కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యం మిమ్మల్ని బలపరచిందా?

దేవుని వాక్యం మిమ్మల్ని బలపరచిందా?

దేవుని వాక్యం మిమ్మల్ని బలపరచిందా?

సవాళ్ళు ఎదురైనప్పుడు వాటిని మీరెలా ఎదుర్కొంటారు? సాతాను సవాళ్ళను ఎదుర్కోవడానికి సముచితమైన ఒక లేఖనాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం యేసుకు సహాయపడింది. (మత్తయి 4:​1-11) అదేవిధంగా, దావీదు రాజు వ్యక్తిగత శోధనలకు గురైనప్పుడు ఆయనను దేవుని వాక్యం బలపరచింది. ఆయన ఇలా అన్నాడు: “నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది.”​—⁠కీర్తన 94:​19.

అదేవిధంగా, మనకు సవాళ్ళు ఎదురైనప్పుడు ఇష్టమైన లేఖనాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం మనకు ఊరట కలిగించగలదు లేదా మనల్ని బలపరచగలదు. ఉదాహరణకు, 89 ఏండ్ల రెక్స్‌, 1931 నుండి పూర్తికాల సువార్తికునిగా ఉన్నాడు. అయినా ఆయనిలా అంటున్నాడు: “పరిచర్యలో నాకు ప్రత్యేక నియామకం ఇచ్చినప్పుడు, అందుకు నేను యోగ్యుడను కాదేమో అని తరచూ భావిస్తాను.” మరి ఆయన దాన్నెలా ఎదుర్కొన్నాడు? “నాకిష్టమైన లేఖనాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాను, అదే సామెతలు 3:​5, 6, అదిలా చెబుతోంది: ‘నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.’ ఈ లేఖనాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని దాన్ని పాటించడం నాకు ఇవ్వబడిన నియామకాలను విజయవంతంగా నిర్వహించడానికి దోహదపడింది.”

చిన్న పిల్లలు కూడా తమకిష్టమైన లేఖనం నుండి ప్రయోజనం పొందుతారు. 6 ఏండ్ల జాక్‌ తనకు ఇష్టమైన లేఖనం మత్తయి 24:⁠14 అని చెబుతున్నాడు. తన తల్లిదండ్రులతో ప్రకటించడానికి వెళ్ళేలా ఈ లేఖనం అతడిని పురికొల్పింది. అతడిలా అంటున్నాడు: “ప్రతి శనివారం మా అమ్మ, నాన్న, అక్కలతో కలిసి సాక్ష్యం ఇవ్వడానికి వెళ్ళడమంటే నాకు ఇష్టం.”

యేసులాగే మీరు కూడా మీ విశ్వాసాన్ని పరీక్షించే సవాళ్ళను కొన్నిసార్లు నేరుగా ఎదుర్కొంటున్నారా? అలాంటప్పుడు ఫిలిప్పీయులు 4:​13 మీకు ఇష్టమైన లేఖనాల్లో ఒకటిగా అవుతుండవచ్చు. దావీదు రాజులాగ మీరు మీ ‘అంతరంగంలోని విచారముల’ కారణంగా బాధపడుతున్నారా? అయితే మీరు వాటిని ఎదుర్కోవడానికి ఫిలిప్పీయులు 4:​6,7 వచనాలను గుర్తు తెచ్చుకోవడం సహాయపడవచ్చు. మీరు దేవునికి చేస్తున్న సేవ అంత విలువైనది కాదని కొన్నిసార్లు చింతిస్తున్నారా? అలాగైతే 1 కొరింథీయులు 15:⁠58 వచనాన్ని గుర్తుంచుకోవడం మిమ్మల్ని బలపరుస్తుంది.

సముచితమైన లేఖనాలను కంఠస్థం చేయడం ద్వారా, మనం దేవుని వాక్యం మన జీవితాల్లో ప్రభావం చూపించడానికి అనుమతిస్తాం. (హెబ్రీయులు 4:​12) ఇటువంటి ఇష్టమైన లేఖనాలు మనకు బలాన్ని, ఆదరణను రెండింటినీ అందించగలవు.​—⁠రోమీయులు 15:⁠4.