మనకు మరీ ఎక్కువ జ్ఞానం అందుబాటులో ఉందా?
మనకు మరీ ఎక్కువ జ్ఞానం అందుబాటులో ఉందా?
పశ్చిమ ఆఫ్రికాలో ఒక వివాహిత జంట బీచ్‌లో కూర్చొని ఆకాశంలో వెండి బంతిలా ఉన్న చంద్రుణ్ణి చూస్తున్నారు. “మానవునికి చంద్రుని గురించి ఎంత తెలుసు, అతను తెలుసుకోవలసినది ఇంకా ఎంత ఉంది?” అన్నాడు భర్త.
దానికి భార్య ఇలా స్పందించింది: “మనం చంద్రుణ్ణి చూస్తున్నట్లే భూమిని కూడా చూస్తున్నామనుకోండి, భూమిపై ప్రజలకు ఇప్పటికే ఎంత జ్ఞానం ఉంది, వారు ఇంకా ఎంత తెలుసుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి! భూమి మాత్రమే సూర్యుని చుట్టూ తిరగడంలేదు, మొత్తం సౌరమండలమే పరిభ్రమిస్తూ ఉంది. అంటే మనం ఇప్పుడు విశ్వంలో సరిగ్గా ఎక్కడ ఉన్నామో ఆ స్థానంలో మనం మరెప్పుడూ ఉండకపోవచ్చు. నిజానికి, విశ్వంలో మనం ఇప్పుడు ఉన్న స్థానం మనకు తెలిసిన సూర్యుడు నక్షత్రాలు ఉన్న స్థానాన్నిబట్టి మాత్రమే మనం అర్థం చేసుకోగలం. ఒకవైపున మనకు కొన్ని విషయాల గురించి ఎంతో జ్ఞానం ఉన్నా, విచిత్రమేమిటంటే మనం ఖచ్చితంగా ఎక్కడ ఉన్నామో కూడా మనకు తెలియదు!”
ఆమాటలు కొన్ని ప్రాథమిక సత్యాలను పేర్కొంటున్నాయి. మనం నేర్చుకోవలసింది ఇంకా ఎంతో ఉంది అనిపిస్తుంది. మనమందరమూ ప్రతీరోజు ఏవో కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం. అయితే మనం ఎంత నేర్చుకున్నా, మనం నేర్చుకోవాలనుకున్నవన్నీ మనం కోరుకున్నంత వేగంగా నేర్చుకోలేకపోతున్నాము అనిపిస్తుంటుంది.
క్రొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యంతోపాటు ఇప్పటికే నేర్చుకున్న విషయాలను భద్రపరిచే సామర్థ్యం కూడా ఎంతో పెరిగింది. మానవజాతి అంతా కలిసి గుర్తుపెట్టుకున్న విషయాలు, సాంకేతిక విజ్ఞానం కారణంగా బృహత్తర రూపం దాల్చాయి. ఇప్పుడు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లకు అలాంటి జ్ఞానాన్ని నిల్వచేయగల సామర్థ్యం ఎంతగా ఉందంటే, వాటిని వివరించడానికి కొత్త గణితశాస్త్ర పదాలను రూపొందించవలసి వచ్చింది. ఒక మామూలు సీడీ-రామ్ అంతులేని సమాచారాన్ని నిల్వచేయగలదు; దాని సామర్థ్యం 680 మెగాబైట్‌లు లేదా అంతకంటే ఎక్కువ అని వర్ణించబడింది. ఒక డీవీడీ దానికంటే ఏడురెట్లు ఎక్కువ సమాచారాన్ని నిల్వచేయగలదు, అంతకంటే ఎక్కువ సామర్థ్యంగలవి అందుబాటులోకి వస్తున్నాయి.
ఆధునిక మనిషి ఉపయోగిస్తున్న సమాచార వ్యవస్థ మన అవగాహనకు దాదాపు అంతుబట్టదు. రోటరీ ప్రెస్‌లు ఆశ్చర్యపడేంత వేగంతో నడుస్తూ అపరిమిత సంఖ్యలో వార్తాపత్రికలను, పత్రికలను, పుస్తకాలను ప్రచురిస్తున్నాయి. ఇంటర్నెట్ ఉపయోగించేవారు అంతులేని సమాచారాన్ని తెలుసుకోవడానికి కేవలం ఒక మీట నొక్కితే చాలు. ఈ విధంగా, మరెన్నో విధాలుగా ఒక వ్యక్తి నేర్చుకోగల దానికంటే వేగంగా సమాచారం వ్యాప్తి చెందుతోంది. ఈ సమాచార భాండాగారం కొన్నిసార్లు సముద్రంతో పోల్చబడింది, మనం దానిలో ఈదడం నేర్చుకోవాలే తప్ప, మొత్తం నీటిని త్రాగేయడానికి ప్రయత్నించకూడదు. అంతులేని సమాచారం అందుబాటులో ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం అవసరం.
అపొస్తలుల కార్యములు 19:35, 36) అది అందరికీ తెలిసిన విషయంగా, చాలామందికి నిర్వివాదాంశంగా కనిపించినా, ఆ మూర్తి పరలోకమునుండి పడిందనే విషయం మాత్రం వాస్తవం కాదు. అందుకే పరిశుద్ధ బైబిలు “జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన” దానికి దూరంగా ఉండమని క్రైస్తవులను హెచ్చరిస్తోంది.—1 తిమోతి 6:20.
మనం సమాచారాన్ని ఎంపిక చేసుకోవడానికి మరో కారణమేమిటంటే లభ్యమవుతున్న సమాచారమంతా ఉపయోగకరమైనది కాదు. నిజానికి కొంత సమాచారం కోరుకోదగినది కూడా కాదు, దానిని తెలుసుకోవడం వ్యర్థం. జ్ఞానం అనేది కేవలం సమాచారాన్ని సూచిస్తుందని గుర్తుంచుకోండి, అది మంచిదైనా కావచ్చు చెడ్డదైనా కావచ్చు, అనుకూలమైనది కావచ్చు ప్రతికూలమైనది కావచ్చు. విషయాన్ని మరింత క్లిష్టతరం చేస్తూ, చాలామంది వాస్తవాలుగా పరిగణించే విషయాలు ఖచ్చితమైనవి కాకపోవచ్చు. ఎంతో గౌరవించబడిన అధికారుల వ్యాఖ్యానాలు కూడా తరచూ తప్పులుగా, అవాస్తవాలుగా నిరూపించబడ్డాయి! ఉదాహరణకు, ప్రాచీన ఎఫెసుకు చెందిన కరణాన్ని ప్రజలు జ్ఞానవంతుడైన అధికారిగా దృష్టించేవాళ్ళు. ఆయన ఇలా అన్నాడు: “ఎఫెసీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్యుపతియొద్దనుండి [పరలోకమునుండి] పడిన మూర్తికిని పాలకురాలై యున్నదని తెలియనివాడెవడు?” (మనం సంపాదించుకునే జ్ఞానం విషయంలో జాగ్రత్తగా ఉండడానికి మరో బలమైన కారణం, మన ప్రస్తుత జీవితకాలం చాలా తక్కువగా ఉండడం. మీరు ఎంత వృద్ధులైనా, ఇంకా పరిశోధించాలని ఇష్టపడే జ్ఞానానికి సంబంధించిన రంగాలు ఎన్నో ఉండవచ్చు, అయితే ఆ జ్ఞానాన్ని సంపాదించుకునేవరకూ మీరు జీవించరు అనే విషయం మీకు తెలుసు.
ఈ ప్రాథమిక సమస్య ఎప్పటికైనా పరిష్కరించబడుతుందా? జీవితకాలాన్ని పొడిగించి, మనం నిరంతరం జీవించేలా చేసే జ్ఞానం ఏదైనా లభ్యమవుతుందా? అలాంటి జ్ఞానం ఇప్పటికే ఉనికిలో ఉందా? అలాగైతే, అది అందరికీ లభ్యమవుతోందా? జ్ఞానమంతా మనం ఆశించినట్లే సత్యవంతంగా ఉండే రోజు ఎప్పటికైనా వస్తుందా? పైన ప్రస్తావించబడిన ఆ వివాహిత జంట ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలను పొందారు, మీరు కూడా పొందవచ్చు. నిరంతరం జ్ఞానాన్ని సంపాదించుకునే ఉత్తరాపేక్షను గురించి మాట్లాడే తర్వాతి ఆర్టికల్‌ను దయచేసి చదవండి.