కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇంకా కావాలనే తాపత్రయం

ఇంకా కావాలనే తాపత్రయం

ఇంకా కావాలనే తాపత్రయం

“మనకు కావలసిన వాటితో సంతృప్తి పడకపోతే, ఇక చాలు అనిపించేది ఏదీ లేదు.”​⁠వరల్డ్‌వాచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక.

“మనకు ఏమి కావాలి? అన్నీ కావాలి. ఎప్పుడు కావాలి? ఇప్పటికిప్పుడు కావాలి.” ఈ నినాదం, 1960లలో కళాశాల విద్యార్థుల్లో ప్రసిద్ధిగాంచింది. నేడు సరిగ్గా అవే మాటలు వినబడకపోయినా, వాటిలోని ప్రధాన తలంపు మాత్రం అలాగే ఉంది. వాస్తవానికి ఇంకా కావాలి అనే తలంపు మన యుగం సంతరించుకున్న విశిష్ట లక్షణంలా కనిపిస్తోంది.

చాలామందికి ఆస్తి, సంపదలను సంపాదించుకోవడమే ప్రధాన లక్ష్యంగా మారింది. అమెరికా మాజీ అధ్యక్షుడైన జిమ్మీ కార్టర్‌ ఒకసారి ఇలా అన్నాడు: “మానవుడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడనే దాన్ని బట్టి కాకుండా, ఇప్పుడు అతని దగ్గర ఏమి ఉందనే దాన్ని బట్టే గుర్తించబడుతున్నాడు.” ఆస్తులకంటే విలువైనవి ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏమిటవి, అవి ఎలాంటి ప్రయోజనాన్ని చేకూరుస్తాయి?