యిర్మీయావలె ధైర్యంగా ఉండండి
యిర్మీయావలె ధైర్యంగా ఉండండి
“యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.”—కీర్తన 27:14.
యెహోవాసాక్షులు ఆధ్యాత్మిక పరదైసులో నివసిస్తున్నారు. (యెషయా 11:6-9) తీవ్ర ఇబ్బందులున్న ఈ లోకంలో వారు, యెహోవా దేవునితోనూ ఒకరితో ఒకరు సమాధానంగా ఉన్న తోటి క్రైస్తవులతో విశిష్టమైన ఆధ్యాత్మిక పర్యావరణపు ఆనందాన్ని అనుభవిస్తున్నారు. (కీర్తన 29:11; యెషయా 54:13) వారి ఆధ్యాత్మిక పరదైసు విస్తరిస్తోంది. ‘మనఃపూర్వకంగా దేవుని చిత్తం జరిగించే’ వారందరూ దాని విస్తరణకు తోడ్పడతారు. (ఎఫెసీయులు 6:6) ఏ విధంగా? బైబిలు సూత్రాలకు అనుగుణంగా జీవిస్తూ, తమలాగే చేసేందుకు ఇతరులకు బోధిస్తూ, తద్వారా తమతోపాటు ఆ పరదైసులో గొప్ప ఆశీర్వాదాలు అనుభవించేలా వారిని ఆహ్వానిస్తున్నారు.—మత్తయి 28:19, 20; యోహాను 15:8.
2 అయితే, మనం ఆధ్యాత్మిక పరదైసులో జీవిస్తున్నామంటే, మనమిక పరీక్షలు సహించాల్సిన పనిలేదని దానర్థం కాదు. మనమింకా అపరిపూర్ణులుగానే ఉన్నాం, మనం వ్యాధి, వృద్ధాప్య బాధలను, చివరకు మరణాన్ని అనుభవిస్తున్నాం. పైగా మనం ‘అంత్యదినాలకు’ సంబంధించిన ప్రవచనాలు నెరవేరడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. (2 తిమోతి 3:1) యుద్ధాలు, నేరం, వ్యాధి, కరవు తదితర ఈతిబాధలు యావత్ మానవాళిని పట్టి పీడిస్తున్నాయి, అయితే వీటికి యెహోవాసాక్షులు అతీతులేమీ కారు.—మార్కు 13:3-10; లూకా 21:10, 11.
3 వీటికి తోడు, మన ఆధ్యాత్మిక పరదైసు యొక్క వెచ్చని పర్యావరణం వెలుపల వ్యతిరేకత అనే ఈదరగాలులు వీస్తున్నాయనీ మనకు తెలుసు. యేసు తన అనుచరులనిలా హెచ్చరించాడు: “మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. —దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు.” (యోహాను 15:18-21) నేటి పరిస్థితులూ అలాగే ఉన్నాయి. మన ఆరాధనా విధానాన్ని అనేకులు ఇంకా అర్థం చేసుకోవడం లేదు లేదా విలువైనదిగా పరిగణించడం లేదు. కొందరు మనలను విమర్శిస్తారు, ఎగతాళి చేస్తారు లేదా చివరకు యేసు హెచ్చరించినట్లే మనల్ని ద్వేషిస్తారు. (మత్తయి 10:22) మనం తరచూ సమాచార మాధ్యమాలిచ్చే తప్పుడు సమాచారానికి, దుష్ప్రచారానికి బలవుతున్నాం. (కీర్తన 109:1-3) అవును, మనమందరం సవాలుదాయకమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం, అందువల్ల మనలో కొందరు ధైర్యాన్ని కోల్పోవడం ఆరంభించవచ్చు. వీటిని మనమెలా తాళుకోవచ్చు?
4 యెహోవా మనకు సహాయం చేస్తాడు. కీర్తనకర్త ప్రేరణతో ఇలా వ్రాశాడు: “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును.” (కీర్తన 34:19; 1 కొరింథీయులు 10:13) యెహోవాపై పూర్తి నమ్మకముంచినప్పుడు ఆయన ఎలాంటి కష్టాన్నైనా తాళుకొనే శక్తిని మనకిస్తాడనే విషయాన్ని మనలో అనేకులం ధృవీకరించగలం. ఆయనపట్ల మనకున్న ప్రేమ, మన ముందుంచబడిన ఆనందం, నిరుత్సాహాన్ని భయాన్ని అధిగమించడానికి మనకు సహాయం చేస్తాయి. (హెబ్రీయులు 12:1) అందుకే మనకు కష్టాలొచ్చినా మనం ఎల్లప్పుడూ స్థిరంగా నిలబడే ఉంటాం.
దేవుని వాక్యం యిర్మీయాను బలపరచింది
5 చరిత్రంతటిలో యెహోవా నమ్మకమైన సేవకులు కష్ట పరిస్థితుల్లో కూడా ఆనందాన్ని అనుభవించారు. విశ్వాసంలేని వారిపై యెహోవా తన కోపం ప్రదర్శించిన తీర్పు కాలాల్లో కొందరు జీవించారు. అలాంటి నమ్మకస్థులైన రోమీయులు 15:4) ఉదాహరణకు, యిర్మీయా విషయమే ఆలోచించండి.
ఆరాధకుల్లో యిర్మీయా, ఆయన సమకాలీనుల్లో కొందరు, అలాగే మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఉన్నారు. అలాంటి చారిత్రక ఉదాహరణలు మనకు ప్రోత్సాహమివ్వడానికి బైబిల్లో వ్రాయబడ్డాయి, వాటిని అధ్యయనం చేయడం ద్వారా మనమెంతో నేర్చుకోవచ్చు. (6 యిర్మీయా బాలునిగా ఉన్నప్పుడే, యూదాలో ప్రవక్తగా సేవచేయడానికి పిలువబడ్డాడు. ఇదంత సులభమైన నియామకమేమీ కాదు. అనేకులు అబద్ధ దేవతలను ఆరాధిస్తున్నారు. యిర్మీయా తన పరిచర్య ఆరంభించినప్పుడు రాజుగావున్న యోషీయా నమ్మకస్థునిగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత వచ్చిన రాజులందరూ నమ్మకద్రోహులయ్యారు, అలాగే ప్రజలకు ఉపదేశమివ్వవలసిన బాధ్యతగల ప్రవక్తలు, యాజకులు సత్యం పక్షాన నిలబడలేదు. (యిర్మీయా 1:1, 2; 6:13; 23:11) అలాంటి పరిస్థితుల్లో తన ప్రవక్తగా ఉండడానికి యెహోవా యిర్మీయాను పిలిచినప్పుడు ఆయనెలా భావించాడు? ఆయనెంతో భయపడ్డాడు! (యిర్మీయా 1:8, 17) యిర్మీయా తన తొలి ప్రతిస్పందనను ఇలా గుర్తుచేసుకున్నాడు: ‘అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేనన్నాను.’—యిర్మీయా 1:6.
7 యిర్మీయా సేవా ప్రాంతపు ప్రజల్లో అత్యధికులు ప్రతిస్పందించకపోవడంతో, ఆయన తరచూ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఒక సందర్భంలో యాజకుడైన పషూరు ఆయనను కొట్టి బొండలో వేయించాడు. ఆ సమయంలో తానెలా భావించాడో యిర్మీయా ఇలా నివేదిస్తున్నాడు: ‘ఆయన [యెహోవా] పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేననుకొంటిని.’ బహుశా మీరు కూడా కొన్నిసార్లు అలాగే భావించి ఉండవచ్చు, ఇక నావల్ల కాదని మీరు అనుకొని ఉండవచ్చు. అయితే పట్టుదలతో కొనసాగడానికి యిర్మీయాకు ఏమి సహాయం చేసిందో గమనించండి. ఆయనిలా చెప్పాడు: “అది [దేవుని వాక్యం లేదా సందేశం] నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడి యున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు.” (యిర్మీయా 20:9) దేవుని మాటలు మీమీద కూడా అదే విధమైన ప్రభావం చూపుతున్నాయా?
యిర్మీయా సహవాసులు
8 యిర్మీయా తన ప్రవచనాత్మక పనిలో ఒంటరిగా లేడు. ఆయనకు సహవాసులున్నారు, అది ఆయనను ప్రోత్సహించి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఆయన సహవాసులు జ్ఞానయుక్తంగా ప్రవర్తించలేదు. ఉదాహరణకు, ఊరియా అనే తోటి ప్రవక్త “యిర్మీయా చెప్పిన మాటల రీతిని” యెరూషలేము యూదాలపై ముమ్మరంగా హెచ్చరికలు ప్రకటించాడు. అయితే యెహోయాకీము రాజు ఆయనను చంపమని ఆజ్ఞాపించినప్పుడు, ఆ ప్రవక్త భయంతో ఐగుప్తుకు పారిపోయాడు. అదాయనను రక్షించలేదు. రాజు మనుష్యులు ఆయనను వెంబడించి, బంధించి తిరిగి యెరూషలేముకు తీసుకురాగా ఆయనక్కడ చంపబడ్డాడు. అది యిర్మీయాను ఎంతో దిగ్భ్రాంతిపరచి ఉంటుంది.—యిర్మీయా 26:20-23.
9 యిర్మీయా మరో సహవాసి ఆయన కార్యదర్శియైన బారూకు. బారూకు యిర్మీయాకు చక్కని సహాయకునిగా పనిచేశాడు, అయితే ఒక సందర్భంలో ఆయన కూడా ఆధ్యాత్మిక దృక్కోణం కోల్పోయాడు. “కటకటా, నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు యిర్మీయా 45:1-5) బారూకు తన ఆధ్యాత్మిక సమతూకాన్ని తిరిగి పొందినప్పుడు యిర్మీయా ఎంతో ప్రోత్సాహం పొంది ఉంటాడు.
ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు, మూలుగుచేత అలసియున్నాను, నాకు నెమ్మది దొరకదాయెను” అని ఆయన ఫిర్యాదు చేయడం ఆరంభించాడు. బారూకు నిరుత్సాహపడి, ఆధ్యాత్మిక విషయాలపట్ల తన ప్రశంసను పోగొట్టుకోవడం ఆరంభించాడు. అయినప్పటికీ, యెహోవా దయతో బారూకుకు జ్ఞానయుక్తమైన ఉపదేశమిచ్చి ఆయనను సరిదిద్దాడు. ఆ తర్వాత ఆయనకు యెరూషలేము నాశనం నుండి రక్షించబడతాడనే హామీ ఇవ్వబడింది. (యెహోవా తన ప్రవక్తను బలపరిచాడు
10 అన్నింటికంటే ప్రాముఖ్యమైన విషయమేమంటే యెహోవా యిర్మీయాను విడిచిపెట్టలేదు. తన ప్రవక్త భావాలేమిటో ఆయన అర్థంచేసుకొని ఆయనకు అవసరమైన బలాన్ని, మద్దతును అనుగ్రహించాడు. ఉదాహరణకు, యిర్మీయా తన పరిచర్య ఆరంభంలో తన సామర్థ్యాల విషయమై సందేహాలు వెలిబుచ్చినప్పుడు, యెహోవా ఆయనకిలా చెప్పాడు: “వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే యెహోవా వాక్కు.” ఆ తర్వాత యెహోవా తన ప్రవక్తకు ఆయన నియామకానికి సంబంధించిన సమాచారమిచ్చి ఇలా చెప్పాడు: “వారు నీతో యుద్ధముచేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొందజాలరు; ఇదే యెహోవా వాక్కు.” (యిర్మీయా 1:8, 19) అదెంత ఓదార్పుకరం! యెహోవా చెప్పినట్లే తన మాట నిలబెట్టుకున్నాడు.
11 అందుకే, బొండలో బంధించబడి, అందరి ఎగతాళికి గురైన తర్వాత కూడా, యిర్మీయా నమ్మకంగా ఇలా అనగలిగాడు: “పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడైయున్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు; వారు . . . బహుగా సిగ్గుపడుదురు.” యిర్మీయా 20:11) ఆ తర్వాతి సంవత్సరాల్లో యిర్మీయాను హతమార్చే ప్రయత్నాలు జరిగినప్పుడు, యెహోవా ఆయనకు తోడైయున్నాడు, బారూకులాగే ఆయన స్వతంత్రునిగా యెరూషలేము నాశనం నుండి తప్పించబడ్డాడు, అయితే ఆయనను హింసించిన వారు, ఆయన హెచ్చరికలను త్రోసిపుచ్చినవారు నాశనం చేయబడ్డారు లేదా బబులోనుకు చెరగా కొనిపోబడ్డారు.
(12 యిర్మీయాలాగే నేడు అనేకమంది యెహోవాసాక్షులు బాధలు సహిస్తున్నారు. ముందు ప్రస్తావించబడినట్లుగా వీటిలో కొన్ని మన సొంత అపరిపూర్ణత మూలంగా కలుగుతుంటే మరికొన్ని ఈ లోకంలోవున్న కల్లోలభరిత పరిస్థితులవల్ల, ఇంకొన్ని మన పనిని వ్యతిరేకించేవారివల్లా కలుగుతున్నాయి. అలాంటి బాధలు నిరుత్సాహపరచవచ్చు. యిర్మీయాలాగే మనం కొనసాగించగలమా లేదా అని ఆలోచించే పరిస్థితికి రావచ్చు. నిజానికి, ఆయా సమయాల్లో నిరుత్సాహానికి గురవుతామని మనం ఎదురుచూడవచ్చు. నిరుత్సాహం యెహోవాపట్ల మన ప్రేమ ప్రగాఢతను పరీక్షిస్తుంది. అందువల్ల, ఊరియాలా యెహోవా సేవనుండి వైదొలగేలాచేసే నిరుత్సాహానికి తావివ్వకుండా ఉండాలని మనం తీర్మానించుకుందాం. దానికి భిన్నంగా, మనం యిర్మీయాను అనుకరిస్తూ యెహోవాయిచ్చే మద్దతుపై నమ్మకముంచుదాం.
నిరుత్సాహాన్ని ఎదుర్కొనే విధానం
13 యిర్మీయా తన లోతైన భావాలను యెహోవా దేవునికి క్రమంగా విన్నవిస్తూ, తనకు బలం ఇమ్మని అర్థిస్తూ వచ్చాడు. అనుకరించడానికి అది చక్కని మాదిరి. ప్రాచీనకాలపు దావీదు కూడా బలానికి మూలాధారమైన యెహోవావైపే చూశాడు. ఆయనిలా వ్రాశాడు: “యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము. నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను.” (కీర్తన 5:1, 2) సహాయం కోసం దావీదు చేసిన ప్రార్థనలకు యెహోవా పదే పదే ప్రత్యుత్తరమిచ్చాడని దావీదు జీవితపు ప్రేరేపిత వృత్తాంతం చూపిస్తోంది. (కీర్తన 18:1, 2; 21:1-5) అదే ప్రకారం ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా సమస్యలు దుర్భేద్యంగా అనిపించినప్పుడు ప్రార్థనలో యెహోవాను సమీపించి ఆయన ఎదుట మన హృదయాన్ని కుమ్మరించడం ఎంతో ఓదార్పుకరంగా ఉంటుంది. (ఫిలిప్పీయులు 4:6, 7; 1 థెస్సలొనీకయులు 5:16-18) మన ప్రార్థనలు ఆలకించడానికి యెహోవా నిరాకరించడు. బదులుగా, ఆయన ‘మన గురించి చింతిస్తున్నానని’ మనకు హామీ ఇస్తున్నాడు. (1 పేతురు 5:6, 7) అయితే, మనం యెహోవాకు ప్రార్థించి ఆయన చెప్పేది వినకుండా ఉండడం సహేతుకంగా ఉండదు, కాదంటారా?
14 యెహోవా మనతో ఎలా మాట్లాడతాడు? మళ్లీ యిర్మీయా విషయమే పరిశీలించండి. యిర్మీయా ఒక ప్రవక్త కాబట్టి యెహోవా ఆయనతో సూటిగా సంభాషించాడు. తన హృదయంపై దేవుని మాటల ప్రభావాన్ని యిర్మీయా ఇలా వర్ణిస్తున్నాడు: “నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యముల కధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి.” (యిర్మీయా 15:16) అవును, దేవుని నామం తనకు పెట్టబడినందుకు యిర్మీయా సంతోషించాడు, అలా ఆ ప్రవక్తకు దేవుని మాటలు అమూల్యంగా ఉన్నాయి. అందువల్ల, అపొస్తలుడైన పౌలులాగే యిర్మీయా కూడా తనకు అప్పగించబడిన సందేశాన్ని ప్రకటించడానికి ఆత్రపడ్డాడు.—రోమీయులు 1:15, 16.
15 యెహోవా నేడు ఎవరితోనూ సూటిగా సంభాషించడు. అయితే, బైబిలు పుటల ద్వారా దేవుని మాటలు మన దగ్గర ఉన్నాయి. అందువల్ల, బైబిలు అధ్యయనాన్ని మనం గంభీరంగా తీసుకొని మనం నేర్చుకున్న వాటిని లోతుగా ధ్యానిస్తే మన హృదయాలకు కూడా దేవుని మాటలు ‘సంతోషాన్ని, ఆనందాన్ని’ కలిగిస్తాయి. ఆ మాటలను ఇతరులతో పంచుకోవడానికి వెళ్లినప్పుడు మనం యెహోవా నామం ధరించినందుకు మనకు కూడా పులకరించే అనుభూతి కలుగుతుంది. యెహోవా నామాన్ని నేడు ప్రపంచంలో మరెవ్వరూ ప్రకటించడం లేదనే వాస్తవాన్ని మనమెప్పటికీ మరచిపోకూడదు. కేవలం ఆయన సాక్షులు మాత్రమే స్థాపిత దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ, యేసుక్రీస్తు శిష్యులయ్యేలా దీనులకు బోధిస్తున్నారు. (మత్తయి 28:19, 20) మనమెంతగా ఆశీర్వదించబడ్డామో గదా! యెహోవా మనకు ప్రేమపూర్వకంగా అప్పగించిన విశేషాధిక్యత దృష్ట్యా మనమెలా మౌనంగా ఉండగలం?
మన సహవాసాల విషయంలో జాగ్రత్తగా ఉందాం
16 ధైర్యంగా ఉండడానికి తనకు సహాయం చేసిన మరో విషయం గురించి యిర్మీయా నివేదిస్తున్నాడు. ఆయనిలా చెప్పాడు: ‘హాస్యోక్తులు చెప్పుకునే వారి సమూహంలో కూర్చొని నేను ఉల్లసించలేదు. అధిక్షేపణతో నీవు నన్ను నింపావు కాబట్టి, నీ హస్తమునుబట్టి నేను ఒంటరిగానే కూర్చున్నాను.’ (యిర్మీయా 15:17, NW) చెడు సాంగత్యంవల్ల చెడిపోవడానికి బదులు యిర్మీయా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడి ఉంటాడు. నేడు మనకూ అదే దృక్కోణముంది. “దుష్టసాంగత్యము,” అనేక సంవత్సరాలుగా మనకున్న మంచి అలవాట్లతోసహా “మంచి నడవడిని చెరుపును” అని అపొస్తలుడైన పౌలు ఇచ్చిన హెచ్చరికను మనమెప్పటికీ మరచిపోము.—1 కొరింథీయులు 15:33.
17 చెడు సాంగత్యాలు లౌకికాత్మ మన ఆలోచనలను కలుషితం చేయడాన్ని అనుమతిస్తాయి. (1 కొరింథీయులు 2:12; ఎఫెసీయులు 2:2; యాకోబు 4:4) అందువల్ల, హానికరమైన సాంగత్యాలను గుర్తించి వాటిని పూర్తిగా విసర్జించడానికి మనం మన జ్ఞానేంద్రియాలను సాధకం చేసుకోవాలి. (హెబ్రీయులు 5:14) నేడు పౌలు ఈ భూమిపై జీవించివుంటే, దుర్నీతికరమైన లేదా హింసాత్మక సినిమాలు లేదా హింసాత్మక క్రీడలు చూసే క్రైస్తవునికి ఆయన ఏమి చెబుతాడని మీరనుకుంటారు? ఇంటర్నెట్‌లో అసలు తెలియని కొత్తవారితో స్నేహం చేస్తున్న సహోదరుణ్ణి ఆయనెలా మందలిస్తాడు? గంటలకొద్దీ వీడియో గేములు ఆడుతూ లేదా టీవీ చూస్తూ మంచి వ్యక్తిగత అధ్యయన అలవాట్లులేని క్రైస్తవుని గురించి ఆయనేమనుకుంటాడు?—2 కొరింథీయులు 6:14; ఎఫెసీయులు 5:3-5, 15, 16.
ఆధ్యాత్మిక పరదైసులో నిలిచివుండండి
18 మన ఆధ్యాత్మిక పరదైసును మనం అమూల్యమైనదిగా పరిగణిస్తాం. నేటి లోకంలో ఏదీ దానికి సాటిరాదు. క్రైస్తవుల్లో పరస్పరమున్న ప్రేమ, శ్రద్ధ, దయాళుత్వం గురించి అవిశ్వాసులు సహితం వ్యాఖ్యానించారు. (ఎఫెసీయులు 4:31, 32) అయినప్పటికీ, క్రితమెన్నడూ లేనంత ఎక్కువగా మనం నిరుత్సాహానికి విరుద్ధంగా పోరాడాలి. మంచి సహవాసం, ప్రార్థన, చక్కని అధ్యయన అలవాట్లు మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి మనకు సహాయం చేయగలవు. అవి యెహోవాపై పూర్తి నమ్మకంతో ఎలాంటి పరీక్షనైనా ఎదుర్కోవడానికి మనలను బలపరుస్తాయి.—2 కొరింథీయులు 4:7, 8.
19 మన బైబిలు సందేశాన్ని ద్వేషించేవారు మనల్ని భయపెట్టి, విశ్వాసం విషయంలో మనం రాజీపడేలా చేయడాన్ని మనమెప్పటికీ అనుమతించకూడదు. యిర్మీయాను హింసించిన శత్రువుల్లాగే, మనకు వ్యతిరేకంగా పోరాడేవారు దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వారు గెలవరు. మన వ్యతిరేకులకంటే మరెంతో బలంగల యెహోవా మనకిలా చెబుతున్నాడు: “యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.” (కీర్తన 27:14) మన హృదయంలో లోతుగా నాటుకున్న యెహోవా మీదున్న నిరీక్షణతో, మేలు చేయడం మానకుండా ఉండడానికి తీర్మానించుకుందాం. యిర్మీయా బారూకుల్లాగే మనం కూడా అలసిపోకుండా ఉంటే తగిన ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకంతో ఉందాం.—గలతీయులు 6:9.
20 నిరుత్సాహానికి వ్యతిరేకంగా పోరాడడం చాలామంది క్రైస్తవులకు నిరంతర పోరాటంగా ఉంది. అయితే యౌవనులు ప్రత్యేక సవాలును ఎదుర్కొంటున్నారు. కానీ వారికి అద్భుతమైన అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాతి ఆర్టికల్ ప్రత్యేకంగా మన మధ్యవున్న యౌవనుల కోసమే వ్రాయబడింది. అలాగే అది సంఘంలోని యౌవనులకు తమ మాట ద్వారా, మాదిరి ద్వారా, నేరుగా మద్దతిస్తూ సహాయంచేయగల స్థానంలోవున్న తల్లిదండ్రులకు, సంఘంలోని సమర్పిత వయోజనులందరికీ ఆసక్తికరంగా ఉంటుంది.
మీరెలా జవాబిస్తారు?
• నిరుత్సాహకరమైన పరిస్థితులను మనమెందుకు ఎదురుచూడవచ్చు, సహాయం కోసం మనమెవరివైపు చూడాలి?
• కష్టభరితమైన నియామకమున్నా యిర్మీయా నిరుత్సాహాన్ని ఎలా జయించాడు?
• కష్టాలున్నప్పటికీ మన హృదయాలను ఏది ‘సంతోషింపజేసి ఆనందపరుస్తుంది’?
[అధ్యయన ప్రశ్నలు]
1. యెహోవాసాక్షులు ఎలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారు?
2, 3. నిజ క్రైస్తవులు దేనిని తాళుకోవాలి?
4. తాళుకొనే సహాయం కోసం మనమెటువైపు చూస్తాం?
5, 6. (ఎ) తాళుకున్న సత్యారాధకుల ఎలాంటి ఉదాహరణలు మనకున్నాయి? (బి) యిర్మీయా ప్రవక్తగా సేవ చేయడానికి పిలువబడినప్పుడు ఎలా ప్రతిస్పందించాడు?
7. యిర్మీయాకు తన సేవా ప్రాంతంలో ఎలాంటి ప్రతిస్పందన ఎదురైంది, దానికి ఆయనెలా ప్రతిస్పందించాడు?
8, 9. (ఎ) ఊరియా ఎలాంటి బలహీనత ప్రదర్శించాడు, తత్ఫలితంగా ఏమి జరిగింది? (బి) బారూకు ఎందుకు నిరుత్సాహపడ్డాడు, ఆయనకు ఏవిధంగా సహాయం లభించింది?
10. యెహోవా యిర్మీయాకు మద్దతిచ్చే ఎలాంటి వాగ్దానాలు చేశాడు?
11. యిర్మీయాను బలపరుస్తాననే తన వాగ్దానాన్ని యెహోవా నెరవేర్చాడని మనకెలా తెలుసు?
12. నిరుత్సాహానికి కారణాలున్నప్పటికీ, మనం ఏమి మనస్సులో ఉంచుకోవాలి?
13. యిర్మీయా దావీదుల మాదిరిని మనమెలా అనుకరించగలం?
14. యెహోవా మాటలు యిర్మీయాపై ఎలాంటి ప్రభావం చూపాయి?
15. యెహోవా మాటలను మనమెలా మన హృదయంలో నాటుకోగలం, ఆలోచించవలసిన ఏ విషయాలు మనం మౌనంగా ఉండకూడదని నిశ్చయించుకునేలా చేస్తాయి?
16, 17. సహవాసుల విషయంలో యిర్మీయా దృక్కోణమేమిటి, మనమాయనను ఎలా అనుకరించవచ్చు?
18. ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి మనకేవి సహాయం చేస్తాయి?
19, 20. (ఎ) సహించడానికి మనకేది సహాయం చేస్తుంది? (బి) తర్వాతి ఆర్టికల్ ఎవరి కోసం వ్రాయబడింది, అది ఎవరికి కూడా ఆసక్తికరంగా ఉంటుంది?
[9వ పేజీలోని చిత్రం]
ప్రవక్తగా ఉండడానికి తాను బాలుడననీ, అనుభవంలేని వాడననీ యిర్మీయా తలంచాడు
[10వ పేజీలోని చిత్రం]
హింస అనుభవిస్తున్న సమయంలో కూడా, “పరాక్రమముగల శూరునివలె” యెహోవా తనకు తోడైయున్నాడని యిర్మీయాకు తెలుసు