కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జ్ఞాపకం ఉంచుకోవలసిన సంఘటన

జ్ఞాపకం ఉంచుకోవలసిన సంఘటన

జ్ఞాపకం ఉంచుకోవలసిన సంఘటన

మనం ఏ సంఘటన గురించి మాట్లాడుతున్నాము? దాదాపు 2,000 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక వ్యక్తి మరణం గురించి మాట్లాడుతున్నాము. “నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను . . . ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను” అని ఆయన అన్నాడు. (యోహాను 10:17, 18) ఆయన యేసుక్రీస్తు.

యేసు తన బలిపూర్వక మరణాన్ని జ్ఞాపకార్థంగా ఆచరించమని తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. ఆ సందర్భము “ప్రభువు రాత్రి భోజనము” అని కూడా పిలువబడుతుంది. (1 కొరింథీయులు 11:20) ఇతరులు తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి యేసు ప్రారంభించిన జ్ఞాపకార్థ ఆచరణను యెహోవాసాక్షులు, వారి స్నేహితులు 2005వ సంవత్సరంలో మార్చి 24వ తేదీ గురువారం సూర్యాస్తమయం తర్వాత జరుపుకుంటారు.

ఆ ఆచరణలో ఉపయోగించబడే పులియని రొట్టె, ఎర్రని ద్రాక్షారసం భావమేమిటో వివరించే బైబిలు ఆధారిత ప్రసంగం ఇవ్వబడుతుంది. (మత్తయి 26:26-28) ఆ ప్రసంగం ఈ ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇస్తుంది: క్రైస్తవులు ఈ ఆచరణను ఎంత తరచుగా ఆచరించాలి? జ్ఞాపకార్థ చిహ్నాలైన రొట్టెను, ద్రాక్షారసాన్ని పుచ్చుకునే అర్హత ఎవరికి ఉంది? యేసు మరణంనుండి ఎవరు ప్రయోజనం పొందుతారు? అందరూ యేసు జీవన్మరణాల సంకల్పాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ప్రాముఖ్యమైన ఆచరణ సహాయం చేస్తుంది.

యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు మీరు సాదరంగా ఆహ్వానించబడుతున్నారు. ఈ ఆచరణ జరిగే స్థలం, సమయం గురించి ఖచ్చితమైన వివరాల కోసం మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులను కలవండి.