కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇవ్వడంనుండి వచ్చే ఆనందాన్ని మీరు చవిచూశారా?

ఇవ్వడంనుండి వచ్చే ఆనందాన్ని మీరు చవిచూశారా?

ఇవ్వడంనుండి వచ్చే ఆనందాన్ని మీరు చవిచూశారా?

ఆమె దాదాపు 50 సంవత్సరాలు చురుగ్గా క్రైస్తవ పరిచర్య చేసింది. వృద్ధాప్యం ఆమెను శారీరకంగా ఎంతో బలహీనపర్చినా ఆమె కొత్తగా నిర్మించబడిన రాజ్యమందిరాన్ని సందర్శించాలని నిర్ణయించుకుంది. ఒక క్రైస్తవ సహోదరుడి సహాయంతో ఆమె రాజ్యమందిరంలోకి ప్రవేశించి మెల్లిగా నడుచుకుంటూ నేరుగా చందా పెట్టె దగ్గరకు వెళ్ళింది. ఆమె కొత్త రాజ్యమందిరానికి విరాళంగా ఇవ్వడానికి దాచిన కొంత డబ్బును దానిలో వేసింది. ఆమె ఆ రాజ్యమందిర నిర్మాణ పనిలో చేయూతనివ్వలేకపోయినా, తాను కూడా సహాయం చేయాలని కోరుకుంది.

ఈ క్రైస్తవ స్త్రీ మీకు మరో నమ్మకమైన స్త్రీని గుర్తు చేయవచ్చు, ఆమె ఎవరో కాదు ఆలయ కానుకల పెట్టెలో రెండు నాణాలు వేసినప్పుడు యేసు గమనించిన “పేద విధవరాలు.” ఆమె పరిస్థితుల గురించి మనకు చెప్పబడలేదు, అయితే అప్పట్లో భర్తలేని స్త్రీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చేది. యేసు ఆమె దీనావస్థను పూర్తిగా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన హృదయం చలించిపోయింది. ఆమెను తన శిష్యులకు ఒక మాదిరిగా ఉంచుతూ యేసు, ఆమె ఇచ్చిన చిన్న కానుక ‘ఆమెకు కలిగినదంతయు, ఆమె జీవనమంతయు’ వేయడానికి సూచనగా ఉందని చెప్పాడు.​—⁠మార్కు 12:41-44.

ఎంతో అవసరంలో ఉన్న ఆ పేద విధవరాలు ఎందుకు అంత త్యాగం చేసింది? ఆమెకు యెహోవా దేవునిపట్ల ప్రగాఢమైన భక్తి ఉన్నందుకే అలా చేసిందని స్పష్టమవుతోంది. ఆయన ఆరాధనకు యెరూషలేములోని ఆలయం కేంద్రస్థానంగా ఉండేది. ఆమె చేయగలిగినదానికి పరిమితులు ఉన్నా ఆమె పరిశుద్ధ సేవకు మద్దతు ఇవ్వాలనుకుంది. తాను ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వడంవల్ల ఆమె నిజమైన సంతోషాన్ని అనుభవించి ఉండవచ్చు.

యెహోవా సేవకు మద్దతునివ్వడం

భౌతిక మద్దతు, డబ్బుపరమైన విరాళాలు ఇవ్వడం పరిశుద్ధ ఆరాధనలో ఎల్లప్పుడూ ఒక భాగంగా ఉంటుంది, అంతేకాక అది ఎల్లప్పుడూ గొప్ప సంతోషానికి మూలంగా ఉంటుంది. (1 దినవృత్తాంతములు 29:⁠9) ప్రాచీన ఇశ్రాయేలులో ఆలయాన్ని అలంకరించడానికే కాక యెహోవా ఆరాధనకు సంబంధించిన అన్ని విషయాలు క్రమంగా జరిగేలా చూడడానికి కూడా విరాళాలు ఉపయోగించబడేవి. ఆలయ సేవలను నిర్వహించే లేవీయులకు మద్దతునివ్వడానికి ఇశ్రాయేలీయులు తమ పంటలో పదవ వంతును ఇవ్వాలని ధర్మశాస్త్రం నిర్దేశించింది. అయితే లేవీయులు కూడా తమకు లభించిన వాటినుండి పదవ వంతును యెహోవాకు అర్పించాలి.​—⁠సంఖ్యాకాండము 18:21-29.

క్రైస్తవులు ధర్మశాస్త్ర నిబంధనకు సంబంధించిన నియమాల నుండి విడుదల చేయబడ్డారు, అయినా సరే దేవుని సేవకులు సత్యారాధనకు మద్దతు ఇవ్వడానికి విరాళాలు ఇవ్వాలనే సూత్రం ఇప్పుడు కూడా అన్వయిస్తుంది. (గలతీయులు 5:⁠1) అంతేకాక మొదటి శతాబ్దపు క్రైస్తవులు తమ సహోదరుల అవసరాలు తీర్చడానికి విరాళాలు ఇవ్వడాన్ని ఆధిక్యతగా భావించారు. (అపొస్తలుల కార్యములు 2:​45, 46) దేవుడు తమకు మంచివాటన్నింటిని ఉదారంగా దయచేసినట్లే తాము కూడా ఇతరులపట్ల ఉదారంగా ప్రవర్తించాలని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు గుర్తుచేశాడు. ఆయన ఇలా వ్రాశాడు: “ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్‌క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞాపించుము.” (1 తిమోతి 6:17-19; 2 కొరింథీయులు 9:​11) నిజానికి పౌలు తన స్వీయానుభవంనుండి యేసు మాటలను ధృవీకరించాడు: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.”​—⁠అపొస్తలుల కార్యములు 20:35.

నేడు క్రైస్తవులుగా ఇవ్వడం

నేడు యెహోవా సేవకులు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి అలాగే దేవుని పనికి మద్దతునివ్వడానికి తమ వస్తుసంపదలను ఉపయోగిస్తూనే ఉన్నారు. ఆర్థిక స్థోమత లేనివాళ్ళు కూడా తాము ఇవ్వగలిగినంత ఇస్తున్నారు. ఇలా విరాళంగా ఇవ్వబడిన డబ్బును శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించే విషయంలో యెహోవా తనను బాధ్యునిగా ఎంచుతాడని “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” భావిస్తున్నాడు. (మత్తయి 24:​45) బ్రాంచి కార్యాలయాల నిర్వహణకు, బైబిళ్ళనూ బైబిలు సాహిత్యాలనూ అనువదించి ముద్రించడానికి, పెద్ద క్రైస్తవ సమావేశాలను ఏర్పాటు చేయడానికి, ప్రయాణ పైవిచారణకర్తలకూ మిషనరీలకూ శిక్షణ ఇచ్చి పంపించడానికి, విపత్తులు సంభవించినప్పుడు సహాయం అందజేయడానికే కాక అవసరమైన ఇతర పనులెన్నింటికో ఆ విరాళాలు ఉపయోగించబడుతున్నాయి. మనం ఇప్పుడు ఒక ఉపయోగం గురించి అంటే ఆరాధనా స్థలాలను నిర్మించడంలో సహాయం చేయడం గురించి చూద్దాము.

యెహోవాసాక్షులు ఆధ్యాత్మిక బోధనుండి, ఆరోగ్యకరమైన సహవాసంనుండి ప్రయోజనం పొందడానికి వారంలో అనేకసార్లు తమ రాజ్యమందిరాల్లో కలుసుకుంటారు. అయితే చాలా దేశాల్లో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండడంవల్ల స్థానిక సాక్షులు మొదట కొంత సహాయం లభించకపోతే రాజ్యమందిరాల నిర్మాణానికయ్యే ఖర్చును భరించలేరు. కాబట్టి యెహోవాసాక్షులు పేద దేశాల్లో రాజ్యమందిరాలు నిర్మించడానికి సహాయం చేసేలా సంపన్న దేశాలనుండి వచ్చిన విరాళాలను ఉపయోగించడానికి 1999లో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా వేలాదిమంది స్వచ్ఛంద సేవకులు తమ సమయాన్ని, నైపుణ్యాలను ఉపయోగించి ఆ దేశాల్లోని సుదూర ప్రాంతాల్లో కూడా పని చేస్తున్నారు. నిర్మాణ పని జరిగేటప్పుడు స్థానిక సాక్షులు నిర్మాణ పనిని, భవనాలను కాపాడడానికి కావలసిన నైపుణ్యాలను నేర్చుకుంటారు. వాటికి అవసరమైన ఉపకరణాలను, పనిముట్లను కొనడానికి రాజ్యమందిర నిధి సహాయం చేస్తుంది. ఇప్పుడు అలా నిర్మించబడిన రాజ్యమందిరాలను ఉపయోగిస్తున్న సాక్షులు తమ తోటి విశ్వాసులు సమయాన్ని, డబ్బును విరాళంగా ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞులుగా ఉన్నారు. అంతేకాకుండా స్థానిక సాక్షులు కొత్త రాజ్యమందిరం మంచి స్థితిలో ఉండేలా కాపాడుకోవడానికి, నిర్మాణ ఖర్చులు భరించడానికి నెల నెలా విరాళాలు ఇవ్వడం ద్వారా మరిన్ని రాజ్యమందిరాలు నిర్మించబడేందుకు సహాయం చేస్తున్నారు.

రాజ్యమందిరాలు స్థానిక పద్ధతులు, వస్తువులు ఉపయోగించి నిర్మించబడుతున్నాయి. అలా నిర్మించబడిన భవనాలు ఆడంబరంగా లేకపోయినా ఆకర్షణీయంగా, ఉపయోగకరంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. 1999లో ఈ నిర్మాణ పని పరిమిత వనరులున్న 40 దేశాల్లో ప్రారంభించబడింది. ఆ దేశాలన్నింటికి మొత్తం 8,000 రాజ్యమందిరాలు అవసరమయ్యాయి. అప్పటినుండి నిర్మాణ పని పెరిగి ఇప్పుడు అలాంటి 116 దేశాలకు విస్తరించింది, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల సంఘాల్లో సగంకంటే ఎక్కువ సంఘాలు ఆ పని క్రింద ఉన్నాయి. గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ ఏర్పాటు క్రింద 9,000 కంటే ఎక్కువ రాజ్యమందిరాలు అంటే సగటున రోజుకు 5 కంటే ఎక్కువ రాజ్యమందిరాలు నిర్మించబడ్డాయి! అయినా కూడా ఈ 116 దేశాల్లో ఇంకా 14,500 కొత్త రాజ్యమందిరాలు నిర్మించబడాలి. యెహోవా ఆశీర్వాదంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాక్షుల సుముఖత, ఉదారతలవల్ల వాటిని నిర్మించడానికి సరిపడా వనరులు ఉంటాయని ఆశిస్తున్నాము.​—⁠కీర్తన 127:⁠1.

రాజ్యమందిరాలు పెరుగుదలను అధికం చేస్తాయి

ఈ అద్భుతమైన కృషి స్థానిక సాక్షులపై అలాగే రాజ్య ప్రకటనా పనిపై ఎలాంటి ప్రభావం చూపించింది? చాలా ప్రాంతాల్లో కొత్త రాజ్యమందిరం నిర్మించబడిన తర్వాత కూటాలకు హాజరయ్యే వారి సంఖ్య గమనార్హంగా పెరిగిపోయింది. దానికి ఒక ఉదాహరణ, బురుండినుండి వచ్చిన ఈ నివేదిక: “ఒక కొత్త రాజ్యమందిరం నిర్మాణం ముగిసిన వెంటనే అది నిండిపోతుంది. ఉదాహరణకు 100 మంది కూటాలకు హాజరయ్యే ఒక సంఘానికి కొత్త రాజ్యమందిరం నిర్మించబడింది. వాళ్ళ కొత్త రాజ్యమందిరంలో 150 మంది కూర్చోవచ్చు. అయితే దాని నిర్మాణం ముగిసే సరికి 250 మంది కూటాలకు హాజరవడం ప్రారంభించారు.”

ఇలాంటి పెరుగుదలకు కారణమేమిటి? ఒక కారణమేమిటంటే, కూటాలు జరుపుకోవడానికి సరైన స్థలం లేక చెట్టు క్రిందో లేక కొన్నిసార్లు పొలంలోనో కూటాలు జరుపుకునే రాజ్య ప్రచారకులను ప్రజలు సందేహిస్తారు. ఒక దేశంలో ఇలాంటి చిన్న చిన్న గుంపులు జాతి హింసలను చెలరేపారు కాబట్టి అన్ని మతసంబంధమైన కూటాలు ఒక ఆరాధనా స్థలంలో జరగాలనే చట్టం చేయబడింది.

సొంత రాజ్యమందిరాన్ని కలిగివుండడంవల్ల యెహోవాసాక్షులు తాము ఒక పాస్టరు శిష్యులము కాదు అని ఆ ప్రాంతంలోని వారికి చూపించడానికి వీలవుతుంది. జింబాబ్వేలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం ఇలా వ్రాసింది: “గతంలో ఈ ప్రాంతంలోని సహోదరులు ఇళ్ళలో సమకూడేవారు కాబట్టి స్థానిక ప్రజలు సంఘాన్ని కూటాలు జరిగే ఇంటి యజమాని పేరుతో గుర్తించేవారు. వారు సహోదరులను ఫలాని వ్యక్తి చర్చికి చెందినవారు అని సంబోధించేవారు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది ఎందుకంటే ప్రతి హాలుకి ‘యెహోవాసాక్షుల రాజ్యమందిరం’ అనే బోర్డు స్పష్టంగా కనిపిస్తుంది.”

సంతోషంగా ఇచ్చేవారు

“దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (2 కొరింథీయులు 9:⁠7) పెద్ద మొత్తంలో ఇవ్వబడే విరాళాలు సహాయకరంగానే ఉంటాయి. అయితే యెహోవాసాక్షుల పని కోసం ఇవ్వబడే విరాళాల్లో అధిక భాగం రాజ్యమందిరంలోని చందా పెట్టెలనుండే వస్తుంది. చిన్నవైనా, పెద్దవైనా అన్ని విరాళాలు ప్రాముఖ్యమైనవే, వేటినీ నిర్లక్ష్యంగా చూడకూడదు. పేద విధవరాలు రెండు చిన్న నాణాలు వేసినప్పుడు యేసు గమనించాడని గుర్తు తెచ్చుకోండి. దేవదూతలు, యెహోవా కూడా ఆమెను చూశారు. మనకు ఆ విధవరాలి పేరు కూడా తెలియదు కానీ యెహోవా ఆమె చేసిన నిస్వార్థమైన పని శాశ్వతంగా గుర్తుండిపోయేలా బైబిలులో నమోదు చేయబడేటట్లు చూశాడు.

మనమిచ్చే విరాళాలు రాజ్యమందిరాల నిర్మాణంతోపాటు, రాజ్యాభివృద్ధి సంబంధించిన ఆవశ్యకమైన అనేక పనులకు మద్దతునిస్తాయి. ఈ విధంగా సహకరించడం ద్వారా మనం సంతోషించడానికి, “అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా” ధనవంతులుగా ఉండడానికి సహాయం చేస్తుంది. (2 కొరింథీయులు 9:​12) బెనిన్‌లోని మన క్రైస్తవ సహోదరులు ఇలా నివేదించారు: “అంతర్జాతీయ సహోదరత్వంనుండి ఆర్థిక సహాయం పొందినందుకు ప్రతిరోజూ అనేక కృతజ్ఞతాస్తుతులు యెహోవాకు తెలియజేయబడుతున్నాయి.” అదే సమయంలో రాజ్యాభివృద్ధికి సంబంధించిన పనులకు ఆర్థిక మద్దతునిచ్చే వాళ్ళందరూ క్రైస్తవులుగా ఇవ్వడంనుండి వచ్చే ఆనందాన్ని చవిచూస్తారు!

[22, 23వ పేజీలోని బాక్సు/చిత్రం]

కొందరు ఇవ్వడానికి ఎన్నుకునే పద్ధతులు

ప్రపంచవ్యాప్త పనికి విరాళాలు

“ప్రపంచవ్యాప్త పని కోసం చందాలు​—⁠మత్తయి 24:14” అని వ్రాయబడివున్న చందా పెట్టెలలో వేయడానికి అనేకులు కొంత డబ్బును ప్రత్యేకంగా తీసిపెడతారు లేదా ఇంత ఇవ్వాలని నిర్ణయించుకుంటారు.

సంఘాలు ప్రతినెలా ఈ మొత్తాలను, తమ తమ దేశాల్లోని సేవను పర్యవేక్షిస్తున్న యెహోవాసాక్షుల కార్యాలయాలకు పంపిస్తాయి. స్వచ్ఛంద విరాళంగా ఇచ్చే డబ్బును ఈ కార్యాలయాలకు నేరుగా కూడా పంపించవచ్చు. బ్రాంచి కార్యాలయాల చిరునామాలు ఈ పత్రిక 2వ పేజీలో ఉన్నాయి. చెక్కులు “Watch Tower” పేర వ్రాయాలి. ఆభరణాలను ఇతర విలువైన వస్తువులను కూడా విరాళంగా ఇవ్వవచ్చు. అయితే వాటితోపాటు, వాటిని పూర్తిగా విరాళంగానే ఇస్తున్నామని తెలియజేసే క్లుప్తమైన లేఖను కూడా జతచేయాలి.

షరతుపూర్వక విరాళాల ట్రస్ట్‌ ఏర్పాటు

Watch Tower ప్రయోజనార్థం డబ్బును ఒక ట్రస్ట్‌లో ఉంచవచ్చు. అయితే దాత తన నిధులను తిరిగి ఇవ్వమని అడిగితే అవి తిరిగి ఇవ్వబడతాయి. మరింత సమాచారం కోసం దయచేసి స్థానిక బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

ధర్మదాన ప్రణాళిక

డబ్బును పూర్తిగా కానుకగా ఇవ్వడమే కాకుండా ప్రపంచవ్యాప్త రాజ్యసేవ ప్రయోజనార్థం విరాళాలు ఇవ్వడానికి ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే:

భీమా: జీవిత భీమా పాలసీకి లేదా రిటైర్‌మెంట్‌/పెన్షన్‌ పథకానికి లబ్దిదారుగా Watch Tower పేరును సూచించవచ్చు.

బ్యాంకు ఖాతాలు: స్థానిక బ్యాంకు నియమాల ప్రకారం బ్యాంకు ఖాతాలకు, డిపాజిట్ల సర్టిఫికెట్లకు లేదా వ్యక్తిగత రిటైర్మెంట్‌ ఖాతాలకు లబ్దిదారుగా Watch Towerని సూచించవచ్చు లేదా మరణానంతరం Watch Towerకి చెల్లించే ఏర్పాటును చేయవచ్చు.

షేర్లు, బాండ్లు: షేర్లను, బాండ్లను Watch Towerకి పూర్తిగా కానుకగా ఇవ్వవచ్చు.

స్థిరాస్థులు: అమ్మదగిన స్థలాలను పూర్తిగా కానుకగా ఇవ్వవచ్చు లేదా అవి నివాస స్థలాలైతే ఆమె/అతడు జీవించినంత కాలం ఆ స్థలంలోనే నివసించే ఏర్పాటుతో విరాళంగా ఇవ్వవచ్చు. ఇలాంటి వాటికి సంబంధించిన దస్తావేజులను వ్రాసే ముందు మీ దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

వార్షికభత్య విరాళం: వార్షికభత్య విరాళమనే ఏర్పాటులో ఒక వ్యక్తి డబ్బును లేదా డబ్బు హామీలను Watch Towerకి బదిలీ చేస్తాడు. ఆ తర్వాత ఆ దాత లేదా ఆ దాత నియమించిన వ్యక్తి జీవితాంతం ప్రతి సంవత్సరం నిర్దిష్టమైన వార్షికభత్యం పొందుతాడు. దాత ఏ సంవత్సరంలోనైతే వార్షికభత్య విరాళ ఏర్పాటు చేస్తాడో ఆ సంవత్సరం ఆయనకు ఆదాయపన్ను మినహాయింపు లభిస్తుంది.

వీలునామాలు, ట్రస్ట్‌లు: ఆస్తిని లేదా డబ్బును చట్టబద్ధంగా Watch Tower పేర వీలునామా వ్రాయవచ్చు, లేక ఒక ట్రస్ట్‌ అగ్రిమెంట్‌ లబ్దిదారుగా Watch Tower పేరు వ్రాయవచ్చు. కొన్ని దేశాల్లో, ఒక మతపరమైన సంస్థకు ప్రయోజనం చేకూర్చే ట్రస్ట్‌వల్ల పన్ను చెల్లింపు ప్రయోజనాలు కొన్ని పొందవచ్చు, అయితే ఇండియాలో మాత్రం ఆ అవకాశం లేదు.

“ధర్మదాన ప్రణాళిక” అనే పదబంధం సూచిస్తున్నట్లుగా, ఇలా విరాళాలు ఇవ్వడానికి దాత ముందుగా ప్రణాళిక వేసుకోవలసి ఉంటుంది. ప్రణాళిక వేసుకొని విరాళాలు ఇవ్వడానికి సంబంధించిన పద్ధతుల్లో ఏదొక దానిని ఉపయోగించి యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికి మద్దతునివ్వాలని కోరుకునేవారి సహాయార్థం ప్రపంచవ్యాప్త రాజ్య సేవ ప్రయోజనార్థం ధర్మదాన ప్రణాళిక అనే బ్రోషుర్‌ ఆంగ్లంలోను, స్పానిష్‌లోను రూపొందించబడింది. వ్యక్తులు ఇప్పుడు లేదా మరణానంతరం వీలునామా ద్వారా విరాళాలు ఇవ్వగల అనేక పద్ధతుల గురించి సమాచారం అందజేయడానికి ఆ బ్రోషుర్‌ వ్రాయబడింది. ఆ బ్రోషుర్‌ను చదివి, తమ స్వంత న్యాయ సలహాదారులను లేదా పన్ను సలహాదారులను సంప్రదించిన తర్వాత చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల పనికి మద్దతివ్వడంలో సహాయం చేయగలిగారు, అంతేకాకుండా అలా చేయడం ద్వారా పన్ను మినహాయింపులను అధికం చేసుకున్నారు.

మరింత సమాచారం కోసం మీరు క్రింద ఇవ్వబడిన చిరునామాకు లేదా మీ దేశంలోని సేవను పర్యవేక్షించే యెహోవాసాక్షుల కార్యాలయానికి ఉత్తరం వ్రాయవచ్చు లేదా ఫోన్‌ చేయవచ్చు.

Charitable Planning Office

Jehovah’s Witnesses,

Post Box 6440,

Yelahanka,

Bangalore 560 064,

Karnataka.

Telephone: (080) 28468072

[20, 21వ పేజీలోని చిత్రాలు]

యెహోవాసాక్షుల పాత, కొత్త ఆరాధనా స్థలాలు

జాంబియా

సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌