కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మీ విజయరహస్యం ఏమిటి?”

“మీ విజయరహస్యం ఏమిటి?”

“మీ విజయరహస్యం ఏమిటి?”

ఒక ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌ దగ్గర, పెద్దవయస్కుడైన ఒక అపరిచితవ్యక్తి ముగ్గురు పిల్లల తల్లియైన మ్యూరియల్‌ను పై ప్రశ్న అడిగినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. మ్యూరియల్‌ తన పిల్లలను డాక్టరు దగ్గరికి తీసుకువెళ్ళడంతో ఆమెకు అక్కడే చాలా సమయం పట్టింది. దానితో తమ క్రైస్తవ కూటాలకు వెళ్ళే ముందు ఇంటికి వెళ్ళి భోజనం చేసేంత సమయం లేకుండా పోయింది. అందుకే పిల్లలు ఏదోకటి తినేందుకు వీలుగా ఆమె వాళ్ళను దగ్గర్లోని రెస్టారెంట్‌కు తీసుకువెళ్ళింది.

వాళ్ళు భోజనం ముగిస్తుండగా ఒక వ్యక్తి మ్యూరియల్‌ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “మీరు ఇక్కడికి వచ్చినప్పటినుండి నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. సాధారణంగా నేను చూసే పిల్లలకు, మీ పిల్లలకు మధ్య చాలా వ్యత్యాసమున్నట్లు నేను గమనించాను. పిల్లలు సాధారణంగా బల్లలను, కుర్చీలను ఎలా ఉపయోగిస్తారో మీరు చూడాలి. కాళ్ళు పైకెత్తి బల్లమీద పెడతారు. కుర్చీలను అటూ ఇటూ నెట్టేస్తారు. కానీ మీ పిల్లలు నెమ్మదిగా ఉన్నారు, మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. ఇంతకీ మీ విజయరహస్యం ఏమిటి?”

మ్యూరియల్‌ ఇలా జవాబిచ్చింది: “నేను, నా భర్త మా పిల్లలతో క్రమంగా బైబిలు అధ్యయనం చేస్తూ, మేము నేర్చుకున్నవాటిని మా జీవితాల్లో అన్వయించుకొనేందుకు ప్రయత్నిస్తాం. మేము యెహోవాసాక్షులం.” అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు: “నేను యూదుణ్ణి, హోలోకాస్ట్‌ (నాజీల మారణహోమం) నుండి సజీవంగా బయటపడ్డాను. జర్మనీలో యెహోవాసాక్షులు హింసించబడుతున్నప్పుడు వారిని చూడడం నాకు గుర్తుంది. హింసించబడుతున్నప్పుడు కూడా వారు ఇతరులకు భిన్నంగా ఉండేవారు. మీ పిల్లల ప్రవర్తన నన్ను నిజంగా ఆకట్టుకుంది. మీ మతాన్ని నేను పరిశోధించాలి.”

బైబిలు, పిల్లలను పెంచడంలో సహాయం చేసే ఒక మంచి మార్గదర్శక పుస్తకం. లేఖనాల్లోవున్న నడిపింపునుండి ప్రయోజనం పొందడానికి ఇతరులకు సహాయం చేసేందుకు యెహోవాసాక్షులు ఎంతో ఆసక్తితో ఉన్నారు. ఈ క్రింది ప్రతిపాదనకు ప్రతిస్పందించమని మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.