కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వేలాదిమంది యెహోవా ఆరాధనను చేపడుతున్నారు

వేలాదిమంది యెహోవా ఆరాధనను చేపడుతున్నారు

“యెహోవా వలననే నాకు సహాయము కలుగును”

వేలాదిమంది యెహోవా ఆరాధనను చేపడుతున్నారు

అన్ని దేశాల ప్రజలు యెహోవా ఉన్నత ఆరాధన వైపు గుంపులుగా వస్తారని మన దినాల గురించిన బైబిలు ప్రవచనాలు ముందుగానే చెప్పాయి. ఉదాహరణకు, యెహోవా దేవుడు హగ్గయి ప్రవక్త ద్వారా ఇలా చెప్పాడు: “నేను అన్యజనులనందరిని కదలింపగా అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును.” (హగ్గయి 2:⁠7) మన కాలంలో అంటే “అంత్యదినములలో” జనాంగాలు, ప్రజలు యెహోవాను ఆమోదకరమైన విధంగా ఆరాధిస్తారని యెషయా, మీకా ప్రవక్తలు ప్రవచించారు.​—⁠యెషయా 2:2-4; మీకా 4:​1-4.

అలాంటి ప్రవచనాలు నేడు నిజంగా నెరవేరుతున్నాయా? మనం వాస్తవాలను పరిశీలిద్దాం. గత పది సంవత్సరాల్లోనే 230 కన్నా ఎక్కువ దేశాల్లో 31,10,000 కన్నా ఎక్కువమంది క్రొత్తవారు యెహోవాకు తమను తాము సమర్పించుకున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా సేవ చేస్తున్న ప్రతీ 10 మంది యెహోవాసాక్షుల్లో 6గురు గత దశాబ్దంలో బాప్తిస్మం తీసుకున్నవారే. 2004లో సగటున ప్రతీ రెండు నిమిషాలకు, క్రొత్తగా సమర్పించుకున్న ఒక వ్యక్తి దేవుని సేవకునిగా క్రైస్తవ సంఘంలోకి వచ్చి చేరారు! *

మొదటి శతాబ్దంలో జరిగినట్లే, నేడు కూడా ‘అనేకులు నమ్మి ప్రభువుతట్టు తిరిగారు.’ సంఖ్యాపరమైన అభివృద్ధి మాత్రమే దేవుని ఆశీర్వాదానికి రుజువు కాకపోయినా “[యెహోవా] హస్తము” తన ప్రజలతో ఉందనే రుజువును అది ఇస్తోంది. (అపొస్తలుల కార్యములు 11:​21) లక్షలాదిమందిని యెహోవా ఆరాధన వైపుకు ఏది నడిపిస్తోంది? ఆ అభివృద్ధి ద్వారా మీరు వ్యక్తిగతంగా ఎలా ప్రభావితులవుతున్నారు?

యథార్థ హృదయులు ఆకర్షితులవుతున్నారు

యేసు సూటియైన పదాలతో ఇలా చెప్పాడు: “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు.” (యోహాను 6:​44) కాబట్టి “నిత్యజీవం పట్ల సరైన మానసిక వైఖరిగల” ప్రజలను యెహోవాయే ఆకర్షిస్తాడు. (అపొస్తలుల కార్యములు 13:​48, NW) దేవుని ఆత్మ, ప్రజలు తమ ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించేలా చేయగలదు. (మత్తయి 5:⁠3) కలత చెందిన మనస్సాక్షి, నిరీక్షణ కోసం నిరాశతో కూడిన అన్వేషణ, పట్టువీడని సంక్షోభం వంటివి కొందరు దేవుని కోసం అన్వేషించేలా చేసి తద్వారా మానవజాతిపట్ల ఆయన సంకల్పం గురించి తెలుసుకోవడానికి దోహదపడవచ్చు.​—⁠మార్కు 7:26-30; లూకా 19:​2-10.

క్రైస్తవ సంఘపు బైబిలు విద్యా కార్యక్రమం తమను కలవరపెడుతున్న ప్రశ్నలకు జవాబులు పొందేందుకు సహాయం చేస్తుంది కాబట్టి చాలామంది యెహోవా ఆరాధన వైపు ఆకర్షితులవుతున్నారు.

“ఒకవేళ దేవుడుంటే, ప్రజలు అన్యాయాన్ని ఎందుకు అనుభవిస్తూనే ఉన్నారు?” ఆ ప్రశ్న, ఇటలీలోని డేవీడ్‌ అనే మాదకద్రవ్యాల వ్యాపారిని వేధించింది. ఆయనకు మతసంబంధమైన విషయాల్లో అంతగా ఆసక్తి లేదు కాబట్టి ఈ కష్టమైన ప్రశ్నను కేవలం వాదన కోసమే అడిగాడు. “నాకు సహేతుకమైన, ఒప్పింపజేసే జవాబు దొరకుతుందని నేను అనుకోలేదు, అయితే నాతో మాట్లాడిన సాక్షి చాలా ఓర్పుతో వ్యవహరించాడు, తాను చెబుతున్నదానికి మద్దతుగా బైబిలు వచనాలను చూపించాడు. ఆ సంభాషణ నా మీద ఎంతో ప్రభావం చూపించింది” అని ఆయన అన్నాడు. నేడు డేవీడ్‌ తన జీవితాన్ని సరిదిద్దుకొని, యెహోవాను సేవిస్తున్నాడు.

మరికొందరు అర్థం, సంకల్పం వంటివాటిని అన్వేషిస్తున్న కారణంగా యెహోవా సంస్థలోని భూసంబంధమైన భాగంలోకి వస్తున్నారు. క్రొయెషియాలోని జాగ్రేబ్‌కు చెందిన ఒక మానసిక వైద్యురాలు తన భావోద్రేక సమస్యలకు చికిత్స పొందడానికి ఒక ప్రఖ్యాత సహోద్యోగిని సందర్శించింది. ఆమెకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ వైద్యుడు ఆమెకు జాగ్రేబ్‌లో ఉన్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయపు ఫోన్‌ నంబరు ఇవ్వడమే కాక, తనకు తెలిసిన ఒక సాక్షి పేరు కూడా ఇచ్చాడు. “చూడండి, ఈ ప్రజలు మీకు సహాయం చేయగలరని నేను అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని చర్చికి పంపిస్తే మీరు అక్కడ జీవం లేని ప్రతిమలను మాత్రమే చూస్తారు, అక్కడ ఎవరూ మాట్లాడరు, ఆధ్యాత్మిక జ్ఞానోదయం ఉండదు. చర్చి మీకు సహాయం చేయగలదని నేను అనుకోవడంలేదు. నేను ఇతర రోగులను యెహోవాసాక్షుల దగ్గరికి పంపించాను, మీరు కూడా వారి దగ్గరికి వెళ్ళడం మీకు మంచిదని నేను భావిస్తున్నాను.” సాక్షులు ఆమెను దయతో సందర్శించి కొంతకాలానికి ఆమెతో బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించారు. కొద్ది వారాల్లో ఆ మానసిక వైద్యురాలు, దేవుని సంకల్పం గురించిన జ్ఞానం తన జీవితానికి అర్థాన్ని ఇచ్చిందని ఆనందంగా చెప్పింది.​—⁠ప్రసంగి 12:​13.

వ్యక్తిగత సంక్షోభం ఎదురైనప్పుడు బైబిలు సత్యం మాత్రమే నిజమైన ఓదార్పును ఇవ్వగలదని చాలామంది గ్రహించారు. గ్రీసులో, ఏడు సంవత్సరాల ఒక అబ్బాయి తన పాఠశాల పైకప్పు నుండి పడి మరణించాడు. కొన్ని నెలల తర్వాత ఇద్దరు సాక్షులు ఆ అబ్బాయి తల్లిని కలిసి పునరుత్థాన నిరీక్షణ గురించి చర్చించడం ద్వారా ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించారు. (యోహాను 5:​28, 29) అలా చర్చించినప్పుడు ఆ స్త్రీ కన్నీళ్ల పర్యంతమయింది. ఆ సహోదరీలు ఇలా అడిగారు: “మీరు బైబిలు గురించి ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే మేము మిమ్మల్ని ఎప్పుడు కలవవచ్చు?” “ఇప్పుడే” అని ఆమె జవాబిచ్చింది. ఆ స్త్రీ వారిని తన ఇంట్లోకి తీసుకువెళ్ళింది, బైబిలు అధ్యయనం ప్రారంభించబడింది. నేడు ఆమె కుటుంబ సభ్యులంతా యెహోవాను సేవిస్తున్నారు.

మీరు భాగం వహిస్తున్నారా?

అలాంటి అనుభవాలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దానికి నమూనాలు. యెహోవా, సత్య ఆరాధకుల గొప్ప బహుళజాతి గుంపును సమకూరుస్తున్నాడు, శిక్షణను ఇస్తున్నాడు. ఆ అంతర్జాతీయ గుంపుకు, సమీపిస్తున్న ఈ దుష్ట విధానపు అంతంలో తప్పించుకొని నీతియుక్త నూతనలోకంలో జీవించే సంతోషకరమైన భావి నిరీక్షణ ఉంది.​—⁠2 పేతురు 3:​13.

యెహోవా ఆశీర్వాదం కారణంగా, ఇంతకుముందెన్నడూ జరగని సమకూర్చే పని, విజయవంతంగా పూర్తయ్యే దిశలో నిరాటంకంగా ముందుకు సాగుతోంది. (యెషయా 55:10, 11; మత్తయి 24:​3, 14) ఈ రాజ్య ప్రకటనా పనిలో మీరు ఉత్సాహంగా పాల్గొంటున్నారా? మీరు పాల్గొంటున్నట్లయితే ఆ పనికి దైవిక మద్దతు ఉందనే నమ్మకంతో ఉండి, కీర్తనకర్త చెప్పిన ఈ వాక్యాలను మీరు ప్రతిధ్వనింపజేయవచ్చు: “యెహోవావలననే నాకు సహాయము కలుగును.”​—⁠కీర్తన 121:⁠2.

[అధస్సూచి]

^ పేరా 4 యెహోవాసాక్షుల క్యాలెండర్‌ 2005 (ఆంగ్లం)లో సెప్టెంబరు/అక్టోబరు చూడండి.

[9వ పేజీలోని బ్లర్బ్‌]

“నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు.”—యోహాను 6:​44

[8వ పేజీలోని బాక్సు]

ఈ అభివృద్ధికి కారకులు ఎవరు?

“యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే.”​—⁠కీర్తన 127:⁠1.

“వృద్ధి కలుగజేసినవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనేగాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.” ​—⁠1 కొరింథీయులు 3:​6, 7.