కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రతి దినమును ప్రయోజనకరంగా ఎలా ఉపయోగించుకోవచ్చు?

ప్రతి దినమును ప్రయోజనకరంగా ఎలా ఉపయోగించుకోవచ్చు?

ప్రతి దినమును ప్రయోజనకరంగా ఎలా ఉపయోగించుకోవచ్చు?

“మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.” (కీర్తన 90:12) బైబిలు రచయిత మోషే వినయంతో అలా ప్రార్థించాడు. ఆయన ప్రత్యేకంగా దేని గురించి అడుగుతున్నాడు? మనం కూడా అలాంటి భక్తిపూర్వకమైన విన్నపం చేయాలా?

పదవ వచనంలో మోషే, మానవ జీవితం అల్పాయుష్షుతో కూడినదని చాలా దుఃఖించాడు. మరో సందర్భంలో ఆయన యోబు పలికిన ఈ మాటలను నివేదించాడు: “స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును.” (యోబు 14:1) అపరిపూర్ణ మానవ జీవితం ఎంత తాత్కాలికమైనదో మోషేకు బాగా తెలుసు అని దీనినిబట్టి స్పష్టమవుతోంది. కాబట్టి ఆయన తన జీవితంలోని ప్రతీ దినాన్ని ఒక అమూల్యమైన వరంగా దృష్టించాడు. పైవిధంగా ప్రార్థించడం ద్వారా మోషే తన జీవితంలో మిగిలివున్న దినములను తన సృష్టికర్తకు సంతోషాన్ని తెచ్చేలా జ్ఞానయుక్తంగా జీవించాలనే తన కోరికను వ్యక్తం చేశాడు. మనం కూడా మన జీవితంలోని ప్రతీ దినాన్ని అర్థవంతంగా ఉపయోగించడానికి కృషి చేయవద్దా? మనకు ఇప్పుడు దేవుని ఆమోదం కావాలని కోరుకుంటే అలా చేయడానికి మనం కృషి చేయాలి.

మోషేను, యోబును పురికొల్పిన మరో విషయం కూడా ఉంది, అది మనల్ని కూడా అదే విధంగా పురికొల్పాలి. దైవభక్తిగల ఆ పురుషులిద్దరూ భవిష్యత్తు ఆశీర్వాదాల కోసం అంటే మెరుగైన పరిస్థితుల్లో భూమిపై జీవించడం కోసం ఎదురు చూశారు. (యోబు 14:14, 15; హెబ్రీయులు 11:24) ఆ కాలం వచ్చినప్పుడు మరణం కారణంగా ఎవ్వరి మంచి పనులు హఠాత్తుగా ఆగిపోవు. నమ్మకమైనవారు భూపరదైసుపై నిరంతరం జీవించాలని మన సృష్టికర్త సంకల్పించాడు. (యెషయా 65:21-24; ప్రకటన 21:3, 4) ‘జ్ఞానహృదయము కలుగునట్లు మీ దినములు లెక్కించుకుంటే,’ మీరు కూడా అదే ఉత్తరాపేక్షతో ఉండవచ్చు.