కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? అయితే, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

కాంప్లుటెన్సియన్‌ బహుభాషా బైబిలు అంటే ఏమిటి, అదెందుకు విశేషమైనది?

అది హీబ్రూ, గ్రీకు, లాటిన్‌ భాషల్లో అప్పట్లో అందుబాటులోవున్న శ్రేష్ఠమైన లేఖనాలను, అలాగే వాటితోపాటు అరామైక్‌ భాషలోని కొన్ని భాగాలను, ప్రక్కనే సమాంతర కాలమ్స్‌లో ఇచ్చి ముద్రించబడిన బహుభాషా బైబిలు గ్రంథం. ఈ బహుభాషా బైబిలు, ఆదిమ భాషల మరింత ప్రామాణిక మూలపాఠాన్ని తయారు చేసే దిశలో తీసుకోబడిన ప్రముఖ చర్యగా ఉపయోగపడింది.​—⁠4/15 28-31 పేజీలు.

మానవులు దేవుణ్ణి ఎలా సంతోషపరచగలరు?

జీవముగల వ్యక్తిగా యెహోవా ఆలోచనా శక్తిగలవాడు, చర్య తీసుకోగలడు, భావావేశాలున్నవాడు. ఆయన “సంతోషముగల దేవుడు,” తన సంకల్పం నెరవేర్చడంలో ఆయన ఆనందిస్తాడు. (1 తిమోతి 1:​11, NW; కీర్తన 104:​31) దేవుని భావాలను మనమెంత ఎక్కువగా గ్రహించడానికి ప్రయత్నిస్తే అంత ఎక్కువగా ఆయన హృదయాన్ని సంతోషపెట్టడానికి, మనమేమి చేయవచ్చో తెలుసుకుంటాము.​—⁠5/15, 4-7 పేజీలు.

దావీదు తన భార్య మీకాలు గృహదేవతా బొమ్మను ఉంచుకోవడానికి ఎందుకు అనుమతించాడు?

సౌలు రాజు దావీదును చంపాలనే పన్నాగం పన్నినప్పుడు, మీకాలు బహుశా మనిషి ఆకారంలోవున్న బొమ్మను మంచం మీద పెట్టి దావీదు తప్పించుకొనేలా సహాయం చేసింది. యెహోవాపట్ల మీకాలుకు సంపూర్ణ హృదయం లేనందువల్లే ఆమె ఆ గృహదేవతా బొమ్మను దగ్గర ఉంచుకొని ఉండవచ్చు. దావీదుకు ఆ విషయం తెలిసుండకపోవచ్చు లేదా ఆమె సౌలు రాజు కుమార్తె కాబట్టి ఆయన దాన్ని అనుమతించి ఉండవచ్చు. (1 దినవృత్తాంతములు 16:25, 26)​—⁠6/1, 29వ పేజీ.

రక్తానికి సంబంధించిన దేవుని ఆజ్ఞలు ఏ సత్యాన్ని నొక్కిచెబుతున్నాయి?

జలప్రళయం తర్వాత మరియు మోషే ధర్మశాస్త్రంలో దేవుడు తాను చెప్పిన మాటల ద్వారా, అపొస్తలుల కార్యములు 15:28, 29లోని ఆజ్ఞ ద్వారా యేసు రక్తం చిందించడం ఇమిడివున్న బలిని సూచించాడు. కేవలం ఆ రక్తం ద్వారానే మనం పాప క్షమాపణ పొంది, దేవునితో సమాధానం కలిగివుండగలం. (కొలొస్సయులు 1:​19-20)​—⁠6/15, 14-19 పేజీలు.

యేసు చేసిన ఎన్ని అద్భుతాలు బైబిల్లో పేర్కొనబడ్డాయి?

సువార్త వృత్తాంతాలు యేసు చేసిన 35 అద్భుతాలను పేర్కొంటున్నాయి. నివేదించబడని వాటితోపాటు, యేసు ఖచ్చితంగా ఎన్ని అద్భుతాలు చేశాడో వెల్లడించబడలేదు. (మత్తయి 14:14)​—⁠7/15, 5వ పేజీ.