కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నా జీవితంలో అది ఒక మంచిరోజు”

“నా జీవితంలో అది ఒక మంచిరోజు”

“నా జీవితంలో అది ఒక మంచిరోజు”

“మానసిక కృంగుదల యౌవనులలో, ఎక్కువగా నివేదించబడుతున్న, బహుశా అతి ప్రధానమైన మానసిక రుగ్మత” అని ఆస్ట్రేలియాలో ప్రభుత్వ నిధి పొందుతున్న బియాండ్‌బ్లూ అనే సంస్థ చెబుతోంది. ప్రతీ సంవత్సరం దాదాపు 1,00,000 మంది యువ ఆస్ట్రేలియన్లు మానసిక కృంగుదలతో బాధపడుతున్నారని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి.

క్రైస్తవ యువకులు మానసిక కృంగుదలకు అతీతులేమీ కారు. అయితే ప్రతికూల భావాలను అధిగమించి తమ యౌవనాన్ని విజయవంతం చేసుకోవడానికి యెహోవాపట్ల విశ్వాసం చాలామందికి సహాయం చేసింది. అలా చేయడం ద్వారా వారు ఇతరుల మీద మంచి ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఎలా?

క్లార్‌ అనే 18 ఏండ్ల యువతి అనుభవాన్ని పరిశీలించండి. ఆమె, ఆమె తల్లి మెల్బోర్న్‌లోని యెహోవాసాక్షుల సంఘానికి హాజరవుతారు. క్లార్‌ తండ్రి కుటుంబాన్ని విడిచివెళ్ళినప్పుడు ఆమె మానసిక కృంగుదలకు గురైంది. అయితే ఆమెకు తన పరలోక తండ్రియైన యెహోవా మీద విశ్వాసం బలంగానే ఉంది. ఒకరోజు ఆ కుటుంబ వైద్యురాలైన లిడియా, అనారోగ్యంగా ఉన్న క్లార్‌ తల్లి ఎలా ఉందో చూడడానికి ఆమె ఇంటికి వచ్చింది. ఆ తర్వాత ఆమె క్లార్‌ను షాపింగ్‌ స్థలానికి తీసుకువెళ్తానని దయాపూర్వకంగా చెప్పింది. దారిలో, నీకు బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడా అని ఆమె క్లార్‌ను అడిగింది. ఒక యెహోవాసాక్షిగా తాను కేవలం సరదా కోసం అబ్బాయిలతో డేటింగ్‌ చేయనని క్లార్‌ వివరించింది. దానితో వైద్యురాలు ఆశ్చర్యపోయింది. అప్పుడు క్లార్‌, జీవితంలో జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి తనకు బైబిలు ఎలా సహాయం చేసిందో వివరించింది. చివరకు, తనకు ఎంతో సహాయం చేసిన బైబిలు ఆధారిత పుస్తకాన్ని వైద్యురాలికి ఇస్తానని క్లార్‌ చెప్పింది. ఆ పుస్తకం పేరు యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం).

ఆ పుస్తకం అందుకున్న మూడు రోజుల తర్వాత లిడియా, తాను ఆ పుస్తకాన్ని చదివి ఎంతగా ఆనందించిందో చెప్పడానికి క్లార్‌ తల్లికి ఫోన్‌ చేసింది. ఆమె తన సహోద్యోగుల కోసం ఇంకా ఆరు పుస్తకాలు కావాలని కోరింది. క్లార్‌ ఆ పుస్తకాలు అందజేసినప్పుడు ఆ వైద్యురాలు తాను క్లార్‌ విశ్వాసాన్నిబట్టి ఎంతగా ప్రభావితం చెందిందో వివరించింది. క్లార్‌ ఆమెతో బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించినప్పుడు, ఆ వైద్యురాలు దానికి అంగీకరించింది.

క్లార్‌ ఎన్నో నెలలు ఆ వైద్యురాలి మధ్యాహ్న భోజన విరామ సమయంలో అధ్యయనాన్ని నిర్వహించింది. యువతలో ఉండే మానసిక కృంగుదల అనే విషయం గురించి ఒక సెమినార్‌లో మాట్లాడతావా అని లిడియా క్లార్‌ను అడిగింది. క్లార్‌ భయపడినప్పటికీ మాట్లాడడానికి అంగీకరించింది. 60 కన్నా ఎక్కువమంది సెమినార్‌కు హాజరయ్యారు. నలుగురు మానసిక ఆరోగ్య నిపుణులు ప్రేక్షకులనుద్దేశించి ప్రసంగించారు, ఆ నలుగురూ వయోజనులే. ఆ తర్వాత క్లార్‌ వంతు వచ్చింది. యౌవనులు దేవునితో సంబంధం ఏర్పరచుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఆమె నొక్కిచెప్పింది. యెహోవా దేవుడు యౌవనులపట్ల ఎంతో శ్రద్ధ కలిగివున్నాడని, మద్దతు, ఓదార్పు కోసం తనవైపు తిరిగే వారందరికీ ఆయన సహాయం చేస్తాడని ఆమె వివరించింది. అంతేకాక, యెహోవా త్వరలో అన్ని రకాల భౌతిక, మానసిక రుగ్మతలను తీసివేస్తాడనే తన దృఢనమ్మకాన్నీ ఆమె వ్యక్తం చేసింది. (యెషయా 33:​24) అలా చక్కని సాక్ష్యం ఇవ్వడం ద్వారా ఎలాంటి ప్రతిఫలం లభించింది?

“ఆ సెమినార్‌ తర్వాత, చాలామంది నా దగ్గరకు వచ్చి ఒక యౌవనస్థురాలు దేవుని గురించి మాట్లాడడాన్ని వినడం ద్వారా తాము ఎంతగా ప్రభావితులయ్యారో చెప్పారు. నేను 23 యువత అడిగే ప్రశ్నలు పుస్తకాలను అందించాను. ప్రేక్షకుల్లో ఉన్న ముగ్గురు అమ్మాయిలు తమ టెలిఫోన్‌ నంబర్లు నాకిచ్చారు. వారిలో ఒక అమ్మాయి ఇప్పుడు బైబిలు అధ్యయనం చేస్తోంది. అది నా జీవితంలో అది ఒక మంచి రోజు” అని క్లార్‌ చెబుతోంది.