కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏమి చదవాలి?-సొలొమోను జ్ఞానయుక్తమైన సలహా

ఏమి చదవాలి?-సొలొమోను జ్ఞానయుక్తమైన సలహా

ఏమి చదవాలి?-సొలొమోను జ్ఞానయుక్తమైన సలహా

“పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు; విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము.” (ప్రసంగి 12:​12) ఆ మాటలను దాదాపు 3,000 సంవత్సరాల క్రితం వ్రాసినప్పుడు ఇశ్రాయేలుకు చెందిన జ్ఞానియైన సొలొమోను రాజు పుస్తకాలు చదవడాన్ని నిరుత్సాహపరచడం లేదు. బదులుగా ఆయన మంచి పుస్తకాలను ఎంపిక చేసుకోవలసిన అవసరత గురించి చెబుతున్నాడు. ప్రపంచంలోని ముద్రణా యంత్రాలు ప్రతి సంవత్సరం కోట్లాది పేజీల సమాచారాన్ని ముద్రిస్తున్న ఈ కాలంలో ఆ జ్ఞాపిక ఎంత సముచితమైనదో!

సొలొమోను ప్రస్తావించిన ‘అనేక పుస్తకములు’ ప్రోత్సాహకరమైనవి లేదా ఉల్లాసకరమైనవి కాదని స్పష్టమవుతోంది. కాబట్టి వాటిని అభ్యాసము చేయడం అనుకూలమైన శాశ్వతమైన ప్రయోజనాలను చేకూర్చే బదులు ‘దేహమునకు ఆయాసకరంగా’ ఉంటుందని ఆయన తర్కించాడు.

అయితే పాఠకులకు ప్రయోజనకరంగా ఉండేలా ఆరోగ్యదాయకమైన, ఆధారపడదగిన మార్గనిర్దేశం ఇచ్చే పుస్తకాలు లేవు అని సొలొమోను చెబుతున్నాడా? లేదు, ఎందుకంటే ఆయన ఇలా కూడా వ్రాశాడు: “జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలలవలెను, చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులవలెను ఉన్నవి; అవి ఒక్క కాపరివలన అంగీకరింపబడినట్టున్నవి.” (ప్రసంగి 12:​11) అవును “ములుకోలలవలె” సహాయకరమైన పురికొల్పును ఇవ్వగల మాటలు కూడా వ్రాయబడి ఉన్నాయి. అవి ఒక వ్యక్తిని సరైన మార్గంలో నడవడానికి ప్రేరేపించగలవు. అంతేకాకుండా “బిగగొట్టబడిన మేకులవలె” అవి ఒకరి తీర్మానాన్ని బలపర్చడానికి, స్థిరమైన ప్రభావం చూపడానికి సహాయం చేయగలవు.

అలాంటి జ్ఞానయుక్తమైన మాటలను మనం ఎక్కడ కనుగొనవచ్చు? సొలొమోను ప్రకారం అత్యంత ఉత్తమమైన మాటలు మన కాపరి అయిన యెహోవానుండి వచ్చే మాటలు. (కీర్తన 23:⁠1) కాబట్టి అలాంటి జ్ఞానయుక్తమైన మాటలను కనుగొనడానికి ఒక వ్యక్తి దేవునిచే ప్రేరేపించబడిన బైబిలును చదవడమే ఉత్తమమైన మార్గం. అలాంటి ప్రేరేపిత మాటలను క్రమంగా చదివినప్పుడు ఒక వ్యక్తి ‘సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండడానికి’ సహాయం లభిస్తుంది.​—⁠2 తిమోతి 3:16, 17.