కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఎంతో మంచి” అనువాదం

“ఎంతో మంచి” అనువాదం

“ఎంతో మంచి” అనువాదం

ఒక అంచనా ప్రకారం 1952 నుండి 1990 మధ్య, క్రైస్తవ గ్రీకు లేఖనాలకు సంబంధించి దాదాపు 55 కొత్త ఆంగ్ల అనువాదాలు ప్రచురించబడ్డాయి. అనువాదకులకు స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి అన్ని అనువాదాలు ఒకే రకంగా ఉండవు. ఆ అనువాదాలు ఎంత ఆధారపడదగినవి అనే విషయాన్ని నిర్ణయించడానికి అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలోవున్న ఫ్లాగ్‌స్టాఫ్‌ అనే నగరంలోని ఉత్తర ఆరిజోనా విశ్వవిద్యాలయంలో మతపరమైన విద్యకు ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జేసన్‌ బిడూన్‌ ఎనిమిది ప్రముఖ అనువాదాలను పరిశీలించి అవి ఖచ్చితంగా ఉన్నాయో లేదోనని పోల్చి చూశారు. అలా పరిశీలించబడిన అనువాదాల్లో యెహోవాసాక్షులు ప్రచురించిన పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము (ఆంగ్లం) కూడా ఒకటి. దాని ఫలితం?

నూతనలోక అనువాదము ఉపయోగించిన కొన్ని పదాలతో ఆయన ఏకీభవించకపోయినా అది “ఎంతో మంచి” అనువాదమని, తాను పరిశీలించినవాటిలో మిగతా వాటికంటే “ఎంతో మెరుగైనదిగా” ఉండడమే కాక “మొదటినుండి చివరివరకూ చక్కగా” ఉందని చెప్పారు. మొత్తమ్మీద నూతనలోక అనువాదము “ప్రస్తుతం లభ్యమవుతున్న క్రొత్త నిబంధనకు సంబంధించిన ఆంగ్ల అనువాదాల్లో అత్యంత ఖచ్చితమైన వాటిలో ఒకటి” అని అది “పరిశీలించబడిన అనువాదాల్లో అత్యంత ఖచ్చితమైనది” అని బిడూన్‌ చెప్పారు.​—⁠ట్రూత్‌ ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌: ఆక్యూరసి అండ్‌ బైయస్‌ ఇన్‌ ఇంగ్లీష్‌ ట్రాన్స్‌లేషన్స్‌ ఆఫ్‌ ద న్యూ టెస్ట్‌మెంట్‌.

చాలామంది అనువాదకులు “బైబిలు చెప్పే విషయాలను, ఆధునిక పాఠకుల అవసరాలకు అనుగుణంగా భావానువాదం చేయడం లేదా వివరించి చెప్పడం” వంటివి చేసే ఒత్తిడికి గురవుతారని కూడా బిడూన్‌ వ్యాఖ్యానించారు. అయితే మరోవైపున నూతనలోక అనువాదము అందుకు భిన్నంగా ఉంది, ఎందుకంటే “క్రొత్త నిబంధనను వ్రాసినవారి మూలభాషా పదాలను అది అక్షరార్థంగా, జాగ్రత్తగా అనువదించినందుకు అది మరింత ఖచ్చితమైనది” అని బిడూన్‌ చెప్పారు.

నూతనలోక బైబిలు అనువాద కమిటీ తమ బైబిలు పరిచయవాక్కులో పేర్కొన్నట్లు పరిశుద్ధ లేఖనాలను తమ మూలభాషలనుండి ఆధునిక భాషలోకి అనువదించడం “చాలా బాధ్యతాయుతమైన పని.” ఆ కమిటీ ఇంకా ఇలా చెప్పింది: “దీనిని అనువదించిన అనువాదకులు పరిశుద్ధ లేఖనాల గ్రంథకర్త అయిన దేవునిపట్ల భయభక్తులు కలవారు, ఆయనను ప్రేమిస్తారు కాబట్టి ఆయన తలంపులను ఆయన మాటలను సాధ్యమైనంత ఖచ్చితంగా అనువదించడం చాలా గొప్ప ఆధిక్యతగా భావిస్తారు.”

పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము మొదట 1961లో ప్రచురించబడినప్పటి నుండి 32 భాషల్లో లభ్యమవుతోంది, అలాగే బ్రెయిలీలో రెండు సంపుటాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా నూతనలోక అనువాదములోని క్రైస్తవ గ్రీకు లేఖనాలు లేదా “క్రొత్త నిబంధన” మరో 18 భాషల్లో లభ్యమవుతోంది, బ్రెయిలీలో ఒక సంపుటి ఉంది. “ఎంతో మంచి” అనువాదం అనిపించుకున్న ఈ ఆధునిక అనువాదాన్ని ఉపయోగించి దేవుని వాక్యం చదవమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.