కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యాన్ని ప్రేమించిన వినయస్థుడైన ఆఫ్రికా దేశస్థుడు

దేవుని వాక్యాన్ని ప్రేమించిన వినయస్థుడైన ఆఫ్రికా దేశస్థుడు

దేవుని వాక్యాన్ని ప్రేమించిన వినయస్థుడైన ఆఫ్రికా దేశస్థుడు

ఆఫ్రికాను సందర్శించేవారు, స్థానిక ప్రజలతో బైబిలు విషయాల గురించి మాట్లాడడం ఎంత సులభమో చూసి ఆశ్చర్యపోతారు. “దేవుని రాజ్యం అంటే ఏమిటి?” లేదా “ఆహార కొరత, వ్యాధులు, యుద్ధాలు, నేరాలు వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా?” వంటి ప్రశ్నలు ఎంతో సులభంగా వారి ఆసక్తిని చూరగొంటాయి. బైబిలు నుండి తమకు జవాబులు చూపిస్తున్నది ఒక అపరిచితుడే అయినా చాలామంది సంతోషంగా వింటారు. అది తరచూ క్రమమైన బైబిలు అధ్యయనానికి దారితీస్తుంది. విద్యార్థులు ఆధ్యాత్మిక ప్రగతి సాధించి, బాప్తిస్మం తీసుకొని క్రైస్తవులు అవుతారు.

ఆ విధంగా స్పందించిన మొట్టమొదటి ఆఫ్రికా దేశస్థుల్లో ఒకరి గురించి బైబిలు అపొస్తలుల కార్యములు 8:26-40లో ప్రస్తావించింది. ఆయన సత్య దేవుడైన యెహోవాను ఆరాధించడానికి యెరూషలేముకు ప్రయాణం చేసిన ఐతియోపీయుడు.

క్రింది చిత్రంలో చూపించిన ప్రకారం, ఆ ఐతియోపీయుడు తన రథంలో ఇంటికి తిరిగి వెళుతూ ఒక ప్రాచీన గ్రంథాన్ని చదువుతున్నాడు. అప్పుడు ఆయనను ఒక అపరిచితుడు సమీపించి, “నీవు చదువునది గ్రహించుచున్నావా?” అని అడిగాడు. ఆ ఐథియోపీయుడు, దాన్ని గ్రహించడానికి తనకు సహాయం అవసరమని వినయంగా ఒప్పుకొని, రథమెక్కి కూర్చొమ్మని ఆ అపరిచితుణ్ణి అంటే క్రైస్తవ సువార్తికుడైన ఫిలిప్పును కోరాడు. ఆ తర్వాత ఆయన తాను అంతకుముందు చదివిన లేఖన భాగానికి భావం ఏమిటో వివరించమని ఫిలిప్పును అడిగాడు. అది ఇటీవలే సంభవించిన మెస్సీయ అయిన యేసుక్రీస్తు మరణాన్ని సూచిస్తున్న ప్రవచనం అని ఫిలిప్పు ఆయనకు వివరించాడు. ఫిలిప్పు ఆయనకు “యేసునుగూర్చిన సువార్త”కు సంబంధించిన ఇతర విషయాలతోపాటు యేసు పునరుత్థానం గురించి కూడా తప్పకుండా వివరించి ఉంటాడు.

ఆ అద్భుతమైన సత్యాలను విన్నాక, ఐతియోపీయుడు తాను యేసు శిష్యుడు కావాలనే కోరికతో ‘నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమిటి?’ అని అడిగాడు. వినయస్థుడైన ఆ ఆఫ్రికా దేశస్థుడు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత బైబిలు ఆయన గురించి ఇంక ఏమీ చెప్పడం లేదు.

నేడు యెహోవాసాక్షులు, ప్రపంచవ్యాప్తంగా అదే “సువార్త” గురించి తెలుసుకోవడానికి లక్షలాది మందికి సహాయం చేస్తున్నారు. వారు ప్రస్తుతం దాదాపు 60 లక్షల ఉచిత గృహ బైబిలు అధ్యయనాలను నిర్వహిస్తున్నారు.