పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
పౌలు ప్రయాణించిన ఓడ సిసిలికి దక్షిణాన, మెలితే దగ్గర కాదుగానీ మరో ద్వీపం దగ్గర బద్దలైపోయిందని కొందరు వాదించారు. ఆయన ప్రయాణించిన ఆ ఓడ ఖచ్చితంగా ఎక్కడ బద్దలయింది?
అపొస్తలుడైన పౌలు ప్రయాణించిన ఓడ మెలితే దగ్గర కాదుగానీ, గ్రీసుకు పశ్చిమతీరాన ఆయోనియన్ సముద్రంలో కార్ఫుకు సమీపంలోని సెఫలోనియా (లేక కెఫల్లినియా) దగ్గర బద్దలైందని ఇటీవల ప్రతిపాదించిన అంశాన్ని ఈ ప్రశ్న సూచిస్తోంది. రోమా శతాధిపతి యూలి ఆధ్వర్యంలో ఇతర సైనికులు, తన సహచరులతోపాటు పౌలు కైసరయ నుండి బయల్దేరాడని ప్రేరేపిత సమాచారం మనకు చెబుతోంది. మ్యాపులో ఉదహరించబడినట్లుగా, వారు సీదోనుకు ఆ తర్వాత మూరకు ప్రయాణించారు. అపొస్తలుల కార్యములు 27:1-28:1.
ఐగుప్తులోని అలెక్సంద్రియకు చెందిన పెద్ద ధాన్యపు ఓడకు మారిన తర్వాత, వాళ్లు పశ్చిమ దిశగా క్నీదు వైపుకు ప్రయాణించారు. కానీ ఏజియన్ సముద్రం గుండా గ్రీసు అగ్రము దాటి రోమ్‌కు వెళ్లే ప్రతిపాదిత సముద్ర మార్గం గుండా వెళ్లలేకపోయారు. బలమైన గాలులు, దక్షిణదిశగా క్రేతు దరివెంబడే వాళ్లు అక్కడికి వెళ్లేలా చేశాయి. చివరకు వారు మంచిరేవులు అనే స్థలంలో ఆగారు. ‘క్రేతునుండి బయలుదేరిన తరువాత,’ ‘ఊరకులోను అను పెనుగాలిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేక’ పోయింది. బరువైన ఆ ధాన్యపు ఓడ పధ్నాల్గవ రాత్రివరకు ‘సముద్రములో ఇటు అటు కొట్టుకొనిపోయింది.’ చివరకు, ఓడ బద్దలై అందులోని 276 మంది, పరిశుద్ధ గ్రంథంలోని గ్రీకు లేఖనాల ప్రకారం, సమీపంలోని మెలితే ద్వీపానికి చేరుకున్నారు.—గతంలో మెలితే అని ఆ ద్వీపాన్ని గుర్తించే విషయంలో వివిధ సూచనలు ఇవ్వబడ్డాయి. అది క్రోషియా తీరానికి దూరంగా ఎడ్రియాటిక్ సముద్రంలో నేడు మిలియెట్ అని పిలువబడుతున్న మిలైట్ ఇలీరికా ద్వీపమని కొందరు తలంచారు. అయితే ఇది నిజం కాకపోవచ్చు, ఎందుకంటే ఉత్తరానవున్న మిలియెట్ ఉన్న ప్రాంతాన్ని పౌలు తర్వాతి మజిలీలైన సురకూసైకి, సిసిలికి ఆ తర్వాత ఇటలీ పశ్చిమ తీర ప్రయాణానికి అనుసంధానం చేయడం కష్టం.—అపొస్తలుల కార్యములు 28:11-13.
బైబిలు అనువాదకుల్లో అత్యధికులు మెలితే అని నేడు పిలువబడుతున్న మాల్టా నిజానికి మెలితే ఆఫ్రికేనస్ ద్వీపాన్ని సూచిస్తుందని నిర్ణయించారు. పౌలు ప్రయాణిస్తున్న ఓడ ఆగిన చివరి రవాణా రేవు క్రేతులోని మంచిరేవులు. ఆ తర్వాత వీచిన బలమైన గాలులవల్ల ఆ ఓడ పశ్చిమ దిశగా కౌద వైపుగా కొట్టుకుపోయింది. గాలి వాటంవల్ల ఓడ చాలారోజుల వరకు అలా కొట్టుకుపోతూనే ఉంది. కాబట్టి గాలికి అలా కొట్టుకుపోయిన ఓడ ఇంకా పశ్చిమదిశకే వెళ్లి, చివరకు మాల్టా తీరం చేరుకుందని చెప్పడం పూర్తిగా సముచితం.
తరచుగా వీచే గాలిని, దాని “వాటాన్ని, గతి ప్రమాణాన్ని” లెక్కలోకి తీసుకుంటూ కానిబార్ మరియు హాసన్ ద లైఫ్ అండ్ ఎపిస్టల్స్ ఆఫ్ సెయింట్ పాల్ అనే తమ గ్రంథంలో ఇలా వ్రాశారు: “క్లౌదకు [లేదా, కౌదకు] మాల్టాకు మధ్య దూరం 770 కంటే తక్కువ కిలోమీటర్లుంది. ఆ నావికులు పధ్నాల్గవ రాత్రి కొట్టుకొచ్చిన [సమీపించిన] ప్రాంతం మాల్టా కాకుండా మరొకటని నమ్మడానికి వీల్లేనంతగా ఆ సంఘటన జరిగింది. వారక్కడకే చేరుకున్నారనడం ఎంతో నమ్మదగిన విషయం.”
ప్రత్యామ్నాయ స్థలాలు ప్రతిపాదించబడవచ్చు కానీ ఇక్కడ ఇవ్వబడిన మ్యాప్‌లో చూపబడినట్లు మాల్టా వద్ద ఓడ బద్దలయింది అనడం బైబిలు నివేదికకు అనుగుణంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
[31వ పేజీలోని మ్యాపు/చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
యెరూషలేము
కైసరయ
సీదోను
మూర
క్నీదు
క్రేతు
కౌద
మెలితే
సిసిలీ
సురకూసై
రోమ్
మిలియెట్
గ్రీసు
సెఫలోనియా