కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ లోకానికి ఆహారం ఎవరు పెడతారు?

ఈ లోకానికి ఆహారం ఎవరు పెడతారు?

ఈ లోకానికి ఆహారం ఎవరు పెడతారు?

ఆకలి మంటలను చల్లార్చడం కోసం పనిచేసే ప్రపంచ ఆహార కార్యక్రమం అనే ఐక్యరాజ్య సమితి సంస్థ అంచనాల ప్రకారం 80 కోట్లమంది ఆహారం లేక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, వారిలో చాలామంది పిల్లలే. అభివృద్ధి చెందిన దేశాల్లో చాలామట్టుకు ఈ పరిస్థితిని మెరుగుపర్చడానికి ఉపయోగించగల వనరులను, ప్రయత్నాలను ఉగ్రవాదంవంటి ఇతర సమస్యలు స్వాహా చేశాయని ఆ సంస్థ ఇటీవలే వెల్లడి చేసింది. అంటువ్యాధులు వ్యాపించడంవల్ల ఆ సమస్య మరింత జటిలమైంది. ఆ సంస్థకు చెందిన గ్లోబల్‌ స్కూల్‌ ఫీడింగ్‌ రిపోర్ట్‌, ఎయిడ్స్‌ ప్రబలంగా ఉన్న ఆఫ్రికా దేశాల గురించి ఇలా చెప్పింది: “ఒక తరానికి చెందిన తల్లిదండ్రులందరూ తుడిచిపెట్టబడుతున్నారు. అనాథలుగా మిగిలే వారి పిల్లలు తమను తాము పోషించుకోవలసి వస్తుంది, వారిలో చాలామందికి ఒక తరంవారి నుండి మరో తరంవారికి సంక్రమించే, వ్యవసాయం గురించిన ప్రాథమిక జ్ఞానం గానీ ప్రతిదిన జీవితానికి అవసరమయ్యే నైపుణ్యాలు గానీ ఉండవు.”

ప్రపంచ ఆహార కార్యక్రమం పాఠశాలల్లో కనీసం ఒకపూట భోజనాన్ని అందించాలనే లక్ష్యంతో పని చేస్తోంది. అయితే అది కేవలం ఆకలిని తగ్గించాలనే ఉద్దేశంతోనే కాక యౌవనస్థులకు హెచ్‌.ఐ.వి/ఎయిడ్స్‌ను నిరోధించడానికి రూపొందించిన ఇతర కార్యక్రమాల ద్వారా క్రమమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో కూడా పని చేస్తోంది.

ఆ కార్యక్రమం ప్రారంభించబడిన ప్రాంతాల్లోని పిల్లలకు పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన శిక్షణ, ఇతర సహాయాలు లభించాయి. ప్రజలు తమ ప్రవర్తనను మార్చుకున్నప్పుడు హెచ్‌.ఐ.వి/ఎయిడ్స్‌ సంక్రమించే నిష్పత్తులు తగ్గిపోయాయని కూడా గమనించబడింది.

అయితే విచారకరమైన విషయమేమిటంటే, మానవ ప్రయత్నాలు తరచూ పాక్షికమైనవేగానీ నిశ్చయాత్మకమైనవి కావు. అయితే బైబిలు ఆకలి సమస్య శాశ్వత పరిష్కారానికి సంబంధించి ఒక ఓదార్పుకరమైన వాగ్దానం చేస్తోంది. “దేశములో . . . సస్య సమృద్ధి కలుగును” అని కీర్తన 72:⁠16 చెబుతోంది. దేవుని రాజ్యంలో ప్రజలు యెహోవా దేవునితో ఇలా చెప్పగలుగుతారు: “నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు . . . నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు.”​—⁠కీర్తన 65:⁠9.

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

WFP/Y. Yuge