కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు ప్రామాణికత్వాన్ని రుజువు చేసే “పిమ్‌”

బైబిలు ప్రామాణికత్వాన్ని రుజువు చేసే “పిమ్‌”

బైబిలు ప్రామాణికత్వాన్ని రుజువు చేసే “పిమ్‌”

ఆధునిక బైబిళ్ళలో పిమ్‌ అనే పదం ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది. సౌలు రాజు పరిపాలనా కాలంలో, ఇశ్రాయేలీయులు తమ ఇనుప పనిముట్లను పదును చేయించుకోవడానికి ఫిలిష్తీయుల కమ్మరుల దగ్గరకు వెళ్ళవలసి వచ్చేది. ‘నక్కులను, పారలను, మూడు ముళ్ళుగల కొంకులను, గొడ్డళ్ళను పదును పెట్టడానికి, మునుకోల కర్రలను సరి చేయడానికి వారు ఒక పిమ్‌ను మూల్యంగా చెల్లించేవారు’ అని బైబిలు చెబుతోంది.​—⁠1 సమూయేలు 13:​21, NW.

ఈ పిమ్‌ అంటే ఏమిటి? సా.శ. 1907లో ప్రాచీన పట్టణమైన గెజెరువద్ద జరిగిన త్రవ్వకాల్లో మొదటిసారిగా పిమ్‌ తూకపు రాయి కనుగొనబడేవరకూ ఆ ప్రశ్నకు సమాధానం రహస్యంగానే ఉండిపోయింది. పూర్వ కాలానికి చెందిన బైబిలు అనువాదకులకు “పిమ్‌” అనే పదాన్ని అనువదించడం చాలా కష్టమయ్యింది. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథము 1 సమూయేలు 13:21వ వచనాన్ని ఇలా అనువదించింది: “అయితే నక్కులకును పారలకును మూడు ముండ్లుగల కొంకులకును గొడ్డండ్రకును మునుకోల కఱ్ఱలు సరిచేయుటకును ఆకు రాళ్లుమాత్రము వారియొద్ద నుండెను.”

పిమ్‌ అనేది దాదాపు 7.82 గ్రాములు, లేదా హీబ్రూ తూకపు ప్రమాణమైన షెకెలులో దాదాపు మూడవ వంతు బరువుండే తూకపు రాయి అని నేటి విద్వాంసులకు తెలుసు. ఇశ్రాయేలీయుల పనిముట్లను పదును పెట్టడానికి ఫిలిష్తీయులు పిమ్‌ బరువుకు సరితూగే వెండిని తీసుకొనేవారు. సా.శ.పూ. 607లో యూదా రాజ్యమూ దాని రాజధానియైన యెరూషలేమూ నాశనం చేయబడినప్పుడు, షెకెలుల ప్రకారం తూచే పద్ధతి మరుగున పడిపోయింది. మరి పిమ్‌ తూకపు రాయి హీబ్రూ మూలపాఠపు ప్రామాణికత్వాన్ని ఎలా రుజువు చేస్తుంది?

కొంతమంది విద్వాంసులు, మొదటి సమూయేలు పుస్తకంతోపాటు హీబ్రూ లేఖనాలు హెలెనిస్టిక్‌-రోమన్‌ శకానికి, అంటే సా.శ.పూ. రెండవ శతాబ్దం నుండి మొదటి శతాబ్దపు మధ్య కాలానికి చెందినవని వాదిస్తారు. కాబట్టి “అవి . . . ‘ప్రామాణికమైనవి కావు,’ అవి ‘బైబిలు సంబంధిత’ లేదా ‘ప్రాచీన ఇశ్రాయేలు’ గురించి నిజమైన చారిత్రక సమాచారాన్ని అందజేయడానికి పనికి రావు. ‘బైబిలు సంబంధిత’ లేదా ‘ప్రాచీన ఇశ్రాయేలు’ అనేవి కేవలం ఆధునిక యూదులు, క్రైస్తవులు కల్పించి వ్రాసినవి మాత్రమే” అని వాదించబడుతోంది.

అయితే 1 సమూయేలు 13:21లో ప్రస్తావించబడిన పిమ్‌ గురించి మధ్య ప్రాచ్య పురావస్తుశాస్త్ర మరియు మానవశాస్త్ర పండితుడైన విలియమ్‌ జి. డివర్‌ ఇలా అన్నారు: “ఈ తూకపు రాళ్ళ ఉపయోగం అంతమై అవి మరువబడిన అనేక శతాబ్దాల తర్వాత హెలెనిస్టిక్‌-రోమన్‌ కాలంలో జీవించిన రచయితలు [ఆ పదాన్ని] ‘కల్పించారు’ అని మనం చెప్పలేము. నిజానికి సా.శ. 20వ శతాబ్దపు తొలిభాగంలో హీబ్రూలో పిమ్‌ అని వ్రాసివున్న మొట్టమొదటి పురావస్తు నమూనాలు కనుగొనబడకముందు . . . ఈ లేఖనం అర్థం చేసుకోబడలేదు.” ఆ పండితుడు ఇంకా ఇలా చెప్పారు: “బైబిలు కథలు హెలెనిస్టిక్‌-రోమన్‌ శకంలో ‘కల్పించి వ్రాసినవే’ అయితే ఈ కథ హీబ్రూ బైబిలులో ఎందుకు ఉంది? ఏదేమైనా పిమ్‌ కేవలం ‘ఒక చిన్న వివరము మాత్రమే’ కదా అని కొందరు దానిని కొట్టి పారేయవచ్చు. అది నిజమే; కానీ ‘చరిత్ర చిన్న వివరాలతోనే రూపొందించబడుతుంది’ అనే సంగతి అందరికి తెలిసిందే.”

[29వ పేజీలోని చిత్రం]

పిమ్‌ తూకపు రాయి షెకెలులో మూడవ వంతు ఉండేది