కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బరల్‌బగ్‌ బైబిల్‌

బరల్‌బగ్‌ బైబిల్‌

బరల్‌బగ్‌ బైబిల్‌

జర్మన్‌ లూథరన్‌ చర్చిలో 17, 18 శతాబ్దాలలో పయటిజమ్‌ అనే మత ఉద్యమం వృద్ధి చెందింది. ఆ ఉద్యమాన్ని అనుసరించిన కొందరు వారి విశ్వాసం కారణంగా ఎగతాళికి గురయ్యారు, చివరికి హింసలపాలయ్యారు. పయిటిజమ్‌ను అనుసరించిన చాలామంది విద్వాంసులు, ఫ్రాంక్‌ఫర్ట్‌ ఎమ్‌ మేయిన్‌కు ఉత్తరాన, దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరల్‌బగ్‌లో ఆశ్రయం పొందారు. మతాన్ని ఎంతో గౌరవించే స్థానిక ప్రముఖుడైన కౌంట్‌ క్యాసిమిర్‌ వాన్‌ విట్జెన్‌స్టైన్‌, వారు ఆశ్రయం పొందడానికి అనుమతించాడు. ఈ ప్రచారకులు, విద్వాంసులు బరల్‌బగ్‌లో ఉండడంవల్ల, నేడు బరల్‌బగ్‌ అనే పేరుతో పిలువబడుతున్న ఒక కొత్త బైబిలు అనువాదానికి మార్గం ఏర్పడింది. దీని అనువాదం ఎలా జరిగింది?

ఆశ్రయం కోరినవారిలో యోహాన్‌ హాగ్‌ ఒకరు, ఆయన స్థానిక వేదాంతుల దురభిమానం కారణంగా స్ట్రాస్‌బర్గ్‌లో ఉన్న తన ఇంటిని విడిచిపెట్టాల్సి వచ్చింది. హాగ్‌ ప్రావీణ్యతగల విద్వాంసుడు, నైపుణ్యంగల భాషా శాస్త్రవేత్త. ఆయన “స్వచ్ఛమైన బైబిలు అనువాదాన్ని అందించాలని, లూథర్‌ అనువాదాన్ని సరి చేయాలని, దేవుని వాక్య ఉద్దేశానికి, స్ఫూర్తికి అనుగుణంగా ఖచ్చితమైన అర్థాన్నిచ్చే అనువాదాన్ని అందించాలన్న” తన ప్రగాఢమైన కోరికను సహవిద్వాంసులకు తెలిపాడు. [ద హిస్టరీ ఆఫ్‌ ద బరల్‌బగ్‌ బైబిలు] విపులమైన వివరాలతో, వ్యాఖ్యానాలతో, సామాన్య ప్రజలు అర్థం చేసుకొనేలా బైబిలును తయారు చేయడమే ఆ అనువాద లక్ష్యం. హాగ్‌ ఇతర ఐరోపా దేశాలలోని విద్వాంసుల సహకారంతో, 20 సంవత్సరాలు ఆ ప్రణాళికపై పని చేశారు. 1726 నుండి బరల్‌బగ్‌ బైబిల్‌ను ప్రచురించడం ప్రారంభించారు. దానిలోని విస్తృత వ్యాఖ్యానాల కారణంగా దానిని ఎనిమిది సంపుటలుగా ముద్రించాల్సి వచ్చింది.

బరల్‌బగ్‌ బైబిలులో ఖచ్చితంగా కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఆ బైబిలులో నిర్గమకాండము 6:2, 3 ఇలా ఉంది: “ఆ తర్వాత దేవుడు మోషేతో ఇట్లనెను​—⁠నేనే ప్రభువును; నేను సర్వసమృద్ధిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు.” దానిలో ఒక వ్యాఖ్యానం ఇలా ఉంది: “యెహోవా అనే పేరు . . . , ప్రత్యేకించబడిన పేరు/లేదా/ప్రకటించుకున్న పేరు.” ఆ బైబిలులో, దేవుని వ్యక్తిగత నామమైన యెహోవా అనేది, నిర్గమకాండము 3:​15, నిర్గమకాండము 34:6 వచనాలకు సంబంధించిన వ్యాఖ్యానాలలో కూడా కనిపిస్తుంది.

ఆ విధంగా, ముఖ్య గ్రంథ పాఠంలోనైనా, అధస్సూచిలోనైనా లేక వ్యాఖ్యానాలలోనైనా యెహోవా నామాన్ని ఉపయోగించిన జర్మన్‌ బైబిళ్ళ పరంపరలో ఇదీ ఒకటి అయింది. దేవుని నామానికి తగిన గౌరవం ఇస్తున్న మరింత ఆధునిక అనువాదాలలో యెహోవాసాక్షులు ప్రచురించిన పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము (ఆంగ్లం) ఒకటి.