రక్షణ కేవలం క్రియలద్వారా కాదు, కృపద్వారా లభిస్తుంది
రక్షణ కేవలం క్రియలద్వారా కాదు, కృపద్వారా లభిస్తుంది
“మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు . . . అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.”—ఎఫెసీయులు 2:8, 9.
సాధారణంగా ప్రజలు తాము వ్యక్తిగతంగా సాధించిన కార్యాలనుబట్టి అతిశయిస్తూ, తరచూ తమ గురించి గొప్పలు చెప్పుకుంటారు. క్రైస్తవులు దీనికి భిన్నంగా ఉంటారు. సత్యారాధనకు సంబంధించిన వాటితో సహా తాము సాధించిన వాటిని వారు ఎక్కువ చేసి చెప్పుకోరు. యెహోవా ప్రజలు ఒక సమూహంగా తాము సాధించిన దానినిబట్టి వారు ఆనందించినా, దానిలో తమ వ్యక్తిగత ప్రమేయాన్ని వారు ఎక్కువ చేసి చెప్పుకోరు. యెహోవా సేవలో వ్యక్తిగత కార్యాలకన్నా సరైన ఉద్దేశాలు కలిగివుండడం ఎక్కువ ప్రాముఖ్యమని వారు గ్రహిస్తారు. చివరకు నిత్యజీవపు బహుమానం ఎవరికి లభించినా అది వ్యక్తిగత కార్యాలనుబట్టి కాదుగానీ, విశ్వాసం, దేవుని కృప మూలంగానే లభిస్తుంది.—లూకా 17:10; యోహాను 3:16.
2 ఈ విషయం అపొస్తలుడైన పౌలుకు బాగా తెలుసు. తన ‘శరీరములోని ముల్లు’ నుండి ఉపశమనం కోసం మూడుసార్లు ప్రార్థించిన తర్వాత, యెహోవా ఆయనకు ఇలా జవాబిచ్చాడు: “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది.” వినయంతో యెహోవా నిర్దేశాన్ని అంగీకరిస్తూ, పౌలు ఇలా అన్నాడు: 2 కొరింథీయులు 12:7-9.
“కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.” పౌలు చూపించిన వినయ దృక్పథాన్నే అనుకరించాలని మనం కోరుకోవాలి.—3 పౌలు అసాధారణ రీతిలో క్రైస్తవ కార్యాలు చేసినప్పటికీ, తనలోని ఒకానొక ప్రత్యేక సామర్థ్యం కారణంగా వాటిని సాధించలేదని ఆయన గుర్తించాడు. ఆయన నమ్రతతో ఇలా వ్రాశాడు: ‘శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడెను.’ (ఎఫెసీయులు 3:8) పౌలులో గొప్పలు చెప్పుకునే స్వభావం గానీ, స్వనీతి గానీ లేదని ఈ మాటలు చూపిస్తున్నాయి. “దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.” (యాకోబు 4:6; 1 పేతురు 5:5) మనం మన సహోదరులకన్నా అల్పులమని వినయంతో పరిగణించుకుంటూ, పౌలు మాదిరిని అనుకరిస్తున్నామా?
‘ఒకరినొకరు తమకంటే యోగ్యులని పరిగణించుకోవడం’
4 అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు ఇలా ఉపదేశించాడు: “కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచు[కొనుడి].” (ఫిలిప్పీయులు 2:3) మనం ప్రత్యేకంగా బాధ్యతాయుత స్థానంలో ఉన్నప్పుడు ఇది ఒక సవాలుగా ఉండవచ్చు. నేటి లోకంలో ప్రబలంగా ఉన్న పోటీతత్వం మనమీద కొంతమేర ప్రభావం చూపుతున్న కారణంగా అది కష్టంగా ఉండవచ్చు. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇంట్లో తోబుట్టువులతో లేదా పాఠశాలలో తోటి విద్యార్థులతో పోటీపడడం బహుశా మనకు నేర్పించబడి ఉండవచ్చు. బహుశా పాఠశాల క్రీడాకారునిగానో, ఉత్తమ విద్యార్థిగానో పేరు తెచ్చుకోవాలనే ఒత్తిడి మనపై ఉండి ఉండవచ్చు. నిజమే, మనం చేసే ఏ పనిలోనైనా శాయశక్తులా కృషి చేయడం మెచ్చుకోదగినదే. కానీ క్రైస్తవులు తమవైపు అధిక అవధానాన్ని మళ్లించుకోవడానికి కాకుండా తమ కార్యశీలత నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి, బహుశా ఇతరులకు కూడా ప్రయోజనం చేకూర్చడానికి మాత్రమే అలా కృషి చేస్తారు. అయితే ఎల్లవేళలా అత్యుత్తమమైన వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలని ఆశించడం ప్రమాదకరం కాగలదు. ఏ విధంగా?
5 పోటీతత్వాన్ని లేదా అహంభావాన్ని అదుపులో పెట్టుకోకపోతే, అది ఒక వ్యక్తిని అమర్యాదస్థునిగా, పొగరుబోతుగా చేస్తుంది. ఇతరుల సామర్థ్యాలు, ఆధిక్యతలనుబట్టి అతడు ఈర్ష్యాపరునిగా లేదా చెడు దృష్టిగలవానిగా మారవచ్చు. సామెతలు 28:22 ఇలా చెబుతోంది: “చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు.” అతడు తాను అర్హుడు కానటువంటి స్థానాలను పొందాలని అహంకారంతో ప్రయత్నించవచ్చు. తన చర్యలను సమర్థించుకోవడానికి అతను సణగడం ఆరంభించి ఇతరుల విషయంలో విమర్శనాత్మకంగా మారవచ్చు. ఇలాంటి లక్షణాలకు క్రైస్తవులు దూరంగా ఉండాలి. (యాకోబు 3:14-16) ఆ లక్షణాలున్న వ్యక్తి స్వార్థపూరిత దృక్పథాన్ని అలవరచుకునే ప్రమాదం ఉంది.
6 కాబట్టి బైబిలు క్రైస్తవులకు ఇలా ఉద్బోధిస్తోంది: “ఒకరి నొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు గలతీయులు 5:26) ఈ విధమైన స్వభావానికి బలైన ఒక తోటి క్రైస్తవుని గురించి మాట్లాడుతూ అపొస్తలుడైన యోహాను ఇలా అన్నాడు: “నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. వాడు మమ్మునుగూర్చి చెడ్డమాటలు వదరుచు[న్నాడు]. . . . అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసికొందును.” ఒక క్రైస్తవుడు అలాంటి పరిస్థితిలో చిక్కుకోవడం ఎంత విషాదకరమో కదా!—3 యోహాను 9, 10.
ఉందము.” (7 నిజమే, ఒక క్రైస్తవుడు పోటీతత్వాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టాలని ఆశించడం అవాస్తవికమే అవుతుంది. ఉదాహరణకు, ఆయన చేస్తున్న ఉద్యోగంలో ఇతరులతో ఆర్థిక సంబంధంగా గానీ ఒకే రకమైన ఉత్పత్తులు తయారుచేసే వ్యాపారాల్లో గానీ ఒకే విధమైన సేవలు అందించే విషయంలో గానీ పోటీ ఉండవచ్చు. అయితే అలాంటి సందర్భాల్లో కూడా ఒక క్రైస్తవుడు గౌరవప్రదంగా, ప్రేమపూర్వకంగా, ఆలోచనాపూర్వకంగా తన పని చేసుకోవాలని కోరుకోవాలి. ఆయన చట్ట విరుద్ధమైన లేదా క్రైస్తవ వ్యతిరేకమైన పనులను తిరస్కరించడమే కాక, పచ్చి స్వార్థపరుడు అనే ముద్రపడకుండా కూడా చూసుకుంటాడు. ఏ పనిలోనైనా అత్యుత్తమమైన వ్యక్తిగా ఉండడమే జీవితంలో సాధించవలసినదని ఆయన భావించడు. ఒకవేళ ఒక క్రైస్తవుడు లోక సంబంధ పనుల్లోనే అలాంటి స్వభావం చూపించడం అవసరమైతే, దాన్ని ఆరాధనా పరిధిలో ఇంకా ఎంత ఎక్కువగా చూపించాలో కదా!
‘ఇతరులనుబట్టి కాక’
8 ఆరాధనలో క్రైస్తవులకు ఉండవలసిన దృక్పథం ఈ ప్రేరేపిత మాటల్లో వర్ణించబడింది: “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.” (గలతీయులు 6:4) సంఘ పెద్దలు తాము ఒకరితో ఒకరు పోటీపడాల్సిన అవసరం లేదని గుర్తించి, ఒక సభగా చక్కని సహకారంతో సన్నిహితంగా కలిసి పనిచేస్తారు. సంఘ సంక్షేమానికి ప్రతీ ఒక్కరూ ఇచ్చే తోడ్పాటునుబట్టి వారు ఆనందిస్తారు. ఆ విధంగా వారు విభజనకు కారణమయ్యే పోటీకి దూరంగా ఉంటూ, ఐక్యత విషయంలో చక్కని ఆదర్శంగా ఉంటారు.
9 కొందరు పెద్దలు వయస్సు, అనుభవం లేదా సహజమైన సామర్థ్యాల కారణంగా ఇతరులకన్నా మరింత ప్రతిభావంతులుగా ఉండవచ్చు లేదా వారికి మరింత అంతర్దృష్టి ఒక వరంగా ఉండవచ్చు. అందుకే యెహోవా సంస్థలో పెద్దలకు వివిధ రకాల బాధ్యతలు ఉన్నాయి. వారు ఒకరితో ఒకరు పోల్చుకునే బదులు ఈ ఉపదేశాన్ని గుర్తుంచుకుంటారు: “దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.” (1 పేతురు 4:10) వాస్తవానికి ఈ వచనం యెహోవా సేవకులందరికీ వర్తిస్తుంది ఎందుకంటే కొంతమేరకు అందరూ ఖచ్చితమైన జ్ఞానమనే వరాన్ని పొందడమేకాక క్రైస్తవ పరిచర్యలో భాగం వహించే ఆధిక్యతనూ ఆస్వాదిస్తున్నారు.
సామెతలు 24:12; 1 సమూయేలు 16:7) కాబట్టి, ‘విశ్వాస క్రియలు జరిగించేటప్పుడు నా ఉద్దేశమేమిటి’ అని మనలను మనం అప్పుడప్పుడు ప్రశ్నించుకోవాలి.—కీర్తన 24:3, 4; మత్తయి 5:8.
10 మనల్ని మనం ఇతరులపై హెచ్చించుకోవాలనే ఉద్దేశంతోకాక ప్రేమతో, భక్తితో చేసినప్పుడు మాత్రమే, మనం చేసే పవిత్ర సేవనుబట్టి దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి సత్యారాధనకు మద్దతునిచ్చే మన పనుల్లో సమతుల్య దృక్కోణం కలిగివుండడం ఆవశ్యకం. ఇతరుల ఉద్దేశాలేమిటో ఎవరూ ఖచ్చితంగా గ్రహించలేకపోయినా, యెహోవా మాత్రం “హృదయములను శోధించువాడు.” (మన సేవపట్ల సరైన దృక్కోణం
11 యెహోవా ఆమోదం పొందే విషయంలో ఉద్దేశమే ప్రాముఖ్యమైన విషయమైనప్పుడు, మన విశ్వాస క్రియలపట్ల మనం ఎంతమేరకు శ్రద్ధ కలిగి ఉండాలి? మనం సరైన ఉద్దేశంతో పరిచర్య చేస్తున్నంత కాలం, మనం ఏమి చేస్తున్నామో ఎంత చేస్తున్నామో, వివరాలు వ్రాసిపెట్టుకోవడం నిజంగా అవసరమా? మన విశ్వాస క్రియలకన్నా ఈ సంఖ్యా వివరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనో లేదా మన క్రైస్తవ కార్యశీలతకు సంబంధించిన మంచి నివేదిక మన ముఖ్య చింత కావాలనో కోరుకోవడం లేదు కాబట్టి ఈ ప్రశ్నలు సముచితమైనవే.
12యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం పుస్తకం ఏమి చెబుతోందో గమనించండి: “ప్రకటనా పని అభివృద్ధి నివేదికల్లో, యేసుక్రీస్తు తొలి అనుచరులు ఆసక్తి ప్రదర్శించారు. (మార్కు 6:30) పెంతెకొస్తునాడు శిష్యులపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు, అక్కడ 120 మంది వ్యక్తులు ఉన్నారని బైబిలు పుస్తకమైన అపొస్తలుల కార్యములు చెబుతోంది. ఆ తర్వాత కొద్దికాలానికే శిష్యుల సంఖ్య 3,000కు, ఆ తర్వాత 5,000కు పెరిగింది. (అపొ. 1:15; 2:5-11, 41, 47; 4:4; 6:7) అభివృద్ధికి సంబంధించిన ఈ వార్తలు ఆ శిష్యులను ఎంతగా ప్రోత్సహించి ఉంటాయో గదా!” ఆ కారణంతోనే నేడు యెహోవాసాక్షులు “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అని చెప్పిన యేసు మాటల నెరవేర్పుగా ప్రపంచవ్యాప్తంగా నిర్వర్తించబడుతున్న సేవకు సంబంధించిన ఖచ్చితమైన నివేదికలను భద్రపరచడానికి కృషి చేస్తారు. (మత్తయి 24:14) అలాంటి నివేదికలు ప్రపంచ క్షేత్రంలో జరుగుతున్న సేవను వాస్తవికంగా తెలియజేస్తాయి. అవి ఎక్కడ సహాయం అవసరం, ఏ విధమైన సాహిత్యాలు అవసరం, ప్రకటనా పనిని ముందుకు తీసుకువెళ్లేందుకు ఎంత సాహిత్యం అవసరం అనేవి చూపిస్తాయి.
13 ఆ విధంగా, మన ప్రకటనా పనికి సంబంధించిన నివేదిక ఇవ్వడం రాజ్య సువార్త ప్రకటించమని మనకు ఇవ్వబడిన ఆజ్ఞను మరింత ఫలవంతంగా నెరవేర్చడానికి సహాయం చేస్తుంది. అంతేకాక, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో మన సహోదరులు చేస్తున్న సేవ గురించి విన్నప్పుడు మనమూ ప్రోత్సాహం పొందడం లేదా? భూవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి, విస్తరణ మనలో ఆనందాన్ని నింపుతూ, మరింత ఎక్కువ సేవ చేయడానికి మనలను పురికొల్పడమే కాక, మనకు యెహోవా ఆశీర్వాదపు హామీని కూడా ఇస్తాయి. మన వ్యక్తిగత రిపోర్టుకు ప్రపంచవ్యాప్త నివేదికలో చోటుందని తెలుసుకోవడం ఎంత సంతృప్తినిస్తుందో కదా! మొత్తంతో పోల్చినప్పుడు మన వ్యక్తిగత రిపోర్టు కొద్దిపాటిదైనా యెహోవా దానిని గమనించకపోడు. (మార్కు 12:42, 43) మీ వ్యక్తిగత రిపోర్టు లేకపోతే ప్రపంచవ్యాప్త నివేదిక అసంపూర్తిగానే ఉంటుందని గుర్తుంచుకోండి.
14 నిజమే, యెహోవా సమర్పిత సేవకునిగా ప్రతీ సాక్షి తన బాధ్యతగా నెరవేర్చేదంతా ఆయన రిపోర్టులో కనిపించదు. ఉదాహరణకు, ఆ రిపోర్టులో క్రమంగా చేసే వ్యక్తిగత బైబిలు అధ్యయనం, క్రైస్తవ కూటాలకు హాజరై వాటిలో భాగం వహించడం, సంఘ బాధ్యతలు, అవసరమైనప్పుడు తోటి విశ్వాసులకు సహాయం చేయడం, ప్రపంచవ్యాప్త రాజ్య పనికి ఇస్తున్న ఆర్థిక మద్దతు మొదలైనవి ఉండకపోవచ్చు. కాబట్టి, ప్రకటనా పనిలో వెనకపడకుండా మన ఆసక్తిని కాపాడుకోవడానికి మనమిచ్చే క్షేత్ర సేవా రిపోర్టు తనవంతు పాత్ర నిర్వహిస్తున్నప్పటికీ, దాని విషయంలో మనం సరైన దృక్కోణం కాపాడుకోవాలి. దానిని మనం మన నిత్యజీవార్హతను నిర్ణయించే ఆధ్యాత్మిక లైసెన్సుగా లేదా పాస్‌పోర్టుగా దృష్టించకూడదు.
‘సత్క్రియలయందు ఆసక్తిగా ఉండడం’
15 కాబట్టి క్రియలు మాత్రమే మనలను రక్షించలేకపోయినా, అవి అవసరమనేది స్పష్టం. అందుకే క్రైస్తవులు ‘సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలు’ అని పిలవబడడమే కాక, “ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచిం[చాలని]” ప్రోత్సహించబడ్డారు. (తీతు 2:14; హెబ్రీయులు 10:24) ఆ విషయాన్నే మరింత నొక్కిచెబుతూ మరో బైబిలు రచయితయైన యాకోబు సూటిగా ఇలా చెబుతున్నాడు: “ప్రాణము లేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.”—యాకోబు 2:26.
16 సత్క్రియలు ప్రాముఖ్యమైనవే అయినా, వాటిని చేయడానికిగల ఉద్దేశాలు అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యమైనవి. కాబట్టి అప్పుడప్పుడు మన ఉద్దేశాలను పరిశీలించుకోవడం జ్ఞానయుక్తం. అయితే, ఇతరుల ఉద్దేశాలను ఖచ్చితంగా తెలుసుకోవడం ఏ మానవునికీ సాధ్యం కాదు కాబట్టి, ఇతరులకు తీర్పుతీర్చే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. “పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు?” అనే ప్రశ్నతోపాటు, “అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే” అని కూడా మనకు జవాబు ఇవ్వబడింది. (రోమీయులు 14:4) సమస్తానికి యజమాని అయిన యెహోవా, ఆయన నియమించిన న్యాయాధిపతి క్రీస్తుయేసు మన క్రియలనుబట్టి మాత్రమే కాక, మన ఉద్దేశాలను, మనకొచ్చిన అవకాశాలను, మన ప్రేమను, మన భక్తినిబట్టి కూడా మనకు తీర్పు తీరుస్తారు. “దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము [‘నీ శక్తిమేరకు కృషిచేయుము,’ NW]” అని అపొస్తలుడైన పౌలు వ్రాసిన మాటల ద్వారా క్రైస్తవులకు ఆదేశించబడినది మనం చేశామా లేదా అనేది ఒక్క యెహోవా, క్రీస్తుయేసు మాత్రమే ఖచ్చితంగా నిర్ణయించగలరు.—2 తిమోతి 2:15; 2 పేతురు 1:10; 3:14.
17 యెహోవా మననుండి ఆశించే విషయంలో సహేతుకంగా ఉన్నాడు. యాకోబు 3:17, ప్రకారం “పైనుండివచ్చు జ్ఞానము . . . మృదువైనది” లేదా సహేతుకమైనది. ఈ విషయంలో మనం యెహోవాను అనుకరించడం జ్ఞానయుక్తమే కాక, వాస్తవ విజయంగా ఉండదా? కాబట్టి మననుండి లేదా మన సహోదరుల నుండి అసహేతుకమైనది, అసాధ్యమైనది ఆశించడానికి మనం ప్రయత్నించకూడదు.
18 మన విశ్వాస క్రియల విషయంలో, యెహోవా కృప విషయంలో సమతుల్య దృక్కోణాన్ని కలిగి ఉన్నంతవరకు, యెహోవా నిజ సేవకుల విశేష గుర్తింపు అయిన ఆనందాన్ని మనం కాపాడుకుంటాం. (యెషయా 65:13, 14) మనం వ్యక్తిగతంగా ఎంత చేయగలిగినప్పటికీ, ఒక గుంపుగా యెహోవా తన ప్రజలపై కుమ్మరిస్తున్న ఆశీర్వాదాలనుబట్టి మనం ఆనందించవచ్చు. ‘ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు దేవునికి తెలియజేస్తూనే’ మన శక్తిమేరకు కృషి చేయడానికి సహాయం చేయమని దేవుణ్ణి వేడుకుంటాం. అప్పుడు నిస్సందేహంగా, ‘సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకును మన తలంపులకును కావలియుండును.’ (ఫిలిప్పీయులు 4:4-7) అవును, కేవలం క్రియల ద్వారా కాదుగానీ, యెహోవా కృప మూలంగానే మనకు రక్షణ లభిస్తుందని తెలుసుకోవడం నుండి ఓదార్పునూ ప్రోత్సాహాన్నీ పొందగలం.
మీరు వివరించగలరా?
• క్రైస్తవులు వ్యక్తిగతంగా సాధించిన వాటి గురించి ఎందుకు గొప్పలు చెప్పుకోరు?
• క్రైస్తవులు పోటీతత్వానికి ఎందుకు దూరంగా ఉంటారు?
• క్రైస్తవులు క్షేత్ర పరిచర్యలోని తమ క్రైస్తవ కార్యశీలతను ఎందుకు నివేదిస్తారు?
• క్రైస్తవులు తమ తోటి క్రైస్తవులను ఎందుకు విమర్శించరు?
[అధ్యయన ప్రశ్నలు]
1. వ్యక్తిగతంగా సాధించిన కార్యాలకు సంబంధించి సాధారణ ప్రజలకు క్రైస్తవులు ఎలా భిన్నంగా ఉంటారు, ఎందుకు భిన్నంగా ఉంటారు?
2, 3. పౌలు ఏ విషయాన్నిబట్టి అతిశయించాడు, ఎందుకు అతిశయించాడు?
4. ఇతరులను మనకంటే యోగ్యులని పరిగణించడం కొన్నిసార్లు మనకు ఎందుకు కష్టంగా ఉండవచ్చు?
5. పోటీతత్వాన్ని అదుపులో ఉంచుకోకపోతే, అది దేనికి దారితీయగలదు?
6. పోటీతత్వం విషయంలో బైబిలు ఏమని హెచ్చరిస్తోంది?
7. నేటి పోటీతత్వ ఉద్యోగ స్థలంలో దేనికి దూరంగా ఉండాలని క్రైస్తవుడు కోరుకుంటాడు?
8, 9. (ఎ) క్రైస్తవ పెద్దలకు ఒకరితో ఒకరు పోటీపడాల్సిన అవసరం ఎందుకు లేదు? (బి) దేవుని సేవకులందరికీ 1 పేతురు 4:10 ఎందుకు వర్తిస్తుంది?
10. మన పవిత్ర సేవ యెహోవాకు ఏ విధంగా మాత్రమే అంగీకారమవుతుంది?
11. పరిచర్యలోని మన కార్యశీలతకు సంబంధించి ఏ ప్రశ్నలను పరిశీలించడం సముచితం?
12, 13. (ఎ) మన క్షేత్ర సేవా నివేదికను భద్రపరచడానికిగల కొన్ని కారణాలేమిటి? (బి) మన ప్రకటనా పని ప్రపంచవ్యాప్త నివేదికను చూసినప్పుడు ఆనందించడానికి మనకు ఎలాంటి కారణాలున్నాయి?
14. ప్రకటనా, బోధనా పనితోపాటు మన ఆరాధనలో ఇంకా ఏమేమి ఉంటాయి?
15. క్రియలు మాత్రమే మనలను రక్షించలేకపోయినా, అవి ఎందుకు అవసరం?
16. క్రియలకన్నా మరింత ప్రాముఖ్యమైనది ఏమిటి, కానీ మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి?
17. మన శక్తిమేరకు చేయడానికి మనం కృషి చేస్తూ యాకోబు 3:17ను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి?
18. మన క్రియల విషయంలో, యెహోవా కృప విషయంలో సమతుల్య దృక్కోణం ఉన్నప్పుడు మనం దేనికోసం ఎదురుచూడవచ్చు?
[15వ పేజీలోని చిత్రం]
“నా కృప నీకు చాలును”
[16, 17వ పేజీలోని చిత్రాలు]
సంఘ సంక్షేమానికి ప్రతీ ఒక్కరూ ఇచ్చే తోడ్పాటునుబట్టి పెద్దలు సంతోషిస్తారు
[18, 19వ పేజీలోని చిత్రాలు]
మీ వ్యక్తిగత రిపోర్టు లేకపోతే ప్రపంచవ్యాప్త నివేదిక అసంపూర్తిగానే ఉంటుంది