కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘పద్మరాగమును పోలినవాడు’

‘పద్మరాగమును పోలినవాడు’

‘పద్మరాగమును పోలినవాడు’

అపొస్తలుడైన యోహానుకు దర్శనంలో, పరలోకంలో ఉన్న మహిమాన్విత సింహాసనము కనిపించింది. సింహాసనాసీనుడైన వ్యక్తి ‘సూర్యకాంత’ మణిలా కనిపించాడు. ఆయన ‘పద్మరాగమును’ పోలి ఉన్నట్లు కూడా కనిపించాడు. (ప్రకటన 4:2, 3) ఇవి ఎలాంటి మణులు?

ఇవి కేవలం ఉపరితలంనుండి ప్రకాశించే అపారదర్శకమైన రాళ్ళు కావు. ప్రాచీన కాలాల్లో, “సూర్యకాంతము” అని అనువదించబడిన గ్రీకుపదం వేర్వేరు రంగుల రాళ్ళను సూచించడానికి, పారదర్శకమైన విలువైన రాళ్ళను సూచించడానికి ఉపయోగించబడేది. ప్రకటన 4:3లో ప్రస్తావించబడిన “సూర్యకాంత” మణి “నేడు మనకు లభించే చౌకబారు ఆధునిక సూర్యకాంత మణి మాత్రం కాదు” అని ఏ. టి. రాబర్ట్‌సన్‌ వర్డ్‌ పిక్చర్స్‌ ఇన్‌ ద న్యూ టెస్టమెంట్‌ అనే పుస్తకంలో నివేదించాడు. అంతేకాకుండా, ప్రకటన పుస్తకంలో ఆ తర్వాత యోహాను పరలోకంలోని యెరూషలేము పట్టణమును ఇలా వర్ణించాడు: “దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్యరత్నమును పోలియున్నది.” (ప్రకటన 21:​10, 11) యోహాను ప్రస్తావించిన మణులు కాంతిని ప్రతిఫలించే పారదర్శకమైన రాళ్ళు అయ్యుండవచ్చు.

యోహాను దర్శనంలో సింహాసనాసీనుడై ఉన్నట్లు కనిపించినది ఈ విశ్వంలోనే అత్యంత మహిమాన్వితుడైన యెహోవా దేవుడు. ఆయన అత్యంత పవిత్రుడు, అత్యంత పరిశుద్ధుడు. దానికి అనుగుణంగానే అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.” (1 యోహాను 1:5) కాబట్టి యోహాను తన తోటి విశ్వాసులను, ‘యెహోవా పవిత్రుడై ఉన్నట్టుగా మిమ్మును మీరు పవిత్రులుగా చేసుకొమ్మని’ ప్రోత్సహించాడు.​—⁠1 యోహాను 3:⁠3.

దేవుడు మనల్ని పవిత్రులుగా దృష్టించాలంటే మనమేమి చేయాలి? మన పాపాలు క్షమించబడడానికి క్రీస్తు చిందించిన రక్తంపై విశ్వాసముంచడం అత్యావశ్యకం. అంతేకాకుండా, మనం క్రమంగా బైబిలును అధ్యయనం చేయడం ద్వారా, దాని బోధలకు అనుగుణంగా జీవించడం ద్వారా ‘వెలుగులో నడుస్తూ’ ఉండాలి.​—⁠1 యోహాను 1:⁠7.