కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సుదీర్ఘమైన సంతోషకరమైన జీవితానికి కిటుకు

సుదీర్ఘమైన సంతోషకరమైన జీవితానికి కిటుకు

సుదీర్ఘమైన సంతోషకరమైన జీవితానికి కిటుకు

“చిరకాలం జీవించాలని అందరూ కోరుకుంటారు; కానీ వృద్ధాప్యం రావాలని ఎవ్వరూ కోరుకోరు” అని ఒక సామెత చెబుతోంది. రిటైర్‌ అవ్వాల్సిన వయసుకు చేరుకునేవారు చాలామంది ఇక తమకు వ్యక్తిగత పనుల కోసం ఎక్కువ సమయం ఉంటుందని, తక్కువ బాధ్యతలు ఉంటాయని ఎదురుచూస్తారు. అయితే తాము ఎలాంటి సంకల్పం లేకుండా, ఎందుకూ పనికిరానివారిగా తయారవుతామేమోనని వాళ్ళు భయపడతారు. తాము ఒంటరి వారమైపోతామని, తమకు సంతోషం లేకుండా పోతుందని, తమ ఆరోగ్యం క్షీణించిపోతుందని కూడా వాళ్ళు చింతిస్తారు.

మరైతే సంతోషభరితమైన జీవితానికి రహస్యమేమిటి? మంచి స్నేహితులూ ప్రేమానురాగాలు కురిపించే కుటుంబమూ యౌవనులు, వృద్ధులు సంతోషంగా ఉండడానికి సహాయం చేస్తాయి. కానీ ఒక వృద్ధుని జీవితాన్ని సంతోషమయం చేయడానికి ఇతరులేమి చేయవచ్చు అనేది ప్రాముఖ్యం కాదు. వృద్ధులే ఇతరులకు సహాయం చేయడానికి ఏమి చేయవచ్చు అనేది అంతకంటే ప్రాముఖ్యమైన విషయం.

423 మంది వృద్ధ దంపతులపై చేయబడిన ఒక దీర్ఘకాల అధ్యయనం, “ఇతరులకు సహాయం చేయడం మన ఆయుష్షును పెంచుకోవడానికి సహాయం చేస్తుంది” అని సూచించింది. ఆ అధ్యయనాన్ని నిర్వహించిన స్టెఫెనీ బ్రౌన్‌, “ఇతరులతో సత్సంబంధాలు కలిగివుండడాన్ని ఫలవంతం చేసేది, మనకేమి లభిస్తుందనే విషయం కాదుగానీ మనం వాళ్ళకెలా సహాయం చేయగలమనే విషయమేనని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి” అని వివరించింది. ఇతరులకు సహాయం చేయడంలో వాళ్ళకు ఇంటిపనిలో సహాయం చేయడం, పిల్లలను చూసుకోవడం, వాళ్ళ కోసం బయటి పనులు చేసిపెట్టడం, వాళ్ళను ఎక్కడికైనా తీసుకెళ్ళడం, లేదా వాళ్ళు మాట్లాడాలనుకున్నప్పుడు శ్రద్ధగా వినడం వంటివి ఉండవచ్చు.

దాదాపు 2,000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు, “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 20:​35) సుదీర్ఘమైన సంతోషకరమైన జీవితానికి కిటుకు, పెద్ద మొత్తంలో బ్యాంక్‌ ఎక్కౌంట్‌ ఉండడమో లేదా వృద్ధులవకుండా ఉండేందుకు సహాయపడే చికిత్సలో ఆహార పద్ధతులో కాదు. చురుగ్గా ఉంటూ తమ సమయాన్ని, శక్తిసామర్థ్యాలను ఇతరుల జీవితాల్లో సంతోషం నింపడానికి ఉపయోగిస్తే చాలు.

అయితే మనం ఇతరులను సంతోషపరచినంత మాత్రాన వృద్ధాప్యం నుండి, అనారోగ్యం నుండి, మరణం నుండి తప్పించుకుంటామని కాదు. దేవుని రాజ్యం మాత్రమే మనలను వాటినుండి రక్షిస్తుంది. ఆ రాజ్య పరిపాలన క్రింద అనారోగ్యం నిర్మూలించబడుతుంది అంతేకాక “మరణము ఇక ఉండదు.” (ప్రకటన 21:3, 4; యెషయా 33:​24) నిజానికి విధేయులైన మానవులు నిరంతరం సంతోషంగా పరదైసు భూమిపై జీవిస్తారు. (లూకా 23:​43) సుదీర్ఘమైన సంతోషకరమైన జీవితానికి బైబిలు ఆధారిత కిటుకును ఇతరులకు చెప్పడానికి యెహోవాసాక్షులు సంతోషిస్తున్నారు.