అభినివేశంగల కోతపనివారిగా గిలియడ్ పట్టభద్రులు బయలువెళ్లారు!
అభినివేశంగల కోతపనివారిగా గిలియడ్ పట్టభద్రులు బయలువెళ్లారు!
“కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు. గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి.” (మత్తయి 9:37, 38) వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క 116వ తరగతి పట్టభద్రులు తమ మిషనరీ నియామకాలకు వెళ్లడానికి సిద్ధపడుతుండగా వారికి ఆ మాటలు ప్రత్యేక భావాన్నిచ్చాయి.
మార్చి 13, 2004 శనివారం గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి న్యూయార్క్‌లోని ప్యాటర్సన్‌లో ఉన్న వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్‌లో, ఈ కార్యక్రమం శాటిలైట్ ద్వారా ప్రసారం చేయబడిన ఇతర బెతెల్ గృహాల్లో కలిపి మొత్తం 6,684 మంది హాజరయ్యారు, ఆ కార్యక్రమంలో తరగతి సభ్యులకు వీడ్కోలు సలహా, ప్రోత్సాహం ఇవ్వబడ్డాయి. ఆధ్యాత్మిక కోతపనిని మనం అభినివేశంతో చేస్తుండగా వారికివ్వబడిన సలహా నుండి మనమందరం ప్రయోజనం పొందవచ్చు.
పరిపాలక సభ సభ్యుడు, గిలియడ్ ఏడవ తరగతి పట్టభద్రుడు అయిన థియోడోర్ జారస్ పలికిన తొలిపలుకులు “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని చెప్పిన యేసు మాటలను నొక్కిచెప్పాయి. (మత్తయి 28:19, 20) పట్టభద్రులు 20 దేశాల్లో సేవచేయడానికి పంపించబడుతున్నారు కాబట్టి ఆ మాటలెంత సముచితమో కదా! అత్యంత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక కోతపనిలో అభినివేశంగల పనివారిగా ఉండేందుకు దేవుని వాక్యోపదేశం విద్యార్థులను సంసిద్ధులను చేసిందని ఆయన వారికి జ్ఞాపకంచేశాడు.—మత్తయి 5:16.
ఫలవంతమైన కోతపనివారిగా ఉండే విధానం
చాలా సంవత్సరాలుగా గిలియడ్ పాఠశాలతో సన్నిహితంగా మెలిగిన రాబర్ట్ ఉలన్ ఆ కార్యక్రమంలో మొదటి ప్రసంగమిచ్చారు. “కనికరమనే చక్కని లక్షణం” అనే అంశంపై మాట్లాడుతూ, “కనికరమనేది చెవిటివారు వినగలిగే, గుడ్డివారు చూడగలిగే చక్కని భాష” అని ఆయన విద్యార్థులకు చెప్పాడు. ఇతరుల దురవస్థ గురించి యేసుకు బాగా తెలుసు, అంతేకాక ఆయన దానిని తొలగించేందుకు ప్రయత్నించాడు. (మత్తయి 9:36) విద్యార్థులకు కూడా ప్రకటనా పనిలో, సంఘంలో, మిషనరీ గృహాల్లో, తమ వివాహబంధంలో యేసులాగే చేసే చాలా అవకాశాలు లభిస్తాయి. “మీరు ఇతరులకు సేవచేస్తుండగా మీ జీవితంలో కూడా కనికరమనే చక్కని లక్షణాన్ని వికసింపనివ్వండి. మిషనరీ గృహంలో దైనందిన జీవితానికి మీ చక్కని ప్రవర్తనే ఎంతో దోహదపడుతుంది. కాబట్టి, కనికరాన్ని ధరించుకోవడానికి తీర్మానించుకోండి” అని ఆయన వారికి ఉద్బోధించాడు.—కొలొస్సయులు 3:12.
తర్వాత, పరిపాలక సభ సభ్యుడు, గిలియడ్ 41వ తరగతి పట్టభద్రుడు అయిన గెరిట్ లూష్ “రక్షణ సమాచార ప్రచారకులు” అనే అంశంమీద మాట్లాడారు. (యెషయా 52:7) ప్రస్తుత విధానం నాశనం చేయబడినప్పుడు ప్రజలు రక్షించబడాలంటే, వాళ్లు దేవుని వాక్య ప్రామాణిక పరిజ్ఞానం సంపాదించుకొని, తమ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటిస్తూ, ఆ తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. (రోమీయులు 10:10; 2 తిమోతి 3:15; 1 పేతురు 3:21) అయితే, రక్షణ సమాచారం ప్రకటించడానికి ప్రాథమిక కారణం మానవుల్ని రక్షించడం కాదుగానీ దేవునికి స్తుతి తీసుకురావడమే. కాబట్టి, “యెహోవాకు స్తుతి కలిగేలా రాజ్య సువార్తను భూదిగంతములకు చేరవేయండి, అభినివేశంగల రక్షణ సమాచార ప్రచారకులవండి” అని కాబోయే ఆ మిషనరీలకు సహోదరుడు గెరిట్ లూష్ ప్రబోధించాడు.—రోమీయులు 10:18.
గిలియడ్ ఉపదేశకుడైన లారెన్స్ బౌవెన్ “మీరెంత తేజోవంతంగా ఉన్నారు?” అనే ప్రశ్నను లేవనెత్తారు. మత్తయి 6:22లో గ్రంథస్తం చేయబడిన యేసు మాటలను ఉదహరిస్తూ, “యెహోవాను మహిమపరిచే, తోటి మానవులకు ప్రయోజనమిచ్చే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతిబింబించడానికి” కంటిని “తేటగా” ఉంచుకోవాలని పట్టభద్రులవుతున్న విద్యార్థులను ఆయన ప్రోత్సహించాడు. ఈ విషయంలో దేవుని చిత్తం చేయడంపైనే దృష్టి నిలుపుతూ యేసు తన పరిచర్య ఆరంభం నుండే పరిపూర్ణ మాదిరి ఉంచాడు. పరలోకంలో తండ్రి తనకు బోధించిన అద్భుతమైన విషయాలను ధ్యానించడం అరణ్యంలో సాతాను తీసుకొచ్చిన పరీక్షలను సహించడానికి యేసుకు సహాయపడింది. (మత్తయి 3:16; 4:1-11) దేవుడు తనకు అప్పగించిన పనిని నెరవేర్చడంలో తాను పూర్తిగా యెహోవాపై ఆధారపడినట్లు యేసు చూపించాడు. అదేవిధంగా, రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి మిషనరీలు చక్కని బైబిలు అధ్యయన అలవాట్లలో కొనసాగుతూ యెహోవాపై పూర్తిగా ఆధారపడాలి.
గిలియడ్ ఉపదేశకుడు, గిలియడ్ 77వ తరగతి పట్టభద్రుడు అయిన మార్క్ న్యూమర్ “మేము నీ వశమున నున్నాము” అనే అంశంపై ప్రసంగిస్తూ ఈ ప్రసంగాల యెహోషువ 9:25) ప్రాచీనకాల గిబియోనీయుల దృక్పథాన్ని అనుకరించమని ఆయన విద్యార్థులను ప్రోత్సహించాడు. గిబియోను ‘గొప్ప పట్టణమైనప్పటికీ, అక్కడి జనులందరూ శూరులైనప్పటికీ,’ గిబియోనీయులు ప్రధానత్వాన్ని కోరలేదు లేదా తమ మాటచొప్పునే పనులు జరగాలని పట్టుబట్టలేదు. (యెహోషువ 10:2) వారు యెహోవా ఆరాధనకు మద్దతుగా లేవీయుల అధికారం క్రింద “కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను” ఇష్టపూర్వకంగా సేవచేశారు. (యెహోషువ 9:27) నిజానికి, పట్టభద్రులవుతున్న తరగతి సభ్యులు మహాగొప్ప యెహోషువ అయిన యేసుక్రీస్తుతో “మేము నీ వశమున నున్నాము” అని చెబుతున్నారు. వారిప్పుడు తమ విదేశీ నియామకాలు చేపడుతుండగా, మహాగొప్ప యెహోషువ వారికి ఏ పని అప్పగిస్తే ఆ పని చేయడానికి అంగీకరించాలి.
పరంపరను ముగించాడు. (అనుభవాలు, ఇంటర్వ్యూలు
ఉపదేశకుల్లో ఒకరు, గిలియడ్ 61వ తరగతి పట్టభద్రుడైన వాలెస్ లివరెన్స్ ‘లేఖనములను సవివరంగా బోధించడం’ అనే అంశంపై కొందరు విద్యార్థులతో చర్చించారు. వారి పాఠశాల విద్యా కాలంలో ప్రాంతీయ పరిచర్యలో ఎదురైన అనుభవాలను వివరించి, పునర్నటించి చూపించారు. దాదాపు ఐదు నెలల శిక్షణా కాలంలో లేఖనాలను లోతుగా చేసిన అధ్యయన ప్రభావం వారి హృదయాలకు చేరిందనీ, తాము నేర్చుకున్నది ఇతరులతో పంచుకోవడానికి వారిని పురికొల్పిందనీ స్పష్టమైంది. (లూకా 24:32) ఆ ఐదు నెలల కాలంలో, ఒక విద్యార్థి తాను నేర్చుకుంటున్న విషయాలను తన సొంత తమ్మునితో పంచుకోగలిగాడు. ఇది, ఆయన తమ్ముడు స్థానికంగావున్న ఒక సంఘానికి వెళ్లి బైబిలు అధ్యయనం తీసుకొనేలా పురికొల్పింది. ఆయనిప్పుడు బాప్తిస్మం పొందని ప్రచారకునిగా అర్హుడయ్యాడు.
ఈ అనుభవాల తర్వాత, రిచర్డ్ ఆష్, జాన్ గిబెర్డ్ వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్‌లో ప్రత్యేక శిక్షణపొందుతున్న ప్రయాణ పైవిచారణకర్తలతోపాటు చాలామంది దీర్ఘకాల నమ్మకమైన యెహోవా సేవకులను ఇంటర్వ్యూ చేశారు. వారు అంతకుముందు జరిగిన గిలియడ్ పాఠశాల తరగతుల్లో పట్టభద్రులయ్యారు. వారిలో ఒకాయన తరగతుల విద్యా కాలంలో సహోదరుడు నార్ ఇలా చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు: “గిలియడ్‌లో మీరు అధికంగా అధ్యయనం చేస్తారు. అయితే దానినిబట్టి మీరు గర్విష్ఠులైతే, మీరు విఫలులైనట్లే. మీరు ప్రేమనిండిన హృదయంగలవారిగా ఉండాలనే మేము కోరుతున్నాం.” ప్రజల అవసరతలపట్ల శ్రద్ధగలవారిగా ఉండాలనీ, క్రీస్తు వ్యవహరించినట్లే ఇతరులతో వ్యవహరించాలనీ, వారికి అప్పగించబడిన ఏ పనినైనా వినయంగా అంగీకరించాలనీ ప్రయాణ సహోదరులు ప్రస్తుత తరగతివారికి సలహా ఇచ్చారు. ఈ హితవును అన్వయించుకోవడం తమ నియామకాల్లో ఫలవంతంగా ఉండడానికి కొత్త మిషనరీలకు నిస్సందేహంగా సహాయం చేస్తుంది.
అభినివేశంగల కోతపనివారిగా బయలువెళ్లండి!
పరిపాలక సభ మరో సభ్యుడైన స్టీఫెన్ లెట్ ప్రసంగాన్ని వినే అవకాశం ప్రేక్షకులకు లభించింది. ఆయన “అభినివేశంగల కోతపనివారిగా బయలువెళ్లండి!” అనే ఆ కార్యక్రమ ముఖ్య ప్రసంగాన్నిచ్చాడు. (మత్తయి 9:38) అక్షరార్థ కోతపనిలో, పంటకోసే సమయం పరిమితంగా ఉంటుంది. కోతపనివారు కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉంటుంది. ఈ విధానాంతంలో ఆ పనిచేయడం ఇంకెంత ప్రాముఖ్యమో కదా! ఈ మహాగొప్ప ఆధ్యాత్మిక కోతపనిలో, ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. (మత్తయి 13:39) పునరావృతంకాని ఈ కోతపనికి సంబంధించి పట్టభద్రులు ‘తమ ఆసక్తి విషయంలో మాంద్యులు కాక యెహోవాను సేవించడానికి ఆత్మయందు తీవ్రతగలవారై ఉండాలని’ సహోదరుడు లెట్ ప్రోత్సహించాడు. (రోమీయులు 12:11) ప్రసంగీకుడు యేసు పలికిన ఈ మాటలను ఉదహరించాడు: “మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవి.” (యోహాను 4:35) ఆ పిమ్మట ఆయన అనియత సాక్ష్యమిచ్చే అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ ప్రజలు ఎప్పుడు, ఎక్కడ అందుబాటులోవున్నా వారిని చేరుకోవడానికి యథార్థంగా ప్రయత్నించడం ద్వారా కోతపనిలో తమ అభినివేశాన్ని ప్రదర్శించమని పట్టభద్రులకు ఉద్బోధించాడు. అవకాశాలు కల్పించుకోవడానికి అప్రమత్తంగా ఉండడం ఫలవంతంగా సాక్ష్యమివ్వడాన్ని సాధ్యం చేస్తుంది. యెహోవా ఆసక్తి లేదా అభినివేశంగల దేవుడు, అందరూ తనను అనుకరించాలనీ, ఆధ్యాత్మిక కోతపనిలో కష్టపడి పనిచేయాలనీ ఆయన ఆశిస్తున్నాడు.—2 రాజులు 19:31; యోహాను 5:17.
ఛైర్మన్‌గా వ్యవహరించిన సహోదరుడు జారస్ కార్యక్రమాన్ని ముగిస్తూ వివిధ బ్రాంచి కార్యాలయాల నుండి అందిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యార్థులకు డిప్లొమాలు అందజేశారు. గిలియడ్ విద్యార్థి ఒకరు తాము పొందిన శిక్షణపట్ల తమ ప్రగాఢ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తంచేసే ఉత్తరం చదివారు. నిశ్చయంగా, 116వ తరగతి గ్రాడ్యుయేషన్ కార్యక్రమం, హాజరైన వారందరూ అభినివేశంగల కోతపనివారిగా బయలువెళ్లేందుకు తీర్మానించుకునేలా చేసింది.
[25వ పేజీలోని బాక్సు]
తరగతి గణాంకాలు
ప్రాతినిధ్యం వహించిన దేశాల సంఖ్య: 6
పంపించబడిన దేశాల సంఖ్య: 20
విద్యార్థుల సంఖ్య: 46
సగటు వయస్సు: 34.2
సత్యంలో సగటు సంవత్సరాలు: 17.2
పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు: 13.9
[26వ పేజీలోని చిత్రం]
వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క 116వ తరగతి పట్టభద్రులు
ఈ క్రింద ఉన్న లిస్టులో వరుసల సంఖ్య ముందు నుండి వెనక్కి లెక్కించబడ్డాయి, ప్రతి వరుసలోని పేర్లు ఎడమ నుండి కుడికి ఇవ్వబడ్డాయి.
(1) సియోన్‌సు, ఆర్.; స్పారక్స్, టి.; పీన్యా, సి.; టర్నర్, పి.; చేనీ, ఎల్. (2) స్వార్డీ, ఎమ్.; ష్జాక్విస్ట్, ఎ.; ఆమాడోరీ, ఎల్.; స్మిత్, ఎన్.; జోర్డాన్, ఎ.; బ్వాసొనో, ఎల్. (3) మ్యాట్‌లాక్, జె.; రూయీత్, సి.; డూలార్, ఎల్.; వీన్యరన్, ఎమ్.; హెన్రీ, కె. (4) ష్జాక్విస్ట్, హెచ్.; లోక్స్, జె.; రూజో, జె.; గుస్టాఫ్‌సన్, కె.; బ్వాసొనో, ఆర్.; జోర్డాన్, ఎమ్. (5) హెన్రీ, డి.; టర్నర్, డి.; కెర్‌విన్, ఎస్.; ఫ్లోరెట్, కె.; సియోన్‌సు, ఎస్. (6) ఆమాడోరీ, ఎస్.; చేనీ, జె.; రాస్, ఆర్.; నెల్సన్, జె.; రూయీత్, జె.; వీన్యరన్, ఎమ్. (7) ఫ్లోరెట్, జె.; మ్యాట్‌లాక్, డి.; రాస్, బి.; లోక్స్, సి.; రూజో, టి.; డులార్, డి.; కెర్‌విన్, ఎన్. (8) గుస్టాఫ్‌సన్, ఎ.; నెల్సన్, డి.; స్వార్డీ, డబ్ల్యూ.; పీన్యా, ఎమ్.; స్మిత్, సి.; స్పారక్స్, టి.