కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నోవహుకు ఉత్తరం

నోవహుకు ఉత్తరం

నోవహుకు ఉత్తరం

ప్రియమైన నోవహుకు, నేను మీ గురించి, మీరూ మీ కుటుంబమూ జలప్రళయం నుండి తప్పించుకోవడానికి సహాయపడిన ఓడను మీరెలా నిర్మించారో బైబిల్లో చాలాసార్లు చదివాను.”

14 నుండి 21 సంవత్సరాల వయస్సుగల విద్యార్థుల వ్రాత పోటీలో పాల్గొన్న మిన్నామారియా అనే 15 సంవత్సరాల బాలిక తన ఉత్తరాన్ని అలా మొదలుపెట్టింది. ఫిన్నీష్‌ పోస్టల్‌ సర్వీసెస్‌, ద ఫెడరేషన్‌ ఫర్‌ ఫిన్నీష్‌ మదర్‌ టంగ్‌ టీచర్స్‌ అండ్‌ ద ఫిన్నీష్‌ లిటరేచర్‌ సొసైటీ ఈ పోటీని ఏర్పాటుచేసింది. ఆ పోటీలో పాల్గొనేవారు ఏదైనా ఒక పుస్తకం ఆధారంగా ఉత్తరం వ్రాయాలి. ఆ పుస్తక గ్రంథకర్తను లేదా అందులోని పాత్రధారిని సంబోధిస్తూ ఆ ఉత్తరం వ్రాయవచ్చు. ఆ టీచర్లు తమ విద్యార్థులు వ్రాసిన అలాంటి ఉత్తరాల నుండి 1,400 కంటే ఎక్కువ ఉత్తరాలను ఎంపిక చేసి పోటీ న్యాయ నిర్ణేతలకు పంపించారు. ఆ న్యాయ నిర్ణేతలు ఆ ఉత్తరాల నుండి ఒక ఉత్తరాన్ని మొదటి బహుమతి కోసం, పది ఉత్తరాలను ద్వితీయ బహుమతి కోసం, మరో పది ఉత్తరాలను తృతీయ బహుమతి కోసం ఎంపిక చేశారు. మిన్నామారియా తన ఉత్తరానికి తృతీయ బహుమతి వచ్చిందని తెలుసుకొని మురిసిపోయింది.

టీనేజ్‌ విద్యార్థిని మిన్నామారియా దాదాపు 5,000 సంవత్సరాల పూర్వం జీవించిన నోవహుకు ఉత్తరం ఎందుకు వ్రాసింది? ఆమె ఇలా అంటోంది: “నాకు బైబిలే మొదట గుర్తుకు వచ్చింది. నాకు బైబిల్లోని వ్యక్తులు చాలాబాగా తెలుసు. నేను వారి గురించి ఎంత ఎక్కువగా చదివానంటే వాళ్లు నాకు దాదాపు సజీవులుగానే కనిపిస్తారు. నోవహునే నేను ఎందుకు ఎంచుకున్నానంటే నా జీవన విధానంకంటే ఆయన జీవన విధానం ఎంతో భిన్నమైనదీ ఉల్లాసభరితమైనదీ.”

మిన్నామారియా ఉత్తరం ఈ మాటలతో ముగిసింది: “విశ్వాసానికీ విధేయతకూ మీరు ఇప్పటికీ మాకు ఒక మాదిరిగానే ఉన్నారు. మీ జీవన విధానం, బైబిలు చదివే వారందరినీ తమ విశ్వాసాన్నిబట్టి ప్రవర్తించాలని ప్రోత్సహిస్తోంది.”

ఈ యౌవన బైబిలు పాఠకురాలి ఉత్తరం, బైబిలు నిజంగా ‘సజీవమైనదని,’ అది ఇటు యౌవనులపై అటు వృద్ధులపై “బలము” లేదా ప్రభావం చూపగలదని చక్కగా ఉదహరిస్తోంది.​—⁠హెబ్రీయులు 4:12.