కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ప్రేమించేవారితో సంభాషిస్తారా?

మీరు ప్రేమించేవారితో సంభాషిస్తారా?

మీరు ప్రేమించేవారితో సంభాషిస్తారా?

“ప్రియమైన వారితో సంభాషించే మన సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతోంది” అని పోలిష్‌ వారపత్రిక పొలిటిక నివేదిస్తోంది. అమెరికాలో, భార్యాభర్తలు నిర్మాణాత్మకంగా మాట్లాడుకోవడానికి ప్రతీరోజు కేవలం ఆరు నిమిషాలే వెచ్చిస్తున్నారని అంచనా వేయబడింది. భార్యాభర్తలు విడిపోవడం, విడాకులు తీసుకోవడం సగానికి పైగా సంభాషణ తగ్గినందుకే జరుగుతున్నాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు.

తల్లిదండ్రులకూ, పిల్లలకూ మధ్య ఉండే సంభాషణ ఎలా ఉంటోంది? చాలా సందర్భాల్లో “అది సంభాషణలాగ ఉండదు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలాగ ఉంటోంది: పాఠశాల ఎలా ఉంది? నీ స్నేహితులు ఎలా ఉన్నారు?” అనే ప్రశ్నలు ఉంటాయని పై నివేదిక వ్యాఖ్యానించింది. “పరిస్థితి ఇలా ఉంటే మన పిల్లలు భావోద్వేగ సంబంధాలను వృద్ధి చేసుకోవడాన్ని ఎలా నేర్చుకుంటారు” అని అది అడుగుతోంది.

మంచి సంభాషణా నైపుణ్యాలు కృషి లేకుండా సాధించలేము కాబట్టి, సంభాషించే సామర్థ్యాన్ని మనం ఎలా వృద్ధి చేసుకోవచ్చు? క్రైస్తవ శిష్యుడైన యాకోబు మనకు ముఖ్యమైన సలహా ఇచ్చాడు: “ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను.” (యాకోబు 1:​19) అవును, ప్రోత్సాహకరమైన సంభాషణ జరగాలంటే మనం శ్రద్ధగా వినాలి, అసహనంతో సంభాషణను మధ్యలోనే అడ్డగించకూడదు లేక తొందరపాటు ముగింపులకు రాకూడదు. విమర్శ, సంభాషణను అణచివేస్తుంది కాబట్టి విమర్శించకండి. అంతేకాకుండా యేసు ఆలోచనాపూర్వకమైన ప్రశ్నలను ఉపయోగించాడు, ఆయన వాటిని తన శ్రోతల హృదయాల్లో ఉన్నదానిని రాబట్టేందుకు, తమ మధ్య ఉన్న బంధాన్ని బలపరచుకునేందుకే ఉపయోగించాడు గానీ సమాచారం రాబట్టేందుకు కాదు.​—⁠సామెతలు 20:⁠5; మత్తయి 16:​13-17; 17:​24-27.

బైబిలులో కనబడే చక్కని సూత్రాలను అన్వయించుకొని, మీకు ప్రియమైనవారితో చక్కగా సంభాషించేందుకు, మాట్లాడేందుకు చొరవతీసుకోండి. అది స్నేహపూర్వకమైన సంబంధానికి దారితీయవచ్చు, అలాంటి సంబంధం అనేక సంవత్సరాలే కాక, జీవితాంతం కూడా నిలుస్తుంది.