కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిరుత్సాహాన్ని ఎలా ఎదిరించవచ్చు?

నిరుత్సాహాన్ని ఎలా ఎదిరించవచ్చు?

నిరుత్సాహాన్ని ఎలా ఎదిరించవచ్చు?

మీరు నిరుత్సాహపడుతున్నారా? అనిశ్చయత, అల్లర్లు ఉన్న ఈ కాలంలో చాలామంది నిరుత్సాహానికి గురవుతున్నారు. కొంతమంది తమకు ఉద్యోగం లేకపోవడం వల్ల నిరుత్సాహపడుతున్నారు. కొందరు ప్రమాదానంతర పరిణామాలను ఎదుర్కొంటున్నారు. మరి కొందరు కుటుంబ సమస్యలతో, తీవ్ర అనారోగ్యంతో, ఒంటరితనపు భావాలతో పోరాడుతున్నారు.

మీరు నిరుత్సాహపడితే సహాయం కోసం ఎక్కడ వెదకవచ్చు? ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది దేవుని వాక్యమైన బైబిలు చదవడం ద్వారా ఓదార్పు పొందారు. అపొస్తలుడైన పౌలు మాటలు వారికి ధైర్యాన్నిచ్చాయి, ఆయనిలా అన్నాడు: “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. . . . ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.” (2 కొరింథీయులు 1:​3, 4) దీన్నీ, బైబిలులోని ఇతర భాగాలనూ మీరు మీ బైబిలులో ఎందుకు చదవకూడదూ? అలా చదవడం ‘మీ హృదయమును ఆదరించి, మిమ్మల్ని స్థిరపరుస్తుంది.’​—⁠2 థెస్సలొనీకయులు 2:​16, 17.

నిరుత్సాహాన్ని ఎదుర్కోవడానికి కావలసిన సహాయం, యెహోవాను సేవిస్తున్న వారి సహవాసం ద్వారా కూడా లభిస్తుంది. సామెతలు 12:⁠25 ఇలా చెబుతోంది: “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును, దయగల మాట దాని సంతోషపెట్టును.” మనం క్రైస్తవ కూటాలకు హాజరైనప్పుడు, మనం ఆ “దయగల మాట” వింటాం, అది ‘ప్రాణమునకు మధురంగా ఎముకలకు ఆరోగ్యకరంగా’ ఉంటుంది. (సామెతలు 16:​24) అటువంటి సహవాసం మిమ్మల్ని బలపరిచేలా ఎంతటి ప్రభావం చూపిస్తుందో స్వయంగా చవిచూసేందుకు, యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో ఒక కూటానికి ఎందుకు హాజరవకూడదూ?

ప్రార్థనకున్న బలం ద్వారా కూడా మీరు ప్రయోజనం పొందవచ్చు. జీవితపు చింతలతో మీరు కృంగిపోయినట్లు భావిస్తే, మీ గుండె లోతుల్లోని భావాలను “ప్రార్థన ఆలకించు” వానితో పంచుకోండి. (కీర్తన 65:⁠2) మన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు, మనల్ని మనం అర్థం చేసుకున్న దానికంటె బాగా అర్థం చేసుకుంటాడు. ఆయన సహాయంపై మనం ఆధారపడవచ్చు. ఆయన వాక్యం మనకిలా వాగ్దానం చేస్తోంది: “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.” (కీర్తన 55:​22) అవును, “యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు.”​—⁠యెషయా 40:​31.

యెహోవా దేవుడు, మనం నిరుత్సాహాన్ని విజయవంతంగా ఎదుర్కొనేందుకు సహాయం చేయగల శక్తివంతమైన ఏర్పాట్లు చేశాడు. మీరు వాటిని ఉపయోగించుకుంటారా?