వేల సంవత్సరాలు అలాగే నిలిచివుంటే కాలిఫోర్నియాలోని బ్రిస్టల్‌కోన్‌ పైన్‌ వృక్షాలు దాదాపు 4,600 సంవత్సరాల నాటివని నమ్మబడుతోంది. అడవిలో, ఎదిగిన చెట్లు తరచూ వాటి పరిసరాలకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉదాహరణకు, పొడవుగా ఎదిగిన చెట్లు లేత మొక్కలకు సంరక్షక నీడను ఇస్తాయి, రాలిపడే దాని ఆకులు క్రిందనున్న నేలకు చేవనిస్తాయి.

ప్రపంచంలోని అత్యంత పొడవైన వృక్షాలు సాధారణంగా అడవుల్లో ఒకదానికొకటి ఆసరాగా గుంపులు గుంపులుగా ఎదుగుతాయి. వాటి వేళ్లు పరస్పరం అల్లుకుపోయి ఉంటాయి కాబట్టి మైదానంలో ఉండే ఒంటరి చెట్టు కంటే గుంపుగా అవి ఎక్కువ బలంగా తుఫాను గాలిని తట్టుకుంటాయి. వ్రేళ్లు ఎక్కువగా విస్తరించి ఉండడంవల్ల ఆ చెట్టు భూమినుండి కావలసినంత నీటిని, పోషక పదార్థాలను సేకరించుకోగలుగుతుంది. కొన్ని సందర్భాల్లో చెట్టుకంటే పొడవుగా వ్రేళ్లు భూమిలోకి లోతుగా నాటుకుపోతాయి లేదా చెట్టు కొమ్మలు ఆకులు విస్తరించిన మేరకు అవి సమాంతరంగా భూమిలో విస్తరిస్తాయి.

“ఆయనయందు [క్రీస్తునందు] వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు . . . విశ్వాసమందు స్థిరపరచబడుచు, . . . ఆయనయందుండి నడుచుకొనుడి” అని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు వివరించినప్పుడు ఆయన పరోక్షంగా ఒక చెట్టునే సూచిస్తుండవచ్చు. (కొలొస్సయులు 2:​6, 7) అవును, క్రైస్తవులు క్రీస్తునందు స్థిరంగా వేరుపారినప్పుడే విశ్వాసమందు బలంగా నిలబడగలరు.​—⁠1 పేతురు 2:21.

దేవుని సేవకులను ఇంకా ఏయే విధాలుగా చెట్లకు పోల్చవచ్చు? తోపులో ఉండే చెట్లు సమీపంలోని చెట్లనుండి బలం పుంజుకున్నట్లే, క్రైస్తవ సంఘంతో సన్నిహితంగా ఉండేవారందరికీ తోటి విశ్వాసుల మద్దతు లభిస్తుంది. (గలతీయులు 6:⁠2) విస్తరించిన ఆధ్యాత్మిక వ్రేళ్లుగల నమ్మకస్థులైన, పరిణతి చెందిన క్రైస్తవులు తుఫానువంటి వ్యతిరేకత మధ్యనూ విశ్వాసంలో స్థిరంగా నిలబడడానికి కొత్త విశ్వాసులకు సహాయం చేస్తారు. (రోమీయులు 1:​11, 12) కొత్తగా విశ్వాసులైన క్రైస్తవులు మరింత అనుభవజ్ఞులైన దేవుని సేవకుల సంరక్షక “నీడలో” వర్ధిల్లవచ్చు. (రోమీయులు 15:⁠1) అలాగే ‘నీతి అను మస్తకి వృక్షములైన’ అభిషిక్త శేషం అందించే బలమైన ఆధ్యాత్మిక పోషకాహారం నుండి ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘ సభ్యులందరూ ప్రయోజనం పొందుతారు.​—⁠యెషయా 61:3.

“నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును” అని యెషయా 65:22లో చెప్పబడిన వాగ్దాన నెరవేర్పును చవిచూసే ఉత్తరాపేక్ష దేవుని సేవకులందరికీ ఉండడం ఎంతగా పులకరింపజేసే విషయమో గదా!

[28వ పేజీలోని చిత్రసౌజన్యం]

Godo-Foto