కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రజలకు వారి ఉద్యోగస్థలాల్లో సాక్ష్యమివ్వడం

ప్రజలకు వారి ఉద్యోగస్థలాల్లో సాక్ష్యమివ్వడం

రాజ్య ప్రచారకుల నివేదిక

ప్రజలకు వారి ఉద్యోగస్థలాల్లో సాక్ష్యమివ్వడం

అపొస్తలులైన మత్తయి, పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానుల మధ్య ఎలాంటి సారూప్యత ఉంది? వారందరూ తమ తమ పనిస్థలాల్లో ఉన్నప్పుడు యేసు వారిని సందర్శించాడు. పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానులను యేసు “నా వెంబడి రండి” అని ఆహ్వానించినప్పుడు వారు తమ చేపల వ్యాపారంతో రద్దీగా ఉన్నారు. యేసు శిష్యుడిగా మారమని ఆహ్వానించబడినప్పుడు మత్తయి సుంకపు మెట్టువద్ద కూర్చొనివున్నాడు.​—⁠మత్తయి 4:18-21; 9:⁠9.

ప్రజలకు వారి ఉద్యోగస్థలాల్లో సాక్ష్యమివ్వడం ప్రతిఫలదాయకంగా ఉండవచ్చు. ఆ విషయాన్ని గ్రహించిన జపానులోని యెహోవాసాక్షులు, ఆ విధంగా పరిచర్య చేయడానికి ఇటీవల మరింత ఎక్కువ కృషి చేశారు. ఫలితాలు ఎలా ఉన్నాయి? కొద్ది నెలల్లోనే వేలకొలది పునర్దర్శనాలు చేయబడ్డాయి, దాదాపు 250 బైబిలు అధ్యయనాలు ప్రారంభించబడ్డాయి. ఈ క్రింది అనుభవాలను పరిశీలించండి.

టోక్యోలోని పూర్తికాల సేవకుడు ఒకాయన ఒక రెస్టారెంట్‌ మేనేజర్‌ను కలిశాడు. ఆ మేనేజర్‌ దాదాపు 30 సంవత్సరాల క్రితం స్కూల్‌ విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక సాక్షితో మాట్లాడాడు. అప్పట్లో ఆ సాక్షి చెప్పినది ఆయనకు అంతగా అర్థం కాకపోయినా బైబిలుపట్ల ఆసక్తి మాత్రం కలిగింది. ఇప్పుడు ఆయన ఆసక్తి తిరిగి రేకెత్తించబడడంతో ఆయన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకం నుండి బైబిలు అధ్యయనం చేయడానికి సంతోషంగా అంగీకరించాడు. * అంతేకాకుండా ప్రతి రాత్రి తాను నిద్రపోయే ముందు బైబిలు చదివే వ్యక్తిగత కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించాడు.

ఒక ప్రత్యేక పయినీరు పరిచారకురాలు ఒక ఆఫీసును సందర్శించింది. ఆ సమయంలో మేనేజర్‌ లేకపోవటంతో, మేనేజర్‌ ఫోన్‌ను అందుకున్న యువతి “మీరు నాతో మాట్లాడడానికి ఇష్టపడతారా?” అని అడిగింది. ఫోన్‌లో కొద్ది నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ యువతి బయటకు వచ్చి తనకు బైబిలు చదవడమంటే ఆసక్తి ఉందని చెప్పింది. ఆ ప్రత్యేక పయినీరు బైబిలు తీసుకొని వెళ్ళి ఆమెను పునర్దర్శించడానికి ఏర్పాట్లు చేసుకొని ఆమెతో బైబిలు అధ్యయనం ప్రారంభించింది, ఆ బైబిలు అధ్యయనం ఉదయం పని ప్రారంభించకముందు ఆఫీసుకు దగ్గర్లో ఒక ఉద్యానవనంలో జరుగుతుంది.

మరో ఆఫీసులోని ఒక వ్యక్తి, తన సహోద్యోగి సాక్షుల దగ్గర నుండి కావలికోట, తేజరిల్లు! పత్రికలను తీసుకొని సాక్షులు వెళ్ళిన వెంటనే వాటిని పడేయటం చూశాడు. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళిన తర్వాత సాక్షియైన తన భార్యకు జరిగిన సంఘటన గురించి చెప్పి, సాక్షులు ఆ పత్రికలను తనకు ఇచ్చివుంటే తాను కనీసం వారు చెప్పేది వినివుండే వాడిని అని అన్నాడు. ఆయన మాటలను విన్న ఆయన కూతురు, ఆ వ్యాపార క్షేత్రంలో సాక్ష్యమిస్తున్న సాక్షికి ఆ విషయాన్ని తెలియజేసింది. ఆ సాక్షి వెంటనే ఆ వ్యక్తిని ఆఫీసులో సందర్శించి ఆయనతో బైబిలు అధ్యయనం ప్రారంభించాడు. ఆ వ్యక్తి ఆ తర్వాత కొంతకాలానికే ఆదివారం కూటాలకు క్రమంగా హాజరవడం ప్రారంభించాడు.

ప్రజలకు వారి ఉద్యోగస్థలాల్లో సాక్ష్యమివ్వడం ఇతర ప్రయోజనాలను కూడా తెచ్చింది. జపానులోని అనేకమంది ప్రచారకులు షాపింగ్‌ స్థలాల్లో, ఫ్యాక్టరీలలో, ఆఫీసుల్లో పునర్దర్శనాలు చేయడంలో నైపుణ్యం సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఈ పద్ధతిలో సాక్ష్యమివ్వడం ద్వారా, నిష్క్రియులుగా ఉన్నవారిని ఎంతోమందిని సందర్శించడం జరిగింది, వారితో మళ్ళీ అధ్యయనాలు ప్రారంభించబడ్డాయి. ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. మధ్య టోక్యోలోని ఒక సంఘం ఇటీవల 108 బైబిలు అధ్యయనాలను రిపోర్టు చేసింది, ఆ సంఖ్య ఒక సంవత్సరం క్రితం రిపోర్టు చేయబడిన సంఖ్యకు రెట్టింపు కంటే ఎక్కువ.

[అధస్సూచి]

^ పేరా 5 యెహోవాసాక్షులు ప్రచురించినది.