మీరు చదువుతున్న దాన్ని ఊహించుకోగలరా?
మీరు చదువుతున్న దాన్ని ఊహించుకోగలరా?
ఏవైనా సంఘటనలు ఊహించుకోవాలంటే, చదువుతున్న స్థలాల గురించి తెలుసుకోవడం సహాయకరంగా ఉంటుందని మీరు అంగీకరిస్తారు. ఉదాహరణకు, బైబిలు పుస్తకమైన అపొస్తలుల కార్యములలో వివరించబడిన అపొస్తలుడైన పౌలు చేసిన మిషనరీ యాత్రల గురించి ఆలోచించండి. ఆయన తన మొదటి మిషనరీ యాత్రను అంతియొకయ (సిరియా) నుండి ప్రారంభించాడు, యేసు అనుచరులు మొట్ట మొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడింది ఇక్కడే. ఆయన ఇక్కడ నుండి సలమీ, అంతియొకయ (పిసిదియ), ఈకొనియ, లుస్త్ర, దెర్బే వంటి ప్రాంతాలకు ప్రయాణించాడు. అవి ఎక్కడ ఉండేవో మీరు ఊహించుకోగలరా?
మీ దగ్గర ఒక మ్యాపు ఉంటే తప్ప వాటిని మీరు ఊహించుకోలేక పోవచ్చు. ‘మంచి దేశమును చూడండి’ అనే 36 పేజీల కొత్త బ్రోషుర్‌లో అలాంటి మ్యాపు ఉంది. అమెరికాలోని మొంటానా నుండి ఒక పాఠకురాలు కృతజ్ఞతతో ఇలా వ్యాఖ్యానిస్తోంది: “పౌలు యాత్రలను నేను చూడగలుగుతున్నాను, సువార్తను వ్యాపింపజేయడానికి ఆయనా, ఇతర తొలి క్రైస్తవులూ ఎలాంటి ప్రయాణాలు చేశారో, ఎలా సేవ చేశారో ఊహించడానికి ప్రయత్నిస్తున్నాను. ఊహించడానికి దోహదపడే ఇంత అందమైన దృశ్య సాధనాన్ని అందించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.”
అయితే ఈ బ్రోషుర్‌లో పౌలు యాత్రకు సంబంధించిన మ్యాపు మాత్రమే కాక ఇంకా అనేక మ్యాపులు ఉన్నాయి. అవి బైబిలులో చెప్పిన దానిని ఊహించుకోవడానికి పాఠకునికి ఎంతో దోహదపడతాయి. మీకు ‘మంచి దేశమును చూడండి’ బ్రోషుర్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడున్న కూపన్ పూరించి, ఈ పత్రికలోని 2వ పేజీలో ఉన్న చిరునామాల్లో మీకు అనుకూలమైన దానికి పంపించవచ్చు.
□ ఎలాంటి నిర్బంధం లేకుండా, ‘మంచి దేశమును చూడండి’ బ్రోషుర్ గురించి మరింత సమాచారం పంపించగలరని కోరుతున్నాను.
□ దయచేసి ఉచిత గృహ బైబిలు అధ్యయనం గురించి నన్ను సంప్రదించండి.
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.