కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మెలకువగా ఉండండి’

‘మెలకువగా ఉండండి’

‘మెలకువగా ఉండండి’

ప్రాచీన కాలాల్లో నగర ద్వారాల వద్ద, ఆలయ ద్వారాల వద్ద, కొన్నిసార్లు ఇంటి ద్వారాల వద్ద ద్వారపాలకులు నియమించబడేవారు. వారు రాత్రిపూట ద్వారాలు మూసివుండేలా చూడడమే కాక, కావలివాళ్ళలా కూడా పనిచేసేవారు. అది చాలా బాధ్యతాయుతమైన పని. ఎందుకంటే రానున్న ప్రమాదం గురించి వారు ప్రజలను హెచ్చరించడంపైనే నగర భద్రత ఆధారపడి ఉండేది.

యేసుక్రీస్తుకు ద్వారపాలకుల పాత్ర గురించి తెలుసు. ఒక సందర్భంలో ఆయన తన శిష్యులను ద్వారపాలకులతో పోల్చి, యూదా విధానాంతానికి సంబంధించి మెలకువగా ఉండమని వారిని ప్రోత్సహించాడు. వారికి ఆయనిలా చెప్పాడు: “జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు . . . మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి, యిల్లు విడిచి దేశాంతరము పోయినట్టే (ఆ కాలము ఉండును.) ఇంటి యజమానుడు . . . యెప్పుడు వచ్చునో మీకు తెలియదు . . . గనుక మీరు మెలకువగా నుండుడి.”​—⁠మార్కు 13:33-36.

ఆ ప్రకారమే కావలికోట అనే ఈ పత్రిక ఇప్పటికి 125 సంవత్సరాలనుండి ‘మెలకువగా ఉండండి’ అని ప్రోత్సహిస్తూ యేసు చెప్పిన మాటలను అందరికీ తెలియజేస్తోంది. ఎలా? ఈ పత్రిక రెండవ పేజీలో నివేదించబడినట్లు, “ప్రపంచ సంఘటనలు బైబిలు ప్రవచనాలను నెరవేరుస్తుండగా ఇది వాటిని విశ్లేషిస్తుంది. తోటి మానవులను అణచివేసే వారిని దేవుని రాజ్యం త్వరలోనే నాశనం చేసి, ఈ భూమిని పరదైసుగా మారుస్తుందనే సువార్తతో ప్రజలందరికీ ఓదార్పునిస్తుంది.” ప్రపంచవ్యాప్తంగా 150 భాషల్లో 2,60,00,000 కంటే ఎక్కువ ప్రతులు పంచిపెట్టబడుతున్న కావలికోట ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా పంచిపెట్టబడుతున్న మతసంబంధ పత్రిక. ఈ పత్రికను ఉపయోగించి యెహోవాసాక్షులు ప్రాచీన ద్వారపాలకుల్లాగే అన్ని ప్రాంతాల్లోవున్న ప్రజలను ఆధ్యాత్మికంగా ‘మెలకువగా ఉండమని’ ఉద్బోధిస్తున్నారు, ఎందుకంటే యజమానుడైన యేసుక్రీస్తు త్వరలోనే తిరిగి వచ్చి ఈ విధానానికి తీర్పు తీర్చబోతున్నాడు.​—⁠మార్కు 13:26, 37.