కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుణ్ణి సంతోషపరచాలన్న మానవుని అన్వేషణ

దేవుణ్ణి సంతోషపరచాలన్న మానవుని అన్వేషణ

దేవుణ్ణి సంతోషపరచాలన్న మానవుని అన్వేషణ

“దేవుడు సృష్టికర్తగా, నియంత్రణకర్తగా ఒక పాత్ర నిర్వహించని మానవ సమాజమంటూ ఏదీ లేదు. బలమైన లౌకికవాద సమాజాల్లో సైతం ఈ విషయం వాస్తవం” అని జాన్‌ బోకెర్‌ తన స్వీయ రచన గాడ్‌—⁠ఎ బ్రీఫ్‌ హిస్టరీలో చెబుతున్నాడు. ఏదోక రీతిలో, దేవుణ్ణి కనుగొని ఆయన అనుగ్రహం పొందాలనే అన్వేషణ మానవ ప్రవర్తనలో బలంగా నాటుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా, దేవుణ్ణి సంతోషపరచాలనే యథార్థమైన కోరిక చాలామందికి ఉంది. అయితే దేవుణ్ణి సంతోషపరచడానికి వారెలా ప్రయత్నిస్తారనేది వారి నమ్మకాలనుబట్టి వివిధ రకాలుగా ఉంటుంది.

దేవుని అనుగ్రహం పొందడానికి మనం చేయవలసిందల్లా మంచిగా జీవించడమేనని కొందరు నమ్ముతారు. బీదలకు దానధర్మాలు చేయడం ద్వారా దేవుని అనుగ్రహం పొందవచ్చునని మరికొందరు భావిస్తారు. వీటికితోడు, లక్షలాదిమందికి మతాచారాలు, కట్టుబాట్లు ప్రాముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి.

మరోవైపున, దేవుడు తమకు అందనంత దూరంలో అంటే సాధారణ ప్రజల విషయాలు పట్టించుకోనంత దూరంలో ఉన్నాడనీ లేదా ఆయనకు అంత తీరిక లేదనీ నమ్మేవారూ ఉన్నారు. ‘దేవతలు మానవులపై ప్రభావం చూపలేనంత దూరంలో ఉన్నారని’ ప్రాచీనకాల గ్రీసు తత్త్వవేత్త ఎపిక్యూరస్‌ నమ్మినట్లుగా చెప్పబడుతోంది. అయినప్పటికీ, అలాంటి భావాలున్న అనేకులు మతాసక్తిపరులుగానే ఉన్నారు. చనిపోయిన తమ పూర్వికులను శాంతింపచేయవచ్చనే ఆశతో కొందరు బలులు అర్పించవచ్చు, మతకర్మలు కూడా ఆచరించవచ్చు.

మీరేమనుకుంటున్నారు? దేవుడు తన అనుగ్రహం పొందాలని మనం చేసే ప్రయత్నాలను నిజంగా గమనిస్తున్నాడా? దేవుణ్ణి ప్రభావితంచేసి ఆయనను సంతోషపరచడం మనకు సాధ్యమవుతుందా?

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

ముఖచిత్రం: Courtesy of ROE/Anglo-Australian Observatory, photograph by David Malin