కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం ఎలాంటి పరీక్షలనైనా ఎదుర్కోవచ్చు!

మనం ఎలాంటి పరీక్షలనైనా ఎదుర్కోవచ్చు!

మనం ఎలాంటి పరీక్షలనైనా ఎదుర్కోవచ్చు!

మీ జీవితంలో ప్రస్తుతం మీరు ఏదైనా పరీక్షను ఎదుర్కొంటున్నారా? మీరు నిరుత్సాహపడుతున్నారా, దానిని ఎదుర్కోలేకపోతున్నారా? మీ సమస్య ప్రత్యేకమైనదనీ, దానికి ఎలాంటి పరిష్కారం లేదనీ మీరు కొన్నిసార్లు భయపడుతున్నారా? అలాగైతే ఉత్తేజితులు కండి! మనకు ఎలాంటి పరీక్షలు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు దేవుడు మనకు శక్తి ఇవ్వగలడని బైబిలు మనకు హామీ ఇస్తోంది.

దేవుని సేవకులు “నానా విధములైన శోధనల[ను]” ఎదుర్కొంటారనే విషయాన్ని బైబిలు అంగీకరిస్తోంది. (యాకోబు 1:⁠2) “నానా విధములైన” (గ్రీకులో పైకీలోస్‌) అనే పదాన్ని గమనించండి. ప్రాచీనకాలంలోని దాని వాడుక ప్రకారం, మూల గ్రీకు పదానికి “వివిధ రకాలు” అనే భావం ఉంది, అది “అనేక రకాల పరీక్షలు” ఉంటాయని నొక్కి చెబుతోంది. కాబట్టి ‘నానా విధములైన శోధనలు’ అంటే వివిధ రకాల పరీక్షలని చెప్పవచ్చు. అయితే వాటన్నింటినీ ఎదుర్కొనేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు. మనం అలాంటి నమ్మకంతో ఎందుకు ఉండవచ్చు?

“దేవుని నానావిధమైన కృప”

క్రైస్తవులకు ‘నానావిధములైన శోధనల ద్వారా దుఃఖము కలుగుచున్నది’ అని అపొస్తలుడైన పేతురు పేర్కొన్నాడు. (1 పేతురు 1:⁠6) ఆ తర్వాత, ఆయన తన ప్రేరేపిత పత్రికలో ‘దేవుని కృప నానా విధాలుగా’ వ్యక్తమవుతుందని పేర్కొన్నాడు. (1 పేతురు 4:​10) ‘నానా విధాలుగా’ అనే పదబంధంలో అదే మూల గ్రీకు పదరూపమే ఉంది. ఒక బైబిలు విద్వాంసుడు ఆ పదబంధం మీద వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నాడు: “ఇది ఒక అద్భుతమైన తలంపు. . . . దేవుని అనుగ్రహాన్ని [లేక, కృపను] పైకీలోస్‌ భావంలో వర్ణించడమంటే, దేవుని అనుగ్రహాన్ని చూపడానికి వీలుకాని మానవ పరిస్థితి ఏదీ లేదని భావం.” ఆయన ఇంకా ఇలా పేర్కొన్నాడు: “దేవుని అనుగ్రహం సరిచేయలేని, విజయవంతంగా వ్యవహరించలేని, అధిగమించలేని పరిస్థితులు, సంకటస్థితి, ఆకస్మిక పరిస్థితి లేక అత్యవసరత ఏదీ ఊహించలేం. దేవుని అనుగ్రహం ఎదుర్కోలేని పరిస్థితి జీవితంలో ఏదీ లేదు. పైకీలోస్‌ అనే వర్ణనాత్మకమైన ఈ పదం, వివిధ రకాలైన దేవుని అనుగ్రహం మనం అన్నిటిని సహించేలా సహాయం చేయడానికి సరిపోయేంత ఉందని మనకు స్పష్టంగా గుర్తు చేస్తోంది.”

దేవుని కృప పరీక్షలను సహించడానికి సహాయం చేస్తుంది

పేతురు చెబుతున్న ప్రకారం, దేవుని కృప వ్యక్తమయ్యే ఒక మార్గం, క్రైస్తవ సంఘంలో ఉన్న అనేకుల ద్వారా. (1 పేతురు 4:​11) పరీక్షలను ఎదుర్కొంటున్నవారికి ప్రోత్సాహానికి ఆధారంగా ఉండగల ఆధ్యాత్మిక వరాలు లేక సామర్థ్యాలు దేవుని సేవకులందరికీ ఉంటాయి. ఉదాహరణకు, సంఘంలోని కొందరు సభ్యులు మంచి బైబిలు బోధకులుగా ఉంటారు. వారి వివేచనతో కూడిన మాటలు, సహించడానికి ఇతరులకు ప్రేరణను, ప్రోత్సాహాన్ని ఇస్తాయి. (నెహెమ్యా 8:​1-4, 8, 12) మరికొందరు ఓదార్పు అవసరమైనవారిని క్రమంగా కాపరి సందర్శనాలు చేస్తారు. అలాంటి సందర్శనాలు ప్రోత్సహించడానికి, ‘హృదయాల ఆదరణకు’ దోహదపడే సందర్భాలు. (కొలొస్సయులు 2:⁠1) పైవిచారణకర్తలు అలా విశ్వాసాన్ని బలపరిచే సందర్శనాలు చేసినప్పుడు వారు ఆధ్యాత్మిక వరాన్ని ఇతరులకు అందిస్తారు. (యోహాను 21:​16) పరీక్షల కారణంగా దుఃఖంతో ఉన్న తోటి విశ్వాసులతో వ్యవహరిస్తున్నప్పుడు స్నేహం, కనికరం, మృదుత్వం చూపించే వారిగా సంఘంలో మరికొందరు పేరుగాంచారు. (అపొస్తలుల కార్యములు 4:36; రోమీయులు 12:10; కొలొస్సయులు 3:​10) అలాంటి ప్రేమగల సహోదర సహోదరీలు చూపించే తదనుభూతి, క్రియాశీల సహకారం దేవుని కృపకు సంబంధించిన ఒక ప్రాముఖ్యమైన వ్యక్తీకరణ.​—⁠సామెతలు 12:​25; 17:​17.

“సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు”

అన్నింటికన్నా ప్రాముఖ్యంగా యెహోవా ఆదరణను అంటే ఓదార్పును ఇస్తున్నాడు. ఆయన ‘సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, శ్రమ అంతటిలో మనలను ఆదరిస్తాడు.’ (2 కొరింథీయులు 1:​3, 4) దేవుని ప్రేరేపిత వాక్యంలో ఉన్న జ్ఞానం, ఆయన పరిశుద్ధాత్మ ఇచ్చే శక్తి, మనం సహాయం కోసం చేసే ప్రార్థనలకు యెహోవా జవాబులు ఇచ్చే ప్రధాన మార్గాలు. (యెషయా 30:18, 21; లూకా 11:13; యోహాను 14:​16) అపొస్తలుడైన పౌలు చేసిన ప్రేరేపిత వాగ్దానం నుండి మనం ప్రోత్సాహం పొందవచ్చు. ఆయన ఇలా చెప్పాడు: “దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.”​—⁠1 కొరింథీయులు 10:​13.

అవును మన పరీక్షల నైజం ఏదైనా వాటిని అధిగమించేందుకు సహాయం చేసే దేవుని కృపకు సంబంధించిన వ్యక్తీకరణ ఎప్పుడూ ఉంటుంది. (యాకోబు 1:​17) యెహోవా సేవకులకు ఎన్నో రకాల శోధనలు లేక సవాళ్ళు ఎదురైనా యెహోవా వారికి ఇచ్చే సమయానుకూలమైన, సరియైన మద్దతు ‘దేవుని నానావిధమైన జ్ఞానానికి’ నిదర్శనం. (ఎఫెసీయులు 3:⁠8) మీరు దీనితో అంగీకరించరా?

[31వ పేజీలోని చిత్రాలు]

పరీక్షలను ఎదుర్కొనేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు