గొప్పతనం విషయంలో క్రీస్తువంటి దృక్కోణాన్ని అలవరచుకోవడం
గొప్పతనం విషయంలో క్రీస్తువంటి దృక్కోణాన్ని అలవరచుకోవడం
“మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను.”—మత్తయి 20:26.
కైరోకు దక్షిణాన దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో, ప్రాచీన ఐగుప్తు పట్టణమైన థీబ్స్ (ఆధునికదిన కార్నాక్) సమీపంలో 18 మీటర్ల ఎత్తున్న ఫరో ఆమెన్‌హోటెప్ III విగ్రహం ఉంది. ఎవరైనా ఆ భారీ విగ్రహంతో తమను తాము పోల్చుకుంటే ఎంతో అల్పంగా ఉన్నట్లు భావించక తప్పదు. ఖచ్చితంగా ఆ పరిపాలకునిపట్ల భక్తిపూర్వక భయం కలిగించడానికే ఉద్దేశించబడిన ఈ స్మారక చిహ్నం, గొప్పతనం విషయంలో ప్రాపంచిక దృక్కోణానికి అంటే ఇతరులు తాము వ్యర్థులమని భావించేలా చేయడానికి ఒక వ్యక్తి తననుతాను సాధ్యమైనంత గొప్పవానిగా, ప్రముఖునిగా చేసుకోవడానికి చిహ్నంగా ఉంది.
2 ఈ దృక్కోణాన్ని, గొప్పతనం విషయంలో యేసుక్రీస్తు బోధించిన దానితో పోల్చి అందులోని తేడాను చూడండి. యేసు తన అనుచరులకు ‘ప్రభువు, బోధకుడు’ అయినప్పటికీ, ఇతరులకు సేవ చేయడంలోనే గొప్పతనం ఉందని ఆయన వారికి బోధించాడు. యేసు తన భూ జీవితపు చివరి రోజున, తన శిష్యుల పాదాలు కడిగి తన బోధకున్న భావమేమిటో ప్రదర్శించాడు. అదెంతటి నిగర్వమైన సేవో కదా! (యోహాను 13:4, 5, 14) సేవ చేయడమా, చేయించుకోవడమా, మీకేది ఇష్టం? క్రీస్తు మాదిరి, మీరు కూడా ఆయనలాగే వినయంగా ఉండాలనే కోరికను మీలో రగిలిస్తోందా? అలాగయితే, గొప్పతనం విషయంలో ప్రాపంచిక దృక్కోణానికి భిన్నమైన క్రీస్తు దృక్కోణమేమిటో మనం పరిశీలిద్దాం.
గొప్పతనం విషయంలో ప్రాపంచిక దృక్కోణాన్ని విసర్జించండి
3 గొప్పతనం విషయంలో ప్రాపంచిక దృక్కోణం నాశనానికి దారితీస్తుందని చూపించే బైబిలు ఉదాహరణలు చాలావున్నాయి. ఉదాహరణకు, ఎస్తేరు మొర్దెకైల కాలంలో పారసీక రాజు ఆస్థానంలో ప్రముఖుడు, అధిక పలుకుబడిగల హామాను విషయమే ఆలోచించండి. హామాను ఘనత కోసం అర్రులు చాచడం అతని అవమానానికి, మరణానికి దారితీసింది. (ఎస్తేరు 3:5; 6:10-12; 7:9, 10) తిరుగులేని అధికారం చెలాయిస్తున్న కాలంలో పిచ్చి పట్టిన, అహంకారంగల నెబుకద్నెజరు విషయమేమిటి? గొప్పతనం విషయంలో అతని వక్ర తలంపు ఈ మాటల్లో వ్యక్తపరచబడింది: “బబులోనును ఈ మహా విశాలపట్టణము నా బలాధికారమును నా ప్రభావఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా?” (దానియేలు 4:30) అలాగే దేవుణ్ణి మహిమపరచడానికి బదులుగా తనను అపాత్రంగా మహిమపరచడాన్ని గర్విష్ఠియైన హేరోదు అగ్రిప్ప I ఆమోదించాడు. తత్ఫలితంగా అతడు “పురుగులు పడి ప్రాణము విడిచెను.” (అపొస్తలుల కార్యములు 12:21-23) గొప్పతనం విషయంలో యెహోవా దృక్కోణాన్ని అర్థం చేసుకోకపోవడం వీరందరూ అవమానకరంగా పతనం కావడానికి దారితీసింది.
4 మనకు గౌరవమర్యాదలు తీసుకొచ్చే విధంగా జీవించాలని మనం కోరుకోవడం సరైనదే. అయితే, అపవాది తన సొంత లాలసకు ప్రతిబింబమైన అహంభావ స్వభావాన్ని పురికొల్పుతూ ఈ కోరికను ఉపయోగించుకుంటాడు. (మత్తయి 4:8, 9) అతడు “ఈ యుగ సంబంధమైన దేవత” అని, ఈ భూమ్మీద తన ఆలోచనను పురికొల్పడానికే తీర్మానించుకున్నాడనీ ఎప్పటికీ మరచిపోకండి. (2 కొరింథీయులు 4:4; ఎఫెసీయులు 2:2; ప్రకటన 12:9) అలాంటి ఆలోచనకు మూలమెవరో క్రైస్తవులకు తెలుసు కాబట్టి వారు గొప్పతనం విషయంలో ప్రాపంచిక దృక్కోణాన్ని విసర్జిస్తారు.
5 లోకంలో పెద్ద పేరు, ప్రజలచే గౌరవాభివందనలు, జేబుల నిండా డబ్బులు వంటివి సంతోషభరిత జీవితాన్ని అందిస్తాయనే ఆలోచనను అపవాది పురికొల్పుతున్నాడు. అది నిజమా? ఒకానొక ఘనకార్యం, గుర్తింపు, సంపద సంతృప్తికరమైన జీవితాన్ని వాగ్దానం చేస్తాయా? అలాంటి ఆలోచనతో మోసపోవద్దని బైబిలు మనలను హెచ్చరిస్తోంది. జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా వ్రాశాడు: “కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నియు నరులకు రోషకారణములని నాకు కనబడెను; ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నమువలెనున్నది.” (ప్రసంగి 4:4) లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి తమ జీవితాన్నే ధారపోసిన చాలామంది బైబిల్లోని ఆ ప్రేరేపిత ఉపదేశపు సత్యసంధతను ధృవీకరించవచ్చు. మనిషిని చంద్రునిపైకి తీసుకెళ్లిన అంతరిక్ష నౌక రూపకల్పనలో, నిర్మాణంలో, పరీక్షలో సహాయం చేసిన వ్యక్తే దానికొక ఉదాహరణ. ఆయనిలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “నేను ఎంతో కష్టపడి పనిచేసి నా పనిలో మంచి ప్రావీణ్యత సంపాదించాను. అయినప్పటికీ, నాకు శాశ్వత సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను ఇవ్వడంలో అది వ్యర్థమన్నట్లుగా లేదా పనికిరానిదన్నట్లుగానే తోచింది.” * అది వ్యాపార రంగమైనా, క్రీడా రంగమైనా లేదా వినోద రంగమైనాసరే గొప్పతనం విషయంలో ప్రాపంచిక దృక్కోణం శాశ్వత సంతృప్తికి హామీ ఇవ్వదు.
ప్రేమచేత పురికొల్పబడిన సేవ నుండి లభించే గొప్పతనం
6 నిజమైన గొప్పతనంలో ఏమి ఇమిడివుందో యేసు జీవితంలోని ఒక సంఘటన వెల్లడి చేస్తోంది. యేసు, ఆయన శిష్యులు సా.శ. 33లో పస్కా పండుగకు యెరూషలేముకు వెళ్తున్నారు. మార్గమధ్యంలో యేసు సమీపజ్ఞాతులైన యాకోబు, యోహాను గొప్పతనానికి సంబంధించి తప్పుడు దృక్కోణం కనబరిచారు. వారు యేసుతో, ‘నీ రాజ్యంలో ఒకరు నీ కుడివైపున మరొకరు నీ ఎడమవైపున కూర్చుండడానికి సెలవిమ్మని’ తమ తల్లి ద్వారా విజ్ఞాపన చేశారు. (మత్తయి 20:21) యూదుల్లో కుడివైపున లేదా ఎడమవైపున కూర్చోవడం మహా గౌరవంగా పరిగణించబడేది. (1 రాజులు 2:19) యాకోబు, యోహాను అత్యాశతో అతి విశిష్టమైన స్థానాలు చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ అధికార స్థానాలు తమకే దక్కాలని వారు కోరుకున్నారు. వారి మనసులోని విషయం యేసుకు తెలుసు, అందుకే ఆయన గొప్పతనం విషయంలో వారి తప్పుడు దృక్కోణాన్ని సరిచేయడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు.
7 ఈ దురహంకార లోకంలో ఇతరులను అదుపులోపెట్టి, ఆజ్ఞాపించే వ్యక్తి గొప్పవాడిగా పరిగణించబడతాడనీ, అతడు తనకిష్టమైన పనులు చిటికెలో చేయించుకోగలడనీ యేసుకు తెలుసు. అయితే తన శిష్యుల్లో వినయంతోచేసే సేవే గొప్పతనపు ప్రమాణం. యేసు ఇలా చెప్పాడు: “మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను.”—మత్తయి 20:26, 27.
8 బైబిల్లో “పరిచారకుడు” అని అనువదించబడిన గ్రీకు పదం ఇతరులకు సేవచేయడానికి శ్రద్ధగా, పట్టుదలగా ప్రయత్నించే వ్యక్తిని సూచిస్తోంది. యేసు తన శిష్యులకు ఒక ప్రాముఖ్యమైన పాఠం నేర్పిస్తున్నాడు. అదేమిటంటే, పనులు చేయమని ఇతరులకు ఆజ్ఞాపించడం కాదుగానీ ప్రేమచేత పురికొల్పబడి ఇతరులకు సేవచేయడమే ఒక వ్యక్తిని గొప్పవాణ్ణి చేస్తుంది. మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘నేనే ఒకవేళ యాకోబు లేదా యోహాను అయివుంటే నేనెలా ప్రతిస్పందించి ఉండేవాడిని? ప్రేమే ప్రేరణగా చేసే సేవలోనే నిజమైన గొప్పతనముందని నేను అర్థంచేసుకుని ఉండేవాడినా?’—1 కొరింథీయులు 13:3.
9 ప్రాపంచిక గొప్పతనపు ప్రమాణం క్రీస్తువంటి గొప్పతనపు ప్రమాణం కాదని యేసు తన శిష్యులకు చూపించాడు. మార్కు 10:13-16; లూకా 7:37-50) బలహీనులతో వ్యవహరించడంలో అనేకమందికి తరచూ ఓపిక నశిస్తూ ఉంటుంది. అయితే యేసు అందుకు పూర్తిగా భిన్నం. కొన్ని సందర్భాల్లో తన శిష్యులు ఆలోచనారహితంగా, తగువులాడేవారిగా ఉన్నప్పటికీ, తాను నిజంగా వినయస్థుడననీ, సాత్వికుడననీ వారికి చూపిస్తూ ఆయన ఓపికగా వారికి ఉపదేశించాడు.—జెకర్యా 9:9; మత్తయి 11:29; లూకా 22:24-27.
ఆయన ఎవరికైతే సేవచేశాడో వారితో తాను ఉన్నతమైనవాడినన్నట్లు ఎన్నడూ ప్రవర్తించలేదు లేదా తాము అధములమన్న భావం వాళ్లలో కలిగించలేదు. అన్ని రకాల ప్రజలు అంటే పురుషులు, స్త్రీలు, పిల్లలు, ధనికులు, బీదవారు, పలుకుబడిగలవారు, పేరుగాంచిన పాపులు ఆయనతో హాయిగా మెలిగారు. (10 దేవుని అద్వితీయ కుమారుని ఈ నిస్వార్థ మాదిరి నిజంగా గొప్పతనమంటే ఏమిటో ప్రదర్శించింది. యేసు ఈ భూమ్మీదికి సేవ చేయించుకోవడానికి రాలేదుగానీ “నానావిధ రోగములు” బాగు చేస్తూ, దయ్యాల బారినుండి ప్రజలను విముక్తుల్ని చేస్తూ ఇతరులకు సేవచేయడానికే వచ్చాడు. ఆయన అలసిపోయి విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో కూడా ఇతరులను ఓదార్చడానికే శ్రమిస్తూ, అన్ని సందర్భాల్లోను తన సొంత విషయాలకంటే ఇతరుల అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. (మార్కు 1:32-34; 6:30-34; యోహాను 11:11, 17, 33) ఆయన రాజ్య సువార్త ప్రకటించడానికి మట్టి రోడ్లపై వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ప్రజలకు ఆధ్యాత్మిక సహాయం చేయడానికి ప్రేమే ఆయనను పురికొల్పింది. (మార్కు 1:38, 39) నిస్సందేహంగా, యేసు ఇతరులకు సేవచేయడాన్ని గంభీరంగా తీసుకున్నాడు.
క్రీస్తు వినయాన్ని అనుకరించండి
11 పద్దెనిమిదవ శతాబ్దపు మలి సంవత్సరాల్లో, దేవుని ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రయాణ ప్రతినిధులుగా ఉండడానికి పురుషులను ఎంపిక చేసుకునేటప్పుడు క్రైస్తవ పైవిచారణకర్తలు అలవరచుకోవలసిన సరైన దృక్పథం నొక్కిచెప్పబడింది. జాయన్స్ వాచ్‌టవర్ సెప్టెంబరు 1, 1894 సంచిక ప్రకారం వారు “ఉప్పొంగేవారిగా కాక సాత్వికులై ఉండాలి . . . , తమను గురించి కాక క్రీస్తును గురించి మాట్లాడే వినయ మనస్కులై ఉండాలి, తమ సొంత పరిజ్ఞానాన్ని కాక దేవుని వాక్య పరిజ్ఞానాన్ని సులభశైలిలో, సమర్థవంతంగా వ్యక్తపరచాలి.” కాబట్టి నిజ క్రైస్తవులు వ్యక్తిగత లాలసను తీర్చుకోవడానికి లేదా ప్రధానత్వాన్ని, అధికారాన్ని, ఇతరులపై నియంత్రణను సంపాదించుకోవడానికి బాధ్యతలు చేపట్టకూడదు. వినయస్థుడైన పైవిచారణకర్త తన బాధ్యతల్లో తనకు మహిమతెచ్చే ఉన్నత స్థానం కాదుగానీ, “దొడ్డపని” చేరివుందని గుర్తుంచుకుంటాడు. (1 తిమోతి 3:1, 2) పెద్దలు, పరిచర్య సేవకులు అందరూ వినయంగా ఇతరులకు సేవచేయడానికీ, ఇతరులు అనుకరించేలా యోగ్యమైన మాదిరి ఉంచుతూ, పవిత్ర సేవలో ముందుండడానికీ తమ యావచ్ఛక్తిని ఉపయోగించాలి.—1 కొరింథీయులు 9:19; గలతీయులు 5:13; 2 తిమోతి 4:5.
12 ఆధిక్యతలు ఆశించే ఏ సహోదరుడైనా తననుతానిలా ప్రశ్నించుకోవాలి: ‘ఇతరులకు సేవచేసే అవకాశాల కోసం నేను చూస్తున్నానా లేక ఇతరులే నాకు సేవచేయాలనే యోహాను 5:41.
ఉద్దేశం నాలో ఉందా? ఇతరులు వెంటనే గమనించలేని సహాయకరమైన పనులు చేయడానికి నేను సుముఖంగా ఉన్నానా?’ ఉదాహరణకు, ఒక యౌవనుడు క్రైస్తవ సంఘంలో ప్రసంగాలు ఇవ్వడానికి ఇష్టపడుతుండవచ్చు గానీ వృద్ధులకు సహాయం చేయడానికి మాత్రం ముందుకు రాకపోవచ్చు. అతను సంఘంలో బాధ్యతగల పురుషులతో సన్నిహితంగా ఉండడానికి ఇష్టపడతాడు గానీ ప్రకటనా పనిలో భాగం వహించడానికి ఇష్టపడకపోవచ్చు. అలాంటి యౌవనుడు తననుతానిలా ప్రశ్నించుకోవాలి: ‘దేవుని సేవలో గుర్తింపును, పొగడ్తను తెచ్చే పనులమీదే నేను ముఖ్యంగా దృష్టిపెడుతున్నానా? ఇతరుల ముందు గొప్పగా కనబడడానికి నేను ప్రయత్నిస్తున్నానా?’ సొంత మహిమ కోసం ప్రయత్నించడం నిశ్చయంగా క్రీస్తును పోలినది కాదు.—13 క్రీస్తు వినయాన్ని అనుకరించడానికి మనం తీవ్రంగా కృషి చేసినప్పుడు, ఇతరులకు సేవ చేసేలా మనం ప్రేరేపించబడతాం. యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాల్లో ఒకదానిలో పనుల్ని పర్యవేక్షిస్తున్న ఒక జోన్ పైవిచారణకర్త ఉదాహరణే తీసుకోండి. పనుల ఒత్తిడి, బాధ్యతాభారం అధికంగా ఉన్నప్పటికీ, ఈ పైవిచారణకర్త స్టిచింగ్ మెషిన్ సెట్టింగ్‌ను సవరించడానికి ఇబ్బందిపడుతున్న ఒక యౌవన సహోదరునికి సహాయం చేయడానికి వెళ్లాడు. “ఆయనలా ముందుకు రావడం నన్ను ఆశ్చర్యపరచింది. యౌవనునిగా తాను బెతెల్‌లో సేవ చేస్తున్నప్పుడు ఆ విధమైన మెషిన్‌మీదే పనిచేశాననీ చెబుతూ, సరైన సెట్టింగ్ అమర్చడం ఎంత కష్టమో ఆయన గుర్తుచేసుకున్నాడు. ఆయన చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నప్పటికీ ఆయన నాతోపాటు కొంచెంసేపు అలాంటి మెషిన్‌మీద పనిచేశాడు. అది నిజంగా నన్ను ముగ్ధుణ్ణి చేసింది” అని ఆ యౌవన సహోదరుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ సహోదరుడు ఇప్పుడు యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాల్లో ఒకదానిలో పైవిచారణకర్తగా ఉన్నాడు, వినయ స్వభావంతో చేసిన ఆ సహాయం ఆయనకింకా జ్ఞాపకముంది. మామూలు పనులు చేయకూడనంత పెద్దవాళ్ళమని, చిన్నపనులు చేసేంత అధములం కాదని మనమెన్నటికీ తలంచకుండా ఉందాం. బదులుగా, మనం ‘వినయమైన మనస్సుగలవారిగా’ ఉండడానికి నడుం బిగించాలి. అది ఐచ్ఛికం కాదు. అది క్రైస్తవుడు ధరించాల్సిన ‘నవీన స్వభావములో’ ఒక భాగం.—ఫిలిప్పీయులు 2:3; కొలొస్సయులు 3:10, 12; రోమీయులు 12:16.
గొప్పతనం విషయంలో క్రీస్తు దృక్కోణాన్ని అలవరచుకునే విధానం
14 గొప్పతనం విషయంలో సరైన దృక్కోణాన్ని మనమెలా అలవరచుకోవచ్చు? దానికి యెహోవా దేవునితో మనకున్న సంబంధాన్ని గురించి ధ్యానించడం ఒక మార్గం. ఆయన ఘనత, శక్తి, జ్ఞానం అల్పమానవులకంటే ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. (యెషయా 40:22) మన తోటివారితో మనకున్న సంబంధాన్ని గురించి ధ్యానించడం కూడా వినయ మనస్సును అలవరచుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు, మనం కొన్ని రంగాల్లో ఇతరులకంటే మిన్నగా ఉండవచ్చు, అయితే జీవితంలో అంతకంటే ప్రాముఖ్యమైన ఇతర అంశాల్లో వారు మనకంటే ఉన్నతంగా ఉండవచ్చు లేదా మనలోలేని కొన్ని లక్షణాలు మన క్రైస్తవ సహోదరుల్లో ఉండవచ్చు. నిజం చెప్పాలంటే, దేవుని దృష్టిలో ప్రశస్తమైన వారు ఎంతోమంది, తమ దీనత్వాన్ని బట్టి, వినయ స్వభావాన్ని బట్టి ప్రముఖంగా కనిపించకూడదని భావించవచ్చు.—సామెతలు 3:34; యాకోబు 4:6.
15 తమ విశ్వాసం కారణంగా పరీక్షించబడిన యెహోవాసాక్షుల అనుభవాలు ఈ అంశాన్ని చక్కగా ఉదహరిస్తున్నాయి. లోకం తరచూ సామాన్యులని పరిగణించిన వారే తీవ్రమైన పరీక్షల్లో దేవుని పట్ల తమ యథార్థతను కాపాడుకున్నారు. అలాంటి ఉదాహరణలను ధ్యానించడం రోమీయులు 12:3. *
మనం వినయంగా ఉండడానికి సహాయం చేసి ‘మనం ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకుండా ఉండడాన్ని’ నేర్పించగలదు.—16 వృద్ధులైనా, యౌవనులైనా క్రైస్తవులందరూ గొప్పతనం విషయంలో క్రీస్తు దృక్కోణాన్ని అలవరచుకోవడానికి ప్రయత్నించాలి. సంఘంలో వివిధ రకాల పనులు చేయాల్సి ఉంటుంది. అల్ప స్థాయివనిపించిన పనులు చేయమని అడిగినప్పుడు చిన్నబుచ్చుకోకండి. (1 సమూయేలు 25:41; 2 రాజులు 3:11) తల్లిదండ్రులారా, రాజ్యమందిరంలో లేదా సమావేశ స్థలంలో తమకు అప్పగించిన ఏ పనినైనా సంతోషంగా చేసేలా మీరు మీ పిల్లలను, ఇతర యౌవనులను ప్రోత్సహిస్తున్నారా? స్వయంగా మీరే అల్ప స్థాయి పనులు చేయడం వారు చూస్తున్నారా? యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం సేవచేస్తున్న ఒక సహోదరుడు తన తల్లిదండ్రుల మాదిరిని స్పష్టంగా గుర్తుచేసుకుంటున్నాడు. ఆయనిలా చెప్పాడు: “రాజ్య మందిరాన్ని లేదా సమావేశ స్థలాన్ని పరిశుభ్రం చేసే పనిని వారు దృష్టించిన విధానం దానిని వారు ప్రాముఖ్యమైనదిగా పరిగణిస్తున్నట్లు నాకు తెలియజేసింది. ఆ పనులు ఎంత అల్పమైనవిగా అనిపించినా సరే సంఘ ప్రయోజనం లేదా సహోదరుల ప్రయోజనం కోసం వాటిని చేయడానికి వారెప్పుడూ స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారు. వారి దృక్పథం, ఇక్కడ బెతెల్‌లో అప్పగించిన ఏ పనినైనా ఇష్టపూర్వకంగా అంగీకరించడానికి నాకు సహాయం చేసింది.”
17 మన విషయాలకంటే ఇతరుల విషయాలకే ప్రాధాన్యతనిచ్చే విషయంలో, సా.శ.పూ. ఐదవ శతాబ్దంలో పారసీక సామ్రాజ్యపు రాణి అయిన ఎస్తేరు మనకు చక్కని మాదిరి ఉంచింది. రాజ భవనంలో నివసిస్తున్నప్పటికీ, దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఆమె ఆయన ప్రజల పక్షాన తన ప్రాణాన్ని ఫణంగా పెట్టడానికి ఇష్టపడింది. (ఎస్తేరు 1:5, 6; 4:14-16) నేటి క్రైస్తవ స్త్రీలు తమ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కృంగినవారిని బలపరచడం, రోగులను పరామర్శించడం, ప్రకటనా పనిలో భాగం వహించడం, పెద్దలతో సహకరించడం వంటివాటి ద్వారా ఎస్తేరు స్వభావాన్ని కనబరచవచ్చు. అలాంటి వినయ స్వభావం గల సహోదరీలు సంఘానికి ఎంత ఆశీర్వాదకరమో కదా!
క్రీస్తువంటి గొప్పతనం వల్ల కలిగే ఆశీర్వాదాలు
18 గొప్పతనం విషయంలో క్రీస్తు దృక్కోణం కాపాడుకోవడంవల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇతరులకు నిస్వార్థంగా సేవచేయడం అటు వారికీ ఇటు మీకూ ఆనందం తీసుకొస్తుంది. (అపొస్తలుల కార్యములు 20:35) మీ సహోదరుల పక్షాన ఇష్టపూర్వకంగా, కుతూహలంతో కష్టపడి పనిచేయడం మిమ్మల్ని వారికి ప్రియమైన వారిగా చేస్తుంది. (అపొస్తలుల కార్యములు 20:38) అంతకంటే ప్రాముఖ్యంగా, తోటి క్రైస్తవుల సంక్షేమానికి తోడ్పడేందుకు మీరు చేసే పనిని తనకు స్తుతిని తీసుకొచ్చే ఇష్టమైన యాగంగా యెహోవా దృష్టిస్తాడు.—ఫిలిప్పీయులు 2:17.
19 మనలో ప్రతీ ఒక్కరూ తమ హృదయం పరిశీలించుకుంటూ ఇలా ప్రశ్నించుకోవాలి: ‘గొప్పతనం విషయంలో క్రీస్తువంటి దృక్కోణం అలవరచుకోవడం గురించి నేను కేవలం మాట్లాడతానా లేక దానిని ఆచరణలో పెట్టడానికి నేను శ్రద్ధగా పనిచేస్తానా?’ గర్విష్ఠుల పట్ల యెహోవా మనోభావాలు స్పష్టం. (సామెతలు 16:5; 1 పేతురు 5:5) క్రైస్తవ సంఘంలోనైనా, మన కుటుంబ జీవితంలోనైనా, తోటి మానవులతో మన దైనందిన వ్యవహారాల్లోనైనా దేవుని మహిమ కోసం, స్తుతి కోసం మనం చేసే కార్యాలన్నీ మనం గొప్పతనం విషయంలో క్రీస్తు దృక్కోణాన్ని కనబరచడంలో ఆనందిస్తున్నామని చూపించునుగాక.—1 కొరింథీయులు 10:31.
[అధస్సూచీలు]
^ పేరా 8 కావలికోట (ఆంగ్లం) మే 1, 1982 3-6 పేజీల్లోని “విజయం కోసం అన్వేషణ” అనే ఆర్టికల్ చూడండి.
^ పేరా 21 ఉదాహరణల కోసం 1992 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం (ఆంగ్లం) 181-2 పేజీలు; కావలికోట సెప్టెంబరు 1, 1993, 27-31 పేజీలు చూడండి.
మీరు వివరించగలరా?
• గొప్పతనం విషయంలో ప్రాపంచిక దృక్కోణాన్ని మనమెందుకు విసర్జించాలి?
• గొప్పతనాన్ని యేసు ఏ ప్రమాణంతో కొలిచాడు?
• పైవిచారణకర్తలు క్రీస్తు వినయాన్ని ఎలా అనుకరించవచ్చు?
• క్రీస్తువంటి గొప్పతనాన్ని అలవరచుకోవడానికి మనకేది సహాయపడగలదు?
[అధ్యయన ప్రశ్నలు]
1. గొప్పతనం విషయంలో ప్రాపంచిక దృక్కోణమేమిటి?
2. యేసు తన అనుచరులకు ఎలాంటి మాదిరి ఉంచాడు, మనల్ని మనం ఏమని ప్రశ్నించుకోవాలి?
3. మనుష్యులు ఘనత కోసం అర్రులు చాచడం విషాదకర ఫలితాలకు దారితీస్తుందని ఏ బైబిలు ఉదాహరణలు చూపిస్తున్నాయి?
4. ప్రాపంచిక అహంభావ స్వభావం వెనక ఎవరున్నారు?
5. ఒకానొక ఘనకార్యం, గుర్తింపు, సంపద శాశ్వతమైన సంతృప్తికి హామీనిస్తాయా? వివరించండి.
6. గొప్పతనం విషయంలో యాకోబు యోహానులకు తప్పుడు దృక్కోణముందని ఏది చూపిస్తోంది?
7. నిజ క్రైస్తవ గొప్పతనపు విధానాన్ని యేసు ఎలా వివరించాడు?
8. పరిచారకుడిగా ఉండడమంటే అర్థమేమిటి, మనల్ని మనం ఏమని ప్రశ్నించుకోవచ్చు?
9. ఇతరులతో వ్యవహరించడంలో యేసు ఎలాంటి మాదిరి ఉంచాడు?
10. యేసు జీవిత విధానమంతా నిస్వార్థంగా ఇతరులకు సేవచేయడాన్ని ఎలా ప్రతిబింబించింది?
11. సంఘంలో పైవిచారణకర్తలుగా సేవచేయడానికి నియమించబడే సహోదరుల్లో ఎలాంటి లక్షణాలు ఉండాలి?
12. సంఘంలో ఆధిక్యతలను ఆశిస్తున్నవారు తమనుతాము ఏమని ప్రశ్నించుకోవచ్చు?
13. (ఎ) వినయం విషయంలో పైవిచారణకర్త చూపే మాదిరి ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపగలదు? (బి) వినయమైన మనస్సుగలవారిగా ఉండడం క్రైస్తవులకు ఐచ్ఛికం కాదని ఎందుకు చెప్పవచ్చు?
14. దేవునితో, మనతోటి వారితో మనకున్న సంబంధాన్ని గురించి ధ్యానించడం గొప్పతనం విషయంలో సరైన దృక్కోణాన్ని అలవరచుకోవడానికి మనకెలా సహాయం చేయవచ్చు?
15. ఇతరులకంటే తాము ఉన్నతులమని భావించడానికి ఎవరికీ ఆధారం లేదని దేవుని ప్రజల యథార్థత ఎలా చూపిస్తోంది?
16. యేసు మాదిరిని అనుకరిస్తూ సంఘంలోని వారందరూ గొప్పతనాన్ని ఎలా అలవరచుకోవచ్చు?
17. వినయ స్వభావం గల స్త్రీలు సంఘానికి ఏయే విధాలుగా ఒక ఆశీర్వాదంగా ఉండగలరు?
18. క్రీస్తువంటి గొప్పతనం కనబరచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?
19. గొప్పతనం విషయంలో క్రీస్తు దృక్కోణానికి సంబంధించి మన తీర్మానమేమై ఉండాలి?
[17వ పేజీలోని బాక్సు]
క్రీస్తు గొప్పతనం వీరిలో ఎవరికుంది?
సేవ చేయించుకోవాలని ఇష్టపడే వ్యక్తికా లేక ఇతరులకు సేవ చేయాలని ఇష్టపడే వ్యక్తికా?
అందరికీ కనబడాలని చేసే వ్యక్తికా లేక అల్పస్థాయి పనులు చేయడానికైనా అంగీకరించే వ్యక్తికా?
తన్నుతాను గొప్పచేసుకొనే వ్యక్తికా లేక ఇతరులను గొప్పచేసే వ్యక్తికా?
[14వ పేజీలోని చిత్రం]
ఫరో ఆమెన్‌హోటెప్ III భారీ విగ్రహం
[15వ పేజీలోని చిత్రం]
హామాను పతనానికి దారితీసిందేమిటో మీకు తెలుసా?
[16వ పేజీలోని చిత్రాలు]
ఇతరులకు సేవచేసే అవకాశాల కోసం మీరు చూస్తారా?