కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారు తమను తాము అందుబాటులో ఉంచుకున్నారు

వారు తమను తాము అందుబాటులో ఉంచుకున్నారు

వారు తమను తాము అందుబాటులో ఉంచుకున్నారు

“నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు.” (కీర్తన 110:⁠3) ఆ మాటలు బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 118వ తరగతికి చెందిన 46 మంది విద్యార్థులకు ప్రత్యేక భావం కలిగి ఉన్నాయి. విదేశాల్లోని ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చేందుకు భావి మిషనరీలకు శిక్షణనిచ్చే ఆ పాఠశాలకు హాజరవడానికి వారు ఎలా సంసిద్ధులయ్యారు? 118వ తరగతికి చెందిన సభ్యులైన మైక్‌, స్టేసీలు ఇలా వివరించారు: “నిరాడంబర జీవితాన్ని గడపాలన్న మా నిర్ణయం అవధానాన్ని మళ్ళించేవాటిని తగ్గించుకోవడానికి, మా జీవితాల్లో ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యతనివ్వడానికి మాకు సహాయం చేసింది. వ్యాపార ప్రపంచంలో మేము సాధిస్తున్న విజయాలు, ఆధ్యాత్మిక లక్ష్యాలను మరుగునపడేయడానికి అనుమతించకూడదనే దృఢనిశ్చయంతో మేము ఉన్నాం.” మైక్‌, స్టేసీల్లాగే ఈ తరగతికి చెందిన ఇతర విద్యార్థులు ఇష్టపూర్వకంగా తమను తాము అందుబాటులో ఉంచుకొని ఇప్పుడు నాలుగు ఖండాల్లో రాజ్య ప్రచారకులుగా సేవ చేస్తున్నారు.

మార్చి 12, 2005 శనివారం 6,843 మంది ప్రేక్షకులు గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమాన్ని వింటున్నప్పుడు వారిలో సంతోషం స్పష్టంగా కనిపించింది. యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన థియోడోర్‌ జారస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించాడు. ఆయన 28 దేశాల నుండి విచ్చేసిన అతిథులను హృదయపూర్వకంగా ఆహ్వానించిన తర్వాత బైబిలు విద్యకున్న విలువవైపు దృష్టి సారించాడు. అమెరికా విద్యావేత్త అయిన విలియం లయాన్‌ ఫెల్ప్స్‌ చెప్పిన దానిని ఉదాహరిస్తూ ప్రసంగీకుడు ఇలా స్పష్టం చేశాడు: “బైబిలుకు సంబంధించిన సమగ్రమైన జ్ఞానము ఉన్న ప్రతీవ్యక్తిని విద్యావంతుడని పిలువవచ్చు.” లౌకిక విద్య ప్రయోజనకరమే కావచ్చు అయితే దానికన్నా బైబిలు విద్యే శ్రేష్ఠమైనది. అది నిత్యజీవానికి నడిపించే దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రజలకు సహాయం చేస్తుంది. (యోహాను 17:⁠3) ప్రపంచవ్యాప్తంగా 98,000 కన్నా ఎక్కువగా ఉన్న యెహోవాసాక్షుల సంఘాల్లో నిర్వహించబడుతున్న ప్రపంచవ్యాప్త బైబిలు విద్యా కార్యక్రమంలో ఎక్కువగా భాగం వహించేందుకు సంసిద్ధత చూపించినందుకు సహోదరుడు జారస్‌ పట్టభద్రులను ప్రశంసించాడు.

పట్టభద్రులకు సమయోచితమైన ప్రోత్సాహం

ఛైర్మన్‌ ప్రారంభ వ్యాఖ్యానాల తర్వాత విలియమ్‌ సామ్యుల్సన్‌, కీర్తన 52:⁠8 మీద ఆధారితమైన “మీరు దేవుని గృహంలో పచ్చని ఒలీవ చెట్టులా ఎలా ఉండవచ్చు” అనే అంశం మీద మాట్లాడారు. బైబిల్లో, ఒలీవ చెట్టు ఫలసమృద్ధికి, అందానికి, హుందాతనానికి అలంకారార్థంగా ఉపయోగించబడిందని ఆయన నొక్కి చెప్పాడు. (యిర్మీయా 11:​16) ప్రసంగీకుడు విద్యార్థులను ఒలీవచెట్లతో పోలుస్తూ ఇలా అన్నాడు: “మీ మిషనరీ నియామకాల్లో మీరు నమ్మకంగా రాజ్య ప్రకటనా పని చేస్తున్నప్పుడు, యెహోవా మిమ్మల్ని అందం, హుందాతనం ఉన్నవారిగా దృష్టిస్తాడు.” క్షామాన్ని తట్టుకుని నిలబడడానికి ఒలీవ చెట్టుకు ఎలాగైతే పెద్ద వేళ్ళు అవసరమవుతాయో అలాగే విదేశీ సేవలో ఎదురవగల ఉదాసీనతను, వ్యతిరేకతను, మరితర పరీక్షలను సహించేందుకు విద్యార్థులు తమ ఆధ్యాత్మిక వేళ్ళను బలపరచుకోవడం అవసరం.​—⁠మత్తయి 13:​21; కొలొస్సయులు 2:​6, 7.

కార్యక్రమంలో భాగం వహించిన ముగ్గురు పరిపాలక సభ సభ్యుల్లో ఒకరైన జాన్‌ ఇ. బార్‌ “మీరు లోకమునకు ఉప్పయి యున్నారు” అనే అంశం మీద మాట్లాడారు. (మత్తయి 5:​13) అక్షరార్థమైన ఉప్పు ఆహారం చెడిపోకుండా ఎలాగైతే కాపాడుతుందో అలాగే దేవుని రాజ్యం గురించి ప్రకటించే మిషనరీలు, వినేవారిపై ప్రాణాలను రక్షించే ప్రభావాన్ని చూపిస్తూ, వారు నైతికంగా ఆధ్యాత్మికంగా చెడిపోకుండా కాపాడతారు. ఆ తర్వాత సహోదరుడు బార్‌ వాత్సల్యం ఉట్టిపడే స్వరంతో, ఇతరులతో ‘సమాధానముగా ఉండమని’ పట్టభద్రులకు నొక్కిచెప్పాడు. (మార్కు 9:​50) “ఆత్మఫలాలను వృద్ధి చేసుకొని మీ ప్రవర్తన, మాటలు ఎల్లప్పుడూ దయాపూర్వకంగా, శ్రద్ధచూపించే విధంగా ఉండేలా చూసుకోండి” అని ప్రసంగీకుడు సలహా ఇచ్చాడు.

గిలియడ్‌ ఉపదేశకుల్లో ఒకరైన వాలెస్‌ లివరెన్స్‌ “లోతు నీళ్ళలో ఉన్నప్పుడు పడవలోనే ఉండండి” అనే అంశాన్ని నొక్కి చెప్పాడు. లోతుగా ఉన్న నీళ్ళలో ప్రయాణం చేస్తున్న ఒక నౌక ఎలాగైతే సరైన దిశలో ప్రయాణం చేయగలదో అలాగే “దేవుని మర్మముల” గురించిన అవగాహన అంటే దేవుని సంకల్పం, అది నెరవేరే విధానం గురించిన అవగాహన, ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి సహాయం చేయగలదు. (1 కొరింథీయులు 2:​10) “దేవోక్తులలో మొదటి మూలపాఠముల[తో]” సంతృప్తి చెందడం ద్వారా లోతులేని ఆధ్యాత్మిక నీళ్ళలోనే ఉండడం మన పురోభివృద్ధిని ఆటంకపరచడమే కాక ‘విశ్వాసవిషయమైన మన ఓడ బద్దలయ్యే’ అవకాశాన్ని కూడా అధికం చేయవచ్చు. (హెబ్రీయులు 5:12, 13; 1 తిమోతి 1:​19) “మీ మిషనరీ నియామకాల్లో ‘దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము’ మీకు సహాయం చేయును గాక” అని సహోదరుడు లివరెన్స్‌ ముగించాడు.​—⁠రోమీయులు 11:​33.

మరో గిలియడ్‌ ఉపదేశకుడైన మార్క్‌ న్యూమర్‌ “మీరు మీ వారసత్వానికి తగ్గట్టుగా జీవిస్తారా?” అనే అంశంపై మాట్లాడాడు. పాఠశాల పట్టభద్రులు ‘విస్తృతంగా ఇచ్చిన మంచి సాక్ష్యం’ కారణంగా దాదాపు 60 సంవత్సరాలకు పైగా ద వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ నమ్మకమైనదిగా అత్యుత్తమమైనదిగా పేరుగాంచింది. (ఆదికాండము 31:​48, NW) ఆ గిలియడ్‌ వారసత్వం 118వ తరగతికి చెందిన విద్యార్థులకు సంక్రమించింది. నెహెమ్యా కాలంలోని ప్రాచీన తెకోవీయులను అనుకరించి స్థానిక సంఘంతో, తోటి మిషనరీలతో వినయంగా సహకరించమని సహోదరుడు న్యూమర్‌ విద్యార్థులను ప్రోత్సహించారు. నెహెమ్యా పేర్కొన్న గర్విష్టులైన “జనుల అధికారుల” వైఖరిని అవలంబించవద్దనీ, దానికి బదులు ప్రజల దృష్టిలోపడాలని ప్రయాసపడకుండా వెనుక ఉండి నిశ్శబ్దంగా పనిచేయడానికి ఇష్టపడమనీ విద్యార్థులను హెచ్చరించాడు.​—⁠నెహెమ్యా 3:⁠5.

ఉపదేశాత్మకమైన అనుభవాలు, ఇంటర్వ్యూలు

కార్యక్రమంలో ఆ తర్వాత ‘దేవుని వాక్యం ప్రబలమైంది’ అనే ప్రసంగం ఇవ్వబడింది. (అపొస్తలుల కార్యములు 6:⁠7) విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నప్పుడు క్షేత్ర పరిచర్యలో తాము ఆనందించిన అనుభవాలను గిలియడ్‌ ఉపదేశకుడు లారెన్స్‌ బొవెన్‌ నిర్దేశంలో పునర్నటించారు. విద్యార్థులు దేవుని వాక్యాన్ని ఉత్సాహంగా ప్రకటించారని, యెహోవా వారి ప్రయత్నాలను మెండుగా ఆశీర్వదించాడని ఆ అనుభవాలు నిరూపించాయి.

రిచర్డ్‌ ఆశ్‌, పాఠశాలతో సన్నిహితంగా పనిచేసే బెతెల్‌ కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూ చేశాడు. గిలియడ్‌ విద్యార్థులు తమ పాఠశాల నుండి పూర్తి ప్రయోజనం పొందేలా బెతెల్‌ కుటుంబం సహకరిస్తున్న విధానాన్ని ఎక్కువగా అర్థం చేసుకొనేందుకు వారి వ్యాఖ్యానాలు సహాయం చేశాయి. ఆ తర్వాత జెఫ్రీ జాక్సన్‌ కొంతమంది పూర్వ గిలియడ్‌ పట్టభద్రులతో మాట్లాడాడు. యెహోవాను స్తుతించడానికి, ఘనపరచడానికి మిషనరీలకు దొరికే అనేక అవకాశాలను వారు నొక్కి చెప్పారు. వారిలో ఒకరు ఇలా వ్యాఖ్యానించారు: “మిషనరీలుగా మీరు చేసే ప్రతీది ప్రజలు గమనిస్తారు. వారు వింటారు, గమనిస్తారు, గుర్తుంచుకుంటారు.” అందుకే అన్ని సమయాల్లో మంచి మాదిరిగా ఉండాలనేది గుర్తుంచుకోవాలని విద్యార్థులు ప్రోత్సహించబడ్డారు. భవిష్యత్తులో ఆ ఆచరణాత్మకమైన సలహా అమూల్యమైనదని రుజువవుతుందనడంలో సందేహం లేదు.

పరిపాలక సభ సభ్యుడైన స్టీఫెన్‌ లెట్‌ “‘జీవజలాన్ని’ మోసేవారిగా వెళ్ళండి” అనే అంశం మీద ముగింపు ప్రసంగాన్ని ఇచ్చాడు. (యోహాను 7:​38) విద్యార్థులు గత ఐదు నెలలుగా దేవుని సత్యవాక్య జలాన్ని పుష్కలంగా ఆస్వాదించడం ద్వారా ఎంతో ప్రయోజనం పొందారని ఆయన వ్యాఖ్యానించాడు. క్రొత్త మిషనరీలు తాము నేర్చుకున్నవాటిని ఏమి చేస్తారు? ఇతరులు తమలో ‘నిత్యజీవం కోసం ఊరెడి నీటి బుగ్గను’ కలిగివుండేలా ఆ ఆధ్యాత్మిక నీళ్ళను నిస్వార్థంగా ఇతరులతో పంచుకోమని సహోదరుడు లెట్‌ పట్టభద్రులను ప్రోత్సహించాడు. (యోహాను 4:14) ప్రసంగీకుడు ఇంకా ఇలా చెప్పాడు: “‘జీవజలానికి మూలమైన’ యెహోవాకు, ఆయనకు తగిన గౌరవం, ఘనత ఇవ్వడాన్ని ఎప్పుడూ మరవకండి. క్షామపీడిత మహాబబులోను నుండి బయటికి వచ్చినవారికి ఓర్పుతో బోధించండి.” (యిర్మీయా 2:​13) ఆత్మను, పెండ్లి కుమార్తెను ఉత్సాహంగా అనుకరిస్తూ ‘రమ్ము! దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము’ అని ఎల్లప్పుడూ చెప్పాలని పట్టభద్రులను ప్రోత్సహించి సహోదరుడు లెట్‌ తన ప్రసంగాన్ని ముగించాడు.​—⁠ప్రకటన 22:​17.

సహోదరుడు జారస్‌ వివిధ దేశాల నుండి అందిన శుభాకాంక్షలు చదివి కార్యక్రమాన్ని ముగించారు. ఆ తర్వాత ఒక గిలియడ్‌ విద్యార్థి కృతజ్ఞతా పత్రాన్ని చదివాడు.

మీరు అవసరం అధికంగా ఉన్నచోట మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోగలరా? అలాగైతే ఆ పట్టభద్రులైన విద్యార్థుల్లాగే ఆధ్యాత్మిక లక్ష్యాల కోసం కృషి చేయండి. ఒక వ్యక్తి విదేశాల్లో ఒక మిషనరీగానో ఇంటికి సమీపంలో ఒక పరిచారకునిగానో దేవుని సేవలో సంతోషంగా తనను తాను ఇష్టపూర్వకంగా అర్పించుకున్నప్పుడు కలిగే ఆనందాన్ని సంతృప్తిని మీరూ పొందండి.

[13వ పేజీలోని బాక్సు]

తరగతి గణాంకాలు

ప్రాతినిధ్యం వహించిన దేశాల సంఖ్య: 8

పంపించబడిన దేశాల సంఖ్య: 19

విద్యార్థుల సంఖ్య: 46

సగటు వయస్సు: 33.0

సత్యంలో సగటు సంవత్సరాలు: 16.5

పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు: 12.9

[15వ పేజీలోని చిత్రం]

వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ యొక్క 118వ తరగతి పట్టభద్రులు

ఈ క్రింద ఉన్న లిస్టులో వరుసల సంఖ్య ముందు నుండి వెనక్కి లెక్కించబడ్డాయి, ప్రతి వరుసలోని పేర్లు ఎడమ నుండి కుడికి ఇవ్వబడ్డాయి.

(1) బ్రాక్‌మైర్‌, ఏ.; మలోనీ, ఎస్‌.; సైమండ్స్‌, ఎన్‌.; లోపెజ్‌, వై.; హోవర్డ్‌, సి. (2) జాజ్‌డ్రెబ్‌స్కీ, టి.; బ్రౌన్‌, డి.; హెర్నాన్‌డెజ్‌, హెచ్‌.; మలగాన్‌, ఐ.; జోన్స్‌, ఏ.; కనల్‌, ఎల్‌. (3) హోవర్డ్‌, జే.; లారూ, ఈ.; శామ్స్‌, బి.; హేయ్స్‌, ఎస్‌.; బ్రౌన్‌, ఓ. (4) బరెల్‌, జే.; హామర్‌, ఎమ్‌.; మేయర్‌, ఏ.; కిమ్‌, కే.; స్టాన్లీ, ఆర్‌.; రేనీ, ఆర్‌. (5) జాజ్‌డ్రెబ్‌స్కీ, పి.; జిలవెట్జ్‌, కే.; ఫరస్‌, ఎస్‌.; టోరెస్‌, బి.; టోరెస్‌, ఎఫ్‌. (6) కొన్నెల్‌, జే.; హెర్నాండెజ్‌, ఆర్‌.; మలోనీ, ఎమ్‌.; మాలాగాన్‌, జే.; శామ్స్‌, ఆర్‌.; హేయ్స్‌, జే. (7) ఫరస్‌, ఏ.; హామర్‌, జే.; స్టాన్లీ, జీ.; కిమ్‌, సి.; సైమండ్స్‌, ఎస్‌.; లోపెజ్‌, డి.; బరల్‌, డి. (8) బ్రాక్‌మైర్‌, డి.; మేయర్‌, జే.; రేనీ, ఎస్‌.; జిలవెట్జ్‌, ఎస్‌.; జోన్స్‌, ఆర్‌.; లారూ, జే.