కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలుపట్లగల ఆసక్తి ప్రశంసించబడింది

బైబిలుపట్లగల ఆసక్తి ప్రశంసించబడింది

బైబిలుపట్లగల ఆసక్తి ప్రశంసించబడింది

యెహోవాసాక్షుల్లో ఒకరైన మారియాన్నాకు 18 సంవత్సరాలు, ఆమె దక్షిణ ఇటలీలో నివసిస్తూ ఉన్నత పాఠశాల చివరి సంవత్సరం చదువుతోంది. ఆమె చదువుతున్న పాఠశాలలోనే యౌవనస్థులైన ఇంకా కొంతమంది సాక్షులు కూడా చదువుతున్నారు.

మారియాన్నా ఇలా వ్రాసింది: “ఇప్పటికి కొన్ని సంవత్సరాలుగా, మాలో కొంతమందిమి పాఠశాల విరామ సమయంలో ప్రతిదినం లేఖనాలను పరిశోధించడం అనే చిన్న పుస్తకంలోనుండి ప్రతిరోజూ ఆ రోజు కోసం ఉండే బైబిలు వచనాన్ని చదువుతున్నాం. స్టాఫ్‌రూమ్‌ దగ్గరున్న ఒక వసారాలో మాత్రమే మేమలా చదువుకోగలిగేవాళ్ళం. అయితే అక్కడంత నిశ్శబ్దంగా ఉండేది కాదు. అటుగా వెళ్తున్న టీచర్లలో చాలామంది మమ్మల్ని చూసేవారు, మేము ఏమి చేస్తున్నామో చూడడానికి కొంతమంది ఆగేవారు. వారలా ఆగడం మూలంగా, వారడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చే అవకాశం తరచూ మాకు దొరికేది. రోజుకు కనీసం ఒక్క టీచరైనా అలా ఆగేవారు. కొంతమంది బైబిలు వచనంపై మేము చేస్తున్న చర్చను వినడానికి ఆగి, సాక్షులమైన మాకు ఆధ్యాత్మిక విషయాలపై ఉన్న ఆసక్తినిబట్టి మమ్మల్ని మెచ్చుకునేవారు. ఒకసారి, స్టాఫ్‌రూమ్‌లోకి వచ్చి చర్చించుకోమని అసిస్టెంట్‌ ప్రిన్సిపాల్‌ మమ్మల్ని ఆహ్వానించారు.

“మేము దినవచనాన్ని ఎక్కడ చర్చించుకుంటున్నామో చూసి, మరింత నిశ్శబ్దంగావుండే తరగతి గదుల్లో ఒకదానిలో చర్చించుకోవడానికి అనుమతి ఇవ్వమని మా టీచరు ప్రిన్సిపాల్‌ను అడిగారు. ఆయన దానికి అనుమతించారు. మేముంచిన మంచి మాదిరికి మా టీచరు తరగతి అంతటి ముందు మమ్మల్ని మెచ్చుకున్నారు. యెహోవా మాకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతనుబట్టి మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం.”