కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఏ పునాది మీద కడుతున్నారు?

మీరు ఏ పునాది మీద కడుతున్నారు?

మీరు ఏ పునాది మీద కడుతున్నారు?

ఒక భవనం దృఢంగా ఉండడం అనేది ఎక్కువగా దాని పునాది మీదే ఆధారపడి ఉంటుంది. బైబిలు కొన్నిసార్లు ఈ సూత్రాన్ని అలంకారార్థ భావంతో ఉపయోగిస్తోంది.

ఉదాహరణకు యెషయా ప్రవక్త యెహోవా దేవుణ్ణి “పునాదులను వేసిన” వానిగా పేర్కొంటున్నాడు. (యెషయా 51:​13) భూకదలికలను, భూమి తన స్థానంలో స్థిరంగా ఉండేందుకు నియంత్రిస్తున్నటువంటి శాశ్వతమైన దేవుని నియమాలకు ఆ అలంకారార్థ పునాది ప్రతీకగా ఉంది. (కీర్తన 104:⁠5) మానవజాతి ఆధారపడి ఉన్న “పునాదుల” గురించి కూడా దేవుని వాక్యమైన బైబిలు మాట్లాడుతోంది. న్యాయం, నియమ నిబంధనలే ఆ పునాదులు. అన్యాయం, అవినీతి, దౌర్జన్యం కారణంగా అవి ‘పాడైపోతే,’ లేక బలహీనమైతే సమాజంలో శాంతిభద్రతలు దెబ్బతింటాయి.​—⁠కీర్తన 11:​2-6; సామెతలు 29:⁠4.

ఈ సూత్రం వ్యక్తిగత స్థాయిలో ప్రజలకు వర్తిస్తుంది. ప్రఖ్యాతి చెందిన తన కొండమీది ప్రసంగపు ముగింపులో యేసుక్రీస్తు ఇలా అన్నాడు: “యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పది.”​—⁠మత్తయి 7:​24-27.

మీ జీవితాన్ని ఏ పునాది మీద కడుతున్నారు? ఇల్లు పూర్తిగా కూలిపోయే భక్తిహీన మానవ తత్త్వజ్ఞానమనే అస్థిరమైన ఇసుక మీద కడుతున్నారా? లేక జీవితంలోని అలంకారార్థ తుఫానులను ఎదుర్కొని క్షేమంగా ఉండేందుకు మీకు సహాయం చేసే యేసుక్రీస్తు మాటలకు విధేయులుగా ఉండడమనే స్థిరమైన బండ మీద కడుతున్నారా?