కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ఖైదీ అయిన పేతురు గుమ్మం దగ్గర ఉన్నాడని విన్నప్పుడు శిష్యులు అది “అతని దూత” అని ఎందుకు అన్నారు?​—అపొస్తలుల కార్యములు 12:​15.

గుమ్మం దగ్గర నిలబడింది పేతురుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక దూత అని శిష్యులు తప్పుగా ఊహించి ఉండవచ్చు. ఆ వాక్యపు సందర్భాన్ని పరిశీలించండి.

యాకోబును చంపించిన హేరోదే పేతురును చెరసాలలో వేయించాడు. కాబట్టి పేతురును కూడా చంపుతారని శిష్యులు నమ్మడానికి సరైన కారణం ఉంది. సంకెళ్ళతో బంధించి, చెరసాలలో వేసిన పేతురును పూటకు నలుగురు చొప్పున పదహారుమంది భటులు కావలి కాశారు. అప్పుడు రాత్రివేళ ఒక దేవదూత ఆయనను అద్భుతమైన రీతిలో విడిపించి చెరసాల నుండి బయటికి నడిపించాడు. పేతురు జరుగుతున్నదానిని చివరకు గుర్తించినప్పుడు ఇలా అన్నాడు: ‘యెహోవా తన దూతను పంపి హేరోదు చేతిలోనుండి నన్ను తప్పించియున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలిసింది.’​—⁠అపొస్తలుల కార్యములు 12:​1-11.

పేతురు వెంటనే మార్కు అనే మారు పేరు ఉన్న యోహాను తల్లియైన మరియ ఇంటికి వెళ్ళాడు, అక్కడ చాలామంది శిష్యులు సమావేశమయ్యారు. ఆయన గుమ్మం తలుపు తట్టినప్పుడు రొదే అనే పేరుగల సేవకురాలు వెళ్ళింది. పేతురు స్వరాన్ని గుర్తుపట్టి ఆయనను లోపలికి రానీయకుండానే ఆయన రాక గురించి ఇతరులకు చెప్పడానికి ఆమె పరుగెత్తింది! పేతురు గుమ్మం దగ్గర ఉన్నాడని శిష్యులు మొదట నమ్మలేక పోయారు. అందుకే ‘అది అతని దూత’ అని వారు తప్పుగా ఊహించారు.​—⁠అపొస్తలుల కార్యములు 12:​12-15.

పేతురును అప్పటికే చంపారనీ, శరీరం నుండి వేరైన ఆయన ఆత్మ గుమ్మం దగ్గర ఉందని శిష్యులు నమ్మారా? అలా నమ్మలేదు, ఎందుకంటే చనిపోయినవారు “ఏమియు ఎరుగరు” అని చనిపోయినవారి గురించిన లేఖన సత్యం యేసు అనుచరులకు తెలుసు. (ప్రసంగి 9:​5, 10) అలాగైతే ‘అది అతని దూత’ అని శిష్యులు చెప్పినప్పుడు వారి ఉద్దేశం ఏమైయుండవచ్చు?

చరిత్రంతటిలో దూతలు దేవుని ప్రజలకు సహాయం చేశారని యేసు శిష్యులకు తెలుసు. ఉదాహరణకు, యాకోబు ‘సమస్తమైన కీడులలో నుండి తనను తప్పించిన దూత’ గురించి మాట్లాడాడు. (ఆదికాండము 48:​16) యేసు తమ మధ్య ఉన్న ఒక పిల్లవాని గురించి తన అనుచరులతో ఇలా చెప్పాడు: “ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను.”​—⁠మత్తయి 18:​10.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యంగ్స్‌ లిటరల్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ బైబిల్‌, ఆజిలాస్‌ (“దేవదూత”) అనే పదాన్ని “రాయబారి” అని అనువదించింది. దేవుని సేవకుల్లో ప్రతి ఒక్కరికీ ఒక దేవదూత, నిజానికి ఒక “సంరక్షక దూత” ఉన్నాడనే నమ్మకం కొందరు యూదుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ అభిప్రాయాన్ని మాత్రం దేవుని వాక్యం సూటిగా బోధించడం లేదు. అయినా శిష్యులు ‘అది అతని దూత’ అని అన్నప్పుడు పేతురుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక దేవదూత గుమ్మం దగ్గర నిలుచున్నాడని వారు ఊహించే అవకాశం ఉంది.