అహంకారులుగా తయారవకుండా జాగ్రత్తపడండి
అహంకారులుగా తయారవకుండా జాగ్రత్తపడండి
‘దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు.’—యాకోబు 4:6.
మీకు గర్వకారణమైన సంఘటనేదైనా జరిగిందా? మనలో చాలామందిమి ఆ సంతోషానుభూతిని అనుభవించే ఉంటాం. మనం కొన్నిసార్లు కాస్త గర్వపడడం తప్పేమీ కాదు. ఉదాహరణకు, ఒక క్రైస్తవ దంపతులు పాఠశాలలో తమ కుమార్తె మంచిగా ప్రవర్తిస్తోందనీ, కష్టపడి చదువుతోందనీ ఆమె గురించిన నివేదికను చూసినప్పుడు వారి ముఖాలు సంతృప్తితో ప్రకాశిస్తాయి. అపొస్తలుడైన పౌలు, ఆయన సహవాసులు సంఘ స్థాపనలో తాము దోహదపడిన క్రొత్త సంఘాన్నిబట్టి అతిశయించారు లేదా గర్వంగా భావించారు, ఎందుకంటే ఆ సంఘంలోని సహోదరులు హింస ఎదురైనా నమ్మకంగా సహించారు.—1 థెస్సలొనీకయులు 1:1, 6; 2:19, 20; 2 థెస్సలొనీకయులు 1:1, 4.
2 పై ఉదాహరణల ద్వారా, గర్వమనేది తాము చేసిన పనినిబట్టి లేదా తమ దగ్గరున్న దానినిబట్టి కలిగే ఆనందభరితమైన భావాలను సూచిస్తుందని మనం చూడవచ్చు. అయితే గర్వం తరచుగా అనుచిత స్వాభిమానాన్ని, ఒక వ్యక్తి తన సామర్థ్యాలనుబట్టి, రూపాన్నిబట్టి, సంపదనుబట్టి లేదా హోదానుబట్టి తనే గొప్పవాడినని తలంచడాన్ని సూచిస్తుంది. అది తరచూ దురుసుతనంలో, అహంకార ప్రవర్తనలో కనబడుతుంది. అలాంటి గర్వం విషయంలో క్రైస్తవులముగా మనం తప్పకుండా జాగ్రత్తపడాలి. ఎందుకు? ఎందుకంటే మన పితరుడైన ఆదాము నుండి వారసత్వంగా పొందిన స్వార్థ స్వభావం మనలో జన్మతః ఉంది. (ఆదికాండము 8:21) కాబట్టి మన హృదయాలు తప్పుడు కారణాలనుబట్టి గర్వించేలా మనల్ని సులభంగా తప్పుదోవ పట్టించగలవు. ఉదాహరణకు క్రైస్తవులు, ఇతరులతో పోలిస్తే తమ జాతి, సంపద, విద్య, సహజ సామర్థ్యాలు లేదా పనితనం గొప్పవని భావిస్తూ గర్వించకుండా జాగ్రత్త వహించాలి. అలాంటి వాటివల్ల కలిగే గర్వం అనుచితమైనదే కాక, అది యెహోవాకు అయిష్టమైనది కూడా.—యిర్మీయా 9:23; అపొస్తలుల కార్యములు 10:34, 35; 1 కొరింథీయులు 4:7; గలతీయులు 5:26; 6:3, 4.
3 అనుచిత గర్వాన్ని విడిచిపెట్టడానికి మరో కారణముంది. అలాంటి అనుచిత గర్వం పెరగడానికి మనం అనుమతిస్తే, అది అహంకారమని పిలువబడే చాలా హేయమైన గర్వానికి దారితీయగలదు. మరి అహంకారమంటే ఏమిటి? ఒక అహంకారి ఇతరులకన్నా తానే ఉత్తముడనని తలంచడమేకాక ఇతరులను అల్పులుగా దృష్టిస్తూ వారిని చిన్నచూపు చూస్తాడు. (లూకా 18:9; యోహాను 7:47-49) యేసు ‘అహంభావాన్ని’ లేక అహంకారాన్ని ‘హృదయములోనుండి’ బయలువెళ్లి ఒక ‘మనుష్యుని అపవిత్రపరిచే’ ఇతర దుష్ట లక్షణాలతోపాటు పేర్కొన్నాడు. (మార్కు 7:20-23) కాబట్టి అహంకారులుగా తయారవకుండా ఉండడం ఎంత ఆవశ్యకమో క్రైస్తవులు గ్రహించవచ్చు.
4 అహంకారుల గురించిన కొన్ని బైబిలు వృత్తాంతాలను పరిశీలించడం ద్వారా మీరు అహంకారాన్ని విసర్జించేందుకు సహాయం పొందవచ్చు. ఆ విధంగా మీరు, అంతర్లీనంగా మీలో ఉన్న లేదా కొంతకాలానికి మీలో వృద్ధికాగల అనుచిత గర్వ భావాలను కనిపెట్టగల మంచి స్థితిలో జెఫన్యా 3:11.
ఉంటారు. ఇది అహంకార హృదయానికి దారితీయగల తలంపులను లేదా భావాలను తిరస్కరించడానికి మీకు సహాయం చేస్తుంది. ఫలితంగా, దేవుడు ఈ హెచ్చరిక ప్రకారం చర్య తీసుకున్నప్పుడు మీరు హానికర ప్రభావానికి గురికారు: “ఆ దినమున నీ గర్వమునుబట్టి సంతోషించువారిని నీలోనుండి నేను వెళ్లగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు.”—దేవుడు అహంకారులపై చర్య తీసుకుంటాడు
5 ఫరోలాంటి శక్తిమంతమైన పరిపాలకులతో యెహోవా వ్యవహరించిన విధానంలో కూడా అహంకారాన్ని ఆయన ఎలా దృష్టిస్తున్నాడో మనం చూడవచ్చు. ఫరో అహంకారి అనడంలో సందేహం లేదు. అతడు తనను తాను ఆరాధనకు తగిన దేవునిగా పరిగణించుకుంటూ తన బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులను ఈసడించుకున్నాడు. యెహోవాకు “ఉత్సవము” చేయడానికి అరణ్యానికి వెళ్లేలా ఇశ్రాయేలీయులను అనుమతించాలని అడిగినప్పుడు అతడెలా స్పందించాడో గమనించండి. ఫరో అహంకారంతో ఇలా అన్నాడు: “నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు?”—నిర్గమకాండము 5:1, 2.
6 ఫరో ఆరు తెగుళ్లు అనుభవించిన తర్వాత, ఆ ఐగుప్తు పరిపాలకునికి ఇలా చెప్పమని యెహోవా మోషేకు చెప్పాడు: “నీవు ఇంక నా ప్రజలను పోనియ్యనొల్లక వారిమీద అతిశయపడుచున్నావు.” (నిర్గమకాండము 9:17) ఆ తర్వాత మోషే, ఏడవ తెగులును అంటే ఆ దేశాన్ని నాశనం చేసిన వడగండ్లను ప్రకటించాడు. పదవ తెగులు తర్వాత ఇశ్రాయేలీయులను పంపించిన వెంటనే ఫరో తన మనసు మార్చుకొని వారిని తరుముకుంటూ వెళ్లాడు. చివరకు ఫరో అతని సైన్యం ఎర్ర సముద్రంలో చిక్కుకుపోయింది. వారి మీదకు నీళ్లు విరుచుకుపడినప్పుడు వారేమి ఆలోచించి ఉంటారో ఊహించండి! ఫరో అహంకారానికి ఎలాంటి ఫలితం దక్కింది? అతని సర్వశ్రేష్ఠ సైనిక దళాలు ఇలా చెప్పుకున్నాయి: “ఇశ్రాయేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు.”—నిర్గమకాండము 14:25.
7 ఇతర అహంకార పాలకులు కూడా యెహోవా చేతిలో అవమానానికి గురయ్యారు. వారిలో ఒకడు అష్షూరు రాజైన సన్హెరీబు. (యెషయా 36:1-4, 20; 37:36-38) అష్షూరును చివరకు బబులోనీయులు జయించారు, అయితే అహంకారులైన ఇద్దరు బబులోను రాజులు కూడా అవమానానికి గురయ్యారు. బెల్షస్సరు, రాజవంశ అతిథులు యెరూషలేము ఆలయం నుండి తీసుకొచ్చిన పాత్రల్లో ద్రాక్షారసం త్రాగుతూ, బబులోను దేవతలను ప్రస్తుతించిన విందును గుర్తుచేసుకోండి. అకస్మాత్తుగా మానవ హస్తపు వేళ్లు గోడమీద ప్రత్యక్షమై దానిపై ఒక సందేశాన్ని వ్రాశాయి. గోడమీది ఆ నిగూఢ సందేశాన్ని వివరించమని అడిగినప్పుడు ప్రవక్తయైన దానియేలు బెల్షస్సరుకు ఇలా గుర్తుచేశాడు: ‘మహోన్నతుడగు దేవుడు రాజ్యమును నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను. అయితే అతడు మనస్సున అతిశయించగా, దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. బెల్షస్సరూ, అతని కుమారుడవగు నీవు ఈ సంగతియంతయు ఎరిగి యుండియు, నీ మనస్సును అణచుకోలేదు.’ (దానియేలు 5:3, 18, 20, 22) ఆ రాత్రే మాదీయ, పారసీక సైన్యం బబులోనును జయించడంతో బెల్షస్సరు హతుడయ్యాడు.—దానియేలు 5:30, 31.
8 యెహోవా ప్రజలను తృణీకరించిన ఇతర అహంకారుల విషయం కూడా ఆలోచించండి: ఫిలిష్తీయుడైన గొల్యాతు, పర్షియా ప్రధానమంత్రియైన హామాను, యూదా ప్రాంతాన్ని పాలించిన రాజైన హేరోదు అగ్రిప్ప. ఈ ముగ్గురు తమ అహంకారం కారణంగా దేవుని చేతిలో అవమానకరమైన మరణం అనుభవించారు. (1 సమూయేలు 17:42-51; ఎస్తేరు 3:5, 6; 7:10; అపొస్తలుల కార్యములు 12:1-3, 21-23) ఆ అహంకారులతో యెహోవా వ్యవహరించిన తీరు ఈ సత్యాన్ని నొక్కిచెబుతోంది: “నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును.” (సామెతలు 16:18) అవును, ‘దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు’ అనడంలో సందేహమే లేదు.—యాకోబు 4:6.
9 ఐగుప్తు, అష్షూరు, బబులోను అహంకార పాలకులకు భిన్నంగా తూరు రాజు ఒకప్పుడు దేవుని ప్రజలకు సహాయకునిగా ఉన్నాడు. దావీదు, సొలొమోను రాజుల పరిపాలనా కాలంలో ఆయన దేవుని ఆలయం కోసం, రాజ భవనాల కోసం నిపుణతగల పనివారిని, వస్తుసామగ్రిని పంపించాడు. (2 సమూయేలు 5:11; 2 దినవృత్తాంతములు ) కానీ విచారకరంగా, ఆ తర్వాత తూరు రాజులు యెహోవా ప్రజలకు వ్యతిరేకంగా తిరిగారు. వారిలో ఆ మార్పుకు కారణమేమిటి?— 2:11-16కీర్తన 83:3-7; యోవేలు 3:4-6; ఆమోసు 1:9, 10.
‘నీవు గర్వించినవాడవైతివి’
10 తూరు రాజుల రాజవంశపు నిజస్వరూపాన్ని వెల్లడిచేసి, ఖండించడానికి యెహోవా తన ప్రవక్తయైన యెహెజ్కేలును ప్రేరేపించాడు. “తూరు రాజును” ఉద్దేశించి ప్రకటించిన ఆ సందేశంలో తూరు రాజవంశాన్నీ, ‘సత్యమందు నిలవని’ ప్రథమ ద్రోహియైన సాతానును సరిగ్గా వర్ణించే మాటలు ఉన్నాయి. (యెహెజ్కేలు 28:12; యోహాను 8:44) సాతాను ఒకప్పుడు యెహోవా పరలోక కుమారుల సంస్థలో విశ్వసనీయ ఆత్మప్రాణిగా ఉన్నాడు. ఇటు తూరు రాజవంశం, అటు సాతాను ద్రోహులవడానికిగల ప్రాథమిక కారణాన్ని యెహోవా దేవుడు యెహెజ్కేలు ద్వారా సూచించాడు:
11 ‘దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, అమూల్య రత్నములతో నీవు అలంకరింపబడి యున్నావు. అభిషేకము నొందిన కెరూబువై నీవుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తనవిషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముచేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి. గనుక ఆశ్రయముగా ఉన్న కెరూబూ నిన్ను నాశనము చేసితిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి.’ (యెహెజ్కేలు 28:13-17) అవును, తూరు రాజుల అహంకారమే యెహోవా ప్రజలపై దౌర్జన్యం చేసేలా వారిని పురికొల్పింది. వ్యాపార కూడలిగా తూరు విస్తారమైన సంపదను కూడగట్టుకొని, దాని సర్వసౌందర్య వస్తువులకు పేరుగాంచింది. (యెషయా 23:8, 9) తూరు రాజులు విపరీతమైన అహంభావంతో దేవుని ప్రజలను అణచివేయడం ఆరంభించారు.
12 అదే విధంగా, సాతానుగా మారిన ఆత్మప్రాణికి ఒకప్పుడు, దేవుడు తనకు అప్పగించిన ఏ పనినైనా చేయడానికి కావలసిన జ్ఞానం ఉంది. కృతజ్ఞతతో ఉండే బదులు అతడు “గర్వాంధుడై” దేవుని పరిపాలనా విధానాన్నే తృణీకరించడం ఆరంభించాడు. (1 తిమోతి 3:6) అతడు అహంభావంతో ఆదాము హవ్వల ఆరాధనను కోరుకున్నాడు. ఆ దురాశే గర్భము ధరించి పాపానికి జన్మనిచ్చింది. (యాకోబు 1:14, 15) దేవుడు నిషేధించిన ఒకేఒక వృక్ష ఫలాల్ని తినేలా సాతాను హవ్వను మోసగించాడు. ఆ తర్వాత సాతాను, ఆదాము కూడా ఆ నిషేధిత ఫలాలను తినేలా చేయడానికి ఆమెను ఉపయోగించుకున్నాడు. (ఆదికాండము 3:1-6) అలా ఆ మొదటి మానవ దంపతులు తమపై దేవునికున్న పరిపాలనా హక్కును తిరస్కరించి, సాతాను ఆరాధకులుగా మారారు. దానితో అతని అహంకారానికి హద్దుల్లేకుండా పోయింది. యేసుక్రీస్తుతోసహా అటు పరలోకంలో, ఇటు భూమ్మీద ఉన్న బుద్ధిసూక్ష్మతగల ప్రాణులందరూ యెహోవా సర్వాధిపత్యాన్ని నిరాకరించి తనను ఆరాధించేలా వారిని మోసగించడానికి అతడు ప్రయత్నించాడు.—మత్తయి 4:8-10; ప్రకటన 12:3, 4, 9.
13 కాబట్టి అహంకారం సాతానుతో మొదలవడాన్ని మీరు చూడవచ్చు; అదే నేడు లోకంలోవున్న పాపానికీ, 2 కొరింథీయులు 4:4) తనకు సమయం కొద్దిగానే ఉందని తెలుసు కాబట్టి అతను నిజ క్రైస్తవులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాడు. వారిని దేవునికి దూరం చేసి, వారిని స్వార్థప్రియులుగా, బింకములాడేవారిగా, అహంకారులుగా మార్చాలన్నదే అతడి లక్ష్యం. ఈ “అంత్యదినములలో” అలాంటి స్వార్థపూరిత లక్షణాలు మామూలేనని బైబిలు ముందుగానే చెప్పింది.—2 తిమోతి 3:1, 2; ప్రకటన 12:12, 17.
బాధలకూ, అవినీతికీ ప్రాథమిక కారణం. “యుగసంబంధమైన దేవత”గా సాతాను గర్వానికి, అహంకారానికి సంబంధించిన అనుచిత భావాలను నిరంతరం పురికొల్పుతున్నాడు. (14 యేసుక్రీస్తు అయితే సాతాను అహంకారపు తలంపులను ధైర్యంగా వెల్లడిచేశాడు. యేసు కనీసం మూడు సందర్భాల్లో స్వనీతిపరులైన శత్రువుల సమక్షంలో మానవులతో యెహోవా వ్యవహరించే ఈ నియమాన్ని స్థిరపరిచాడు: “తన్నుతాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.”—లూకా 14:11; 18:14; మత్తయి 23:12.
అహంకారం విషయంలో జాగ్రత్తగా ఉండండి
15 అహంకారానికి సంబంధించి పైన ప్రస్తావించబడిన ఉదాహరణల్లో ప్రముఖ వ్యక్తులు ఉన్నట్లు మీరు గమనించే ఉంటారు. అంటే సాధారణ ప్రజలు అహంకారులయ్యే అవకాశం లేదని దానర్థమా? అలా అని కాదు. అబ్రాహాము కుటుంబీకుల మధ్య జరిగిన ఒక సంఘటనను పరిశీలించండి. ఆ పితరునికి వారసుడు కాగల కుమారుడు లేడు, పైగా ఆయన భార్య శారాకు పిల్లలు కనే వయస్సు దాటిపోయింది. ఆ రోజుల్లో, అబ్రాహాము పరిస్థితిలో ఉన్న పురుషుడు రెండవ భార్యను చేసుకొని పిల్లల్ని కనడం వాడుక. అలాంటి వివాహాలను దేవుడు అనుమతించాడు ఎందుకంటే సత్యారాధకుల్లో వివాహానికి సంబంధించిన తన ఆది సంకల్పాన్ని పునఃస్థాపించేందుకు అది సమయం కాదు.—మత్తయి 19:3-9.
16 ఆయన భార్య శారా ప్రోద్బలంతో, ఐగుప్తు దాసియైన హాగరు ద్వారా తన వారసుడుకాగల సంతానాన్ని కనేందుకు అంగీకరించాడు. అబ్రాహాము రెండవ భార్యగా హాగరు గర్భవతి అయింది. తనకు లభించిన గౌరవనీయమైన ఆ హోదాపట్ల ఆమె ప్రగాఢ కృతజ్ఞతను చూపించాల్సింది. కానీ ఆమె తన హృదయం అహంకారంతో నిండిపోయేందుకు అనుమతించింది. బైబిలు ఇలా చెబుతోంది: “తాను గర్భవతి నైతినని తెలిసికొనినప్పుడు దాని యజమానురాలు దానిదృష్టికి నీచమైనదాయెను.” ఆ వైఖరి అబ్రాహాము కుటుంబంలో ఎంత తగవులాటకు దారి తీసిందంటే చివరకు శారా హాగరును తన ఇంటినుండి వెళ్లగొట్టే పరిస్థితి వచ్చింది. అయితే ఆ సమస్యకు పరిష్కారముంది. దేవుని దూత హాగరుకు ఇలా సలహా ఇచ్చాడు: “నీ యజమానురాలియొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగియుండుము.” (ఆదికాండము 16:4, 9) హాగరు ఆ సలహాను పాటించి, శారాపట్ల తన వైఖరిని మార్చుకొని ఒక పెద్ద జనాంగానికి పూర్వీకురాలయ్యింది.
17 ఒకరి హోదా పెరిగినప్పుడు అహంకారం పుట్టే అవకాశముందని హాగరు ఉదాహరణ చూపిస్తోంది. పాఠమేమిటంటే, దేవుని సేవలో మంచి హృదయం కనబరచిన క్రైస్తవుడు సహితం, ధనం లేదా అధికారం సంపాదించుకున్నప్పుడు అహంకారిగా మారే అవకాశముంది. ఇతరులు ఆయన విజయాన్నిబట్టి, జ్ఞానాన్నిబట్టి లేదా సామర్థ్యాన్నిబట్టి ఆయనను కొనియాడినప్పుడు కూడా అలాంటి దృక్పథం వృద్ధికావచ్చు. అవును, ఒక క్రైస్తవుడు తన హృదయంలో అహంకారం వృద్ధికాకుండా జాగ్రత్తపడాలి. ప్రత్యేకంగా ఆయన విజయం సాధించినప్పుడు లేదా మరిన్ని బాధ్యతలు లభించినప్పుడు అలా జరుగుతుంది.
18 అహంకారానికి దూరంగా ఉండేందుకు అత్యంత శక్తిమంతమైన కారణం, ఆ లక్షణం విషయంలో దేవుని దృక్కోణమే. ఆయన వాక్యం ఇలా చెబుతోంది: “అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు.” (సామెతలు 21:4) ఆసక్తికరమైన విషయమేమిటంటే, బైబిలు ప్రత్యేకంగా “ఇహమందు ధనవంతులైన” క్రైస్తవులు అహంకారులు లేదా “గర్విష్ఠులు” కాకూడదని హెచ్చరిస్తోంది. (1 తిమోతి 6:17; ద్వితీయోపదేశకాండము 8:11-17) ధనవంతులుకాని క్రైస్తవులు ‘లోభత్వాన్ని’ విసర్జించడమే కాక, అహంకారం ఎవరిలోనైనా అంటే ధనవంతుల్లోనైనా బీదవారిలోనైనా వృద్ధి కాగలదని గుర్తుంచుకోవాలి.—మార్కు 7:21-23; యాకోబు 4:5.
19 ఇతర దుష్ట లక్షణాలతోపాటు అహంకారం యెహోవాతో మంచి సంబంధాన్ని పాడుచేయగలదు. ఉదాహరణకు, రాజైన ఉజ్జియా పరిపాలనా తొలికాలాన్నే పరిశీలించండి, అతను “యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. . . . అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను.” (2 దినవృత్తాంతములు 26:4, 5) అయితే విచారకరంగా, ఉజ్జియా తన మంచి పేరును పాడుచేసుకున్నాడు ఎందుకంటే “అతడు మనస్సున గర్వించి చెడిపోయెను.” అతడు ఎంత అహంకారిగా మారాడంటే, ధూపం వేయడానికి ఆలయంలో ప్రవేశించాడు. దురహంకారంతో ఆ పని చేయవద్దని యాజకులు హెచ్చరించినప్పుడు ‘ఉజ్జియా రౌద్రుడయ్యాడు.’ ఫలితంగా, యెహోవా అతణ్ణి కుష్ఠువ్యాధితో మొత్తగా అతడు దేవుని అనుగ్రహం కోల్పోయి మరణించాడు.—2 దినవృత్తాంతములు 26:16-21.
20 అతనికీ రాజైన హిజ్కియా ఉదాహరణకూ మధ్యవున్న తేడాను మీరు గమనించవచ్చు. ఒకానొక సందర్భంలో “మనస్సున గర్వించిన” కారణంగా ఆ రాజుకున్న మంచి పేరు ప్రమాదంలోపడింది. అయితే సంతోషకరమైన విషయమేమిటంటే, ‘హిజ్కియా హృదయగర్వము విడచి, తననుతాను తగ్గించుకొన్నాడు.’ (2 దినవృత్తాంతములు 32:25, 26) హిజ్కియా అహంకారానికి సరైన మందు వినయం అనే విషయాన్ని గమనించండి. అవును, వినయం అహంకారానికి విరుద్ధమైనది. కాబట్టి తర్వాతి ఆర్టికల్లో క్రైస్తవ వినయాన్ని అలవరచుకొని దానిని ఎలా కాపాడుకోవచ్చో మనం పరిశీలిద్దాం.
21 అయితే అహంకారం కలిగించే సమస్త చెడును మనం మరచిపోకుండా ఉందాం. ‘దేవుడు అహంకారులను యెషయా 2:17.
ఎదిరిస్తాడు’ కాబట్టి అనుచిత అహంకార భావాలను తృణీకరించేందుకు మనం ధృడంగా నిశ్చయించుకుందాం. వినయంగల క్రైస్తవులుగా ఉండేందుకు మనం కృషి చేస్తుండగా, అహంకారులతోపాటు వారి ఫలాలు కూడా భూమినుండి తొలగించబడే దేవుని మహా దినాన్ని తప్పించుకోవడం కోసం మనం ఎదురుచూడవచ్చు. “అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును, మనుష్యుల గర్వము తగ్గింపబడును; ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.”—ధ్యానించవలసిన అంశాలు
• అహంకారిని మీరెలా వర్ణిస్తారు?
• అహంకారం ఎలా మొదలైంది?
• ఒక వ్యక్తి అహంకారిగా మారేందుకు ఏది కారణం కాగలదు?
• అహంకారం విషయంలో మనమెందుకు జాగ్రత్తగా ఉండాలి?
[అధ్యయన ప్రశ్నలు]
1. సముచితమైన గర్వానికి సంబంధించిన ఒక ఉదాహరణ చెప్పండి.
2. సాధారణంగా గర్వభావాలు ఎందుకు కోరదగినవి కావు?
3. అహంకారమంటే ఏమిటి, దాని గురించి యేసు ఏమి చెప్పాడు?
4. అహంకారుల గురించిన బైబిలు ఉదాహరణలను పరిశీలించడం మనకెలా సహాయం చేయగలదు?
5, 6. ఫరో అహంకారాన్ని ఎలా ప్రదర్శించాడు, దాని ఫలితమేమిటి?
7. బబులోను పాలకులు ఎలా అహంకారం చూపించారు?
8. అహంకారులైన వివిధ వ్యక్తులతో యెహోవా ఎలా వ్యవహరించాడు?
9. తూరు రాజులు ఎలా ద్రోహులయ్యారు?
10, 11. (ఎ) తూరు రాజులను ఎవరితో పోల్చవచ్చు? (బి) ఇశ్రాయేలీయులపట్ల తూరు రాజుల దృక్పథాన్ని ఏది మార్చివేసింది?
12. సాతాను విశ్వాసఘాతుకంగా ప్రవర్తించడానికి నడిపించిందేమిటి, అతడు ఇంకా ఏమి చేయడంలో కొనసాగాడు?
13. అహంకారం ఎలాంటి ఫలాలను ఫలించింది?
14. ఏ నియమం ప్రకారం యెహోవా తన బుద్ధిసూక్ష్మతగల ప్రాణులతో వ్యవహరిస్తాడు?
15, 16. హాగరు అహంకారిగా మారేందుకు ఏది కారణమయ్యింది?
17, 18. అహంకారం విషయంలో మనమందరం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
19. ఉజ్జియా తన మంచి పేరును ఎలా పాడు చేసుకున్నాడు?
20. (ఎ) రాజైన ఉజ్జియా మంచి పేరు ఎలా ప్రమాదంలో పడింది? (బి) తర్వాతి ఆర్టికల్లో ఏమి పరిశీలించబడుతుంది?
21. వినయంగల క్రైస్తవులు దేనికోసం ఎదురుచూడవచ్చు?
[23వ పేజీలోని చిత్రం]
ఫరో అహంకారం అతను అవమానపడేందుకు దారితీసింది
[24వ పేజీలోని చిత్రం]
హాగరుకు పెరిగిన హోదా ఆమె అహంకారిగా తయారయ్యేందుకు కారణమైంది
[25వ పేజీలోని చిత్రం]
హిజ్కియా తననుతాను తగ్గించుకొని తిరిగి దేవుని అనుగ్రహం పొందాడు