కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మేము ‘అవును!’ అని చెప్పాలనుకుంటున్నాం”

“మేము ‘అవును!’ అని చెప్పాలనుకుంటున్నాం”

“మేము ‘అవును!’ అని చెప్పాలనుకుంటున్నాం”

నైజీరియాలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి ఒక ఉత్తరం వచ్చింది, దానిలో కొంతభాగమిలా ఉంది:

“మా అబ్బాయి ఆండర్సన్‌ 14 సంవత్సరాల వయస్సులో చనిపోయాడు. తన మరణానికి ముందు అతను రెండు కోళ్లను పెంచడం మొదలుపెట్టాడు. వాటిని అమ్మి ఆ డబ్బును ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి విరాళంగా బ్రాంచి కార్యాలయానికి పంపించాలని కోరుకున్నాడు. అయితే వాటిని అమ్మడానికి ముందే మా అబ్బాయి చనిపోయాడు.

“తన కోరిక ప్రకారమే, వాడి తల్లిదండ్రులమైన మేము ఆ కోళ్లను పెంచి, వాటిని అమ్మి ఆ డబ్బును ఆండర్సన్‌ తరఫున మీకు విరాళంగా పంపిస్తున్నాము. యెహోవా వాగ్దానాన్ని బట్టి మేము, అతి త్వరలోనే ఆండర్సన్‌ను మళ్లీ చూస్తామనే నమ్మకం మాకుంది. మేము తన అభీష్టం నెరవేర్చామా అని మా అబ్బాయి అడిగితే మేము, ‘అవును!’ అని చెప్పాలనుకుంటున్నాం. నిజానికి మేము ఆండర్సన్‌నే కాదు పునరుత్థానమయ్యే ‘గొప్ప సాక్షి సమూహాన్ని’ కూడా చూడాలని ఎదురుచూస్తున్నాం.”​—⁠హెబ్రీయులు 12:1; యోహాను 5:28, 29.

పై ఉత్తరంలో స్పష్టంగా ప్రతిబింబించినట్లు, పునరుత్థానంపై నమ్మకం నిజ క్రైస్తవులను బలపరిచే నిరీక్షణ. ఆండర్సన్‌ కుటుంబంలాగే లక్షలాది కుటుంబాలు శత్రువైన మరణం పాలైన తమ ప్రియమైన వారిని తిరిగి స్వాగతించడం ఎంత ఆనందదాయకమైన అనుభవంగా ఉంటుందో కదా!​—⁠1 కొరింథీయులు 15:24-26.

దేవుని వాక్యం, ఓదార్పుకరమైన ఈ పునరుత్థాన నిరీక్షణను, దేవుని రాజ్య పరిపాలనలోని నీతియుక్త నూతనలోకంలో వాస్తవమయ్యే అనేకమైన అద్భుతాల్లో ఒకటిగా చెబుతోంది. (2 పేతురు 3:​13) ఆ కాలంలో ప్రజల కోసం దేవుడు ఏమిచేస్తాడో వివరిస్తూ బైబిలు ఇలా చెబుతోంది: “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”​—⁠ప్రకటన 21:⁠4.