మృగాన్ని, దాని ముద్రను గుర్తించడం
మృగాన్ని, దాని ముద్రను గుర్తించడం
ఏదైనా ఒక ప్రహేళికను పరిష్కరించడం మీకు ఇష్టమేనా? అలా చేయడానికి ముందు, దాని పరిష్కారానికి మీకు సహాయపడే ఆధారాలకోసం మీరు చూస్తారు. ప్రకటన 13వ అధ్యాయంలోని ఆ మృగపు 666 సంఖ్య, ఆ పేరు లేదా ముద్రకు సంబంధించిన ఆధారాలను దేవుడు తన ప్రేరేపిత వాక్యంలో పొందుపరిచాడు.
ఈ ఆర్టికల్‌లో, ఆ మృగపు ముద్రకున్న భావాన్ని వెల్లడిచేసే నాలుగు ముఖ్య కారణాలను అంటే ఆవశ్యకమైన ఆధారాలను మనం పరిశీలిద్దాం. అవేమిటంటే, (1) కొన్నిసార్లు బైబిలు పేర్లు ఎలా ఎన్నుకోబడ్డాయి, (2) మృగం యొక్క గుర్తింపు, (3) 666 ‘ఒక మనుష్యుని సంఖ్యగా’ ఉండడంలోని భావమేమిటి, (4) 6 అనే అంకెకున్న ప్రాధాన్యత, అది మూడంకెలుగా అంటే 600 ప్లస్ 60 ప్లస్ 6, లేదా 666 అని ఎందుకు వ్రాయబడింది?—ప్రకటన 13:18.
బైబిలు పేర్లు—కేవలం చీటీలు కాదు
బైబిలు పేర్లకు, ప్రత్యేకంగా దేవుడిచ్చిన పేర్లకు విలక్షణమైన ప్రాధాన్యత ఉంది. ఉదాహరణకు, అబ్రాము జనాంగాలకు తండ్రి అవుతాడు కాబట్టి, దేవుడు ఆ పితరుని పేరును అబ్రాహాముగా మార్చాడు, దానికి “అనేక జనములకు తండ్రి” అని భావం. (ఆదికాండము 17:5) మరియకు కలుగబోయే శిశువుకు, “యెహోవాయే రక్షణ” అనే భావంగల యేసు అని పేరు పెట్టమని యోసేపు, మరియలకు దేవుడు చెప్పాడు. (మత్తయి 1:21; లూకా 1:31) అర్థవంతమైన ఆ పేరుకు అనుగుణంగా, యేసు పరిచర్య ద్వారా, బలిపూర్వక మరణం ద్వారా యెహోవా మన రక్షణను సాధ్యం చేశాడు.—యోహాను 3:16.
కాబట్టి దేవుడిచ్చిన 666 అనే సంఖ్యా నామం, ఆ మృగపు ప్రత్యేక లక్షణాలు ఇవే అని దేవుడు పరిగణించే లక్షణాలను సూచించాలి. అందువల్ల మనమా లక్షణాలను అర్థంచేసుకోవడానికి, మొదట ఆ మృగాన్ని గుర్తించి దాని కార్యకలాపాల గురించి తెలుసుకోవాలి.
ఆ మృగం గుర్తించబడింది
సూచనార్థక మృగాల భావాన్ని అర్థంచేసుకోవడానికి బైబిలు పుస్తకమైన దానియేలు ఎంతో సమాచారాన్ని అందిస్తుంది. 7వ అధ్యాయంలో సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, ఇనుప దంతాలుగల భయంకరమైన జంతువు వంటి “నాలుగు మిక్కిలి గొప్ప జంతువుల” సవివర వర్ణణ ఉంది. (దానియేలు 7:2-7) ఈ జంతువులు విస్తారమైన సామ్రాజ్యాలపై ఒకరి తర్వాత మరొకరుగా పరిపాలించే “రాజులను” లేదా రాజకీయ ప్రభుత్వాలను సూచిస్తున్నాయని దానియేలు మనకు చెబుతున్నాడు.—దానియేలు 7:17, 23.
ప్రకటన 13:1, 2లోని మృగాన్ని గురించి చెబుతూ, అది “దానియేలు దర్శనంలోని నాలుగు జంతువుల గుణగణాలన్నింటినీ సంతరించుకుంది. . . . అందువల్ల [ప్రకటనలోని] ఆ మొదటి మృగం, లోకంలో దేవుణ్ణి వ్యతిరేకించే రాజకీయ పరిపాలనా శక్తులన్నిటి సమైక్య బలగాలను సూచిస్తోంది” అని ది ఇంటర్‌ప్రెటర్స్ డిక్షనరీ ఆఫ్ ద బైబిల్ చెబుతోంది. ఈ అభిప్రాయాన్ని, ‘ప్రతి వంశముమీదను ప్రతి ప్రజమీదను ఆ యా భాషలు మాటలాడువారిమీదను ప్రతిజనము మీదను అధికారము దానికియ్యబడెను’ అని ఆ మృగాన్ని గురించి చెబుతున్న ప్రకటన 13:7 స్థిరపరుస్తోంది. *
మృగాలను మానవ పరిపాలనకు సూచనగా బైబిలు ఎందుకు ఉపయోగిస్తోంది? దానికి కనీసం రెండు కారణాలున్నాయి. మొదటి కారణం, ప్రభుత్వాలు శతాబ్దాలుగా ప్రసంగి 8:9) రెండవ కారణం, ‘ఆ మృగముకు ఘటసర్పము [సాతాను] తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చాడు.’ (ప్రకటన 12:9; 13:2) తత్ఫలితంగా, అపవాదివల్ల కలిగిన మానవ పరిపాలన అతని పాశవిక, సర్పసంబంధమైన వైఖరిని ప్రతిఫలిస్తోంది.—యోహాను 8:44; ఎఫెసీయులు 6:12.
మృగాల్లాగే రక్తపాత చరిత్రను సంపాదించుకున్నాయి. “చరిత్రలో యుద్ధం తప్పనిసరి అంశమై, నాగరికత లేదా ప్రజాస్వామ్యం సుస్థిరమవుతుండగా అది అంతరించిపోలేదు” అని చరిత్రకారులైన విల్ మరియు ఎరియెల్ డ్యురాంట్ వ్రాస్తున్నారు. “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట” అనేది ఎంత వాస్తవమో గదా! (అంతమాత్రాన ప్రతీ మానవ పరిపాలకుడు నేరుగా సాతాను చేతిలోని ఉపకరణమని దానర్థం కాదు. నిజానికి ఒక భావంలో మానవ ప్రభుత్వాలు మానవ సమాజానికి స్థిరత్వాన్నిస్తూ ‘దేవుని పరిచారకులుగా’ పనిచేస్తున్నారు, అవే లేకుంటే అరాచకమే రాజ్యమేలుతుంది. మరియు కొంతమంది నాయకులు, సాతానుకు ఎంతమాత్రం ఇష్టంలేని, సత్యారాధన చేయడమనే హక్కుతోపాటు ప్రాథమిక మానవ హక్కులను పరిరక్షించారు. (రోమీయులు 13:3, 4; ఎజ్రా 7:11-27; అపొస్తలుల కార్యములు 13:7) అయినప్పటికీ, అపవాది ప్రభావం కారణంగా ఏ మానవుడూ లేదా మానవ సంస్థా ప్రజలకు శాశ్వత శాంతి భద్రతలు తీసుకురాలేక పోయారు. *—యోహాను 12:31.
‘ఒక మనుష్యుని సంఖ్య’
666 భావాన్ని అర్థం చేసుకోవడానికి మూడవ ఆధారం, అది ‘ఒక మనుష్యుని సంఖ్య,’ లేదా ది ఆంప్లిఫైడ్ బైబిల్ అనువదించినట్లుగా “మానవ సంబంధమైన సంఖ్య” అన్న మాటల్లో దొరుకుతుంది. ఈ మాటలు ఒక మానవుణ్ణి సూచించలేవు, ఎందుకంటే మృగంమీద ఏ మానవునికి కాదుగానీ సాతానుకే అధికారముంది. (లూకా 4:5, 6; 1 యోహాను 5:19; ప్రకటన 13:2, 18) బదులుగా, ఆ మృగానికి ‘మనుష్యుని సంఖ్య’ లేదా ముద్ర ఉండడం అది ఆత్మల లేదా దయ్యాల సంబంధమైనది కాదుగానీ దానికి మానవ స్వభావం ఉంటుందని సూచిస్తోంది, అందువల్ల అది కొన్ని మానవ లక్షణాలను కనబరుస్తుంది. ఆ లక్షణాలు ఏమై ఉండవచ్చు? బైబిలు దానికిలా జవాబిస్తోంది: “ఏ భేదమును లేదు; [మానవులు] అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” (రోమీయులు 3:23) కాబట్టి ఆ మృగానికి ‘మనుష్యుని సంఖ్య’ ఉండడం, పాపం మరియు అసంపూర్ణతల గురుతైన దిగజారిన మానవ స్థితిని ప్రభుత్వాలు ప్రతిబింబిస్తాయని సూచిస్తోంది.
ఇది నిజమని చరిత్ర రూఢిపరుస్తోంది. “ఉనికిలోవున్న ప్రతీ నాగరికత చివరకు పతనమైంది. నెరవేరని ఆశల, విఫలయత్నాల గాథే చరిత్ర . . . అందువల్ల చరిత్రకారునిగా ఒక వ్యక్తి విషాదం అనివార్యం అనే భావంతోనే జీవించాలి” అని యు.ఎస్. సెక్రెటరీ ఆఫ్ స్టేట్ హెన్రీ కిస్సింగర్ అన్నాడు. కిస్సింగర్ యథార్థ అభిప్రాయం బైబిల్లోని ఈ ప్రాథమిక సత్యాన్ని స్పష్టం చేస్తోంది: ‘తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు. మనుష్యులు తమ యిర్మీయా 10:23.
ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు.’—మనం ఆ మృగాన్ని గుర్తించి, దేవుడు దానినెలా దృష్టిస్తున్నాడో అర్థం చేసుకున్నాము కాబట్టి ఇప్పుడు మనం మన ప్రహేళికలోని చివరి భాగాన్ని అంటే 6 అనే అంకె 666గా లేదా 600 ప్లస్ 60 ప్లస్ 6 అనే మూడంకెల సంఖ్యగా ఎందుకు వ్రాయబడిందో పరిశీలించే స్థితికి చేరుకున్నాం.
ఆరు మూడంకెలుగా ఎందుకు వ్రాయబడింది?
లేఖనాల్లో, ఆయా సంఖ్యలకు సూచనార్థక విశేషత ఉంది. మచ్చుకు, ఏడు అనే అంకె దేవుని దృష్టిలో సంపూర్ణమైన దాన్ని లేదా పరిపూర్ణమైన దాన్ని సూచించడానికి తరచూ ఉపయోగించబడింది. ఉదాహరణకు, దేవుని సృష్టికార్యాల వారంలో ఏడు ‘రోజులు’ లేదా విస్తృత కాలనిడివిలు ఉన్నాయి, ఆ కాలంలో దేవుడు ఈ భూమికి సంబంధించిన తన సృష్టి సంకల్పాన్ని పూర్తిగా నెరవేరుస్తాడు. (ఆదికాండము 1:3-2:3) దేవుని “మాటలు,” “ఏడుమారులు కరిగి ఊదిన” వెండి వలే ఉన్నాయి, కాబట్టి అవి పరిపూర్ణంగా పుటము వేయబడినవి. (కీర్తన 12:6; సామెతలు 30:5, 6) కుష్ఠరోగియైన నయమానుకు యొర్దాను నదిలో ఏడుసార్లు స్నానము చేయమని చెప్పబడింది, ఆ తర్వాత అతడు సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు.—2 రాజులు 5:10, 14.
ఆరు ఏడుకు ఒకటి తక్కువ. కాబట్టి అది, దేవుని దృష్టిలో అసంపూర్ణమైన దానికి లేదా లోపంగల దానికి సరైన సూచన కాదా? అవును అది సరైన సూచనే! (1 దినవృత్తాంతములు 20:6, 7) అంతేకాకుండా, ఆరును 666 అని మూడంకెలుగా వ్రాయడం అపరిపూర్ణతను బలంగా నొక్కిచెబుతోంది. మనం పరిశీలించినట్లుగా, 666 “మనుష్యుని సంఖ్య” అని చెప్పబడడం ఈ అభిప్రాయం సరైనదేనని బలపరుస్తోంది. కాబట్టి మృగపు పనితీరు, దాని “మనుష్యుని సంఖ్య,” 666 అనే సంఖ్య నిర్ద్వందంగా యెహోవా దృష్టిలో ఘోరమైన లోపాన్ని, వైఫల్యాన్ని సూచిస్తున్నాయి.
మృగపు లోపాల చిత్రీకరణ ప్రాచీన బబులోను రాజైన బెల్షస్సరుకు చెప్పబడిన విషయం గుర్తుచేస్తోంది. దానియేలు ద్వారా యెహోవా ఆ పాలకునికి ఇలాచెప్పాడు: “నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి.” ఆ రాత్రే బెల్షస్సరు హతమార్చబడగా, బబులోను మహా సామ్రాజ్యం పతనమైంది. (దానియేలు 5:26, 30) అదే ప్రకారం, ఆ రాజకీయ మృగానికి, దాని ముద్రగల వారికి దేవుని తీర్పు అంటే, ఆ మృగానికి, దాని మద్దతుదారులకు అంతమని దాని భావం. ఈ సంఘటన సమయంలోనే దేవుడు కేవలం ఒక రాజకీయ విధానాన్ని మాత్రమే కాక మానవ పరిపాలనకు సంబంధించిన ప్రతీ ఛాయను తుడిచివేస్తాడు. (దానియేలు 2:44; ప్రకటన 19:19, 20) అందువల్ల, మనం ఆ మృగపు ముద్రకు దూరంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో గదా!
ఆ ముద్ర గుర్తించబడింది
ప్రకటన గ్రంథం, 666 సంఖ్యను వెల్లడిచేసిన వెంటనే గొర్రెపిల్లయైన యేసుక్రీస్తు పేరు, ఆయన తండ్రియైన యెహోవా పేరు నొసళ్లపై వ్రాయబడివున్న ఆయన 1,44,000 మంది అనుచరుల గురించి ప్రస్తావిస్తోంది. ఆ పేర్లు వాటిని ధరించినవారు యెహోవాకు, ఆయన కుమారునికి లూకా 20:25; ప్రకటన 13:4, 8; 14:1) ఏ విధంగా? రాజకీయ ప్రభుత్వానికి, దాని చిహ్నాలకు, దాని సైనిక శక్తికి ఆరాధనాపూర్వక ఘనత చెల్లించడం ద్వారా, వారు రక్షణ నిరీక్షణలకై వాటివైపు చూస్తారు. వారు సత్యదేవునికి చేసే ఎలాంటి ఆరాధనైనా అది కేవలం నామకార్థ సేవగానే ఉంటుంది.
చెందినవారని గుర్తిస్తున్నాయి, ఈ ఇద్దరి గురించి వారు సగర్వంగా సాక్ష్యమిస్తారు. అదే విధంగా మృగపు ముద్రగలవారు మృగానికి తాము దాసోహమని ప్రకటిస్తారు. కాబట్టి, ఆ ముద్ర కుడిచేతిమీదున్నా లేదా నొసటిపైవున్నా అలంకారార్థంగా అదివున్న వ్యక్తి మృగాన్ని పోలిన ప్రపంచ రాజకీయ విధానాలకు ఆరాధనాపూర్వక మద్దతిచ్చేవాడని అది గుర్తిస్తుంది. ఆ ముద్రగలవారు న్యాయంగా దేవునికి చెందవలసినది “కైసరునకు” చెల్లిస్తారు. (దానికి భిన్నంగా బైబిలు మనకిలా ఉద్బోధిస్తోంది: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును.” (కీర్తన 146:3, 4) ఆ జ్ఞానయుక్తమైన ఉపదేశాన్ని లక్ష్యపెట్టేవారు, వాగ్దానాలు నిలబెట్టుకోలేక ప్రభుత్వాలు కూలిపోయినప్పుడు లేదా జనాకర్షక నాయకులు తమ ప్రధానత్వం కోల్పోయినప్పుడు కలతచెందరు.—సామెతలు 1:33.
అంటే నిజ క్రైస్తవులు ఊరికే కూర్చొని మానవాళి అవస్థను పట్టించుకోరని దానర్థం కాదు. బదులుగా వారు మానవాళి సమస్యలను పరిష్కరించే ఏకైక ప్రభుత్వాన్ని అంటే తాము ప్రాతినిధ్యం వహించే దేవుని రాజ్యాన్ని చురుకుగా ప్రకటిస్తారు.—మత్తయి 24:14.
దేవుని రాజ్యం—మానవాళి ఏకైక నిరీక్షణ
యేసు భూమ్మీద జీవించినప్పుడు దేవుని రాజ్యాన్ని తన ప్రచార ముఖ్యాంశంగా చేసుకున్నాడు. (లూకా 4:43) ప్రభువు ప్రార్థన అని కొన్నిసార్లు పిలువబడే తన మాదిరి ప్రార్థనలో యేసు, ఆ రాజ్యము రావాలని, దేవుని చిత్తము భూమిపై నెరవేరాలని ప్రార్థించమని తన అనుచరులకు నేర్పించాడు. (మత్తయి 6:9, 10) భూమ్మీద ఏదోక రాజధాని నుండి కాదుగానీ పరలోకంనుండే పరిపాలించే ఆ రాజ్యం భూమంతటిమీద పరిపాలన సాగించే ప్రభుత్వం. అందువల్ల యేసు దానిని “పరలోకరాజ్యము” అని పిలిచాడు.—మత్తయి 11:12.
తన భావి పౌరుల కోసం తన ప్రాణాలర్పించిన యేసుక్రీస్తు కంటే యోగ్యుడైన పరిపాలకుడు ఆ రాజ్యానికి ఇంకా ఎవరు ఉండగలరు? (యెషయా 9:6, 7; యోహాను 3:16) ప్రస్తుతం బలమైన ఆత్మసంబంధ వ్యక్తిగావున్న ఈ పరిపూర్ణ పరిపాలకుడు త్వరలోనే ఆ మృగాన్ని దాని పాలకులను, సైన్యాలను సంపూర్ణ నాశనానికి సూచనగావున్న “గంధకముతో మండు అగ్నిగుండములో” పడవేస్తాడు. అది మాత్రమే కాదు. ఏ మానవుడు చేయలేని పనిని అంటే సాతానును సైతం యేసు తొలగిస్తాడు.—ప్రకటన 11:15; 19:16, 19-21; 20:2, 10.
దేవుని రాజ్యం దాని పట్ల విధేయత చూపించే ప్రజలందరికీ సమాధానం తీసుకొస్తుంది. (కీర్తన 37:11, 29; 46:8, 9) దుఃఖం, వేదన, మరణం సైతం లేకుండాపోతాయి. ఆ మృగపు ముద్రచే గుర్తించబడకుండా ఉండేవారికోసం ఎంతటి మహిమాన్విత భవిష్యత్తు ఉందో గదా!—ప్రకటన 21:3, 4.
[అధస్సూచీలు]
^ పేరా 9 ఈ వచనాల సమగ్ర చర్చకోసం యెహోవాసాక్షులు ప్రచురించిన ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకంలో 28వ అధ్యాయం చూడండి.
^ పేరా 11 మానవ పరిపాలన తరచూ పాశవికంగా ఉన్నట్లు గుర్తిస్తూనే, నిజ క్రైస్తవులు బైబిలు నిర్దేశిస్తున్నట్లుగా ప్రభుత్వ “పై అధికారులకు” లోబడతారు. (రోమీయులు 13:1) అయితే ఆ అధికారులు దేవుని నియమానికి విరుద్ధంగా ప్రవర్తించమని వారిని ఆజ్ఞాపిస్తే, వారు ‘మనుష్యులకు కాదు దేవునికే లోబడతారు.’—అపొస్తలుల కార్యములు 5:29.
[5వ పేజీలోని బాక్సు]
666ను అర్థంచేసుకోవడానికి ఆధారాలు
1. అబ్రాహాము, యేసు మరితర అనేకుల పేర్ల విషయంలో ఉన్నట్టుగానే బైబిలు పేర్లు తరచూ ఆ పేరుగల వ్యక్తి గురించి ఎంతో కొంత తెలియజేస్తాయి. అదే విధంగా, ఆ మృగపు సంఖ్యానామం దాని గుణగణాలకు ప్రతీకగా ఉంది.
2. బైబిల్లోని దానియేలు పుస్తకంలో వివిధరకాల జంతువులు వరుస రాజ్యాలను లేదా సామ్రాజ్యాలను సూచిస్తున్నాయి. ప్రకటన 13:1, 2లోని సంయుక్త మృగం, సాతానుకు అధికారమివ్వబడిన, అతని ఆధీనంలోవున్న ప్రపంచ రాజకీయ విధానానికి ప్రతీకగా ఉంది.
3. ఆ మృగానికి ‘ఒక మనుష్యుని సంఖ్య’ లేదా “మానవ సంబంధమైన సంఖ్య” ఉండడం అది దయ్యాలకు సంబంధించినది కాదుగానీ మానవ వ్యవస్థకు సంబంధించినదని సూచిస్తోంది. అందువల్లే అది పాపం, అపరిపూర్ణతల ఫలితంగా కలిగే మానవ వైఫల్యాలను ప్రతిబింబిస్తుంది.
4. బైబిలు ప్రకారం సంపూర్ణతను లేదా పరిపూర్ణతను సూచించే ఏడుకు తక్కువగావున్న ఆరు అంకె దేవుని దృష్టిలో అపరిపూర్ణతను సూచిస్తోంది. 666 అనే ముద్రలో 6 మూడంకెలుగా వ్రాయబడింది కాబట్టి అది ఆ లోపాన్ని మరింతగా నొక్కిచెబుతోంది.
[6వ పేజీలోని చిత్రాలు]
మానవ పరిపాలన విఫలమైందని నిరూపించబడింది దాన్ని 666 సరిగ్గా సూచించింది
[చిత్రసౌజన్యం]
ఆకలితో అలమటిస్తున్న పిల్లవాడు: UNITED NATIONS/Photo by F. GRIFFING
[7వ పేజీలోని చిత్రాలు]
యేసుక్రీస్తు భూమిపైకి పరిపూర్ణ పరిపాలన తీసుకువస్తాడు