మారుతున్న జీవన పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు దేవుని ఆత్మపై ఆధారపడండి
మారుతున్న జీవన పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు దేవుని ఆత్మపై ఆధారపడండి
“యోగ్యునిగా . . . నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము.”—2 తిమోతి 2:15.
మన చుట్టూవున్న లోకం మారుతూనే ఉంటుంది. ఉత్తేజకరమైన విజ్ఞానశాస్త్ర, సాంకేతిక అభివృద్ధితోపాటు నైతిక విలువలు తీవ్రంగా క్షీణించిపోవడాన్ని మనం చూస్తున్నాం. మనం ముందటి ఆర్టికల్‌లో పరిశీలించిన ప్రకారం, క్రైస్తవులు దేవునికి విరుద్ధంగా ఉన్న లౌకికాత్మను ఎదిరించాలి. అయితే లోకం మారుతుండగా వ్యక్తిగతంగా మనమూ అనేక రీతుల్లో మారుతుంటాం. చిన్నపిల్లలం నుండి పెరిగి పెద్దవాళ్లమయ్యాము. ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ప్రియమైనవారిని మనం పొందవచ్చు, పోగొట్టుకోవచ్చు. అలాంటి అనేక మార్పులు మన చేతుల్లో ఉండకపోగా అవి మన ఆధ్యాత్మిక సంక్షేమానికి కొత్తవైన, దుర్భేద్యమైన సవాళ్లను తీసుకురావచ్చు.
2 కొద్దిమంది యెష్షయి కుమారుడైన దావీదువలెనే జీవితంలో తీవ్ర మార్పులు అనుభవించవచ్చు. గొర్రెలు కాసే సామాన్య బాలునిగావున్న దావీదు స్వల్పకాలంలో జాతీయ 2 తిమోతి 2:15) మన పరిస్థితులు దావీదు పరిస్థితులకు భిన్నంగా ఉన్నప్పటికీ, ఆయన తన జీవితంలోని విషయాలతో వ్యవహరించిన విధానం నుండి మనమెంతో నేర్చుకోవచ్చు. మన జీవితంలో మార్పులు జరుగుతున్నప్పుడు మనం దేవుని ఆత్మ సహాయాన్ని ఎల్లప్పుడూ ఎలా పొందవచ్చో అర్థం చేసుకోవడానికి ఆయన మాదిరి మనకు సహాయం చేయగలదు.
కథానాయకునిగా కీర్తిప్రతిష్ఠలు పొందాడు. ఆ తర్వాత ఆయన పలాయితుడై, అసూయపరుడైన రాజుచేత జంతువులా వేటాడబడ్డాడు. ఆ తర్వాత దావీదు రాజై, విజయోత్సవ యోధుడయ్యాడు. గంభీర పాపపు బాధాకరమైన పరిణామాలు చవిచూశాడు. తన కుటుంబంలోనే విషాదాన్ని, విభజనను అనుభవించాడు. ఆయన ఐశ్వర్యం సంపాదించాడు, వృద్ధుడై వృద్ధాప్యపు దుర్బలత్వం అనుభవించాడు. అయితే జీవితంలో ఇన్ని మార్పులు జరిగినా, దావీదు జీవితాంతం యెహోవాపై, ఆయన ఆత్మపై ప్రగాఢ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రదర్శించాడు. తనను తాను ‘దేవునియెదుట యోగ్యునిగా కనుపరచుకొనుటకు’ ఆయన తన శాయశక్తులా కృషిచేశాడు, దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. (దావీదు వినయం—చక్కని మాదిరి
3 బాలునిగా దావీదు తన సొంత కుటుంబంలో సైతం ప్రముఖునిగా పరిగణించబడలేదు. సమూయేలు ప్రవక్త బేత్లెహేముకు వచ్చినప్పుడు, దావీదు తండ్రి తన ఎనిమిదిమంది కుమారుల్లో ఏడుగురిని ఆయనకు చూపించాడు. కనిష్ఠుడైన దావీదు గొర్రెలు కాయడానికి పంపించబడ్డాడు. అయినప్పటికీ, ఇశ్రాయేలు భావి రాజుగా యెహోవా దావీదునే ఎన్నుకున్నాడు. దావీదు పొలంనుండి పిలిపించబడ్డాడు. ఆ తర్వాత జరిగిన దానిని బైబిలు ఇలా నివేదిస్తోంది: “సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను.” (1 సమూయేలు 16:12, 13) దావీదు తన జీవితమంతా ఆ ఆత్మపై ఆధారపడ్డాడు.
4 గొర్రెలు కాసుకునే ఆ బాలుడు త్వరలోనే జనాంగంలో గొప్ప పేరుప్రతిష్ఠలు పొందాడు. రాజు దగ్గర సేవకునిగా ఉంటూ ఆయనకోసం సంగీతం వాయించడానికి పిలువబడ్డాడు. కాకలుతీరిన ఇశ్రాయేలు సైనికులు సైతం ఎదుర్కోవడానికి భయపడిన భారీశరీరంగల యోధుడైన గొల్యాతును ఆయన హతమార్చాడు. సైనికులపై నాయకునిగా నియమించబడిన దావీదు ఫిలిష్తీయులపై విజయవంతంగా యుద్ధాలుచేశాడు. ప్రజలు ఆయనను ప్రేమించారు. ఆయనను పొగుడుతూ ప్రజలు పాటలుకట్టారు. అంతకుముందు, రాజు సలహాదారుడు ఒకరు యువ దావీదును సితారా “చమత్కారముగా వాయింపగలడు” అనే కాకుండా, “బహు శూరుడును, యుద్ధశాలియు మాటనేర్పరియు రూపసియునైయున్నాడు” అని కూడా వర్ణించాడు.—1 సమూయేలు 16:18; 17:23, 24, 45-51; 18:5-7.
5 కీర్తి ప్రతిష్ఠలు, సౌందర్యం, యౌవనం, వాక్‌పటిమ, సంగీత కౌశల్యం, సైనిక పరాక్రమం, దైవానుగ్రహం వంటివన్నీ దావీదుకు ఉన్నట్టు కనబడుతుంది. వీటిలో ఏదైనా దావీదును అహంభావిగా చేసివుండేవే, అయితే అవేవీ ఆయనను అలా చేయలేదు. తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని సౌలు రాజు చెప్పినప్పుడు, దావీదు దానికెలా ప్రతిస్పందించాడో గమనించండి. నిజమైన వినయం ప్రదర్శిస్తూ, దావీదు ఇలా అన్నాడు: “రాజునకు అల్లుడనగుటకు నేనెంతటివాడను? నా స్థితియైనను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివి?” (1 సమూయేలు 18:18) ఈ వచనంపై వ్యాఖ్యానిస్తూ, ఒక విద్వాంసుడు ఇలా వ్రాశాడు: “తన వ్యక్తిగత యోగ్యతలు, తన సామాజిక హోదా, తన వంశావళి ఇవేవీ తాను రాజుకు అల్లుడయ్యే అర్హత కల్పించవని దావీదు భావం.”
6 ప్రతీ విషయంలో యెహోవా అసంపూర్ణ మానవులకంటే అపరిమేయ సర్వోన్నతుడని గుర్తించడంపైనే దావీదు వినయం ఆధారపడివుంది. నరుణ్ణి సైతం దేవుడు లక్ష్యపెడతాడనే విషయాన్నిబట్టి దావీదు విస్మయం వ్యక్తపరిచాడు. (కీర్తన 144:3) తనకు ఏ గొప్పతనమున్నా అది యెహోవా వినయంచూపి, తనను ఆదరించేందుకు, కాపాడేందుకు, శ్రద్ధచూపేందుకు తననుతాను తగ్గించుకున్నాడు కాబట్టే తనకు దక్కిందని కూడా దావీదుకు తెలుసు. (కీర్తన 18:35) మనకు అదెంత చక్కని పాఠమో కదా! మన ప్రతిభ, మన ఘనకార్యాలు, మన ఆధిక్యతలు ఎప్పటికీ మనలను అహంకారులను చేయకూడదు. “నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 4:7) దేవుని పరిశుద్ధాత్మను పొంది, ఆయన ఆమోదాన్ని ఆనందించడానికి మనం తప్పక వినయం అలవరచుకొని దానిని కాపాడుకోవాలి.—యాకోబు 4:6.
‘మీకు మీరే పగతీర్చుకోవద్దు’
7 దావీదుకున్న ప్రతిష్ఠ ఆయన హృదయంలో అహంకారం ఏర్పరచలేదు గానీ, రాజైన సౌలులో హత్యాపూర్వక అసూయను రేకెత్తించింది, కాగా అతనినుండి దేవుని ఆత్మ తొలగిపోయింది. దావీదు ఏ తప్పూ చేయకపోయినా, ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పారిపోయి అరణ్యంలో జీవించాడు. ఒక సందర్భంలో, సౌలు రాజు కక్షతో దావీదును వెంటాడుతూ ఒక గుహలో ప్రవేశించాడు, దావీదూ ఆయన అనుచరులూ ఆ గుహలోనే దాక్కున్నారని అతనికి తెలియదు. సౌలును సంహరించడానికి దేవుడిచ్చిన అవకాశంగా కనిపించిన ఆ అవకాశాన్ని చేజిక్కించుకొమ్మని దావీదు మనుష్యులు అతణ్ణి బలవంతం చేశారు. “అదిగో—నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని” ఆ చీకటిలో వారు దావీదు చెవిలో రహస్యంగా చెప్పడాన్ని మీరు చిత్రీకరించుకోవచ్చు.—1 సమూయేలు 24:2-6.
8 సౌలుకు హాని కలిగించేందుకు దావీదు నిరాకరించాడు. విశ్వాసం, సహనం ప్రదర్శిస్తూ ఆయన విషయాలను యెహోవాకే విడిచిపెట్టాడు. రాజు ఆ గుహనుండి బయటకు వెళ్లిపోయిన తర్వాత, దావీదు కేకవేసి అతనితో ఇలా అన్నాడు: “నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగతీర్చును గాని నేను నిన్ను చంపను.” (1 సమూయేలు 24:12) దావీదుకు సౌలు తప్పుచేస్తున్నాడని తెలిసినప్పటికీ, ఆయన తానుగా పగతీర్చుకోలేదు; అలాగే ఆయన సౌలును దూషించలేదు లేదా అతని గురించి చెడ్డగా మాట్లాడలేదు. అనేక ఇతర సందర్భాల్లో దావీదు తానుగా పగతీర్చుకోకుండా నిగ్రహించుకున్నాడు. బదులుగా ఆయన పరిస్థితులను చక్కదిద్దేందుకు యెహోవాపై ఆధారపడ్డాడు.—1 సమూయేలు 25:32-34; 26:10, 11.
9 దావీదులాగే, మీరు కూడా కష్టభరిత పరిస్థితుల్లో ఉండవచ్చు. బహుశా తోటి విద్యార్థులు, తోటి ఉద్యోగస్థులు, కుటుంబ సభ్యులు లేదా మీ విశ్వాసం పంచుకోని ఇతరులు మిమ్మల్ని వ్యతిరేకిస్తుండవచ్చు లేదా హింసిస్తుండవచ్చు. మీరే పగతీర్చుకోకండి. మీకు సహాయం చేయడానికి యెహోవా పరిశుద్ధాత్మకోసం ప్రార్థిస్తూ ఆయనపై ఆధారపడండి. బహుశా మీ సత్ప్రవర్తనకు ముగ్ధులైన ఆ అవిశ్వాసులు విశ్వాసులుగా మారవచ్చు. (1 పేతురు 3:1) ఏదేమైనా, యెహోవా మీ పరిస్థితిని చూస్తున్నాడని, తన యుక్తకాలంలో దాని విషయమై ఏదోకటి చేస్తాడని నమ్మకంతో ఉండండి. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి—పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు [“యెహోవా,” NW] చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.”—రోమీయులు 12:19.
‘ఉపదేశం నిరాకరించవద్దు’
10 కాలం గడిచి, దావీదు అధిక ప్రధానత్వంగల ప్రియతమ రాజయ్యాడు. ఆయన అసాధారణ నమ్మకత్వపు జీవన విధానంతోపాటు, యెహోవాను స్తుతిస్తూ ఆయన వ్రాసిన చక్కని కీర్తనలు, ఆయన ఎప్పటికీ గంభీరమైన పాపంలో చిక్కుకోడనే అభిప్రాయాన్ని సులభంగా ఏర్పరచవచ్చు. కానీ ఆయన గంభీరమైన పాపంలో చిక్కుకున్నాడు. ఒక రోజు, రాజు మిద్దె పైనుండి ఒక అందమైన స్త్రీ స్నానం చేయడం చూశాడు. ఆమె ఎవరో విచారించి తెలుసుకున్నాడు. ఆమె బత్షెబ అని, ఆమె భర్త ఊరియా యుద్ధానికి వెళ్లాడనీ తెలుసుకొని, దావీదు ఆమెను పిలువనంపి, ఆమెతో శయనించాడు. ఆ తర్వాత ఆమె గర్భవతని ఆయనకు తెలిసింది. ఆ విషయం బయటకు పొక్కితే అదెంత అపఖ్యాతి తెస్తుందో గదా! మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం మరణకరమైన నేరం. ఆ పాపాన్ని కప్పివేయవచ్చని రాజు తలంచాడని స్పష్టమవుతోంది. అందువల్ల ఆయన ఊరియా యెరూషలేముకు తిరిగిరావల్సిందిగా సైన్యానికి కబురు పంపాడు. ఊరియా ఆ రాత్రి బత్షెబతో గడుపుతాడని దావీదు అనుకున్నాడు, కానీ అలా జరగలేదు. దానితో నిరాశచెందిన దావీదు ఊరియాను తిరిగి యుద్ధానికి పంపిస్తూ అతనిచేత సైన్యాధికారియైన యోవాబుకు ఒక ఉత్తరం పంపించాడు. ఊరియా హతమయ్యేలా యుద్ధం జరిగేచోట అతణ్ణి పెట్టమని ఆ ఉత్తరం ఆదేశించింది. యోవాబు అలాగే చేయడంతో, ఊరియా హతమయ్యాడు. వాడుకచొప్పున బత్షెబ అంగలార్పుకాలము ముగిసిన తర్వాత, దావీదు ఆమెను తన భార్యగా స్వీకరించాడు.—2 సమూయేలు 11:1-27.
11 ఆ పన్నాగం పనిచేసినట్లు కనిపించింది, అయితే ఈ సంఘటనంతా యెహోవా కన్నులకు మరుగులేక తేటగా ఉందనే విషయం దావీదు గ్రహించాల్సింది. (హెబ్రీయులు 4:13) నెలలు గడిచి ఆయనకు ఒక కుమారుడు కలిగాడు. ఆ పిమ్మట, దేవుని నిర్దేశంమేరకు నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వెళ్లాడు. ఆ ప్రవక్త, అనేక సొంత గొర్రెలుగల ఒక ధనవంతుడు ఒక దరిద్రునికి ప్రియాతి ప్రియంగా ఉన్న ఒకేఒక గొర్రెపిల్లను తీసుకొని, చంపిన ఒక పరిస్థితి గురించి రాజుకు వివరించాడు. ఆ కథ దావీదు న్యాయబుద్ధినైతే మేల్కొలిపింది గానీ, ఆయన దానిలో దాగివున్న అర్థాన్ని మాత్రం గ్రహించలేకపోయాడు. ఆ ధనవంతునికి విరుద్ధంగా దావీదు మరుక్షణమే తీర్పు ప్రకటించాడు. ఆయన కోపంతో రగిలిపోతూ నాతానుతో ఇలా అన్నాడు: “ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు.”—2 సమూయేలు 12:1-6.
12 దానికి నాతాను “ఆ మనుష్యుడవు నీవే” అని ప్రత్యుత్తరమిచ్చాడు. దావీదు తనపై తానే తీర్పు ప్రకటించుకున్నాడు. నిస్సందేహంగా, దావీదు కోపం చప్పున చల్లారి తీవ్రమైన తలవంపుకు, మిక్కిలి దుఃఖానికి దారితీసింది. నోటమాటరాక ఆయన, తప్పించుకోవడానికి వీల్లేని యెహోవా తీర్పును నాతాను ప్రకటించడం విన్నాడు. అందులో ఆదరణ లేదా ఓదార్పునిచ్చే మాటలేవీ లేవు. దుష్కార్యం చేయడం ద్వారా దావీదు యెహోవా మాటను తృణీకరించాడు. ఆయన శత్రువులచేత ఊరియాను చంపించలేదా? అందువల్ల దావీదు ఇంటివారికి సదాకాలం యుద్ధం తప్పదు. ఆయన రహస్యంగా ఊరియా భార్యను తీసుకోలేదా? కాబట్టి 2 సమూయేలు 12:7-12.
అలాంటి కీడే రహస్యంగా కాదు బహిరంగముగా ఆయనపట్ల జరుగుతుంది.—13 దావీదు గురించి చెప్పుకోదగిన మంచి విషయమేమిటంటే, ఆయన తన అపరాధం ఒప్పుకున్నాడు. ఆయన నాతాను ప్రవక్తపై కోపగించుకోలేదు. తాను చేసిన పనికి ఆయన ఇతరులను నిందించలేదు లేదా సాకులు వెదకలేదు. తన పాపాలు బయటపెట్టబడినప్పుడు, “నేను పాపముచేసితిని” అని చెబుతూ దావీదు తన తప్పును అంగీకరించాడు. (2 సమూయేలు 12:13) 51వ కీర్తన ఆయన అపరాధ విషయమైన తీవ్రబాధను, ప్రగాఢ పశ్చాత్తాపాన్ని చూపిస్తోంది. ఆయన యెహోవానిలా వేడుకున్నాడు: “నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.” యెహోవా తన కనికరాన్నిబట్టి, చేసిన పాపం మూలంగా ‘విరిగి నలిగిన హృదయాన్ని’ త్రోసిపుచ్చడని ఆయన నమ్మాడు. (కీర్తన 51:11, 17) దావీదు ఎల్లప్పుడు దేవుని ఆత్మపై ఆధారపడ్డాడు. యెహోవా దావీదును ఆయన పాపం యొక్క తీవ్ర పర్యవసానాలనుండి కాపాడకపోయినా ఆయనను క్షమించాడు.
14 మనమందరం అపరిపూర్ణులం, అందరం పాపం చేస్తాం. (రోమీయులు 3:23) దావీదులాగే కొన్నిసార్లు మనం గంభీరమైన పాపంలో పడిపోవచ్చు. ప్రేమగల తండ్రి తన కుమారులను శిక్షించినట్లే, యెహోవా తనను సేవించడానికి ప్రయత్నించేవారిని సరిదిద్దుతాడు. అయితే ఆ క్రమశిక్షణ ప్రయోజనార్థమే అయినా దానిని అంగీకరించడం అంత సులభం కాదు. వాస్తవానికి అది కొన్నిసార్లు “దుఃఖకరముగా” ఉంటుంది. (హెబ్రీయులు 12:6, 11) అయినప్పటికీ, మనకు ఇవ్వబడ్డ ‘ఉపదేశాన్ని అవలంబిస్తే,’ మనం యెహోవాతో సమాధానపడవచ్చు. (సామెతలు 8:33) యెహోవా ఆత్మ ఆశీర్వాదాలను మనం నిరాటంకంగా అనుభవించాలంటే, మనం దిద్దుబాటును అంగీకరించి దేవుని ఆమోదం పొందడానికి కృషిచెయ్యాలి.
అస్థిర ఐశ్వర్యంపై ఆశలు పెట్టుకోకండి
15 దావీదు ఉన్నత హోదాగల కుటుంబీకుడనీ లేదా ఆయనది సంపన్న కుటుంబమనీ అనడానికి ఏ సూచనా లేదు. అయితే తను రాజుగావున్న కాలంలో దావీదు ఎనలేని సంపద కూడబెట్టాడు. చాలామంది సంపదను కూడబెట్టుకుంటారనీ, దానిని పేరాశతో అధికం చేయడానికి ప్రయత్నిస్తారనీ, లేదా స్వార్థపూరితంగానే ఖర్చు చేస్తారనీ మీకు తెలుసు. ఇంకా కొందరైతే తమను మహిమపరచుకోవడానికి మాత్రమే డబ్బును ఉపయోగిస్తారు. (మత్తయి 6:2) అయితే దావీదు తన ఐశ్వర్యాన్ని మరో విధంగా ఉపయోగించాడు. యెహోవాను ఘనపరచాలని ఆయన కోరుకున్నాడు. ఆ కాలంలో యెరూషలేమునందు “డేరాలో నిలిచియున్న” నిబంధనా మందసాన్ని పెట్టడానికి యెహోవాకు దేవాలయం నిర్మించాలనే తన కోరికను దావీదు నాతానుకు చెప్పాడు. దావీదు ఉద్దేశం విషయంలో యెహోవా ఎంతో సంతోషపడ్డాడు, అయితే దావీదు కుమారుడైన సొలొమోను ఆ దేవాలయం నిర్మిస్తాడని నాతాను ద్వారా ఆయనకు తెలియజేశాడు.—2 సమూయేలు 7:1, 2, 12, 13.
16 ఈ భారీ నిర్మాణ ప్రణాళికకు కావలసిన వస్తుసామగ్రిని దావీదు సమకూర్చాడు. దావీదు సొలొమోనుకు ఇలా చెప్పాడు: “యెహోవా మందిరముకొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తారమైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రానులను రాళ్లను కూర్చియుంచితిని; నీవు ఇంకను సంపాదించుదువు.” ఆయన తన * (1 దినవృత్తాంతములు 22:14; 29:3, 4) దావీదు ఔదార్యంతో ఇవ్వడం డంబంగా చెప్పుకోవడానికి కాదుగానీ యెహోవా దేవునిపట్ల ఆయనకు విశ్వాసం, భక్తి ఉన్నందువల్లే అలా ఇచ్చాడు. తన సంపద మూలాధారాన్ని గుర్తిస్తూ ఆయన యెహోవాతో ఇలా అన్నాడు: “సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము.” (1 దినవృత్తాంతములు 29:14) స్వచ్ఛారాధనను ప్రోత్సహించేలా తాను చేయగలిగినంత చేయడానికి దావీదు ఉదార హృదయం ఆయనను పురికొల్పింది.
వ్యక్తిగత సంపద నుండి 6,000 మణుగుల బంగారాన్ని, 14,000 మణుగుల వెండిని కానుకగా ఇచ్చాడు.17 అదే ప్రకారంగా మనమూ మన వస్తుసంపదను మేలు చేయడానికై ఉపయోగించుదము గాక. ఐశ్వర్యాసక్తిగల జీవన విధానాన్ని వెంబడించడానికి బదులు, దేవుని ఆమోదం కోసం వెదకడం మంచిది అది నిజమైన జ్ఞానం, సంతోషంగల విధానం. పౌలు ఇలా వ్రాశాడు: “ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్‌క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞాపించుము.” (1 తిమోతి 6:17-19) మన ఆర్థిక స్థితి ఎలావున్నా, దేవుని ఆత్మపై ఆధారపడి, ‘దేవునియెడల ధనవంతులనుచేసే’ జీవన విధానాన్ని మనం వెంబడిద్దాం. (లూకా 12:21) మన ప్రేమగల పరలోకపు తండ్రితో మనకుండే ఆమోదకరమైన స్థానాన్ని మించిన విలువైనదేదీ లేదు.
దేవునియెదుట యోగ్యులుగా మిమ్మల్ని మీరు కనబరచుకోండి
18 దావీదు తన జీవితమంతా యెహోవా ఆమోదంకోసం ప్రయత్నించాడు. ఒక కీర్తనలో ఆయనిలా మొరపెట్టాడు: “నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణుజొచ్చి యున్నాను.” (కీర్తన 57:1) యెహోవాపై ఆయన ఉంచిన నమ్మకం వమ్ముకాలేదు. దావీదు “ఏండ్లునిండిన” వృద్ధుడయ్యాడు. (1 దినవృత్తాంతములు 23:1) దావీదు గంభీరమైన పాపాలు చేసినా, అసాధారణ విశ్వాసం ప్రదర్శించిన దేవుని అనేక సాక్షుల్లో ఒకనిగా చిరస్మరణీయుడు.—హెబ్రీయులు 11:32.
19 మీ జీవితంలో పరిస్థితులు మారుతున్నప్పుడు, దావీదును యెహోవా ఏ విధంగా ఆదరించాడో, బలపరిచాడో, సరిదిద్దాడో అదేప్రకారం మీపట్ల కూడా జరిగించగలడని జ్ఞాపకముంచుకోండి. దావీదు వలెనే అపొస్తలుడైన పౌలు కూడా జీవితంలో అనేక మార్పులను ఎదుర్కొన్నాడు. అయినాసరే ఆయన దేవుని ఆత్మపై ఆధారపడి నమ్మకంగా నిలబడ్డాడు. ఆయనిలా వ్రాశాడు: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.” (ఫిలిప్పీయులు 4:12, 13) మనం యెహోవాపై ఆధారపడితే మనం విజయం సాధించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. మనం విజయవంతులం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. మనమాయన మాటవిని ఆయనకు సన్నిహితులమైతే, తన చిత్తం చేయడానికి కావలసిన బలం ఆయన మనకిస్తాడు. మనం ఎల్లప్పుడూ దేవుని ఆత్మపై ఆధారపడితే, ఇప్పుడూ, యుగయుగాలూ ‘దేవునియెదుట యోగ్యులుగా మనల్ని మనం కనబరచుకోగలుగుతాం.’—2 తిమోతి 2:15.
[అధస్సూచి]
^ పేరా 22 నేటి ప్రమాణాల ప్రకారం దావీదు కానుకగా ఇచ్చినవాటి విలువ 5,600 కోట్ల రూపాయిలకు పైగా ఉంటుంది.
మీరెలా సమాధానమిస్తారు?
• అహంకారానికి విరుద్ధంగా మనమెలా జాగ్రత్తగా ఉండవచ్చు?
• మనమే స్వయంగా ఎందుకు పగతీర్చుకోకూడదు?
• క్రమశిక్షణ విషయంలో మనకెలాంటి దృక్కోణం ఉండాలి?
• ధనమందు కాక దేవునియందే మనమెందుకు నమ్మకముంచాలి?
[అధ్యయన ప్రశ్నలు]
1. ఎలాంటి మార్పులు మన ఆధ్యాత్మిక సంక్షేమానికి సవాళ్లను తీసుకురావచ్చు?
2. దావీదు జీవితమెలా మారుతూ వచ్చింది?
3, 4. దావీదు గొర్రెలుకాసే సామాన్య బాలుని నుండి జాతీయ ప్రతిష్ఠకు ఎలా ఎదిగాడు?
5. ఏవి దావీదును అహంభావిగాచేసి ఉండేవి, ఆయనలా కాలేదని మనకెలా తెలుసు?
6. మనమెందుకు వినయం అలవరచుకోవాలి?
7. రాజైన సౌలును సంహరించే ఎలాంటి అవకాశం దావీదుకు దొరికింది?
8. తానుగా పగతీర్చుకోకుండా దావీదు ఎందుకు నిగ్రహించుకున్నాడు?
9. మనం వ్యతిరేకతను లేదా హింసను అనుభవిస్తే మనమెందుకు పగతీర్చుకోకూడదు?
10. దావీదు పాపంలో ఎలా పడ్డాడు, ఆయన దానిని కప్పేందుకు ఎలా ప్రయత్నించాడు?
11. నాతాను ఎలాంటి పరిస్థితిని దావీదుకు వివరించాడు, దానికి ఆయనెలా ప్రతిస్పందించాడు?
12. దావీదుకు వ్యతిరేకంగా యెహోవా ఎలాంటి తీర్పు తీర్చాడు?
13. యెహోవా ఇచ్చిన క్రమశిక్షణకు దావీదు ఎలా ప్రతిస్పందించాడు?
14. యెహోవా క్రమశిక్షణకు మనమెలా ప్రతిస్పందించాలి?
15. (ఎ) కొందరు ఏయే విధాలుగా తమ సంపదను ఉపయోగిస్తారు? (బి) దావీదు తన ఐశ్వర్యాన్ని ఎలా ఉపయోగించాలని కోరుకున్నాడు?
16. దేవాలయ నిర్మాణానికి దావీదు ఏమేమి సిద్ధపరిచాడు?
17. మొదటి తిమోతి 6:17-19లోని ఉపదేశం ధనవంతులకూ, బీదలకూ ఎలా అన్వయిస్తుంది?
18. దావీదు ఏ విధంగా క్రైస్తవులకు చక్కని మాదిరి ఉంచాడు?
19. ‘దేవునియెదుట యోగ్యులుగా’ మనల్ని మనం ఎలా కనబరచుకోగలుగుతాం?
[16, 17వ పేజీలోని చిత్రం]
దావీదు దేవుని ఆత్మపై ఆధారపడి, దేవుని ఆమోదంకోసం వెదికాడు. మీరూ అలాగే చేస్తున్నారా?
[18వ పేజీలోని చిత్రం]
“సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము”