యెహోవాను మీ దేవునిగా చేసుకోవడం
యెహోవాను మీ దేవునిగా చేసుకోవడం
బైబిలు కాలాల్లో కొంతమందికి యెహోవాతో ఎంతో సన్నిహిత సంబంధం ఉండేది, అందుకే యెహోవా వారి దేవుడని పిలువబడ్డాడు. ఉదాహరణకు, లేఖనాల్లో యెహోవా ‘అబ్రాహాము దేవునిగా,’ ‘దావీదు దేవునిగా,’ ‘ఏలియా దేవునిగా’ వర్ణించబడ్డాడు.—ఆదికాండము 31:42; 2 రాజులు 2:14; 20:5.
ఆ ముగ్గురూ దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఎలా పెంపొందించుకున్నారు? మనం కూడా సృష్టికర్తతో బలమైన వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకొని దానిని కాపాడుకొనేందుకు వారినుండి మనమేమి నేర్చుకోవచ్చు?
అబ్రాహాము “యెహోవాను నమ్మెను”
యెహోవాపై నమ్మకం ఉంచడం గురించి బైబిలు ప్రస్తావిస్తున్నవారిలో అబ్రాహామే మొదటి వ్యక్తి. అబ్రాహాముకు దేవుని ఆమోదం తెచ్చిపెట్టిన ప్రాథమిక లక్షణం ఆయనకున్న విశ్వాసమే. నిజానికి అబ్రాహాము యెహోవా ఆమోదాన్ని ఎంతగా పొందాడంటే, సృష్టికర్త స్వయంగా ఆ తర్వాత మోషేకు తననుతాను పరిచయం చేసుకుంటూ ‘నేను అబ్రాహాము దేవుడను,’ ఆయన కుమారుడు ఇస్సాకు, మనవడు యాకోబుల దేవుడను అని చెప్పుకున్నాడు.—ఆదికాండము 15:6; నిర్గమకాండము 3:6.
అబ్రాహాము దేవునిపై అంతటి విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకున్నాడు? మొదటిగా అబ్రాహాము తన విశ్వాసాన్ని ఒక బలమైన పునాదిపై నిర్మించుకున్నాడు. యెహోవా రక్షణ కార్యాలను స్వయంగా చూసిన నోవహు కుమారుడైన షేము, అబ్రాహాముకు దేవుని మార్గాల గురించి ఉపదేశించి ఉండవచ్చు. యెహోవా “భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను” అనడానికి షేము ఒక సజీవ నిదర్శనగా ఉన్నాడు. (2 పేతురు 2:5) యెహోవా ఏదైనా వాగ్దానం చేస్తే, దానిని తప్పకుండా నెరవేరుస్తాడు అనే విషయాన్ని అబ్రాహాము షేము నుండి తెలుసుకొని ఉండవచ్చు. ఏదేమైనా దేవుడు స్వయంగా అబ్రాహాముకే ఒక వాగ్దానం చేసినప్పుడు అబ్రాహాము ఎంతో సంతోషించి ఆ వాగ్దానం తప్పకుండా నెరవేరుతుందనే నమ్మకంపై తన జీవిత విధానాన్ని ఆధారం చేసుకున్నాడు.
అప్పటికే బలమైన ఆధారంపై నిర్మించబడిన తన విశ్వాసాన్ని అబ్రాహాము తన చర్యల ద్వారా బలపర్చుకున్నాడు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను.” (హెబ్రీయులు 11:8) యెహోవాకు విధేయత చూపిస్తూ అబ్రాహాము చేసిన ఆ పని ఆయన విశ్వాసాన్ని బలపర్చింది, ఆయన విశ్వాసం గురించి శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “విశ్వాసము అతని క్రియలతోకూడి కార్యసిద్ధి కలుగజేసెను . . . క్రియలమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది.”—యాకోబు 2:22.
అంతేకాకుండా, యెహోవా అబ్రాహాము విశ్వాసం పరీక్షించబడేందుకు అనుమతించాడు, తత్ఫలితంగా అబ్రాహాము విశ్వాసం మరింత బలపడింది. పౌలు ఇలా చెప్పాడు: “అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను.” పరీక్షలు విశ్వాసాన్ని హెబ్రీయులు 11:17; 1 పేతురు 1:7.
మెరుగుపరిచి దానిని బలపరిచి ‘సువర్ణము కంటే అమూల్యమైనదిగా’ చేస్తాయి.—దేవుడు వాగ్దానం చేసినవాటన్నింటి నెరవేర్పును చూసేంతవరకూ అబ్రాహాము జీవించకపోయినా, ఇతరులు తన మాదిరిని అనుసరించడాన్ని చూసి సంతోషించే అవకాశం ఆయనకు లభించింది. ఆయన భార్య శారా, ఆయన కుటుంబానికి చెందిన మరో ముగ్గురు సభ్యులు అంటే ఇస్సాకు, యాకోబు, యోసేపు కూడా తమ అసాధారణమైన విశ్వాసం కారణంగా బైబిలులో ప్రశంసించబడ్డారు.—హెబ్రీయులు 11:11, 20-22.
నేడు అబ్రాహాము వంటి విశ్వాసం
యెహోవాను తమ దేవునిగా చేసుకోవాలనుకునే వారెవరికైనా విశ్వాసం అవసరం. “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము” అని పౌలు వ్రాశాడు. (హెబ్రీయులు 11:6) నేడు ఒక దేవుని సేవకుడు అబ్రాహాముకు ఉన్నటువంటి బలమైన విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు?
అబ్రాహాము చేసినట్లే మనం మన విశ్వాసాన్ని బలమైన పునాదిపై నిర్మించుకోవాలి. బైబిలును, బైబిలు ఆధారిత ప్రచురణలను క్రమంగా అధ్యయనం చేయడం ద్వారా మనం అలా చేయవచ్చు. బైబిలు చదవడం, దానిలోని విషయాల గురించి ధ్యానించడం దేవుని వాగ్దానాలు తప్పకుండా నెరవేరతాయని మనకు హామీ ఇస్తాయి. అప్పుడు మనం ఆ నమ్మకం ఆధారంగా మన జీవన శైలిని మార్చుకోవడానికి కదిలించబడతాము. విధేయతా క్రియల ద్వారా మన విశ్వాసం మరింత బలపడుతుంది, అలాంటి క్రియల్లో పరిచర్యలో పాల్గొనడం, క్రైస్తవ కూటాలకు హాజరవడం వంటివి ఉన్నాయి.—మత్తయి 24:14; 28:19, 20; హెబ్రీయులు 10:24, 25.
మన విశ్వాసం తప్పకుండా పరీక్షించబడుతుంది, అది బహుశా వ్యతిరేకత, తీవ్రమైన అనారోగ్యం, ప్రియమైనవారి మరణం, లేదా మరో దాని మూలంగా పరీక్షించబడవచ్చు. పరీక్షలు ఎదురైనప్పుడు కూడా యెహోవాకు విశ్వసనీయంగా ఉండడం మన విశ్వాసాన్ని బలపరిచి దానిని బంగారం కంటే విలువైనదిగా చేస్తుంది. దేవుడు చేసిన వాగ్దానాలన్నింటి నెరవేర్పును చూసేంతవరకూ మనం జీవించినా జీవించకపోయినా మన విశ్వాసం మనల్ని యెహోవాకు సన్నిహితం చేస్తుంది. అంతేకాకుండా మన మాదిరిని చూసి ఇతరులు మన విశ్వాసాన్ని అనుకరించడానికి ప్రోత్సహించబడతారు. (హెబ్రీయులు 13:7) రాల్ఫ్ విషయంలో అదే జరిగింది, ఆయన తన తల్లిదండ్రుల విశ్వాసాన్ని గమనించి, దాన్ని అనుకరించాడు. ఆయన ఇలా వివరించాడు:
“నేను నా తల్లిదండ్రులతో కలిసి ఉన్నప్పుడు, కుటుంబమంతా కలిసి బైబిలును చదవడానికి వీలుగా అందరూ ఉదయాన్నే నిద్ర లేవాలని వారు ప్రోత్సహించేవారు. మేము మొత్తం బైబిలును అలాగే చదివాము.” రాల్ఫ్ ఇప్పటికీ ప్రతి ఉదయం బైబిలు చదువుతాడు, అది ఆయన దినానికి మంచి ఆరంభాన్నిస్తుంది. రాల్ఫ్ తన తండ్రితోపాటు ప్రతి వారం పరిచర్యకు వెళ్ళేవాడు. “నేను పునర్దర్శనాలు చేసి గృహ బైబిలు అధ్యయనాలను నిర్వహించడం నేర్చుకుంది అప్పుడే” అని ఆయన చెప్పాడు. రాల్ఫ్ ఇప్పుడు యూరోప్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో స్వచ్ఛంద సేవకునిగా పని చేస్తున్నాడు. ఆయన తల్లిదండ్రులు చూపించిన విశ్వాసానికి అది ఎంత చక్కటి ప్రతిఫలమో కదా!
యెహోవా చిత్తానుసారమైన మనస్సుగల వ్యక్తి
అబ్రాహాము తర్వాత దాదాపు 900 సంవత్సరాలకు జన్మించిన దావీదు, లేఖనాల్లో ప్రస్తావించబడిన యెహోవా సేవకుల్లో ఒక అసాధారణమైన వ్యక్తి. యెహోవా భవిష్యత్ రాజుగా దావీదును ఎంపిక చేసుకోవడం గురించి సమూయేలు ప్రవక్త ఇలా చెప్పాడు: “యెహోవా తన చిత్తానుసారమైన మనస్సుగల యొకని కనుగొనియున్నాడు.” యెహోవాకు దావీదుకు మధ్య ఉన్న సంబంధం ఎంత సన్నిహితమైనదంటే, ఆ తర్వాత హిజ్కియా రాజుతో మాట్లాడుతూ యెషయా ప్రవక్త “నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా” అని అన్నాడు.—1 సమూయేలు 13:14; 2 రాజులు 20:5; యెషయా 38:5.
దావీదు యెహోవా మనస్సుకు సన్నిహితుడైనా, ఆయన తన కోరికలకు లొంగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మూడుసార్లు ఆయన గంభీరమైన తప్పిదాలు చేశాడు: నిబంధనా మందసాన్ని యెరూషలేముకు తరలించేటప్పుడు అది సరికాని పద్ధతిలో తీసుకెళ్ళబడేందుకు అనుమతించాడు; 2 సమూయేలు 6:2-10; 11:2-27; 24:1-9.
బత్షెబతో వ్యభిచారం చేసి, ఆమె భర్త ఊరియా మరణించేటట్లు కుట్ర పన్నాడు; యెహోవా ఆజ్ఞాపించకుండానే ఇశ్రాయేలు, యూదాల్లోని జనుల సంఖ్యను లెక్కించాడు. ఆ మూడు సందర్భాల్లోనూ దావీదు దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడు.—అయితే దావీదు పాపాలు బయట పెట్టబడినప్పుడు, ఆయన వెంటనే వాటి బాధ్యత వహించాడు, ఇతరులపై నింద మోపడానికి ప్రయత్నించలేదు. నిబంధనా మందసాన్ని తీసుకెళ్ళడానికి సరైన ఏర్పాట్లు చేయబడలేదని ఒప్పుకొని ‘మనము యెహోవా యొద్ద విధినిబట్టి విచారణ చేయలేదు’ అని అన్నాడు. తన వ్యభిచారాన్ని నాతాను ప్రవక్త బయట పెట్టినప్పుడు, “నేను పాపము చేసితిని” అని ఒప్పుకున్నాడు. జనుల సంఖ్య లెక్కించి తాను ఎంత అవివేకమైన పని చేశాడో గ్రహించినప్పుడు కూడా దావీదు ఇలా ఒప్పుకున్నాడు: “నేను చేసిన పనివలన గొప్ప పాపము కట్టుకొంటిని.” దావీదు తన పాపాల విషయంలో పశ్చాత్తాపపడి యెహోవాకు సన్నిహితంగా ఉన్నాడు.—1 దినవృత్తాంతములు 15:13; 2 సమూయేలు 12:13; 24:10.
మనం తప్పు చేసినప్పుడు
యెహోవాను మన దేవునిగా చేసుకోవడానికి కృషి చేస్తుండగా దావీదు ఉదాహరణ మనకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దేవుని మనస్సుకు ఎంతో ఇష్టుడైన వ్యక్తే అలాంటి గంభీరమైన పాపాలు చేశాడు, కాబట్టి మనం మన శాయశక్తులా ప్రయత్నించినా, కొన్నిసార్లు తప్పిపోయినప్పుడు లేదా పెద్ద తప్పిదాలు చేసినప్పుడు నిరుత్సాహపడకూడదు. (ప్రసంగి 7:20) దావీదు పశ్చాత్తాపపడినప్పుడు ఆయన పాపాలు క్షమించబడ్డాయనే వాస్తవం నుండి మనం ఓదార్పు పొందవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం యూవే * విషయంలో అదే జరిగింది.
యూవే ఒక యెహోవాసాక్షుల సంఘంలో పెద్దగా సేవ చేసేవాడు. ఒకసారి ఆయన తప్పుడు కోరికలకు లొంగిపోయి అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డాడు. మొదట్లో యూవే కూడా దావీదు రాజులాగే తాను చేసిన తప్పిదాన్ని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించి యెహోవా తన పాపాన్ని చూసీచూడనట్లుగా వదిలేస్తాడు అని ఆశించాడు. చివరికి యూవే మనస్సాక్షి ఆయనను ఎంతగా బాధించిందంటే, ఆయన వెళ్ళి తన తోటి పెద్దకు తన పాపం గురించి చెప్పాడు, యూవే తన ఆధ్యాత్మిక విపత్తు నుండి కోలుకోవడానికి సహాయపడేందుకు వెంటనే చర్యలు తీసుకోబడ్డాయి.
యూవే తన పాపాల విషయంలో పశ్చాత్తాపపడి యెహోవాకు, సంఘానికి సన్నిహితంగా కొనసాగాడు. తనకు లభించిన సహాయం విషయంలో ఆయన ఎంత కృతజ్ఞతతో ఉన్నాడంటే, కొన్ని వారాల తర్వాత ఆయన తనకు సహాయం చేసినందుకు యథార్థమైన ప్రగాఢమైన కృతజ్ఞతను తెలియజేస్తూ పెద్దలకు ఒక ఉత్తరం వ్రాశాడు. “యెహోవా నామానికి కలిగిన నిందను తొలగించడానికి మీరు నాకు సహాయం చేశారు” అని ఆయన వ్రాశాడు. యూవే యెహోవాతో తన సంబంధాన్ని పునరుద్ధరించుకోగలిగాడు, కొంతకాలం తర్వాత ఆయన అదే సంఘంలో మళ్ళీ పెద్దగా నియమించబడ్డాడు.
“మనవంటి స్వభావముగల మనుష్యుడే”
దావీదు జీవించిన తర్వాతి శతాబ్దానికి చెందిన ఏలియా ఇశ్రాయేలు మొట్టమొదటి ప్రవక్తల్లో ఒకడు. ఏలియా అవినీతి, అనైతికత ప్రబలంగా ఉన్న కాలంలో సత్యారాధనకు మద్దతుగా నిలిచాడు, ఆయన యెహోవాపట్ల తనకున్న భక్తి విషయంలో ఎన్నడూ చలించలేదు. అందువల్ల ఆయన తర్వాతి ప్రవక్తయైన ఎలీషా ఒకసారి యెహోవాను “ఏలియాయొక్క దేవుడైన యెహోవా” అని సంబోధించడంలో ఆశ్చర్యం లేదు.—2 రాజులు 2:14.
అయితే ఏలియా మానవాతీతుడేమీ కాదు. యాకోబు ఇలా వ్రాశాడు: “ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే.” (యాకోబు 5:17) ఉదాహరణకు, ఆయన ఇశ్రాయేలులోని బయలు ఆరాధాకులను చిత్తుగా ఓడించిన తర్వాత యెజెబెలు రాణి ఆయనను చంపుతానని బెదిరించింది. ఆయన ఎలా స్పందించాడు? ఆయన భయపడి అరణ్యానికి పారిపోయాడు. అక్కడ ఒక బదరీ వృక్షము క్రింద కూర్చొని ఏలియా ఇలా వాపోయాడు: “యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను; ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము.” ఏలియా ఇక ప్రవక్తగా ఉండాలని కోరుకోలేదు, తాను చావడమే మంచిదని అనుకున్నాడు.—1 రాజులు 19:4.
అయితే యెహోవా ఏలియా భావాలను అర్థం చేసుకున్నాడు. ఏలియా ఒంటరివాడేమీ కాదని, సత్యారాధనకు నమ్మకంగా ఉన్న ఇతరులు కూడా ఉన్నారని హామీ ఇస్తూ దేవుడు ఆయనను బలపరిచాడు. అంతేకాకుండా యెహోవా ఏలియాపై అదే నమ్మకంతో ఆయనకు మళ్ళీ పని ఇచ్చాడు.—1 రాజులు 19:5-18.
ఏలియా అనుభవించిన భావోద్వేగపరమైన కలవరం, ఆయన దేవుని అనుగ్రహాన్ని కోల్పోయాడని సూచించలేదు. దాదాపు 1,000 సంవత్సరాల తర్వాత పేతురు, యాకోబు, యోహానుల ఎదుట క్రీస్తు యేసు రూపాంతరము మత్తయి 17:1-9) యెహోవా ఏలియాను ఒక మాదిరికరమైన ప్రవక్తగా దృష్టించాడని స్పష్టమవుతోంది. ఏలియా కేవలం “మనవంటి స్వభావముగల మనుష్యుడే” అయినా, సత్యారాధనను పునరుద్ధరించడానికి, తన నామాన్ని పరిశుద్ధపరచడానికి ఆయన కష్టపడి చేస్తున్న పనిని దేవుడు విలువైనదిగా ఎంచాడు.
పొందినప్పుడు ఆయనతోపాటు దర్శనంలో కనిపించడానికి యెహోవా ఎవరిని ఎంపిక చేసుకున్నాడు? మోషేను, ఏలియానే. (మన భావోద్వేగపరమైన పోరాటం
నేడు యెహోవా సేవకులు కొన్నిసార్లు నిరుత్సాహపడవచ్చు లేదా కలత చెందవచ్చు. ఏలియా కూడా అలాంటి భావోద్వేగాలనే అనుభవించాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరమో కదా! యెహోవా ఏలియా భావాలను అర్థం చేసుకున్నట్లే, మన భావోద్వేగపరమైన పోరాటాన్ని కూడా అర్థం చేసుకుంటాడు అనే విషయం మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది.—కీర్తన 103:14.
ఒకవైపు మనం దేవుణ్ణి, మనతోటి వారిని ప్రేమిస్తాము, రాజ్య సువార్తను ప్రకటించమని యెహోవా ఇచ్చిన పనిని చేయాలని కోరుకుంటాము. మరోవైపు మనం చేస్తున్న ప్రకటనా పనికి సరైన ప్రతిస్పందన లేకపోతే మనం నిరుత్సాహపడవచ్చు లేదా సత్యారాధనకు శత్రువులుగా ఉన్నవారి నుండి వచ్చే బెదిరింపులకు భయపడవచ్చు. అయితే ఏలియా తన సేవను కొనసాగించడానికి యెహోవా సహాయం చేశాడు, ఆయన నేడు కూడా తన సేవకులకు అలాగే సహాయం చేస్తాడు. ఉదాహరణకు, హెర్బట్ మరియు జెర్ట్రూడ్‌లనే తీసుకోండి.
హెర్బట్ మరియు జెర్ట్రూడ్‌లు, మాజీ జర్మన్ గణతంత్ర రాజ్యంలోని లెయిప్జిగ్‌లో 1952లో యెహోవాసాక్షులుగా బాప్తిస్మం తీసుకున్నారు. అప్పట్లో దేవుని సేవకులకు జీవితం కష్టంగా ఉండేది, ఎందుకంటే వారి పరిచర్య నిషేధించబడింది. ఇంటింటికి వెళ్ళి ప్రకటించడం గురించి హెర్బట్ ఎలా భావించాడు?
“మేము కొన్నిసార్లు చాలా భయపడేవాళ్ళము. మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు అధికారులు ఎప్పుడు హఠాత్తుగా ప్రత్యక్షమయి మమ్మల్ని అరెస్టు చేస్తారో మాకు తెలిసేది కాదు.” హెర్బట్‌తోపాటు ఇతరులు తమ భయాన్ని అధిగమించడానికి ఏమి సహాయం చేసింది? “మేము వ్యక్తిగతంగా బైబిలును ఎంతో అధ్యయనం చేసేవాళ్ళము. మా ప్రకటనా పనిని కొనసాగించడానికి యెహోవా మాకు శక్తినిచ్చాడు.” తన పరిచర్యలో హెర్బట్‌కు ఎన్నో ప్రోత్సాహకరమైన, మరికొన్ని గమ్మత్తయిన అనుభవాలు కూడా ఎదురయ్యాయి.
హెర్బట్ ఒక మధ్య వయస్కురాలిని కలిశాడు, ఆమె బైబిలుపట్ల ఆసక్తి చూపించింది. కొన్ని రోజుల తర్వాత హెర్బట్ ఆమెను మళ్ళీ సందర్శించినప్పుడు, ఆమెతోపాటు మరో యువకుడు కూడా ఉన్నాడు, ఆయన కూడా చర్చను విన్నాడు. కొన్ని నిమిషాల తర్వాత హెర్బట్ ఒక వస్తువును చూసి వణికిపోయాడు. ఆ గదిలో ఓ మూల కుర్చీ మీద పోలీసు అధికారి టోపీ ఉంది. అది ఆ యువకుడిది, ఆయన ఒక పోలీసు అధికారి, ఆయన హెర్బట్‌ను అరెస్టు చేయాలనే ఉద్దేశంతోనే అక్కడకు వచ్చాడు.
“నువ్వు ఒక యెహోవాసాక్షివి! నీ ఐడెంటిఫికేషన్ కార్డు చూపించు” అని ఆ యువకుడు అడిగాడు. హెర్బట్ తన కార్డును చూపించాడు. అప్పుడు ఒక అనుకోని సంఘటన జరిగింది. ఆ స్త్రీ పోలీసు అధికారివైపు తిరిగి ఇలా హెచ్చరించింది: “ఈ దేవుని సేవకుడికి ఏమైనా జరిగిందంటే, నువ్వు మళ్ళీ నా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు.”
ఆ యువకుడు ఒక్క క్షణం ఆలోచించి, హెర్బట్ కార్డు వెనక్కు ఇచ్చేసి ఆయనను వెళ్ళనిచ్చాడు. ఆ పోలీసు అధికారి ఆ స్త్రీ కూతురిని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడ్డాడని హెర్బట్‌కు తర్వాత తెలిసింది. హెర్బట్‌ను అరెస్టు చేయడంకంటే ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడమే బాగుంటుందని ఆ యువకుడికి అనిపించింది.
యెహోవాను మన దేవునిగా చేసుకుందాము
ఈ సంఘటనల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? అబ్రాహాములాగే మనకు యెహోవా వాగ్దానాలపై బలమైన విశ్వాసం ఉండాలి. దావీదులా మనం, తప్పిదం చేసినప్పుడు నిజమైన పశ్చాత్తాపం చూపించి యెహోవావైపు తిరగాలి. ఏలియాలా మనం కలవరపరిచే పరిస్థితుల్లో బలం కోసం యెహోవాపై ఆధారపడాలి. అలా చేసినప్పుడు మనం ఇప్పుడూ ఎల్లప్పుడూ యెహోవాను మన దేవునిగా చేసుకోగలుగుతాము, ఎందుకంటే ఆయన “మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవుడు.”—1 తిమోతి 4:10.
[అధస్సూచి]
^ పేరా 20 పేరు మార్చబడింది.
[25వ పేజీలోని చిత్రాలు]
విధేయతా క్రియలు అబ్రాహాము విశ్వాసాన్ని బలపరిచాయి
[26వ పేజీలోని చిత్రం]
దావీదులాగే మనం పాపం చేసినప్పుడు పశ్చాత్తాపపడాలి
[28వ పేజీలోని చిత్రం]
యెహోవా ఏలియా భావాలను అర్థం చేసుకున్నట్లే, మన భావాలను కూడా అర్థం చేసుకుంటాడు