కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వ్యాధిగ్రస్తుల విశ్వాసం వారిని బాగుచేయగలదా?

వ్యాధిగ్రస్తుల విశ్వాసం వారిని బాగుచేయగలదా?

వ్యాధిగ్రస్తుల విశ్వాసం వారిని బాగుచేయగలదా?

మనం వ్యాధిగ్రస్తులమైనప్పుడు ఆ వ్యాధి నయం కావాలని, ఉపశమనం పొందాలని కోరుకుంటాం. యేసుక్రీస్తు తరచూ అన్ని రకాల వ్యాధులను నయం చేసి బాధితులకు ఉపశమనం కలుగజేశాడని బహుశా మీరు బైబిల్లో చదివేవుంటారు. యేసు వారిని ఎలా బాగుచేయగలిగాడు? “దేవుని మహాత్మ్యమును” బట్టి అని బైబిలు చెబుతోంది. (లూకా 9:42, 43; అపొస్తలుల కార్యములు 19:​11, 12) కాబట్టి కేవలం ఆ వ్యక్తికున్న విశ్వాసాన్ని బట్టి కాదుకాని దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆ స్వస్థత కలిగింది. (అపొస్తలుల కార్యములు 28:​7-9) అందుకే స్వస్థపరచబడడం కోసం అనారోగ్యులు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేయాలని యేసు కోరలేదు.

‘అద్భుతరీతిలో స్వస్థత పొందడం కేవలం గతంలోనే జరిగిందా, లేదా యేసు చేసినటువంటి స్వస్థతలు మళ్ళీ చేయబడతాయా? బాధాకరమైన లేదా చికిత్సలేని వ్యాధితో బాధపడే ప్రజలకు ఎలాంటి నిరీక్షణ ఉంది?’ అని మీరు ఆలోచించవచ్చు.

దేవుని నీతియుక్త నూతనలోకంలో దేవుని శక్తి ద్వారా, యేసు భూమిపై ఉన్నప్పుడు చేసినటువంటి అద్భుతమైన స్వస్థతలు మళ్ళీ కలుగుతాయని బైబిలు వివరిస్తోంది. అవి ఎలా జరుగుతాయి, విశ్వాస స్వస్థతలు చేసే ఏ వ్యక్తి చేయలేని పనిని అంటే అన్ని రకాల వ్యాధులను, మరణాన్ని సహితం దేవుడు ఎప్పుడు నిర్మూలిస్తాడు అనే విషయాలను మీకు వివరించడానికి మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులు సంతోషిస్తారు. అవును దేవుడు ‘మరెన్నడును ఉండకుండ మరణమును మ్రింగివేయును.’​—⁠యెషయా 25:⁠8.